Feb 15, 2020

ప్రధాని – జగన్ భేటీ - బొత్స వ్యాఖ్యలు – సెలెక్ట్ కమిటీ. – ట్రంప్ పర్యటన


ఏపీ 24X7 -తేదీ: 15.02.2020 శనివారం ఉదయం 7.30 గం. 
అంశాలు :  ప్రధాని – జగన్ భేటీ  - ఎన్డీఏలో చేరికపై బొత్స వ్యాఖ్యలు – మండలి, సెలెక్ట్ కమిటీ. – ట్రంప్ పర్యటన – చికెన్ లెగ్స్ దిగుమతి.

యాంకర్ :  కృష్ణ సాయి రామ్


రఘునాధ్ బాబు – బీజేపీ
వైసీపీ బీజేపీతో కలిసే ప్రసక్తిలేదు. అలా అయితే జనసేనతో పొత్తు ఎందుకు పెట్టుకుంటాం. తెలంగాణలో కేసీఆర్ కు, ఇక్కడ జగన్ కు మేమే ప్రత్యర్థులం.  2014లో తెలంగాణలో టీడీపీ బలమైన పార్టీ. 5 ఏళ్లు తిరిగేసరికి ఓడిపోయింది. అక్కడ నిలబెట్టలేని వారు ఒక్కడ ఎలా నిలబెడతారు. అక్కడ ఏం జరిగిందో ఇక్కడా అదే జరుగుతుంది. తెలంగాణలో ఓటుకు నోటు కేసు రావడంతో కట్టుబట్టలతో వచ్చేశారు. ఇక్కడ అలాంటిది ఏదైనా జరిగితే ఎక్కడకు వెళతారు? వివిధ కేసులలో చంద్రబాబు నాయుడు కు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నాయి. టీడీపీ, వైసీపీ కూడా మొన్న ఎన్నికల్లో అవినీతి సమ్ముతో గెలవడానికి ప్రయత్నం చేశారు. పవన్ కల్యాణ్ గారితో కలిసి అవినీతికి వ్యతిరేకంగా పోరాడతాం. మేం 1 శాతం నుంచి ఎదగలేం అనేది కరెక్ట్ కాదు. బెంగాల్, త్రిపులలలో మేం 4వ స్థానంలో ఉన్నాం. మమతా బెనర్జీకి ఢీ అంటే ఢీ అనే స్టేజ్ కు వచ్చాం.  2014లో టీడీపీ, బీజేపీల పరిస్థితి ఏంటి? 2019లో ఈ రెండు పార్టీల పరిస్థితి ఏమిటి? ఎందుకు రాదు వస్తుంది. పైగా ఇక్కడ పవన్ కల్యాణ్ లాంటి నేత ఉన్నారు. టీడీపీ భవిష్యత్ ప్రశ్నార్ధకం. అది ఎండిపోయే చెరువు. దానిలో నుంచి బయటకు వెళ్లేవారు వెళ్లిపోతుంటారు.  2014లో 4 రాష్ట్రాలలో ఓడిపోయాం. తరువాత 6 నెలలకే జరిగిన ఎన్నికల్లో స్వీప్ చేశాం. తెలంగాణలో టీడీపీ ఎలా సున్నా అయ్యారో, ఏపీలో కూడా అలా అవ్వరని గ్యారంటీ ఏమిటీ?
మండలి-సెలక్ట్ కమిటీ వ్యవహరం కోర్టులో ఉంది. సాధారణంగా స్పీకర్, చైర్మన్ చేసే నిర్ణయాలలో కోర్టులు జోక్యం చేసుకోవు. గతంలో 23 మంది ఎమ్మెల్యేలను తీసుకోవడం, వారికి  మంత్రి పదవులు ఇవ్వడం వంటివి వ్యవస్థల దుర్వినియోగమే. సూచనలు, సలహాలు ఇచ్చే హక్కు మండలికి ఉంది.  బిల్లును అడ్డుకోవడానికి కాలపరిమితి ఉండాలి. యనమల గారు కాలపరిమితిలేదన్నట్లు మాట్లాడుతున్నారు. అది సరైనదికాదు. కాలపరిమితి ఉంటే మంచిది.
ట్రంప్ పర్యటన : కోళ్ల లెగ్ పీస్ ల దిగుమతి కొంత ఇబ్బందికరమే. వాళ్లకు పనికిరావు మనకి దిగుమతి చేస్తున్నారు. అవి దిగుమతి అయితే ఇక్కడ కోళ్ల పరిశ్రమకి దెబ్బే. అయతే అంతర్జాతీయ వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాలు రెండూ ముఖ్యం. ఈ విషయం కేంద్రం తప్పకుండా ఆలోచన చేస్తుంది. వ్యవసాయదారుల ఆదాయం పెరగాలనేది ప్రధాని ఆలోచన.


