Feb 17, 2020

అమరావతిలో అభివృద్ధి పనులపై హైకోర్టులో మరో వ్యాజ్యం


17.02.2020: 
v రాజధాని అమరావతిలో ప్రారంభించిన ప్రాజెక్టుల్ని పూర్తి చేసేలా, ముందస్తు ప్రణాళికల ప్రకారం మౌలిక సదుపాయాలు కల్పించేలా, అభివృద్ధి పనుల్ని కొనసాగించేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.  కేంద్ర హోం, న్యాయ కార్యదర్శులు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, సీఆర్‌డీఏ కమిషనర్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
v  2014లో రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఏర్పాటైన ప్రభుత్వం తుళ్లూరు, మంగళగిరి మండలాలతో పాటు తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని ప్రాంతాలను కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో రాజధాని నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (ఏపీసీఆర్‌డీఏ) భూసమీకరణ పథకం కింద 27,365 మంది రైతుల నుంచి 33,599 ఎకరాలను సేకరించింది.
v  గత ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉండగానే నిరుడు జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం మారింది. అప్పటి నుంచి రాజధానిలోని అభివృద్ధి పనులు నిలిచిపోయాయి.   ప్రభుత్వ నిరాసక్తత కారణంగా రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన ఆర్థిక సంస్థలు వరుసగా వెనుదిరిగాయి. 
v రహస్య ఎజెండాతో ప్రభుత్వం నిపుణుల కమిటీ నివేదికను ప్రభుత్వం సాకుగా చూపుతూ రాజధానిని తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
v సీఆర్‌డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ బిల్లులు శాసనమండలి సెలెక్ట్‌ కమిటీ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. సీఆర్‌డీఏ చట్టం రద్దయినప్పటికీ గతంలో ప్రభుత్వం మొదలుపెట్టిన అభివృద్ధి పనుల్ని పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. రాజధానికి భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్రాంతంలో ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అధికారులు ఇందుకు విరుద్ధంగా వ్యవహరించరాదు.
v  భారీగా సంస్థలు రావడంతో లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని, తమ పిల్లల భవిష్యత్‌ బాగుంటుందని విశ్వసించి రైతులు తమ భూములిచ్చారు. రాజధానిని వేరే ప్రాంతాలకు తరలిపోతే వారంతా తీవ్రంగా నష్టపోతారు. అందువల్ల ముందస్తు ప్రణాళికల ప్రకారం రాజధానిలో అభివృద్ధి పనులు కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును తిరుపతిరావు అభ్యర్థించారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...