Jan 27, 2017

ఇలా చదవండి-విజయం మీదే

పంచాయతీ సెక్రటరీ(గ్రేడ్-IV) పోస్టుల పోటీ పరీక్షలకు సిలబస్
      ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ కోసం గత నెలలో విడుదల చేసిన  నోటిఫికేషన్లలో పంచాయతీరాజ్ సబార్డినేట్ సర్వీస్ లో  పంచాయతీ సెక్రటరీ(గ్రేడ్-IV) పోస్టులే అత్యధికంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 1055 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ సారి పోటీ పరిక్షలకు వయోపరిమితిని 42 సంవత్సరాలకు పెంచడంతో పోస్టులకు తగ్గట్టుగానే అత్యధిక మంది పోటీపడే అవకాశం ఉంది. అందువల్ల ఈ పోస్టు కోసం పోటీ పడే అభ్యర్థులు ప్రణాళికాబద్దంగా కాస్త ఎక్కువగానే  అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. ఈ ఖాళీలకు 25వేల మందికి మించి అభ్యర్థులు పోటీపడితే కమిషన్ ముందుగా స్క్రీనింగ్ టెస్  నిర్వహిస్తుంది. ఎక్కువ మంది అభ్యర్థులు దరకాస్తు చేసుకునే అవకాశం ఉన్నందున  ఏప్రిల్ 23న ఆఫ్ లైన్ లో  స్క్రీనింగ్ టెస్  నిర్వహించే అవకాశం ఉంది. అందులో ఎంపికైన వారికి మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఆ పరీక్ష జూలై 16న నిర్వహించే అవకాశం ఉంది. ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థులు (1:50 నిష్పత్తి) ఉండే విధంగా  జనరల్ మెరిట్ లో మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు.  మెయిన్ పరీక్షను ఆన్ లైన్ లో నిర్వహిస్తారు.

పరీక్షల విధానం :
స్ర్కీనింగ్ టెస్ట్, మెయిన్ పరీక్ష రెండూ డిగ్రీ స్థాయిలో ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. స్ర్కీనింగ్ టెస్ట్ లో 150 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి. సమయం 150 నిమిషాలు కేటాయిస్తారు. ఈ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ఏదైన ఒక ప్రశ్నకు జవాబు తప్పుగా మార్క్ చేస్తే, ఒన్ థర్డ్ మార్క్ నష్టపోవలసి ఉంటుంది. అంటే మూడు జవాబులు తప్పుగా మార్క్ చేస్తే ఒక మార్కు పోతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని జవాబులు మార్క్ చేయవలసి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక నిమిషం సమయం ఉన్నందున జాగ్రత్తగా ఆలోచించి జవాబు మార్క్ చేయడం మంచింది.
మెయిన్ పరీక్ష: ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్లో 150 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి. 150 నిమిషాల సమయం ఉంటుంది. మొదటి పేపర్ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీలో 150 మార్కులకు ఉంటుంది. రెండవ పేపర్ గ్రామీణాభివృద్ధి, ఏపీలోని గ్రామీణ ప్రాంత సమస్యలపై 150 మార్కులకు ఉంటుంది.  మొత్తం 300 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. దీంట్లో కూడా స్ర్కీనింగ్ టెస్ట్ లో మాదిరే మైనస్ మార్కులు ఉంటాయి. ఏదైన ఒక ప్రశ్నకు తప్పుడు జవాబు మార్క్ చేస్తే, ఒన్ థర్డ్ మార్క్ మైనస్ చేస్తారు. మూడు ప్రశ్నలకు తప్పుడు జవాబులు మార్క్ చేస్తే ఒక మార్క్ మైనస్ చేస్తారు.