కాకుమను రాజశేఖర్ – వైసీపీ
జగన్ గారు పీఎం, కేంద్ర మంత్రులను ఎన్నిసార్లు కలిసినా 5 కోట్ల ఆంధ్ర ప్రజల కోసమే. బీజేపీతో కలిసే, ప్రభుత్వంతో కలిసే ప్రతిపాదన ఏదీ రాలేదు. బీజేపీతో సన్నిహితమై రాష్ట్రానికి రావలసిన నిధులు ఎన్ని వేల కోట్లు జనసేన నాయకులు తీసుకురాగలిగారు. కేంద్రం రావలసిన నిధులు, విభజన హామీలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు 5 ఏళ్లో 29 సార్లు ఢిల్లీ పర్యటన చేసి రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారు? టీడీపీ అవినీతి చేసి నట్లు ఐడీ దాడుల ద్వారా తెలిసింది. జగన్ గారు ఢిల్లీ వెళ్లింది రాష్ట్ర ప్రయోజనాల కోసమే. ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, రాజధాని నిర్మాణ నిధులు, దిశ, కడప స్టీల్ ప్లాంట్... వంటి అంశాలను సీఎం ప్రధానితో మాట్లాడారు.
బొత్స మాటలను వక్రీకరించవలసిన అవసరంలేదు. 5కోట్ల ఆంధ్రప్రజల భవిష్యత్, రాష్ట్ర అభివృద్ధి అంశలు కేంద్రంతో ముడిపడి ఉన్నాయి. ఆ ప్రయోజనాలను ఆశించి మాత్రమే మేం ఒక మెట్టు దిగేందుకు సిద్ధంగా ఉన్నాం. బీజేపీది వింతవాదనగా కనిపిస్తోంది. కేంద్రంలో ఒక విధానం, రాష్ట్రంలో ఒక విధానం పాటిస్తోంది ఇటీవల పచ్చ పుష్పాల చేరికతో మరింత గందరగోళంలోకి బీజేపీ వెళ్లింది. రాజధాని, కౌన్సిల్ కు సంబంధించిన అంశాల విషయంలో అవి రాష్ట్ర పరిధిలోని అంశాలని కేంద్రంలోని వారు మాట్లాడారు. ఇక్కడ బీజేపీవారు రాజధాని అమరావతిలోనే ఉంటుందని మాట్లాడుతున్నారు. మేం ఏది చేసినా చట్ట ప్రకారం చేస్తున్నాం. వారి ఉనికిని కాపాడుకోవడం కోసం వారు మాట్లాడుతున్నారు. జగన్మోహన రెడ్డి గారిపై కేసుల విషయంలో మేం కోర్టులో ఎదుర్కొంటున్నాం.  
రాజ్యాంగ సంక్షోభం ఏపీలో లేదు. మండలిలోకి బిల్లు వస్తే ఏకగ్రీవంగా గానీ, ఓటింగ్ ద్వారా గానీ జరగాలి. అక్కడ చైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపారు. చర్చ జరగలేదు. ఓటింగ్ జరగలేదు. రాజ్యాంగ స్పూర్తికి తూట్లు పొడిచింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన కౌన్సిల్ గ్యాలరీలో కూర్చొని చైర్మన్ ని డిక్టేట్ చేశారు. మండలిని అగౌరవపరిచారు. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అసెంబ్లీ నుంచి వచ్చిన బిల్లులను చర్చించాలి. కానీ విచక్షణాధికారంతో సెలెక్ట్ కమిటీకి పంపారు. చైర్మన్ నిర్ణయం పెద్దల సభకే అగౌరవంగా ఉంది. అలాంటి సభ మనకు అవసరమా? ఏడాదికి రూ.61 కోట్లు ఖర్చు చేసి అటువంటి సభ మనకి అవసరమా?  28 రాష్ట్రాల్లో  6 రాష్ట్రాల్లో కౌన్సిల్ ఉంది. బీజేపీ నాయకులు గుర్తించారు.


