Feb 12, 2020

ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై ధర్మాసనం సూటి ప్రశ్నలు


12.02.2020: 
v విజిలెన్స్‌ కమిషన్‌, కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌ విభాగాల నిర్వహణకు ప్రస్తుత భవనాలు సరిపోని పక్షంలో మరో భవనానికి మారాలి తప్ప ఏకంగా మరో జిల్లాకు తరలించడమెందుకు? ఈ రెండు కార్యాలయాల్లో ఎంతమంది సిబ్బంది పని చేస్తున్నారు? ఇంకెన్ని ఖాళీలున్నాయి? ప్రస్తుతం ఏ మేర విస్తీర్ణంలో ఉన్నాయి? వాటికి ఎంతమేర విస్తీర్ణం అవసరం? తదితర వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలి. రాజకీయ వ్యాఖ్యలకు దురుద్దేశాలు ఆపాదించవద్దని పిటిషనర్‌కు హితవు.
v   ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులకు మేం నోటీసులు ఇవ్వం.  తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్‌ ఏకే శేషసాయి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ.
v  విజిలెన్స్‌ కమిషనర్‌, కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ జారీచేసిన జీవోతో పాటు, విశాఖలో మిలీనియం టవర్స్‌-బి నిర్మాణ పనులకోసం రూ.19.73 కోట్లు కేటాయిస్తూ జారీ చేసిన జీవోలను సవాల్‌ చేస్తూ సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ ఎం.రమేష్‌, రాజధాని అభివృద్ధి పనుల సమీక్షను అడ్డుకోవాలని కోరుతూ రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనేలకు రామారావు, రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని కోరుతూ పాటిబండ్ల సుధాకర్‌ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం మరోమారు విచారణ జరిగింది.
v  రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్‌.శ్రీరాం వాదనలు: ప్రస్తుతం విజిలెన్స్‌ కార్యాలయం 6,585చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.  అయితే అది సరిపోవడం లేదు. విజిలెన్స్‌ కార్యాలయం కోసం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనాన్ని కూడా పరిశీలించాం. అక్కడ కూడా తగినంత చోటు లేనందువల్లనే తరలించాల్సి వస్తోంది. విజిలెన్స్‌ కమిషన్‌లో 48పోస్టులు ఉండగా ప్రస్తుతం 19 మంది పని చేస్తున్నారు. ఇందులో పలువురు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులున్నారు. సచివాలయంలోని వివిధ శాఖల్లో ఉన్న విజిలెన్స్‌ కార్యాలయాలను తరలించడం లేదు.
v  ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ... విజిలెన్స్‌ కమిషన్‌ కార్యాలయాన్ని వేరేచోట ఉంచడం వల్ల పర్యవేక్షణ కష్టసాధ్యంకదా అని ప్రశ్నించింది.
v  జీఏడీకి విజిలెన్స్‌ కమిషన్‌కు ఎలా సంబంధం లేదో వివరణ ఇవ్వాలి. ఈ వివరాలన్నింటినీ ముఖ్యకార్యదర్శి స్థాయి అధికారితో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయించాలి.
v  ఒక పిటిషనర్‌ తరఫు న్యాయవాది అంబటి సుధాకరరావు వాదనలు వినిపిస్తూ.. కార్యాలయాల తరలింపుపై స్టే ఇవ్వాలని అభ్యర్థించగా, ప్రభుత్వ వైఖరి తెలుసుకున్న తరువాతే దీనిపై స్పందిస్తాం.
v   రాజకీయ వ్యాఖ్యలకు దురుద్దేశాలు ఆపాదించొద్దని పిటిషనర్‌ రమేష్‌ తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావుకు ధర్మాసనం సూచించింది. సీఎం, మంత్రులు, సలహాదారులను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. వారికి ఎలాంటి నోటీసులు జారీ చేయం. వారి వ్యాఖ్యలపై విచారణకు ఆదేశించం. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యాఖ్యానించారంటూ ప్రతిదానిపైనా విచారణ కోరితే ఎలా?.
v  మా అధికారాలు మాకు  తెలుసు. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠనెలా కాపాడుకోవాలో మాకు తెలుసు. పిటిషనర్‌ అనవసర విషయాలపైనా దృష్టి పెట్టారు. ఆ వ్యవహారాలతో మాకు పనిలేదు. కార్యాలయాల తరలింపు వరకే పరిమితమవుతాం. పిటిషనర్లు ఇంతవరకే పరిమితం కావాలి. అధికారులు సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని భావిస్తే.. సంబంధిత ఫోరం ముందు ఫిర్యాదు చేసుకోవచ్చు.
v రాయలసీమ ప్రజలు కూడా ఈ పిటిషన్లలో ఇంప్లీడ్‌ అయి వాదనలు వినిపించాలని భావిస్తున్నారని, వాటినీ పరిగణనలోకి తీసుకోవాలని న్యాయవాది యర్రంరెడ్డి నాగిరెడ్డి అభ్యర్థించారు. సమ్మతించిన ధర్మాసనం తగిన సమయంలో వారి వాదనలు కూడా వింటామని పేర్కొంది.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...