స్ర్కీనింగ్ టెస్ట్ సిలబస్:
1.జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలకు సంబంధించి కరెంట్ ఎఫైర్స్.
2. జనరల్ సైన్స్ లో ప్రాధమిక అంశాలు, దైనందిక జీవితంలో వాటి ప్రధాన్యత. సైన్స్, టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలలో జరుగుతున్న అభివృద్ధి.
3. జాతీయోధ్యమం, ఆధుని భారత దేశ చరిత్ర.
4.స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత దేశంలో ఆర్థికాభివృద్ధి.
5. లాజికల్ రీజనింగ్, విశ్లేషణా సామర్థ్యం, డేటా ఇంటర్ ప్రిటేషన్.
6. భారత రాజ్యాంగం స్థూల పరిశీలన.
7. ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు- విభజన కారణంగా తలెత్తిన రాజకీయ, పరిపాలన, ఆర్థిక,సామాజిక, సాంస్కృతిక, న్యాయపరమైన సమస్యలు.
8.భారత దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ స్వరూపం, దానిలో వచ్చిన మార్పులు, దానికి సంబంధించి  జరిగిన రాజ్యాంగ సవరణలు, వివిధ కమిటీల నివేదికలు.
9. ఏపీలో పంచాయతీరాజ్ వ్యవస్థ, దానిలో వచ్చిన మార్పులు.
10. ఏపీ పంచాయతీరాజ్ శాఖలోని ప్రధానమైన పథకాలు.
11. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ. వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు, గ్రామీణ చేతివృత్తులు.
12. ఏపీలో గ్రామీణ పరపతి స్వరూపం. ఇందులో బ్యాంకులు, సహకార సంఘాలు, మైక్రో ఫైనాన్స్ వంటి వాటి పాత్ర.
13. స్వయం సహాయకం సంఘాల ద్వారా మహిళా సాధికారత, ఆర్థిక అభివృద్ధి.

         ఈ పరీక్ష కోసం 6వ తరగతి నుంచి 10 తరగతి వరకు సైన్స్, సోషల్ పుస్తకాలను చదవాలి. వాటిలో భౌతిక, రసాయన,జీవ, పౌర, అర్థ శాస్తాలతోపాటు జాగ్రఫీ కూడా ఉంటుంది.  5 నుంచి 8 వరకు గణితం పుస్తకాలను అధ్యయనం చేయాలి. ఆధుని భారత దేశ చరిత్ర, జాతీయోధ్యమం కోసం డిగ్రీ చరిత్ర పుస్తకం చదవడం ఉత్తమం. కరెంట్ ఎఫైర్స్ కోసం ప్రతి రోజూ పేపర్లు చదవాలి. అమెరికా అధ్యక్షుని ఎన్నిక, దావోస్ సమ్మిట్ వంటి అంతర్జాతీయ, పెద్ద నోట్ల రద్దు, క్యాష్ లెస్ లావాదేవీలు వంటి జాతీయ, నూతన రాజధాని అమరావతి, విశాఖలో పార్టర్ షిప్ సమ్మిట్ వంటి రాష్ట్ర అంశాలను తెలుసుకోవాలి. రాష్ట్ర విభజనకు కారణాలు, విభజన తరువాత తలెత్తిన సమస్యలపై అవగాహన ఉండాలి. ఆరోగ్యబీమా, ఎన్టీఆర్ వైద్యసేవలు, ఎన్టీఆర్ గృహనిర్మాణం వంటి ప్రభుత్వ పథకాలతోపాటు సీఆర్డీఏ, సింగిల్ విండో విధానం, కాపు కార్పోరేషన్, కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం, పంచాయతీరాజ్ వ్యవస్థ స్వరూపం మొత్తం తెలుసుకోవాలి. రైతు రుణాల మాఫీ, మహిళా సాధికారిత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, జిల్లాలు, నదులు, పంటలు వంటి వాటిపై అవగాహన ఉండాలి. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలకు వచ్చేసరికి స్వచ్చభారత్, మేక్ ఇన్ ఇండియా, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం), ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన వంటి పథకాలు గురించి తెలుసుకోవాలి. ఆయా అంశాలకు సంబంధించి పుస్తకాలు మార్కెట్లో దొరుకుతాయి. అలాగే ఇంటర్నెట్ లో అన్ని వ్యవస్థలపై వెబ్ సైట్స్ ఉన్నాయి. వాటిలో తాజా సమాచారం దొరుకుతుంది. సెన్సెస్ సైట్ లోకి వెళితే 2011 భారతదేశ జనాభాతోపాటు రాష్ట్రం, జిల్లా, పట్టణం గ్రామాల జనాభాకు సంబంధించి పూర్తి వివరాలు వేరువేరుగా లభిస్తాయి. అలాగే గూగుల్ సెర్చింజన్  లోకి వెళ్లి ఏ అంశం కావాలో దానిని ఎంటర్ చేస్తే ఆ వెబ్ సైట్లు కనిపిస్తాయి. సీఎం డ్యాష్ బోర్డు, సీఆర్డీఏ, ఎంజీఎన్ఆర్ఈజీఎస్, జన్ ధన్ యోజన, అసెంబ్లీ, పార్లమెంట్, ప్రసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆధార్....ఇలా ప్రతిదానికి వెబ్ సైట్ ఉంటుంది. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ విషయాలన్నిటినీ తెలుసుకోవడం సులభమైంది. అయితే చదవడమే ప్రణాళిక ప్రకారం చదవాలి.

