Feb 24, 2020

విశాఖపట్నంలో రహస్య అన్వేషణ!


24.02.2020: 
v కార్యనిర్వాహక రాజధానిని విశాఖపట్నంలో ఏర్పాటుచేయబోతున్నట్లు  రాష్ట్ర ప్రభుత్వం  ప్రకటించిన నేపథ్యంలో వైసీపీపీ నేత విజయసాయిరెడ్డి సోమవారం సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎంవో/జీఏడీ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌, సీఎం అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డి, డీజీపీ గౌతం సవాంగ్‌తో కలిసి విశాఖలో రహస్య పర్యటన జరిపారు.
v  విజయనగరంలో జగనన్న విద్యా దీవెనపథకం ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి సోమవారం విమానంలో విశాఖపట్నం రాగా ఆయనతో పాటు వీరంతా ఇక్కడ దిగారు. అనంతరం జగన్‌ హెలికాప్టరులో విజయనగరం వెళ్లగా వీరు నగరంలోకి వచ్చారు. రుషికొండ ఐటీ పార్కులోని మిలీనియం టవర్‌-1కు పది కార్లలో వెళ్లి కాండ్యుయెంట్‌ సంస్థ నడుస్తున్న కార్యాలయాన్ని సందర్శించారు. తర్వాత కాపులుప్పాడలో అదానీ కంపెనీ కోసం రూపొందించిన లేఅవుట్‌ను పరిశీలించారు. ఆ తర్వాత భీమిలి బీచ్‌ రోడ్డుకు వెళ్లి చిట్టివలస జూట్‌ మిల్లు యాజమాన్యానికి ఉన్న గెస్ట్‌ హౌస్‌ను చూశారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...