Jan 5, 2020

అమరావతి - ముఖ్యమైన అంశాలు


v మెజారిటీ అభిప్రాయం: ప్రజాస్వామ్య పద్దతుల్లో అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని మెజారిటీ అభిప్రాయం ప్రకారం అమరావతిని  నిర్ణయించారు. , గుంటూరు ప్రాంతంలో రాజధాని ఉండాలని 52 శాతం ప్రజలు   శివరామకృష్ణ కమిటీకి సూచించారు.
v భూ సమీకరణః రైతులు అందరికి లబ్ది చేకూర్చే భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) పథకం.  ఈ విధంగా 34 వేల ఎకరాలు సమీకరించడం ప్రపంచంలో ఇదే మొట్టమొదటిసారి. ఇది  ఓ రికార్డ్. ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా, రైతులు లాభపడేవిధంగా రూపొందించిన పథకం ఇది.
v సమీకరణ : 28,538 మంది రైతులు 34,395.50 ఎకరాలు
v అమరావతి ప్రాంతం : 53,748 ఎకరాలు  - 217.23 చదరపు కిలో మీటర్లు. (తొలుత 390 కి. మీ.)
v 25 రెవెన్యూ గ్రామాలు (29 గ్రామాలు).  అమరావతి సీడ్ ఏరియా : 4,283 ఎకరాలు.
v సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ 6.8 చదరపు కిలోమీటర్లు (1691 ఎకరాలకు గానూ)
v ప్యాకేజీలు: భూములిచ్చిన రైతులకు జరీబు భూమికి రూ. 50 వేలు, మెట్ట భూమికి రూ.30 వేలు సీఆర్డీఏ కౌలు చెల్లిస్తోంది. ఇలా పదేళ్లు చెల్లించేలా చట్టంలో పొందుపరిచారు. రైతులకు కమర్షియల్, రెసిడెన్షియల్ ప్లాట్లు.
v రైతులకు కేటాయించిన ప్లాట్ల సంఖ్య 64,710
v రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు 39,299
v రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఉన్న ప్లాట్లు 297
v రిజిస్ట్రేషన్ పెండింగ్‌లో ఉన్న ప్లాట్ల సంఖ్య 25,488 (40శాతం)
v రైతు కూలీలకు పెన్షన్: 20,780 వేల మంది వ్యవసాయ ఆధారిత కూలీలకు నెలకు రూ.2,500 చొప్పున పింఛన్ పదేళ్లపాటు చెల్లింపు.
v   సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) పరిధి :  తొలుత 7,068 కిలో మీటర్లు.  తరువాత  8,352 చదరపు కిలోమీటర్లకు పెంచారు. 21,25,000 ఎకరాలు.
v అద్వితీయ నగరం: 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో  ప్రపంచ స్థాయి నగరాల సరసన నిలిచేవిధంగా అమరావతిని నిర్మించాలన్నది చంద్రబాబు లక్ష్యం. 
v మాస్టర్ ప్లాన్ : అమరావతి నగరానికి మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ (సర్బనా జురాంగ్ సింగపూర్ సంస్థ) రూపొందించింది. 22.02.2016 ఫైనల్ మాస్టర్ ప్లాన్.
v 9 నగరాలు, 27 టౌన్‌షిప్‌లు
v పరిపాలనా నగరాన్ని  బ్రిటన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్ సంస్థ డిజైన్ చేసింది.  హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ ఐకానిక్ భవనాలు డిజైన్ చేసింది.
v సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ :  ప్రజా రాజధాని అమరావతి బహుళ ప్రయోజనకారి.  స్వయం ఆధారిత అభివృద్ధి (సెల్ఫ్ ఫైనాన్స్) ప్రాజెక్ట్. అమరావతిలో రైతులకు ఇవ్వగా ప్రభుత్వానికి మిగిలిన భూముల విలువ లక్ష కోట్లు ఉంటుదని అంచనా. ఇక్కడ రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తే హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ముంబై నగరాలకు ధీటైన  రాజధాని అంధ్రులకు ఏర్పడుతుంది.
v నిర్మాణాలు పూర్తి : ఇప్పటికే శాసనసభ, శాసనమండలి భవనం, సచివాలయ భవనాలు, హైకోర్టు భవనం నిర్మించారు. రాజధానిలోని 29 గ్రామాలలో ఇళ్లు లేని పేదలందరికీ దాదాపు 5వేల ఫ్లాట్ల నిర్మాణం పూర్తి. కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తి.
v అమరావతిలోని పేదలకు ఇళ్లు : రాజధానిలోని 29 గ్రామాలలో ఇళ్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల నిర్మాణం.
45 ఎకరాలు – 8 ప్రాంతాలు – 5,024 ఫ్లాట్లు – ఏపీ టిడ్కో . ఈ ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి. 2400 ఫ్లాట్లు కేటాయింపు.
v నిర్మాణ దశ:  ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, న్యాయమూర్తులు, కేంద్ర సర్వీస్, ఐఏఎస్, గజిటెడ్ అధికారులు, ఇతర ఉద్యోగుల గృహ సముదాయాలు 3,840 ప్లాట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. 34 ప్రధాన రహదారులను 320 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్నారు. వాటిలో కొన్ని దాదాపు 70 - 80 శాతం పూర్తి. రూ.41,678 కోట్ల విలువైన పనులు గ్రౌండ్‌ అయ్యాయి. ప్రభుత్వం రూ.5,674 కోట్లు చెల్లించింది. 
v 320 కిలో మీటర్ల గ్రాండ్ ట్రంక్ రోడ్ల పనులు జరుగుతున్నాయి.
v 1280 కిలో మీటర్ల లేఔట్లలో రోడ్లు, డ్రైనేజీల పనులు మొదలు.
