Jan 11, 2017

అందరికీ అన్ని రకాల భద్రత - అదే ప్రభుత్వ లక్ష్యం

§  4 రోజుల్లో 16 లక్షల మందికి రూ.105 కోట్ల పెన్షన్ల పంపిణీ
§  4వ విడత ‘జన్మభూమి-మాఊరు’ ప్రత్యేకత
§  38,27,919  కుటుంబాలకు రూ.1 కిలో బియ్యం
§  1,96,355 కొత్తగా రేషన్ కార్డులు
§  దీపం పథకం కింద కొత్తగా 2,00,793 కనెక్షన్లు
§  3,54,100 మందికి మందుల పంపిణీ
§  విద్యార్థినులకు 2322 సైకిళ్లు పంపిణీ

          రాష్ట్రంలోని పేద మధ్య తరగతి ప్రజలకు అన్ని రకాల భద్రతను పటిష్టపరచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 4వ విడత ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం చేపట్టింది. కుటుంబ భద్రతకు 15 సూత్రాలు రూపొందించి సమర్ధవంతంగా అమలు చేస్తోంది. ప్రజాసమస్యలకు పరిష్కార వేదికగా నిలిచిన ఈ కార్యక్రమం సమాజిక భద్రతకు నిలువుటద్దంలా నిలుస్తుంది. ఈ నెల 2 నుంచి 11వ తేదీ వరకు పది రోజుల పాటు కొనసాగుతుంది. 4వ రోజు గురువారం సాయంత్రం 7 గంటల వరకు అందిన సమాచారం మేరకు జీవన భద్రతలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద మొదటి నాలుగు రోజుల్లో 16,06,424 మందికి 105.28 కోట్ల రూపాయల పించన్లు ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇబ్బందులుపడే వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి, వారికి జీవన భద్రత కల్పించడానికి ఈ పించన్లు ఇస్తున్నారు. వృద్ధులు 4,87,929 మందికి, వితంతువులు 3,41,978 మందికి, దివ్యాంగులు 1,20,570 మందికి, చేనేత కార్మికులు 22,897 మందికి, కల్లుగీత కార్మికులు 19,217 మందికి పించన్లు ఇచ్చారు.
పేదలకు నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా పేదలు ఒక్కొక్కరికి కిలో రూపాయి చొప్పున 5కిలోల బియ్యం అందజేస్తున్నారు.అక్రమాలకు, అవినీతికి తావులేకుండా ఈ-పాస్ ను ప్రవేశపెట్టి ఆహారభద్రత కల్పిస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం పోషకాహార భద్రత కింద 38,27,919  కుటుంబాలకు 5 కిలోల బియ్యం చొప్పున అందించారు. 31,80,456 అర్హత గల కుటుంబాలు సంక్రాతి కానుకలు అందుకున్నారు. 6,41,171 కుటుంబాలు క్రిస్మస్ కానుకలు అందుకున్నారు.  1,96,355 మందికి కొత్తగా రేషన్ కార్డులు అందజేశారు.

9,86,919 మంది జీవిత బీమా సౌకర్యం
          దేశంలో నిరుపేదలకు మొదటిసారిగా బీమా కల్పించిన రాష్ట్రం ఏపీ. ఈ నాలుగు రోజుల్లో 9,86,919 మంది జీవిత, అంగవైకల్యం బీమా పరిధి కింద నమోదయ్యారు. రాష్ట్రాభివృద్ధిలో విద్యుత్ ప్రాముఖ్యతను గుర్తించిన ప్రభుత్వం విద్యుత్ భద్రతకు ప్రాధాన్యత ఇస్తోంది. 2014లో రాష్ట్రంలో రోజుకు 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల  రెండేళ్లలో విద్యుత్ మిగిలే స్థాయికి చేరింది. గృహావసరాలకు, పరిశ్రమలకు 24 గంటలు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తూ కూడా మిగులు విద్యుత్ సాధించడం విశేషం.  ప్రస్తుతం 46,07,485 ఇళ్లకు 24 గంటలు నిరంతరం విద్యుత్ సరఫరా అవుతోంది. వ్యవసాయరంగంలో 6,35,065 రైతులు 7 గంటల ఉచిత విద్యుత్ పొందుతున్నారు. 50 యూనిట్ల లోపల వినియోగించే ఎస్సీ,ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నారు.

