Jan 11, 2017

జన్మభూమికి అపూర్వ స్పందన


ü గ్రామసభల్లో ఉత్సవ వాతావరణం
ü గ్రామసభల్లో పాల్గొన్న 1,39,660  మంది విద్యార్థులు
ü పెన్షన్లు, కొత్త దీపం కనెక్షన్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ
ü గర్భిణులకు సీమంతాలు – పెద్ద ఎత్తున పాల్గొంటున్న మహిళలు
ü 8,204 చోట్ల  కుటుంబ, సమాజ వికాసం కార్యక్రమాలు

             రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వివిధ రకాల భద్రతలు కల్పిస్తూ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 4వ విడత ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమాలకు అపూర్వ స్పందన లభిస్తోంది. ఈ నెల 2 నుంచి 12వ తేదీ వరకు జరిగే ఈ గ్రామ సభలలో అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. గ్రామ సభలు జరిగే చోట ఉత్సవ వాతావరణం నెలకొంటోంది. గర్భిణులకు ప్రభుత్వం తరపున సీమంతం వేడుకలు నిర్వహిస్తున్నారు. వివిధ రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. గ్రామాలలో పశువైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. పశువులకు కృత్రిమ గర్భధారణ, గొర్రెలు, మేకలకు డీ-వార్మింగ్ వంటివి చేస్తున్నారు. కొత్త పించన్లకు, రేషన్ కార్డులకు దరకాస్తులు స్వీకరిస్తున్నారు. 9వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేస్తున్నారు. అర్హులకు పించన్లతోపాటు కొత్త రేషన్ కార్డులు, కొత్తగా దీపం కనెక్షన్లు ఇస్తున్నారు. దాంతో ప్రజలు అధిక సంఖ్యలో గ్రామ సభలలో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, మునిసిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్ లు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొని ప్రజల సమస్యలకు పరిష్కార మార్గాలు చూపుతున్నారు.

జన్మభూమిలో పాల్గొన్న 1,39,660  మంది విద్యార్థులు
         రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జన్మభూమి కార్యక్రమాలలో శుక్రవారం సాయంత్రం వరకు ఈ అయిదు రోజులలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 7,529 చోట్ల పాల్నొన్నారు. 1,39,660  మంది విద్యార్థులు, 26, 537 మంది ఉపాధ్యాయులు  ఈ కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు. మునిసిపల్ కార్యాలయాలు, పంచాయతీ సిబ్బంది 24,731 గ్రామసభలలో పాల్గొన్నారు. జన్మభూమి కమిటీ సభ్యులు 36,709 కార్యక్రమాలలో, మునిసిపల్ కమిషనర్లు, వీఆర్ఓలు 9,558, పంచాయతీ కార్యదర్శులు, శానిటరీ ఇనస్పెక్టర్లు 8,798, వ్యవసాయ అధికారులు, బిల్ కలెక్టర్లు 10,473 గ్రామ సభలలో పాల్గొన్నారు. ఏఎన్ఎంలు 12,126 కార్యక్రమాలలో, నీటి వినియోగ సంఘాల వారు 6,395 కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆయా గ్రామ పంచాయతీలు, వార్డులలో 2014 జూన్ నుంచి సాధించిన ఫలితాల వివరాలు తెలుపుతూ 7,643 చోట్ల కార్డులు పంపిణీ చేశారు. గ్రామాలు, వార్డులు అభివృద్ధికి సంబంధించి 2017-18 యాక్షన్ బడ్జెట్ ప్లాన్లను 7,326 చోట్ల పంపిణీ చేశారు. 8,204 చోట్ల  కుటుంబ వికాసం, సమాజ వికాసం కార్యక్రమాలను నిర్వహించారు.

క్యాష్ లెస్ లావాదేవీలపై అవగాహన: రాష్ట్ర వ్యప్తంగా ప్రభుత్వం క్యాష్ లెస్ లావాదేవీలను విస్తృతంగా ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా  జన్మభూమి కార్యక్రమాలలో క్యాష్ లెస్ లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామ సభలలో ఇప్పటి వరకు 41,649 మందికి ఈ అంశంపై శిక్షణ ఇచ్చారు. 46, 020 రూపే కార్డులు పంపిణీ చేశారు. 36,480 రూపే కార్డులను యాక్టివేట్ చేశారు.  ఎక్కవ గ్రామ సభలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...