v మౌలిక సదుపాయాల కల్పన : రోడ్లు, విద్యుత్, టెలికం... వంటి మౌలిక సదుపాయాలు కల్పించారు.
v త్వరితగతిన నిర్మాణాలు: ఏడు నెలల వ్యవధిలోనే 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తాత్కాలిక సచివాలయం, శాసనసభ భవనాల నిర్మాణం పూర్తి చేసి పరిపాలన, శాసనసభ సమావేశాలు ప్రారంభించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టించింది.
v తాతాల్కిక శాసనసభ, శాసన మండలి భవనం: దాదాపు రూ. 63.40 కోట్లతో 18 ఆగష్టు 2016న శంకుస్థాపన. 02-03-2017 ప్రారంభం. 06-03-2017  తొలి శాసనసభ సమావేశాలు. 192 రోజుల్లో సిద్దమైంది. 
v తాతాల్కిక సచివాలయం: 2016 ఫిబ్రవరి 17న వెలగపూడి తాతాల్కిక సచివాలయానికి శంకుస్థాపన. తాత్కాలిక సచివాలయం అయిదు భవనాల సముదాయానికి, మౌలిక వసతులకు మొత్తం రూ.515.19 కోట్లు ఖర్చు. 2016 ఏప్రిల్‌ 25న ఒక భవనంలో గది ప్రారంభం. 2016 జూన్‌ 29న రెండు బ్లాకులు పూర్తిస్థాయిలో సిద్ధం. 2016 అక్టోబరు 3 నుంచి అన్ని విభాగాలు ప్రారంభం.
v శాశ్విత సచివాలయం:  రాయపూడి కొండమరాజుపాలెం వద్ద ప్రపంచంలోనే ఎత్తైన ఐదు టవర్ల సచివాలయ నిర్మాణానికి 27.12.2018న శంకుస్థాపన. 41 ఎకరాల్లో 69.8 లక్షల చదరపు అడుగల విస్తీర్ణం. అంచనా వ్యయం రూ.4,890 కోట్లు.  40 అంతస్తులతో నాలుగు టవర్లు, 50 అంతస్తులతో ఐదో టవర్‌. సచివాలయ ప్రాంగణంలో 4వేల కార్లు పార్క్‌ చేసుకునే అవకాశం. ఒకేసారి 10 వేల మంది విజిటర్స్‌. 36 నెలల్లో 5 భవనాలను రాఫ్ట్‌ ఫౌండేషన్‌తో నిర్మాణాలు పూర్తి చేసేలా లక్ష్యం. 13 అడుగుల లోతున  రాఫ్ట్‌ పౌండేషన్‌.
v హైకోర్టు:  2019, ఫిబ్రవరి 3న నేలపాడు వద్ద  జ్యూడీషియల్‌ కాంప్లెక్స్‌లో హైకోర్టును ప్రారంభం. శాశ్వత హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన.    
v కొండవీటి ఎత్తిపోతల పథకం: రాజధాని రక్షణగా అమరావతికి ముంపును నివారించేందుకు కొండవీటి వాగు, పాలవాగుల వరద ఇకపై సులువుగా ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోసేందుకు వీలుగా కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తి. ఐదు వేల క్యూసెక్కుల వరద నీటిని కృష్ణానదిలో ఎత్తిపోసేందుకు రూ.237 కోట్లు ఖర్చు. 350 క్యూసెక్కుల సామర్థ్యంతో 16 పంపుల ఏర్పాటు.
v జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే  అమరావతి నిర్మాణ పనులు నిలిపివేసింది.
v రాజధానిలో దాదాపు రూ.40 వేల కోట్ల మేర పనులు జరుగుతుండగా,  2019-20 రాష్ట్ర బడ్జెట్‌లో రాజధాని నిర్మాణానికి  కేవలం 500 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించారు.
v ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాన్ని రాజధానికి ఎంపిక చేయడం సురక్షితం కాదని, నల్లమట్టి భూములు కావడంతో పునాది ఎక్కువ లోతులో వేయాల్సి ఉంటుందని, అనేక వంతెనలు వంటివి నిర్మించాల్సి ఉంటుందని మంత్రి బొత్స చెప్పుకొచ్చారు. దీని వల్ల రాజధాని నిర్మాణానికి చాలా వ్యయం అవుతుందని, దీనికన్నా తక్కువ వ్యయంతో మరోచోట రాజధాని నిర్మించుకోవచ్చని చెప్పారు.
v సూరాయపాలెం వద్ద కృష్ణానదిపై జాతీయ రహదారుల విభాగం వంతెన నిర్మిస్తే రాజధాని ప్రాంతానికి రోడ్డు రవాణా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటుందన్న ఉద్దేశంతో దాన్ని నిర్మించే ఆలోచనలో  ప్రభుత్వం ఉంది.
v హైకోర్టు కార్యకలాపాలకు ప్రస్తుతం ఉన్న తాత్కాలిక భవనం సరిపోతుందన్నది ఈ ప్రభుత్వ భావన.
v విజయవాడలో ప్రస్తుతం రాజ్‌భవన్‌ ఉన్న భవనం సౌకర్యంగా ఉండటంతో మరికొంత కాలం దానినే కొనసాగించాలన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది.
v గత ప్రభుత్వం ప్రతిపాదించిన ఇబ్రహీంపట్నం వద్ద వంతెన నిర్మాణాన్ని పక్కనబెట్టేశారు.
v  సచివాలయం టవర్లను 25 అంతస్తుల నుంచి పది అంతస్తులకు కుదింపు.