కొత్త దీపం కనెక్షన్లు 2,00,793
     గ్యాస్ భద్రతలో భాగంగా  కొత్తగా 2,76,774 ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చారు. దీపం పథకం కింద కొత్తగా 2,00,793 కనెక్షన్లు ఇచ్చారు. తాగునీరు, సాగు నీరు అందించడానికి ప్రభుత్వం అనేక బృహత్తర ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. పంట సంజీవని పథకం కింత 2016-17లో2,55,445 ఫారం పండ్స్ మంజూరు చేశారు. ఇప్పటి వరకు పంట సంజీవని కింద 1,38,465 ఫారం పాండ్స్ చేపట్టారు. 4,01,601 నివాస ప్రాంతాలు త్రాగునీటి పథకం పరిధిలోకి వచ్చాయి. 4,41,176 ప్రాంతాలు పాక్షికంగా ఈ పథకం పరిధిలో ఉన్నాయి. నీరు ప్రగతి పథకం కింద కొత్తగా 60,583 హెక్టార్లకు సాగు నీరు అందుతోంది. వర్షం కురవని ప్రాంతాలలో 7586 రెయిన్ గన్స్ ఉపయోగించారు.
అందరికి ఇళ్లు నినాదంలో భాగంగా ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద 94,736 ఇళ్లు మంజూరు చేశారు. ఈ పథకం కింద 43,111 ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. ప్రాథమికమైన నీరు, శానిటేషన్, విద్యుత్, రోడ్లు, గ్యాస్ వంటి సౌకర్యాలతో పట్టణ గృహ నిర్మాణ పథకం కింద 30,112 ఇళ్లు నిర్మించారు. స్వచ్ఛాంధ్రలో భాగంగా పారిశుద్ధ్య భద్రత కింద 2016-17లో 8,76,872 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేశారు. ఇప్పటివరకు 4,90,942 మంది వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. 19,145 కమ్యునిటీ మరుగుదొడ్లు నిర్మించారు.

3,54,100 మందికి మందుల పంపిణీ
            రాష్ట్రంలోని ప్రజలందరికి ఆరోగ్య భద్రత కల్పించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ జన్మభూమిలో ఇప్పటి వరకు 6,809 ఆరోగ్య శిబిరాలు నిర్వహించింది. ఈ శిబిరాలలో  3,54,100 మందికి మందులు పంపిణీ చేశారు. కంటి చూపు లోపించడం వల్ల కళ్లద్దాలు కావలసినవారిని 20,930 మందిని గుర్తించారు. కంటి శస్త్ర చికిత్సకు 3,215 మంది తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పథకం కింద వైద్య పొందడానికి 13,993 మందిని గుర్తించారు. తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్ పథకం కింద 37,931 మంది లబ్ది పొందారు. 108 సర్వీసుల ద్వారా 58,870 మంది, 104 సర్వీసుల కింద4,47,749 మంది లబ్దిపొందారు. 3,083 జనరిక్ మెడికల్ షాపులు ఏర్పాటు చేశారు.

6,809 పశువైద్య శిబిరాలు
జన్మభూమి కార్యక్రమాలలో 6,809 పశువైద్య శిబిరాలను కూడా నిర్వహించారు. 6,19,325 పశువులకు వైద్యం చేశారు. 19,736 పశువులకు కృత్రిమ గర్భధారణ చేశారు. 30,20,418 గొర్రెలు, మేకలకు డీ-వార్మింగ్ చేశారు. 1,97,176 దూడలకు డీ-వార్మింగ్ చేశారు. పశు మిత్ర పథకం ద్వారా 1,19,278 కుటుంబాలు పశుగ్రాసాన్ని సమకూరుస్తున్నాయి. జీవనమిత్ర పథకం కింద 1,56,505 కుటుంబాలు గొర్రెలకు, మేకలకు మేతని సమకూరుస్తున్నాయి.

