Jan 9, 2018

సచివాలయ క్యాంటిన్ లో అచ్చ తెలుగు వంటకాలు


సచివాలయం, జనవరి 8: సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక తెలుగు వంటకాల రుచులు అందిస్తున్న సందర్భంగా సచివాలయంలో ఉద్యోగుల సహకార సంఘ ఫలహారశాలలో భోజన సమయంలో అచ్చ తెలుగు వంటకాలు అందుబాటులో ఉంచుతున్నట్లు సంఘం అధ్యక్షుడు వంకాయల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు ఈ వంటకాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీ రాగి సంకటి, వేరుశనగ పచ్చడి, 10న దంపుడు బియ్యం పలావ్, 11న మెంతి కూర టమాటా అన్నం, 12న బెల్లం పొంగల్, మషాల వడ అందుబాటులో ఉంచుతామని ఆయన వివరించారు.

No comments:

Post a Comment

గోలి మధు కలానికి పదును, స్పీడు, ఎరుపు ఎక్కువ!

‘ఎదురీత’ పుస్తక సమీక్ష ఎవరు  ఏ సమస్య చెప్పినా వెంటనే స్పందించి, ఇట్టే  అద్భుతమైన  కవిత్వం రాయగల దిట్ట  ప్రముఖ అభ్యుదయ కవి గోలి మధు. ఆయన కవిత...