v రుణం ఇచ్చేది లేదన్న ప్రపంచ బ్యాంకు, ఏషియన్‌ బ్యాంక్‌
v రాజధాని డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుకు చంద్రబాబు ప్రభుత్వంలో రూ.2,100 కోట్లు(300 మిలియన్‌ డాలర్లు) అందిస్తామంటూ ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంక్‌ ఇప్పుడు ఆ నిధులు ఇవ్వటానికి వెనకడుగు వేసింది. - (జులై 15, 2019) రాజధానికి రుణం ఇచ్చేందుకు వరల్డ్‌ బ్యాంక్‌ నిరాకరించి వారం రోజులు గడవక ముందే.. అమరావతి ప్రాజెక్టుకు 200 మిలియన్‌ డాలర్ల రుణం ఇచ్చేది లేదని చైనా ఆధిపత్యంలోని ది ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్మెంట్‌ బ్యాంక్‌ తేల్చి చెప్పింది. (జులై 23, 2019)
v ప్రపంచ బ్యాంక్‌, ఏషియన్‌ బ్యాంక్‌ యూటర్న్‌ తీసుకోవడానికి సీఎం జగన్‌ వైఖరితో పాటు రాజధాని నిర్మాణం జరగకూడదని ఆ పార్టీ నాయకులు చేసిన రచ్చే కారణం. గతంలో వారు రాసిన లేఖలే నేడు అమరావతి నిర్మాణానికి విఘాతంగా మారాయి.
v రాజధాని ఇక్కడ ఉండకపోవచ్చనే ప్రచారంతో అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ రంగం పడిపోయింది. కోట్లు పలికిన భూములు ఇప్పుడు లక్షలకు పడిపోయాయి. రాజధాని పరిధిలో అమ్మకాలు, కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి.
v చంద్రబాబు హయాంలో నిత్యం నిర్మాణాలు, కార్మికులకు చేతినిండా పనితో కళకళలాడిన అమరావతిలో ఇప్పుడు నిర్మానుష్య వాతావరణం కనిపిస్తోంది.
n కార్యాలయాల కుదింపు..
v నూతన ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి 5 నెలల్లో సీఆర్డీయే, ఏడీసీల కార్యాలయాలనూ కుదించారు. ఏడీసీ ప్రధాన కార్యాలయాన్ని చిన్న భవంతిలోకి మార్చారు.  సీఆర్డీయేలోని ఇంజినీరింగ్‌ విభాగాన్ని ప్రత్యేక భవనంలో నుంచి ప్రధాన కార్యాలయంలోకి తరలించారు. భూములిచ్చిన వారికి  ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ కోసం రాజధాని గ్రామాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల మూసివేత.
v సీఆర్డీఏ, ఏడీఏ  సంస్థల్లోని అధికారులు, ఉద్యోగులు, కన్సల్టెంట్ల సంఖ్య సగానికి సగం తగ్గిపోయింది! ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఊపందుకుంది. సుమారు 30కిపైగా ఉన్న కన్సల్టెంట్‌ సంస్థల సేవలను చాలించారు. దాదాపు 100 మందికిపైగా నిపుణులు తిరుగుముఖం పట్టారు.
v రాజధాని నిర్మాణం పరుగులు తీయాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రభుత్వ శాఖల నుంచి సీఆర్డీయే, ఏడీసీలకు డిప్యుటేషన్‌పై వచ్చిన వందలాదిమంది అధికారులు, ఉద్యోగులకు అప్పటివరకూ ఇస్తూండిన స్పెషల్‌ అలవెన్స్‌ను ప్రభుత్వం రద్దు చేయడంతో వారిలో అత్యధికులు వెనుదిరిగారు. పరిస్థితులిలా అనూహ్యంగా మారడాన్ని గమనించి కాంట్రాక్ట్‌ విధానంలో పని చేస్తున్న పలువురు నిపుణులు ఇప్పటికే నిష్క్రమించారు.
v సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పీ మధు: రాజధానిలో పెద్ద ఎత్తున జరుగుతున్న అభివృద్ధి పనులను నిలిపివేయడం సరికాదు. రాజధాని రైతులకు కౌలు చెల్లింపులు చేయటానికే రోడ్డెక్కి ఇంత ఆందోళన చేస్తే... రాజధానిపై అసత్య ప్రచారాలు చేస్తూ, గందరగోళం సృష్టిస్తున్న వైసీపీ నేతలకు రాజధాని గురించి స్పష్టత రావాలంటే ఇంకెంత పోరాటం చేయాలి.
n స్విస్ ఛాలెంజ్ కేసులో హైకోర్టు కామెంట్
v స్విస్ ఛాలెంజ్ కేసు సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు మాట్లాడుతూ హైకోర్టు ప్రాంతంలో కనీసం టీ కూడా లభించడంలేదు. జడ్జీల క్వార్టర్లు ఇప్పటిదాకా నిర్మించలేదు – పనుల జాప్యంతో హైకోర్టులో సమస్యలు – పనులు మీరు చేస్తారా? ఆదేశాలు ఇవ్వాలా? అని వ్యాఖ్యానించారు. ఇది జగన్ ప్రభుత్వ అసమర్థతకు, ద్రుక్పద లోపానికి నిదర్శనం.
v అమరావతి హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్ట్ :
v అమరావతిలో ప్రజానివాస సముదాయంగా గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించతలపెట్టిన హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టుకు సంబంధించి కూడా రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
§  అమరావతిలో సీఆర్‌డీఏ నిర్మిస్తున్న గృహ నిర్మాణ ప్రాజెక్టు
§  నేలపాడు వద్ద మొత్తం 1200 ఫ్లాట్లు నిర్మించాలని ప్రతిపాదన.
