Jan 5, 2020

బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ నివేదిక


03.01.2020: రాజధానితోపాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం నియమించిన బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ తన నివేదికను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సమర్పించింది.
v విశాఖపట్నం, అమరావతి, కర్నూలులో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలి.
v ప్రాంతీయ ఆకాంక్షలు, చారిత్రక నేపథ్యాల్ని దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రాంతాలు అభివృద్ధికి ఏ విధానం ఉత్తమమనే అంశాల్ని బీసీజీ సిఫారసు చేసింది: ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌.
v రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో తలసరి పారిశ్రామిక స్థూల అదనపు విలువ(జీవీఏ) మరింతగా పెంపొందించవచ్చు.  
v కృష్ణా, గోదావరి బేసిన్‌ బయట ఉన్న 9 జిల్లాల్లో వ్యవసాయ ఉద్పాదకతను మరింతగా పెంచవచ్చు. 
v రాష్ట్రంలో ప్రస్తుతం మత్స్య ఉత్పత్తిలో 60 శాతం రెండు జిల్లాల నుంచే లభిస్తోంది. ఇతర జిల్లాలపై మరింత దృష్టి సారించడం ద్వారా మత్స్య ఉత్పత్తిని వృద్ధి చేయవచ్చు. 
-         ప్రధానంగా మహిళల్లో అక్షరాస్యత శాతాన్ని పెంచాలి. 
-         ప్రస్తుతం రాష్ట్రానికి ఏటా 0.3 మిలియన్ల మంది విదేశీ పర్యాటకులు వస్తున్నారు. పర్యాటక రంగంని అభివృద్ధి చేయడం ద్వారా విదేశీ పర్యాటకులను మరింతగా ఆకర్షించవచ్చు. 
-         చెన్నైకోల్‌కతా జాతీయ రహదారితోపాటు రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారులతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానించాలి. 
-         రాయలసీమలో పంటల విస్తీర్ణాన్ని పెంపొందించాలి.
v కృష్ణాగోదావరి బేసిన్‌లో 60 శాతం నుంచి 80 శాతం వరకు భూములు సాగుబడిలో ఉన్నాయి.
v రాయలసీమలో కేవలం 20 శాతం భూములు మాత్రమే సాగులో ఉన్నాయి.
v గోదావరిపెన్నా నదుల అనుసంధానించాలి.


v సచివాలయానికి వచ్చేవారు:  
-         ఏడాదికి మొత్తం లక్ష మంది సచివాలయానికి వస్తే, అందులో 75 శాతం మంది కేవలం ముఖ్యమంత్రి సహాయ నిధి కోసమే వచ్చారు. 
-         ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద చాలా సేవలు అందిస్తున్నా, ఆ సమాచారం తెలియక చాలా మంది సచివాలయానికి వస్తున్నారు. 
-         మిగతావారంతా కాంట్రాక్టర్లు, బదిలీలు కోరుకునే వారు,  బిల్లుల కోసం వచ్చే వారే.

v ఉత్తరాంధ్ర అభివృద్ధికి... (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ)
-         ఎనలిటిక్స్, డాటా హబ్‌గా తీర్చిదిద్దాలి. 
-         వైద్య పరికరాల ఉత్పత్తి, ఆట బొమ్మల తయారీ పరిశ్రమలు నెలకొల్పాలి.
-         జీడి మామిడి, కాఫీ, పసుపు వంటి వాణిజ్య పంటల సాగును ప్రోత్సహించాలి.
-         భోగపురం విమానాశ్రయాన్ని నిర్మించాలి.  
-         అరకులో ఎకో, వైద్య టూరిజంను ప్రోత్సహించాలి. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమావేశాల నిర్వహణ వేదికగా తీర్చిదిద్దాలి. 

v గోదావరి డెల్టా అభివృద్ధికి...(తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి)
-         పెట్రో కెమికల్, ప్లాస్టిక్, సోలార్‌ పరిశ్రమలను నెలకొల్పాలి. 
-         ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థాపనకు ప్రాధాన్యమివ్వాలి. 
-         ఉద్యానవన పంటలు, వాణిజ్య పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు చేపట్టాలి.
-         పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలి. 
-         రోడ్‌ కనెక్టివిటీని పెంచుతూ బ్యాక్‌వాటర్‌ టూరిజం కేంద్రంగా కోనసీమ, హోప్‌ ఐలాండ్‌లను అభివృద్ధి చేయాలి. 