సప్తగిరి ప్రసాద్ – టీడీపీ
జగన్ సీఎం అయినదగ్గర నుంచి ఆయన 7,8 సార్లు పీఎంని కలిశారు. బీజేపీలో వైసీపీ చేరినా, పొత్తు పెట్టుకున్నా మాకు ఇబ్బబందిలేదు. ప్రధానితో ఏం మాట్లాడారో బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఎందుకు వెళ్లారో చెప్పకుండా మాటిమాటికి ఢిల్లీ వెళుతున్నారు. ఈ రెండు పార్టీలు బ్రహ్మాండంగా కలిసే అవకాశం ఉంది. తీవ్రమైన ఆర్థిక నేరాల్లో ముద్దాయిగా ఉండి,  ప్రతి శుక్రవారం కోర్టుకు వెళుతున్న జగన్ తనను తాను కాపాడుకోవడం కోసం ప్రధానిని కలిశారు. వేరే ప్రయోజనం ఏమీలేదు. చంద్రబాబు నాయుడు గారిని వేరేవేరే కేసులలో ఇరికించుదామన్న ఆలోచన కూడా ఉండే ఉంటుంది.  టీడీపీ భవిష్యత్ ప్రజల వద్ద ఉంది. మండలిని రద్దు చేయమని జగన్ గారు ప్రధానిని, అమిత్ షా గారిని కలిశారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం చేతులు ఎత్తివేశాయి. దానిని దృష్టిలోపెట్టుకోవాలి. వైసీసీ బీజేపీలో చేరినంతమాత్రాన బీజేపీకీ ఒరిగేది ఏమీలేదు. ఆయన కేసులు మాఫీ చేయించుకోవాడానికి కలిశారు. మెడలు వంచుతానని చెప్పి, వీళ్లే వెళ్లి మెడలు వంచారు. కేంద్రంలో, ఎన్డీఏలో చేరితే రాష్ట్ర ప్రజనాలు ఏమనా తీరతాయా. ఢిల్లీ వెళ్లేది  వారి ప్రయోజనాలకోసమే.
తెలంగాణలో 4 సీట్లు వచ్చాయి, ఢిల్లీలో 3 నుంచి 8కి పెరిగింది.  మహారాష్ట్ర, హర్యానాలలో అధికారం కోల్పోయింది. టీడీపీ ప్రజలలో ఉంటుంది. ఒకప్పుడు ఎన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది? ఈ రోజు ఎక్కడ ఉంది? పబ్లిక్  మూడు ఎన్నికల సమయానికి మారుతుంది. బీజేపీ ఏపీలో ఎప్పుడూ అధికారంలో లేదు, రాదు.
మండలి విషయంలో వైసీపీ వారు చేసే వ్యవహారం దుర్మార్గంగా ఉంది. చైర్మన్ ఆదేశాలను వెనక్కు పంపండం వెనుక ఏదో వ్యవహారం ఉంది. ప్రభుత్వ వత్తిడి ఉంది.  ఇది రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుంది. రాష్ట్రప్రభుత్వానికి ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా వీరికి మార్పురాదు. సెలెక్ట్ కమిటీకి వెళితే ఏమౌతుంది. ప్రజల్లోకి వెళుతుంది. సెక్రటరీ భయపడి ఉండవచ్చు. అధికారులను బెదిరించడం ఈ ప్రభుత్వానికి తగదు. విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, రోజా గార్లు ఎందుకు మండలి గ్యాలరీలో కూర్చున్నారు. ఎంపీలకు ఏం పనిండి అక్కడ? మీరు కూర్చొవచ్చు, చంద్రబాబు నాయుడు కూర్చోకూడదా. ప్రభుత్వ సలహాదారులకు లక్షలలక్షల జీతాలు ఇవ్వడం, కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయడం కంటే మండలి వ్యయం ఎక్కువా?