§  24 నెలల్లో ప్రాజెక్ట్ పూర్తి చేయాల్ననది లక్ష్యం.
v 14.46 ఎకరాలు - 12 టవర్ల – ఒక్కో టవర్ 19 అంతస్తులు (జీ+18) - 1200 ఫ్లాట్లు
v సీఆర్డీఏ పరిధి :  8603 చదరపు కిలో మీటర్లు.
v  దేశ మ్యాప్‌లో లేని అమరావతి
v  నవంబర్ 2, 2019న కేంద్ర హామ్ శాఖ 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలతో భారత దేశ మ్యాప్ విడుదల చేసింది. అందులో ఏపీ రాజధాని అమరావతిని గుర్తించలేదు. భారతదేశ పొలిటికల్ 2 మ్యాప్‌ పేరిట కేంద్ర హోం శాఖ విడుదల చేసిన ఈ మ్యాప్‌లో ఇచ్చిన ఒక వివరణలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిపాలన హైదరాబాద్ నగరం నుంచే జరుగుతోందని పేర్కొన్నారు.
v  రాష్ట్ర రాజధానికి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారా? – మంత్రి బొత్స
n 05112019 : రాష్ట్ర రాజధాని ఎక్కడుందో చంద్రబాబు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారా? రాజధాని, సాగునీటి ప్రాజెక్టులపై కమిటీ వేశాం - నివేదిక వచ్చాక రాజధాని వివరాలు చెబుతాం - : మంత్రి బొత్స సత్యనారాయణ
v బీజేపీ ఎంపీ సుజనాచౌదరి కామెంట్స్
v ఢిల్లీ:  అమరావతి రాజధానిగా  నోటిఫికేషన్ ఇవ్వకపోవడం చంద్రబాబు ఫెయిల్యూర్. నోటిఫికేషన్ రానందునే మ్యాప్‌లో అమరావతి లేదు. అమరావతి నోటిఫికేషన్ చేయడంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారు. చంద్రబాబు తప్పుల మూలంగానే వైసీపీ అధికారంలోకి వచ్చిందనేది నా అభిప్రాయం. వైసీపీ పాలనపై ప్రజలు సంతోషంగా లేరు.
v రాజధాని నోటిఫికేషన్:
v కేంద్రం నియమించిన శివరామకృష్ణ కమిటీ సూచనలమేరకు రాజధాని ప్రాంతం ఎంపిక.  రాజధాని కోసం 28,538 మంది రైతులు 34,395.50 ఎకరాలు భూమి ఇచ్చారు.  వైఎస్ జగన్మోహన రెడ్డి సహా శాసనసభలో ఏకగ్రీవ ఆమోదం. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన.  కేంద్రం రూ.15,000 కోట్లు విడుదల. 25 రెవెన్యూ గ్రామాలు (29 గ్రామాలు)లలోని 53,748 ఎకరాలలో  217.23 చదరపు కిలో మీటర్లు విస్తీర్ణాన్ని రాజధాని అమరావతి ప్రాంతంగా నిర్ణయం.  నాలుగేళ్ల నుంచి అమరావతిలో ఇంటెర్మ్ గవర్నమెంట్ కాంప్లెక్స్ (ఐజీసీ) నుంచే పరిపాలన కొనసాగిస్తున్నారు. కొత్త ప్రభుత్వం కూడా అక్కడ నుంచే పరిపాలన కొనసాగిస్తోంది. మార్చి 2, 2017న అమరావతిలో శాసన సభ, మండలి భవనాన్ని ప్రారంభించారు. మార్చి 6 నుంచి శాసనసభ సమావేశాలు అక్కడే ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి శాసనసభ, మండలి సమావేశాలు అక్కడే జరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా సమావేశాలు అక్కడే జరిగాయి. ఈ భవనాలన్నీ శాశ్విత భవనాలే. సీడ్ యాక్సెస్ రోడ్డుతోపాటు 320 కిలోమీటర్ల పొడవున 35 రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి.   వాటిలో కొన్ని దాదాపు 70 - 80 శాతం పూర్తి అయ్యాయి. ఆ రోడ్లపైనే అందరూ ప్రయాణిస్తున్నారు.  దేశంలో 25వ హైకోర్టుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జనవరి 1, 2019 నుంచి అమరావతిలో ప్రారంభమవుతుందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ డిసెంబర్ 26, 2018న గెజిట్ నోటిషికేషన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 3, 2019న అమరావతిలో హైకోర్టు భవనాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం అక్కడే న్యాయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇది కూడా శాశ్విత భవనమే.  రాజధానిలోని 29 గ్రామాలలో ఇళ్లు లేని పేదలందరికీ దాదాపు 5 వేల ఫ్లాట్ల నిర్మాణం పూర్తి చేశారు.   కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఆర్డీఏ విడుదల చేసిన శ్వేత పత్రం ప్రకారం  రాజధాని మొదటి దశ నిర్మాణ వ్యయం రూ.52,837 కోట్లు, కాగా  రూ.41,678 కోట్ల విలువైన పనులు గ్రౌండ్ అయ్యాయి.  రూ.5,674 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లింపులు కూడా చేసింది. రాజధానిలో రోడ్లు, విద్యుత్, టెలికం... వంటి మౌలిక సదుపాయాలు కల్పించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, న్యాయమూర్తులు, కేంద్ర సర్వీస్, ఐఏఎస్, గజిటెడ్ అధికారులు, ఇతర ఉద్యోగుల గృహ సముదాయాలు 3,840 ప్లాట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. రాజధాని అమరావతికి సంబంధించిన వాస్తవాలు ఇలా ఉంటే అమరావతి అడ్రెస్ ఎక్కడ? అని బాధ్యతాయుతమైన పదవులలో ఉన్న బొత్స ప్రశిస్తున్నారు.  న్యాయ వివాదాలు తలెత్తకుండా, పూర్తి వివరాలతో రాజధాని పరిధులు స్పష్టంగా నిర్ణయించి,  పటిష్టమైన చట్టం రూపొందించి, దానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి కొంత సమయం పడుతుంది. ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. దేశ ప్రథమ పౌరుడు, రాజ్యాంగం ప్రకారం కార్యనిర్వాహణలో  దేశాధినేత,  సర్వ సైన్యాధ్యక్షుడైన  రాష్ట్రపతి జారీ చేసిన ఏపీ హైకోర్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్న అమరావతి ఎక్కడ అని  మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి అనడం భావ్యంకాదు.