v కృష్ణా డెల్టా అభివృద్ధికి... (కృష్ణా, గుంటూరు)
-         ఫుడ్‌ ప్రాసెసింగ్, సిరామిక్స్‌ పరిశ్రమలను నెలకొల్పాలి.
-         హైటెక్‌ సేంద్రియ వ్యవసాయం, మత్స్య పరిశ్రమలను ప్రోత్సహించాలి. 
-         బందరు పోర్టును నిర్మించాలి. 
-         బహుళ వినియోగ లాజిస్టిక్‌ హబ్‌గా అభివృద్ధి చేయాలి.
-         వైద్య సేవలకు ప్రధాన కేంద్రంగా చేస్తూ హెల్త్‌హబ్‌గా తీర్చిదిద్దాలి. 
-         ఎడ్యుకేషన్‌ హబ్‌గా అభివృద్ధి చేయాలి.
v దక్షిణాంధ్ర జిల్లాల అభివృద్ధికి... (ప్రకాశం, నెల్లూరు)
-         ఆటోమొబైల్, టెలికాం ఉత్పత్తుల తయారీ పరిశ్రమలను నెలకొల్పాలి. 
-         చిన్న తరహా, మధ్యతరహా కాగితం గుజ్జు, చర్మ, ఫర్నిచర్‌ పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చేయాలి.
-         మత్స్య పరిశ్రమకు కేంద్రంగా తీర్చిదిద్దాలి.
-         మైపాడు బీచ్‌ను అభివృద్ధి చేయాలి. 
-         గోదావరి పెన్నా నదులను అనుసంధానించాలి. కాలువల సామర్థ్యాన్ని పెంపొందించాలి.
-         వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటు చేయాలి. అన్ని ప్రాంతాలను జాతీయ రహదారులతో అనుసంధానించాలి.
v తూర్పు రాయలసీమ అభివృద్ధికి... (వైఎస్సార్, చిత్తూరు)
-         స్టీల్, ఎలక్ట్రానిక్స్, అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. 
-         టమాటో ప్రాసెసింగ్‌ యూనిట్లు వంటి హైటెక్‌ వ్యవసాయ పరిశ్రమలను ప్రోత్సహించాలి.
-         గండికోట, బెలూం గుహల (కర్నూలు జిల్లా) కేంద్రంగా ఎకోఅడ్వంచర్‌ పర్యాటక రంగ కేంద్రంగా తీర్చిదిద్దాలి. 
-         గోదావరిపెన్నా నదులను అనుసంధానించాలి. కాలువల సామర్థ్యాన్ని పెంపొందించాలి. 
-         వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటు చేయాలి. అన్ని ప్రాంతాలను జాతీయ రహదారులతో అనుసంధానించాలి. 
v పశ్చిమ రాయలసీమ అభివృద్ధికి... (కర్నూలు, అనంతపురం)
-         టెక్స్‌టైల్స్, లాజిస్టిక్స్, ఆటోమొబైల్‌ స్పేర్‌పార్ట్స్‌ పరిశ్రమలను నెలకొల్పాలి. 
-         బిందుసేద్యాన్ని ప్రోత్సహించాలి. ఆర్గానిక్‌ ఉద్యానవన పంటల సాగును పెంపొందించాలి. 
-         విజయనగర సామ్రాజ్య చరిత్ర ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ పెనుకొండ రాయదుర్గం టూరిజం సర్క్యూట్‌ ఏర్పాటు చేయాలి.
-         గోదావరిపెన్నా నదులను అనుసంధానించాలి. కాలువల సామర్థ్యాన్ని పెంపొందించాలి. 
-         వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటు చేయాలి. అన్ని ప్రాంతాలను జాతీయ రహదారులతో అనుసంధానించాలి.  

గ్రీన్ ఫీల్డ్ నగరాల అభివృద్ధిపై వివరణ:  
ప్రపంచంలో 32కు పైగా గ్రీన్ ఫీల్డ్ సిటీలు నిర్మిస్తే రెండు తప్ప( చైనాలో షెంజన్, భారత్ లో నవీ ముంబై) న్ని విఫలం అయ్యాయని చెప్పారు. వాటికి అనేక కారణాలు ఉన్నాయి.  ఇప్పటికే రాజధాని ఉన్న నగరాలు అవి. మన రాష్ట్రానికి రాజధాని లేదు.
1.    మోనార్టో (ఆస్ట్రేలియా): అడిడైడ్ కు 160 కి.మీ. దూరం. ఓ తిక్కలోడు అక్కడి నుంచి ప్రభుత్వం మార్చడం వల్ల అది విఫలమైంది.
2.    బ్లూ సిటీ ప్రాజెక్ట్ (ఓమన్): 2007లో పిపిపి కింద దీనిని ప్రారంభించారు.
3.    షేక్ జయిద్ సిటీ (ఈజిప్ట్): గ్రేటర్ కైరోకు అది శాటిలైట్ సిటీ
4.    కింగ్ సిటీ (ఘనా): మైనింగ్ ప్రాంతంలో అర్బన్ ఎకానమీ కోసం దీనిని పెట్టారు.
5.    ఇన్నో పోలిస్ (రష్యా): టెక్నాలజీ కంపెనీలకు ఒక హబ్ గా దీనిని తెచ్చారు. ఇది ఫెయిల్ అయిందని అంటారు.
6.    కిలాంబ(లువాండా): ఇది ఓ చిన్న అర్బన్ మునిసిపాలిటీ. పిపిపి కింద దీని నిర్మానం మొదలు పెట్టారు.
7.    ఎకోట్లాంటిక్ (నైజీరియా): సముద్రాన్ని రిక్లయిన్ చేసి అక్కడ  చైనీస్  భాగస్వామ్యంతో ఒక టెక్నాలజీ హబ్ ని ఏర్పాటు చేద్దామని అనుకున్నారు. అదొక హబ్ మాత్రమే.
* జయవర్ధన పెరె కొట్టే (శ్రీలంక): శ్రీలంకకు ఇప్పటికే రాజధాని ఉంది. చారిత్రకంగా ఇక్కడ లంక రాజుల భవనాలు, బుద్దిస్ట్ మాన్యుమెంట్లు ఉన్నాయి. అందువల్ల చారిత్రక అంశాల ప్రాతిపదికన రాజధానిగా దానిని 1987లో  నోటిఫై చేశారు. ప్రభుత్వం అక్కడ ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదు. అది ఇంకా మునిసిపాలిటీనే.
*  పుత్రజయ (మలేషియా): ఇప్పటికే ఉన్న రాజధాని కౌలాలంపూర్ అభివృద్ధి చెందుతుండగా 1999లో దీని నిర్మాణం మొదలు పెట్టారు. కౌలాలంపూర్ నుంచి పుత్రజయ 36 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.
* ఇవన్నీ రాజధానులు ఉన్న దేశాలు. మనది రాజధాని లేని రాష్ట్రం. వాటికి మన రాష్ట్రానికి పొంతనలేదు.

 

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...