విద్యార్థినులకు 2322 సైకిళ్లు పంపిణీ

          విద్యా భద్రతలో భాగంగా 2016-17లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినులు 2322 మందికి సైకిళ్లు పంపిణీ చేశారు. 4008 మందికి ప్రతిభ అవార్డులు ఇచ్చారు. 1118 డిజిటల్ క్లాస్ రూమ్ లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం ప్రభుత్వం అనే చర్యలు తీసుకుంటోంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఇజీఏ) కింద 38,24,657 మందికి జాబ్ కార్డులు ఇచ్చారు. ఈ పథకం కింద ఈ ఏడాది ఇప్పటి వరకు 6,76,99,115 పని దినాలు కల్పించారు. ఇందు కోసం రూ.934.34 కోట్లు ఖర్చు చేశారు. సమాచార, సాంకేతిక విజ్ఞానం విషయంలో రాష్ట్రప్రభుత్వం ముందుంది. ఫైబర్ నెట్ ద్వారా నెలకు 149 రూపాయలకే ప్రతి ఇంటికి ఇంటర్నెట్, ఫోన్, కేబుల్ టీవీ సౌకర్యం కల్పించే ఏర్పాట్లు చేస్తోంది. ఈ పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించారు. ఇప్పటివరకు 13,508 ఇళ్లకు ఈ సౌకర్యం కల్పించారు.

306 కేసులు నమోదు
             శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకునే చర్యలలో భాగంగా ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థని పెంపొందిస్తున్నారు. 222 గ్రామాలలో శాంతిభద్రతల సమస్య ఉన్నట్లు గుర్తించారు. 306 కేసులు నమోదు చేశారు. శ్రమ చేయగలిగిన ప్రతి పౌరునికి ఆదాయ భద్రత కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ల ద్వారా ఆ వర్గాల కుటుంబాల కనీస ఆదాయం నెలకు పది వేల రూపాయలు వచ్చేలా ఏర్పాట్లు చేసింది.
అక్షరాశ్యులుగా మారిన 6,52,844 మంది నిరక్షరాశ్యులు
          ఈ జన్మభూమిలో సమాజ వికాస కార్యక్రమాలను కూడా ప్రభుత్వం చేపట్టింది. ఈ ఏడాది 6,52,844 మంది నిరక్షరాశ్యులు అక్షరాశ్యులుగా మారారు. ఆరోగ్యానికి సంబంధించి ఎన్టీఆర్ వైద్య పరీక్ష పథకం ద్వారా 3,21,004 మంది వైద్య సేవలు పొందారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద 18,33,018 మంది వైద్య సేవలు పొందారు. తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్ పథకం కింద 43,897 మంది అబ్ది పొందారు. వ్యవసాయం, అనుబంధ విభాగాలలో 7,58,441 మందికి సాయిల్ నాణ్యత కార్డులు అందజేశారు. నీరు-చెట్టు పరిధిలోకి 16,074 చెరువులు ఉన్నాయి. నదులు అనుసంధానం ద్వారా వేల ఎకరాలకు సాగు నీరు అందుతోంది. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా 2,359 ఎంఎస్ఎంఈ(మైక్రో,స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్)లను నెలకొల్పారు. రాష్ట్రాభివృద్ధిలో మౌలిక సదుపాయాలకల్పన అత్యంత ప్రధానమైనది. దానికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం 19,002 కిలో మీటర్ల అంతర్గత సీసీ రోడ్ల అవసరాన్ని గుర్తించింది. 11,025 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లను వేయించింది. 20,623 కిలోమీటర్ల డ్రైనేజీ అవసరం కాగా, 10,232 కిలోమీటర్ల మేర నిర్మించింది. పౌరసేవలలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ ద్వారా 4,49,741 ఫిర్యాదులు అందుకున్నారు. మీ భూమి ద్వారా 12,38,470 భూమి రికార్డులను పరిశీలించారు. పట్టాదార్ పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్ కు సంబంధించి 5,54,667 పత్రాలపై తహశీల్డార్లు సంతకాలు చేశారు.  సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా రంగోళి పోటీలలో 8,385 మందికి అవార్డులు ఇచ్చారు. ఫుడ్ ఫెస్టివల్స్ లో 4,982 మందికి బహుమతులు అందజేశారు. గ్రామీణ క్రీడలలో 5,916 మందికి అవార్డులు ఇచ్చారు. జన్మభూమి కమిటీలు, బ్యాంకు అధికారులు సంయుక్తంగా డిజిటల్ లావాదేవీలలో 20,321 మందికి శిక్షణ ఇచ్చారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...