v జి.ఎన్‌.రావు కమిటీ: 13.09. 2019: అమరావతి సహా అన్ని జిల్లాలు, ప్రదేశాలు సమానంగా అభివృద్ధి చెందేందుకు ఉపకరించే సలహాలు, సూచనలివ్వాలంటూ జి.ఎన్‌.రావు కమిటీ ఏర్పాటు. కమిటీ కన్వీనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎస్ రావు,  సభ్యులుగా ప్రొఫెసర్ మహవీర్, డాక్టర్ అంజలీ మోహన్, డాక్టర్ శివానందరెడ్డి, ప్రొఫెసర్ కేటీ రవిచంద్రన్, ప్రొఫెసర్ అరుణాచలం, మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌గా బ్రిగేడియర్‌ డాక్టర్‌ పి.రాజ్‌కుమార్‌.
v 06.11.2019:  రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతల పర్యటన - అమరావతిలో నిర్మాణాలు లేవన్న ఆరోపణలకు కౌంటర్ గా ఈ పర్యటన.  ఈ పర్యటనలో ఏపీ అసెంబ్లీ ప్రతిపక్ష ఉప నేత అచ్చెన్నాయుడు,  మాజీ మంత్రులు నారాయణ, దేవినేని ఉమ,  ఎంపి గల్లా జయదేవ్, ఎమ్మెల్యే రామానాయుడు,  పంచుమర్తి అనురాధ  తదితరులు పాల్గొన్నారు. నిర్మాణంలో ఉన్న భవనాలన్నింటినీ పరిశీలించారు. అమరావతిలో 12 టవర్లతో శాసన సభ్యులకు 288 ప్లాట్లు సిద్ధం అయ్యాయని వివరించారు. రాజధానిపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రాజధానికి వస్తే నిర్మాణాలు ఎలా ఉన్నాయో  చూపిస్తామని చెప్పారు.
v రాజధాని పేరు చెప్తే చంద్రబాబు గుర్తొస్తారని,  రాజధానిని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. 60 రోజుల్లో పూర్తి అయ్యే నిర్మాణాలను కావాలని శాడిస్ట్ ఆలోచనతో ఆపేశారు. అమరావతి నగరాన్ని గ్రాఫిక్స్ అని నోటి మాటలు చెప్పడం కాదు, ఇక్కడకు వచ్చి చూసి మాట్లాడాలి. బొత్సా లెంపలేసుకుని క్షమాపణ చెప్పాలి. అవాకులు చెవాకులు పేలిన మంత్రి బొత్స లెంపలు వేసుకుని క్షమాపణలు చెప్పాలి. అమరావతిలో అంతా అవినీతి జరిగిందన్నారు. మరి ఇంతకీ ఏం తేల్చారు అని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
v 08.11.2019 జీఎన్‌ రావు కమిటీకి భారీగా లేఖలు, ఈమెయిల్స్‌(ఆంధ్రజ్యోతి): జి.ఎన్‌.రావు కమిటీకి ఇప్పటి వరకు సుమారు 25 వేల లేఖలు, ఈ-మెయిల్స్‌ అందినట్లు  తెలిసింది. 13 జిల్లాలూ సరిసమానంగా పురోగమించేందుకు తోడ్పడే వినతులు కూడా ఉన్నట్లు సమాచారం. రాజధాని నగరంగా అమరావతి ఎంపిక నుంచి భూసమీకరణ, మాస్టర్‌ ప్లాన్ల తయారీ, పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల నిర్మాణం, భారీ ఎత్తున నిధుల సమీకరణ జరగడంతోపాటు ఇప్పటికే దీని నిర్మాణానికి రూ.9,000 కోట్ల వరకూ వెచ్చించిన దరిమిలా ఇక్కడే కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. అలా కాకుండా రాజధానిని తరలిస్తే అమరావతిపై ఇప్పటి వరకూ వెచ్చించిన నిధులే కాకుండా అపార మానవ వనరులు, శక్తియుక్తులు సైతం బూడిదలో పోసిన పన్నీరవుతాయని స్పష్టం చేశారు.
v రాజధాని కమిటీని రద్దు చేయమని  హైకోర్టులో గుంటూరు రైతుల పిటిషన్‌ : రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జీఎన్‌రావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీని రద్దు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా బోరుపాలెం గ్రామానికి చెందిన రైతులు సీహెచ్‌ శివలింగయ్య, సీహెచ్‌ రామారావు హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ సీఆర్‌డీఏ చట్ట నిబంధనలకు విరుద్ధంగా కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. చట్టసభ ద్వారా ఏర్పాటైన సీఆర్‌డీఏపై పునఃసమీక్ష జరిపే అధికారం కూడా ఈ కమిటీకి లేదని పిటిషన్‌లో వివరించారు. ఈ నేపథ్యంలో కమిటీని నియమిస్తూ జారీచేసిన జీవోను రద్దు చేయాలని అభ్యర్థించారు. వైసీపీ ప్రభుత్వం రాజధానిని తరలించినా, నిర్మాణం ఆలస్యం చేసినా భూములిచ్చిన రైతులు తీవ్రంగా నష్టపోతారని వివరించారు.
