Sep 3, 2020

తేట తెలుగు

అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ఌా ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ: ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది.

 తేట తేట తెనుగులా....
మన తెలుగు భాష గొప్పదనం ముందుగా అక్షరమాల అల్లికలోనే ఉంది.

పూర్వం గురువులు పిల్లలతో వర్ణమాలను వల్లె వేయించేవారు. అలా కంఠస్ధం చేయించడంవల్ల కంఠం నుంచి ముఖం వరకు వ్యాయామం తెలియకుండానే జరుగుతుంది

ఏలాఅంటే

అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ఌా ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ:

ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది.

క ఖ గ ఘ ఙ……..కంఠ భాగం

చ ఛ జ ఝ ఞ……..కంఠంపైన నాలుక మొదటి భాగం

ట ఠ డ ఢ ణ……నాలుక మధ్యభాగం

త థ ద ధ న……నాలుక కొస భాగం

ప ఫ బ భ మ……..పెదవులకు

య ర ల వ శ ష స హ ళ క్ష ఱ……నోరంతా

ఇలా ముఖమంతా హల్లులతో వ్యాయామం జరుగుతుంది.

సుందర సుమధుర సౌమ్యమైన కమ్మని మృదుత్వంతో కూడిన తియ్యని తేనేలాంటిది మన భాష. ఆనందంగా మనసుకు హాయి గొలిపే విధంగా వినసొంపైన మాటలు మనందరి నోటంట వెలువడుతే ఎంత బాగుంటుంది.

తెలుగు భాషను అందంగా వ్రాసే వారికి చిత్రకళ సొంతమవుతుందంట ఎందుకంటే మన వర్ణమాలతో అన్ని మెలికలు ఉన్నాయి.

మనలోని భావాన్ని మాతృభాషలో వర్ణించినంత వివరంగా ఏ భాషలోను వ్రాయలేరు. తెలుగువారింటి ముంగిట ముగ్గును చూస్తే ఎంత ఆహ్లదభరితంగా చూడముచ్చటగా ఉంటుందో తెలుగువారి మనస్సు అంత అందంగా ఉంటుంది.


అరసున్న (ఁ), బండి 'ఱ' లు ఎందుకు?

అరసున్న~బండి లు

నేటిభాషలో దాదాపుగా వాడుకలో లేవు.

ఐతే ఇవి తెలుగు భాషకి ప్రత్యేకమైనవి.

ద్రావిడ భాషా లక్షణాన్ని నిరూపించేవి.

అంతేకాదు కావ్యభాషలోను, లక్షణశాస్త్రంలోను

వీటి ప్రాముఖ్యం చాలావుంది.

వాడకపోతే పరవాలేదు

కానీ వీటిగురించి తెలుగువాడు తెలుసుకోవాలిగదా!

 మన భాషాసంపదలో  ఇవీ భాగస్వాములే అని గ్రహించాలి గదా!

 అరసున్న, ఱ ల వల్ల అర్థభేదం ఏర్పడుతొంది.

 పదసంపదకి ఇవి తోడ్పడతాయి.

ఎలాగో చూడండి: ఉదా:-

 అరుఁగు= వీది అరుగు*

 అరుగు= వెళ్ళు, పోవు*

 అఱుగు= జీర్ణించు*

 ఏఁడు = సంవత్సరం*

 ఏడు= బాధ~7 సంఖ్య*

 కరి= ఏనుగు*

 కఱి= నల్లని*

 కాఁపు= కులము*

 కాపు= కావలి*

 కాఁచు= వెచ్చచేయు*

 కాచు= రక్షించు*

 కారు= ఋతువుకాలము*

 కాఱు= కారుట (స్రవించు)*

(కారు=వాహనం ఆంగ్ల పదము)

 చీఁకు= చప్పరించు*

 చీకు= నిస్సారము, గ్రుడ్డి*

 తఱుఁగు= తగ్గుట*

 తఱుగు= తరగటం(ఖండించటం)*

 తరి= తరుచు*

 తఱి= తఱచు*

తీరు= పద్ధతి*

 తీఱు= నశించు*

 దాఁక= వరకు*

 దాక= కుండ, పాత్ర*

 నాఁడు= కాలము*

 నాడు= దేశము, ప్రాంతము*

 నెరి= వక్రత*

 నెఱి= అందమైన*

 నీరు= పానీయం*

 నీఱు= బూడిద*

 పేఁట= నగరములో భాగము*

 పేట= హారంలో వరుస*

 పోఁగు= దారము పోఁగు*

 పోగు= కుప్ప*

 బోటి= స్త్రీ*

 బోఁటి=వంటి [నీబోఁటి]*

 వాఁడి= వాఁడిగాగల*

 వాడి= ఉపయోగించి*

 వేరు= చెట్టు వేరు*

 వేఱు= మరొకవిధము

 ఇవి మన సంపద

తెలుసుకుని సంతోషపడదాం

 


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...