కృష్ణాంజనేయులు – జర్నలిస్ట్
ప్రధాని మోదీ  జగన్ గారికి ఇంత సమయం ఇవ్వడం రాజకీయ ప్రాధాన్యత. ఏపీ సమస్యలు చర్చించే అవకాశం కల్పించారు. మన సీఎంకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి ఉండేది. దేశ వ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు మారడం, ముఖ్యంగా బీజేపీ పరిస్థితులు మారిన నేపథ్యంలో ఎక్కువ సమయం కేటాయించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో వైసీపీ భాగస్వామ్యంపై బొత్సా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పార్టీ ప్రయోజనాలా? రాష్ట్రానికి ప్రయోజనాలా? కేంద్రంలో చేరినంతమాత్రాన రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందా? గత టీడీపీ ప్రభుత్వం సమయంలో పరిస్థితులను ఉదాహరణగా తీసుకోవచ్చా? టీడీపీ-యూపీఏ అనుభవాలను వైసీపీ తీసుకోవాలి. 8 నెలల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎటువంటి విభేదాలు లేవు.  కేంద్రం ప్రవేశపెట్టిన 370కి, కాబ్, త్రిబుల్ తలాక్ కి అనుకూలంగా వైసీపీ ఓటేసింది. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ద్రోహం చేసిందని జగన్ గారు దీక్షలు చేశారు. ఇప్పుడు కేంద్రంలో చేరే ఆలోచన ఉంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం డిమాండ్ చేశారో వాటిని అండగాలి. ప్రత్యేక హోదా డిమాండ్ చేయండి.
వైసీపీ వైఖరిని బొత్స చాలా స్పష్టంగా చెప్పారు. చాలా కీలకమైన విషయాలను బొత్స మాట్లాడుతుంటారు.
మండలి సెలెక్ట్ కమిటీకి సంబంధించిన పరిణామాలు రాజ్యాంగ సంక్షోభ దిశగా ప్రయాణం జరుగుతుంది. మండలి చైర్మన్ రూలింగ్ ని అమలు చేయవలసిన బాధ్యత కార్యదర్శికి ఉంటుంది. దానిని తిరస్కరించడం సంక్షోభానికి దారి తీస్తుంది. అధికార వికేంద్రీకరణ, టీఆర్డీఏ రద్దు బిల్లుల విషయంలో శాసనమండలి రద్దుకు వైసీపీ వెళ్లింది. కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలత వస్తే మండలి ముందే రద్దయ్యే అవకాశం ఉంటుంది. సెలెక్ట్ కమిటీకి వెళితే ప్రజల అభిప్రాయం తెలుస్తుంది. దానిని తిరస్కరించే అవకాశం లేదు.
పౌల్ట్రీ పరిశ్రమ 40 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. దానిని దెబ్బతీసేవిధంగా అమెరికాతో ఒప్పందం చేసుకోవడం మంచిదికాదు. వారికి పనికిరాని వస్తువుని ఇక్కడకు తెప్పించుకోవడం కాక, దానికి దిగుమతి సుంకం తగ్గించడం ఏమిటి? ఉద్యోగాలు లేక, కొనుగోలు శక్తిలేక ఇక్కడ ఆర్థిక మాంద్యం వచ్చింది.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...