v అమరావతి స్టార్ట్ అప్ ఏరియా ప్రాజెక్ట్ ఎంఓయు 15,05.2017న జరిగింది. 12.11.2019న రద్దయింది.
v అమరావతి స్టార్ట్ అప్ ఏరియా ప్రాజెక్ట్ : స్విస్‌ చాలెంజ్‌ పద్ధతి : ప్రపంచ స్థాయి కంపెనీల ఏర్పాటు, ఉద్యోగాల కల్పన, మౌలిక, ఫైనాన్స్‌ డిస్ట్రిక్ట్‌ - 2.5 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి - ఒక 'స్టార్ట్‌ అప్‌' నగరాన్ని నిర్మించేందుకు సింగపూర్‌ కన్సార్షియంతో స్విస్స్‌ చాలెంజ్‌ టెండర్‌ ప్రక్రియ ద్వారా ఒప్పందం కుదిరింది. 1691 ఎకరాల్లో 3 దశల్లో, 15 సంవత్సరాల్లో నగరాభివృద్ధి. 6.84 చదరపు కిలోమీటర్ల పరిధిలో స్టార్టప్‌ నగరం.
v వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత సింగపూర్‌ కన్సార్షియం ఒప్పందం రద్దు
v సీడ్‌ క్యాపిటల్‌ ప్రాజెక్ట్‌ నుంచి స్వచ్ఛందంగా వైదొలగుతామంటూ సింగపూర్‌ కన్సార్షియం చేసిన లిఖితపూర్వక విజ్ఞప్తిపై సీఎం జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన 30.10.2019న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చ అనంతరం, అందుకు సీఎం అనుమతించారు.
v 12.11.2019 : ఒప్పందం రద్దు చేసుకున్నట్లు సింగపూర్ పరిశ్రమలు, వాణిజ్య మంత్రి ఈశ్వరన్‌ తెలిపారు.
v పెట్టుబడులు : హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు నగరాలకు ధీటైన రాజధాని ఆంధ్రులకు లేకపోతే ఏపీలో ఎవరు వచ్చి పెట్టుబడులు పెడతారు? ఉద్యోగాలు ఎలా వస్తాయి? 13 జిల్లాల అభివృద్ధికి ఆదాయం ఎలా సమకూరుతుంది? తెలంగాణ బడ్జెట్‌లో ఒక్క హైదరాబాద్ నగర ఆదాయమే సింహ భాగం ఉన్నది వాస్తవం కాదా?
v     రాజధాని నిర్మాణాలన్నీ నిలుపుదల చేయడం వల్ల, ప్రజా వేదికను కూల్చి రాజధాని ప్రాంత ఇమేజ్ డ్యామేజ్ చేయడం వల్ల ఒక్క రాజధాని భూముల విలువే లక్ష కోట్లు పడిపోయింది వాస్తవం కాదా? ఈ ప్రభావంతో రాష్ట్రమంతా భూముల విలువ పడిపోయి రిజిస్ట్రేషన్ల ఆదాయం ప్రభుత్వానికి పడిపోయింది నిజం కాదా? హైదరాబాద్ భూముల విలువ 30 శాతం పెరిగింది వాస్తవం కాదా?
v   అమరావతి ముంపు ప్రాంతమని మీరు చెప్పింది అబద్దం కాదా? అమరావతి ముంపు ప్రాంతం కాదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఇస్రో నిర్ధరించింది నిజం కాదా? 1850, 2009లో పెద్ద వరదలు వచ్చినా ఎలాంటి ముంపు జరగలేదని గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు పేరా 76లో చెప్పింది వాస్తవం కాదా?
v   బాలకృష్ణ వియ్యంకునికి రాజధానిలో 500 ఎకరాలిచ్చి ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారనే మీ ఆరోపణ పచ్చి అబద్దంకాదా? రాజధానిలో ఆయనకు ప్రభుత్వం సెంటు భూమి కూడా ఇవ్వలేదని రుజువైంది వాస్తవం కాదా?
v   ఒక సామాజిక వర్గం కోసమే రాజధాని అంటూ అబద్దాలు చెప్పడమే కాక కుల చిచ్చు పెట్టడం మంత్రి స్థాయిని దిగజార్చడం కాదా? ఇక్కడ 14 సామాజిక వర్గాల వారు భూములు ఇచ్చారు. ఎస్సీ నియోజకవర్గంలో రాజధాని ఉండటం జగన్ గారికి ఇష్టంలేదా? రాజధానిలో ఎస్సీ, బీసీ, మైనార్టీలు 75 శాతం ఉన్న మాట నిజం కాదా? 29 పంచాయతీల్లో 15 పంచాయితీల్లో కాపులు గణనీయంగా ఉన్నారు.    రెడ్డి, కాపు, కమ్మ జనాభా సమానంగా ఉన్నది వాస్తవం. అమరావతి, తాడేపల్లిలలో రెడ్లు, కమ్మవారికి భూములు సమానంగా వున్నది నిజం కాదా? ఈ వాస్తవాలు కప్పిపెట్టి ప్రత్యేకంగా ఒక సామాజిక వర్గంపై దుష్ప్రచారం చేయడం దుర్మార్గం కాదా? విజయవాడ, గుంటూరులలో బ్రాహ్మణ, వైశ్య జనాభా గణనీయంగా ఉన్నారు. అమరావతి కులాల కాస్మాపాలిటిన్ ప్రాంతం.
v రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టలేమని చెప్పిన లూలూ గ్రూపు భారత సంచాలకుడు అనంతరామ్
1.    వారికిచ్చిన భూములను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.
2.     ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులోనూ ఆ సంస్థ పెట్టుబడులు పెట్టదు.