మెయిన్ పరీక్ష
పేపర్ - I  జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ
1.     జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత గల సంఘటనలు.
2.    జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలకు సంబంధించి కరెంట్ ఎఫైర్స్.
3.    జనరల్ సైన్స్ లో ప్రాధమిక అంశాలు, దైనందిక జీవితంలో వాటి ప్రధాన్యత. సైన్స్, టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలలో జరుగుతున్న అభివృద్ధి.
4.     జాతీయోధ్యమం, ఆధుని భారత దేశ చరిత్ర.
5.    స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత దేశంలో ఆర్థికాభివృద్ధి.
6.    లాజికల్ రీజనింగ్, విశ్లేషణా సామర్థ్యం, డేటా ఇంటర్ ప్రిటేషన్.
7.    విపత్తు నిర్వహణకు సంబంధించి ప్రాధమిక అంశాలు(సీబీఎస్ఈ VIII & IVస్థాయి).
8.    ఏపీకి ప్రాధాన్యత ఇస్తూ భారతదేశ భౌగోళిక స్వరూపం.
9.     భారత రాజ్యాంగం స్థూల పరిశీలన.
10.                       పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధికి అవకాశాలు
11.                       ఆంధ్రప్రదేశ్ విభజన - ఆ కారణంగా తలెత్తిన రాజకీయ, పరిపాలన, ఆర్థిక,సామాజిక, సాంస్కృతిక, న్యాయపరమైన సమస్యలతోపాటు ఈ దిగువ తెలిపిన అంశాలు
  ఏ. రాజధాని నగరాన్ని వదులుకోవడం, కొత్త రాజధాని నిర్మాణంలో ఎదురయ్యే చాలెంజెస్, ఆర్థిక సమస్యలు.
బి. ఉమ్మడి సంస్థల విభజన
సీ. ఉద్యోగుల విభజన, వారి తరలింపు, వారి స్థానికత సమస్యలు
డీ. వాణిజ్యం, వ్యాపార సంస్థలపై విభజన ప్రభావం.
ఈ. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వనరుల సమస్య.
ఎఫ్. విభజన తరువాత రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు, మౌలిక సదుపాయా ల అభివృద్ధి.
జీ. జనాభాతోపాటు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలపై విభజన ప్రభావం.
హెచ్. నదీ జలాల పంపకం, సంబంధిత అంశాలపై విభజన ప్రభావం.
ఐ. ఏపీ పునర్వవస్తీకరణ చట్టం-2014, ఏక పక్ష విభజన.

