Feb 25, 2020

పేదల ఇళ్ల స్థలాల కోసం 1251 ఎకరాల రాజధాని భూముల సేకరణ

25.02.2020:
v రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్‌డీఏ) పరిధిలోని కొన్ని గ్రామాల్లో భారీ ఎత్తున భూమిని సేకరించడానికి జగన్ సర్కార్ ఉత్తర్వుల(G.O.Ms.No.107 Dated:25.02.2020)ను జారీ చేసింది.
v మెనిఫెస్టోలో పొందుపరిచిన పేదలకు ఇళ్లు పథకం కింద భూమిని సేకరించడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలని కృష్ణా, గుంటూరు జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి జే శ్యామలరావు నోటిఫికేషన్‌ను జారీ చేశారు.
v  సీఆర్డీఏ పరిధిలో నివసించే పేదలకు సొంత ఇంటి వసతిని కల్పించడానికి మొత్తం 1251.5065 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీని కోసం 54,307 మందిని లబ్దిదారులుగా గుర్తించింది.
v  భూసేకరణ జరిగే గ్రామాలు:  మంగళగిరి మండలం నవులూరు, కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలం మందడం, ఐనవోలు.
v ఇళ్ల స్థలాల కేటాయింపు: ఈ భూములను గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని 11,300 మందికి, పెదకాకాని మండలంలోని 1308 మందికి, మంగళగిరి మండలంలోని 10,247 మందికి, దుగ్గిరాల మండలంలోని 2500 మందికి, కృష్ణా జిల్లా విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ లోని 28,952 మందికి కేటాయింస్తారు.
v తాడేపల్లి మండలంలోని వారికి నవులూరు, కృష్ణాయపాలెంలో, పెదకాకాని మండలంలోని వారికి  కృష్ణాయపాలెంలో, మంగళగిరి మండలంలోని వారికి నిడమర్రులో, దుగ్గిరాల మండలంలోని వారికి కృష్ణాయపాలెంలో, విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ వారికి ఐనవోలు, కృష్ణాయపాలెం, కురగల్లు, నిడమర్రు, మందడం గ్రామాలలో కేటాయిస్తారు.
v మహిళ పేరుపై ఒక సెంటు ఇస్తారు.
v లేఅవుట్లను సీఆర్డీఏ అభివృద్ధి చేసి,ఒక్కో లబ్దిదారునికి ఒక సెంటు చొప్పున నంబర్లు కేటాయించాలి.
v దీనంతటినీ పర్యవేక్షించడానికి కృష్ణా, గుంటూరు జిల్లా కలెక్టర్లు, సీఆర్డీఏ కమిషనర్‌తో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.

v భూసమీకరణలో తీసుకున్న మొత్తం భూమిలో కనీసం 5శాతం పేదలకు అందుబాటు ధరలో గృహ నిర్మాణం కోసం కేటాయించాలని సీఆర్డీఏ చట్టంలోని 53(డి) నిబంధనలో పేర్కొన్నారు. ఇప్పటికే ఆ భూమిలో 87.02 ఎకరాలను పేదల గృహ నిర్మాణం కోసం వినియోగించారు. 

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...