3.     వాళ్లు విశాఖలో కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్, హోటల్ నిర్మించేవారు.
4.     రూ.2200 కోట్లు పెట్టుబడి పోయింది.  7 వేల మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కోల్పోయాం.
v  22-11-2019 ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రెస్ మీట్
రాష్ట్రానికి రాజధాని నిర్మాణం మా ప్రాధాన్యం కాదని పరోక్షంగా స్పష్టం. ‘‘లక్షల కోట్లు ఖర్చుపెట్టి నగరాలు నిర్మించే స్థోమత మా ప్రభుత్వానికి లేదు. రాష్ట్ర రాజధానిని లండన్‌లా రూపొందిస్తామని ఒక ప్రభుత్వం అంటే, ఆ తర్వాతి ప్రభుత్వం, దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. అమరావతిలో తాత్కాలిక ప్రభుత్వ భవనాలకు అడుగుకి 10వేల చొప్పున టీడీపీ ప్రభుత్వం వెచ్చించింది. వాటినేమైనా స్వర్గంలో కట్టారా?’’  మేనిఫెస్టోలో ప్రకటించినట్లు నవరత్నాల అమలుకే మా ప్రాధాన్యం.
v భారత్ మ్యాప్‌లో అమరావతి
భారతదేశం రాజకీయ చిత్రపటంలో అమరావతికి స్థానం లభించని విషయాన్ని  ఎంపీ గల్లా జయదేవ్ జీరో అవర్‌లో ప్రస్తావించారు. స్పందించిన హోంశాఖ పొరపాటును సరిదిద్దింది. హోంశాఖ ఆదేశాలతో సర్వే ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ నవంబర్ 23, 2019న కొత్త మ్యాప్ విడుదల చేసింది. అమరావతి మ్యాప్ నుంచి మిస్ అయిందని ఎంపీలు గురువారం లేవనెత్తిన అంశాన్ని పరిగణనలోకి తీసుకుని నేను ఈ అంశాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. తప్పును సరిదిద్దాంఅని పేర్కొంటూ నూతన మ్యాప్‌ను హాం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి  జత చేశారు. ఈ ట్విటర్ పోస్టును ఆయన జయదేవ్ గల్లాకు ట్యాగ్ చేశారు.

v 27.11.2019 : స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమరావతికి ఇప్పటి వరకు రూ.496 కోట్లు కేటాయింపు. చేసిన ఖర్చు రూ.472.9 కోట్లు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి రాజసభలో వెల్లడి.

v 28.11.2019 : చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజారాజధాని అమరావతి పర్యటన. భారీ సంఖ్యలో జనం పాల్గొన్నారు. ఉద్దండరాయునిపాలెం గ్రామ ప్రజలు ఘనస్వాగతం. ఉనికి చాటుకోవడం కోసం వైసీపీ గూండాలు స్థానికేతరులతో వెంకటపాలెం సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద బస్సుపై రాళ్లు, చెప్పులు విసిరించారు. ఆ ఒక్క చోట మాత్రమే పది మంది కార్యకర్తలు నిరసన తెలిపారు. ఆధ్యంతం చంద్రబాబు పర్యటన విజయవంతం అయింది. నిర్మాణాలన్నింటిని ఆయన పరిశీలించారు.

v 05.12.2019 :   ప్రజా రాజధాని అమరావతి, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన అజెండాగా విజయవాడలో జరిగిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతంమైంది. దాదాపు 15 రాజకీయ పార్టీలు, పలు ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. అమరావతి నిర్మాణం ఆపవద్దని ముక్తకంఠంతో కోరారు.

v అమరావతి ఎల్పీఎస్‌ భేష్‌: న్యూఢిల్లీ అంతర్జాతీయస్థాయి సదస్సులో సీఆర్డీయే కమిషనర్‌ లక్ష్మీ నరసింహం        03-12-2019 : రాజధాని నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూసమీకరణ పథకం (ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం- ఎల్పీఎస్‌) ఉత్తమమైనదని ఏపీసీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ పి.లక్ష్మీ నరసింహం పేర్కొన్నారు.  స్వచ్ఛంద సంస్థ తెరి’ (ది ఎనర్జీ అండ్‌ రీసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌) ఆధ్వర్యంలో భూసమీకరణపై న్యూఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు.
v అమరావతి కోసం భూములను పూలింగ్‌ ప్రాతిపదికన ఇవ్వాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరినంతనే రాజధానిలోని 29 గ్రామాలకు చెందిన వేలాది మంది రైతులు సుమారు 34,000 ఎకరాలను అందించడం చారిత్రాత్మకం.
v ఇంతటి భారీ ప్రక్రియ, అదీ పూర్తి శాంతియుతంగా జరగడం దేశంలోనే కాదు బహుశా ప్రపంచంలోనే మరెక్కడా జరిగి ఉండకపోవచ్చు.
v రాజధాని గ్రామాల్లోని రైతుల కోసం అమలు పరిచిన ఎల్పీఎస్‌ ప్యాకేజీ వివరాలతోపాటు నిరుపేదలు, ఇతర వర్గాలకు వర్తింపజేసిన సంక్షేమ పథకాలు, భూములిచ్చిన రైతులకు బదులుగా కేటాయించిన రిటర్నబుల్‌ ప్లాట్లను ఎటువంటి ఆరోపణలకు ఆస్కారమివ్వని రీతిలో ఆన్‌లైన్‌ లాటరీ ద్వారా కేటాయించారు.
v దేశంలోని కొన్ని చోట్ల ఎల్పీఎస్‌ అమలు చేసే క్రమంలో తలెత్తిన అవాంఛనీయ సంఘటనలు, ప్రతికూలత వంటివేమీ అమరావతిలో జరగలేదు. ఈ పథకం ఇక్కడ  విజయవంతమైంది.  అన్ని వర్గాల వారిని సంతృప్తి పరచింది.
