Jan 25, 2018

సచివాలయ ఉద్యోగుల ఓటర్ ప్రతిజ్ఞ


               సచివాలయం, జనవరి 25: జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా సచివాలయం 1వ బ్లాక్ గ్రీవెన్స్ హాల్ లో గురువారం ఉదయం  సచివాలయ ఉద్యోగులు ఓటర్ ప్రతిజ్ఞ  చేశారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వారిచేత ప్రమాణం చేయించారు. ‘‘భారతదేశ పౌరులమయిన మేము, ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము’’ అని ఉద్యోగులు చెప్పారు.

No comments:

Post a Comment

గోలి మధు కలానికి పదును, స్పీడు, ఎరుపు ఎక్కువ!

‘ఎదురీత’ పుస్తక సమీక్ష ఎవరు  ఏ సమస్య చెప్పినా వెంటనే స్పందించి, ఇట్టే  అద్భుతమైన  కవిత్వం రాయగల దిట్ట  ప్రముఖ అభ్యుదయ కవి గోలి మధు. ఆయన కవిత...