పేపర్ –II  గ్రామీణాభివృద్ధి, గ్రామీణ ప్రాంత ముఖ్యంగా ఏపీలోని సమస్యలు

1.     భారత దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ స్వరూపం, దానిలో వచ్చిన మార్పులు, దానికి సంబంధించి  జరిగిన రాజ్యాంగ సవరణలు, వివిధ కమిటీల నివేదికలు.
2.    ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీరాజ్ వ్యవస్థ.
3.    పంచాయతీ సెక్రటరీ బాధ్యతలు.
4.    గ్రామీణ సమాజం : గ్రామీణ పేదల అభివృద్ధికి ఉపయోగపడిన పథకాలు
5.    గ్రామీణాభివృద్ధికి ఉపకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖల అతి ముఖ్యమైన పథకాలు.
6.    ఏపీ పంచాయతీరాజ్ శాఖకు చెందిన ముఖ్యమైన పథకాలు
7.    రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ: వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు, గ్రామీణ చేతి వృత్తిదారులు.
8.    ఏపీలో గ్రామీణ పరపతి : బ్యాంకులు, సహకార సంఘాలు, మైక్రో ఫైనాన్స్
9.    కమ్యునిటీ ప్రాతిపదికగా ఏర్పాటైన సంస్థలు, సంక్షేమ పథకాలు
10.           . స్వయం సహాయకం సంఘాల ద్వారా మహిళా సాధికారత, ఆర్థిక అభివృద్ధి.
11.            స్థానిక సంస్థల ఆదాయ, వ్యయాల నిర్వహణ
12.           వివిధ పథకాల కింద వచ్చిన నిధుల నిర్వహణ, వాటి జమాఖర్చుల లెక్కలు.

మెయిన్ పరీక్ష సిలబస్ ని పరిశీలిస్తే  కొన్ని అంశాలు స్ర్కీనింగ్ టెస్ట్ సిలబస్ లోనివే అయినప్పటికీ పరిధి ఎక్కువగా ఉంది. దానికి తోడు కొన్ని కొత్త అంశాలు కూడా చేరాయి. అంటే దాని కంటే మెయిన్ కు ఎక్కవగా కష్టపడవలసిన అవసరం ఉంది. విపత్తు నిర్వహణ, పంచాయతీరాజ్ సెక్రటరీ బాధ్యతలు, పర్యావరణ, ఆదాయ,వ్యయాల లెక్కలు, నిధుల నిర్వహణ వంటివి అదనంగా వచ్చాయి. అలాగే రాష్ట్ర విభజన పరిణామ క్రమం, విభజన తీరు, ఆ తరువాత ఎదుర్కొంటున్న సమస్యలు, రాజధాని నిర్మాణం వంటి అంశాలతో విస్తృత స్థాయిలో అధ్యయనం చేయాలి.  ఇందు కోసం యోజన, ఆంధ్రప్రదేశ్ వంటి పుస్తకాలు చదడంతోపాటు పంచాయతీరాజ్, ఏపీ రూరల్ డెవలప్ మెంట్, నాబార్డ్... వంటి వెబ్ సైట్లను అధ్యయనం చేయాలి. ఆ వెబ్ సైట్లలోకి వెళితే సంబంధింత వెబ్ సైట్ల లింకులు కూడా ఉంటాయి. ఆ విధంగా కూడా కొత్తకొత్త వెబ్ సైట్ల గురించి తెలుస్తుంది. కొన్ని వెబ్ సైట్లలో తెలుగులో కూడా సమాచారం ఉంటుంది.

ఈ పరీక్షలకు ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన వెబ్ సైట్లు ఈ దిగువ ఇస్తున్నాం.

india.gov.in
presidentofindia.gov.in
www.ap.gov.in
desap.cgg.gov.in
aplegislature.org
reorganisation.ap.gov.in
core.ap.gov.in
www.crda.ap.gov.in
pmjdy.gov.in
rural.nic.in
digitalindia.gov.in
www.apagrisnet.gov.in
apseeds.ap.nic.in
www.nrega.ap.gov.in
www.ssp.ap.gov.in   
www.egmm.cgg.gov.in      
www.aaby.ap.gov.in 
www.socialaudit.ap.gov.in 
www.apard.gov.in    
www.rdhrms.ap.gov.in      
www.iwmp.ap.gov.in
www.serp.ap.gov.in
www.apagros.org
www.haca.co.in
www.aphorticulture.com
www.apmarkfed.org
www.market.ap.nic.in
www.icrisat.org
www.angrau.net
www.agri.ap.nic.in
www.sfci.nic.in
www.nsc.gov.in
www.apssca.ap.nic.in
www.nafed-india.com
horticulturedept.ap.gov.in
www.nabard.org
www.censusindia.gov.in
goidirectory.nic.in
apahd.gov.in
jbmv.ap.gov.in
 -          శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్.
26.01.2017 విశాలాంధ్ర నుంచి



No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...