అసైన్డ్ భూముల లావాదేవీలు రద్దు
v 11.12.2019 : సీఆర్డీఏ పరిధిలో థర్డ్ పార్టీ కొనుగోలు చేసిన మంత్రి మండలి రద్దు చేసింది.   అసైన్డ్ భూముల యాజమాన్య హక్కులు  తిరిగి దళిత రైతులకు దక్కనున్నాయి. ల్యాండ్ పూలింగ్ లబ్ధి దళిత రైతులకే.మొత్తం 2,500ఎకరాలలో 450ఎకరాల్లో ఉల్లంఘనలు గుర్తించినట్లు చెప్పిన మంత్రి బొత్స. అసైన్డ్‌ రైతుల పేరిట పూలింగ్‌కు ఇచ్చి, వేరే వ్యక్తుల పేరుతో రిటర్న్‌ బుల్‌ ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేశారు. ఈ అవకతవకల జాబితాలో ప్రతిపక్ష పార్టీకి చెందిన పలువురు నేతల పేర్లు. సీఆర్డీయే వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన ఓ మాజీమంత్రికి చెందిన బినామీల పేరుతో దాదాపు 70ఎకరాల్లో అక్రమాలు.
రాజధానిని మార్చం: మంత్రి బొత్స
v  13.12.2019 :  ఏపీ రాజధాని అమరావతిని మార్చడం లేదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శాసనమండలిలో  లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. రాజధాని మార్చే ఉద్దేశం ఉందా? అని టీడీపీ ఎమ్మెల్సీలు పామిడి శమంతకమణి, గుణపాటి దీపక్ రెడ్డి, పరుచూరి అశోక్ బాబు అడిగిన  ప్రశ్నకు అలాంటి ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు.
v 16.12.2019: రాజధాని తరలింపు యోచన లేదని మండలిలో ప్రకటించిన రెండు రోజులకే డిసెంబర్ 16,2019న మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట మార్చారు. శివరామకృష్ణ కమిటీ రాజధానికి ఈ ప్రాంతం తగదని చెప్పిందన్నారు. అందుకే అమరావతిపై జీఎన్‌ రావు సమన్వయకర్తగా నిపుణులతో కమిటీ వేశామని చెప్పారు.
v  
మూడు రాజధానులు
v 17.12.2019 ‌: శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి :  దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులున్నాయి. మనకూ మూడు ఉంటే తప్పేంటి.? అమరావతిలో చట్టసభలు, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో హైకోర్టు.

తీవ్ర నిరసన
సీఎం వ్యాఖ్యలకు రాష్ట్ర వ్యాప్తంగా, అమరావతి ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాజధాని రైతులు ఆందోళనకు దిగారు. అత్యధిక మంది రాజధానిని మార్చడానికి వ్యతిరేకత వ్యక్తం చేశారు.  కొందరు రాయలసీమ వారు మాకూ సచివాలయం కావాలని అడుగుతున్నారు.  తుగ్లక్ చర్యగా టీడీపీ పేర్కొంది. ఇతర పార్టీలు రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయడాన్ని స్వాగతించారు. కొందరు విశాఖలో అసెంబ్లీ ఏర్పాటు చేయవచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అందరూ సచివాలయాన్ని తరలించడానికి ఇష్టపడటంలేదు. అందరి దృష్టిలో రాజధాని అమరావతే. రాష్ట్ర వెలుపలవాళ్లు కూడా రాజధాని మార్పుని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.
జీఎన్‌రావు  కమిటీ నివేదిక
v 20.12.2019 : జీఎన్‌రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డికి నివేదిక అందజేసింది.
v నివేదిక ప్రకారం విజయనగరంతో కలిపి విశాఖపట్నం మెట్రో రీజన్‌ఏర్పాటు చేస్తారు. సచివాలయాన్నీ, అసెంబ్లీ(వేసవికాల)ని విజయనగరంలో ఏర్పాటు చేస్తారు.
v అమరావతిలో హైకోర్టు ధర్మాసనం ఉంటుంది. మంగళగిరి కాంప్లెక్స్‌ లో సీఎం క్యాంప్‌ కార్యాలయం, రాజ్‌ భవన్‌ ఉంటాయి. అసెంబ్లీ శీతాకాల, వర్షాకాల సమావేశాలు ఇక్కడ జరుగుతాయి.
v కర్నూలులో ప్రధానమైన హైకోర్టు ఉంటుంది. దీనికి అనుబంధంగా 2 వేర్వేరు ధర్మాసనాలు ఏర్పాటవుతాయి.
v సచివాలయాన్ని విశాఖ, అమరావతిలో సమాంతరంగా నడపాలి.  
v ట్రైబ్యునళ్లను కూడా 3 నగరాల మధ్య విభజించాలి.
v జీఎన్‌రావు  : పట్టణీకరణంతా మధ్య, ఉత్తర కోస్తాలోనే కేంద్రీకృతమైంది. దక్షిణకోస్తా, సీమ ప్రాంతాల్లో పట్టణీకరణ తక్కువ. అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ ఏపీకి తప్పనిసరి. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఏపీని నాలుగు ప్రాంతాలుగా చూడాలి.
v  ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు : 1. శ్రీకాకుళం, విజయనగరం ఒక మండలి. 2. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లా. 3. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. 4. సీమ నాలుగు జిల్లాలు చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం.
v 3 రాజధానుల ప్రతిపాదనను రాజధాని ప్రాంత రైతులు, ప్రజలతోపాటు వైసీపీ తప్ప మిగిలిన పార్టీలన్నీ వ్యతిరేకించాయి.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...