Feb 14, 2020

అమరావతి శాసన రాజధాని.. 70 రోజులు ఉంటా: సీఎం జగన్‌



v న్యూఢిల్లీ: అమరావతి లెజిస్లేటివ్‌ కేపిటల్‌ కదా..! అక్కడ నేను 70 రోజులు ఉంటాఅని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలో శుక్రవారం రాత్రి ఆయన తన అధికార నివాసమైన 1-జన్‌పథ్‌ వద్ద ఢిల్లీలోని తెలుగు జర్నలిస్టులతో భేటీ అయ్యారు.
v   ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి : ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రతిపక్షం అడ్డుకునే ప్రయత్నం చేసి, అపహాస్యం చేయడం వల్లే శాసనమండలిని రద్దుచేయాలని నిర్ణయించాం. శాసనసభ మూడింట రెండొంతుల మెజారిటీతో ఈ తీర్మానాన్ని ఆమోదించి.. రద్దుచేయాలని కేంద్రానికి సిఫారసు చేసింది. మండలి రద్దుకు తదుపరి చర్యలు చేపట్టాల్సిందిగా కేంద్ర న్యాయశాఖను ఆదేశించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు విజ్ఞప్తి.
v   ఢిల్లీలో ఆయన శుక్రవారం రాత్రి 9.45 గంటలకు షాను కలిశారు. సుమారు అరగంటసేపు చర్చలు జరిగాయి. బుధవారం ప్రధాని మోదీకి అందజేసిన వినతిపత్రంలోని అంశాలనే షాకు కూడా సమర్పించారు.
v కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతిని నిర్ణయించాం. ఈ ప్రతిపాదనను రాష్ట్ర కేబినెట్‌, అసెంబ్లీ ఆమోదించాయి. కర్నూలుకు హైకోర్టును తరలించేందుకు కేంద్ర న్యాయశాఖకు తగిన ఆదేశాలివ్వండి. రాయలసీమలో శాశ్వత ప్రాతిపదికన హైకోర్టు ఏర్పాటు చేస్తామని బీజేపీ కూడా 2019 మేనిఫెస్టోలోనే పేర్కొంది

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...