Sep 3, 2020

వ్యత్యాసాలు

 మా కండలు పిండిన నెత్తురు

మీ పెండ్లికి చిలికే అత్తరు.

మా మొగాలకీ కన్నీరు,

మీ మొగాలకో పన్నీరు!

మానోట్లో ఆకలి భగభగ

మానోట్లో సిగార్సు భుగభుగ

మాకీ పడిపోయిన గోడలు

మీ కేడంతస్తుల మేడలు!

చింపిగుడ్డ సింగారం మాకు

ఒళ్లంతా బంగారం మీకు,

మేము మండుటెండల్లో మాడుతూ

మీరు పండువెన్నెల్లో ఆడుతూ!

మాలోపల అగ్నిజ్వాలలు

మీలోపల అజీర్ణశూలలు!

మీమోటార్ లేపిన ధూళి

మానుదుటికి గులాబీ పౌడర్!

మీకార్లకు పనికిరాని టైర్లు

మాకాళ్లను కాపాడే జోళ్ళు

మా బ్రతుకిది మళ్లీ మళ్లీ

మీ బుగ్గ తిరిగే కిళ్ళీ!

పస్తున్నాం మేమిక్కడ,

మేస్తున్నారా మీరక్కడ? .....

 

కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి

 

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...