Feb 18, 2020

రాజధాని ప్రాంతంలో రైతులు - బ్రోకర్లు


టీవీ   ఏపీ 24X7 - తేదీ: 18.02.2020 మంగళవారం ఉదయం 7.30 గం. నుంచి
అంశాలు :  రాజధాని ప్రాంతంలో రైతులు - బ్రోకర్లు -    యాంకర్ :  వెంకటకృష్ణ

ఎమ్మార్వో వనజాక్షి - తాడేపల్లి కొత్తూరు గ్రామం – ఇళ్ల స్థలాల కోసం అసైన్డ్ భూములు స్వాధీన యత్నం – రాజధాని ప్రాంతంలో రైతులు – బ్రోకర్లు – రైతులు ఘెరావ్.
అమరావతిలో 800 ఎకరాలలో 80వేల పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కసరత్తు.

 కోనేరు సురేష్ – టీడీపీ
ప్రభుత్వం 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకుంది. సాధ్యాసాధ్యాలు ఆలోచన చేయలేదు. పేదలకు ఇవ్వాల్సిందే. గతంలో చంద్రబాబు నాయుడు గారు టిట్కో కింద 7 లక్షల ఇళ్లు కట్టించారు. హౌస్ ఫర్ ఆల్ కింద నెల్లూరు బయట పదవేల ఇళ్లు ఒకే చోట కట్టారు. అర్బన్ ప్రాంతంలో భూమి కొరత ఉన్నందున ఆ విధంగా నిర్మించాం.  వచ్చే విపరిణామాల ఆలోచన లేకుండా చేశారు. భూమిపై ఆదాయంతో బతకాలని భూమి ఇచ్చాం. ఈ రోజు అదే భూములను లాక్కొని మరో పేదలకు ఇవ్వనున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎస్సైన్డ్ ల్యాండ్ తీసుకున్న మరే భూమి తీసుకున్నా పరిహారం చెల్లించాలి. ప్రభుత్వానికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకోవచ్చన్న డీఫాంలో ఉన్న క్లాజ్ ని అడ్డం పెట్టుకొని ఆ భూములు తీసుకుంటున్నారు. వారి బతికే ఆధారం పోగొడుతున్నారు. విశాఖలో 6,116 ఎకరాలు తీసుకునే ప్రయత్నం. కావాలంటే కొని ఇవ్వండి. అర్బన్ ప్రాంతంలో అపార్ట్ మెంట్లు, ఫ్లాట్లు కట్టి ఇవ్వండి. 5 ఏళ్ల తరువాత పరిస్థితి ఏమిటి? కొత్తూరు తాడేపల్లి లో వంద ఎకరాలు స్వాధీనం చేసుకోవడానికి చంద్రబాబు గారు ప్రయత్నించారు. ఆ విధానంలో వెళ్లండి. టిడ్కో ద్వారా నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో  కూడా  జీ ప్లస్ 3 కి వెళ్లాం. 3 ఫ్లోర్లు ఎక్కడం ఇబ్బంది అవుతుంటే మెట్ల సైజ్ ని తగ్గించి తేలికగా ఎక్కడానికి అనువుగా నిర్మించమని చెప్పాం. పెద్దలకు గ్రౌండ్ ఫ్లోర్, చిన్నవయసువారికి పైన ఇచ్చాం. కొత్తూరు తాడేపల్లి విజయవాడ నుంచి పాల ఫ్యాక్టరీకి వెళ్లే దారిలో ఉన్నారు. ప్రభుత్వం ఎలా ఉందో అధికారులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. ప్రజలకు నచ్చజెప్పాలి. గతంలో ముసునూరులో  వనజాక్షి గారు వెస్ట్ గోదావరి జిల్లాలోకి వెళ్లింది. ఇసుక డ్వాక్రా మహిళలు చేసుకుంటున్నారు. ఈ కలెక్టర్ ద్వారా ఆ కలెక్టర్ కి చెప్పాలి.  ఆ అధికారి యాటిట్యూడ్ గురించి చెబుతున్నాను. ఒక ఎమ్మెల్యేని బదనాం చేశారు. నెల్లూరులో శ్రీధర్ రెడ్డి గారు ఏం చేశారు? అర్బన్ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో విధానాలు వేరువేరుగా ఉండాలి. పంచనామా విషయం కేంద్రం చూసుకుంటుంది. మీరు ప్రతి శుక్రవారం కోర్టుకు వెళతారు. ఎందుకు ఉళిక్కిపడతారు.  సాక్షి పేపర్లో 13 పేజీలు అచ్చెయ్యండి. సాక్షి టీవీలో రోజంతా ప్రసారం చేయండి. పేపర్లో చెత్తంగా రాస్తారు గదా.
రాజధాని ప్రాంతంలో 54 వేల ఎకరాలు ఉంది. ప్రభుత్వ నిర్మాణాలు, రైతులకు ప్లాట్లు, రోడ్లు ఇతర అవసరాలకు పోగా  పదివేల ఎకరాలు ఉంటుంది.  రాజధానిని నిర్మాణానికి ప్రతి సంవత్సరం 5 వేల కోట్లు ఖర్చు చేస్తే, 5, 10 సంతవత్సరాల తరువాత ఆ భూములను అమ్మి నిర్మాణానికి తెచ్చిన అప్పులను తీర్చవచ్చనేది చంద్రబాబు గారి ఆలోచన. ప్రభుత్వం ఏమీ ఖర్చు పెట్టవలసిన అవసరంలేదని, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చంద్రబాబు గారు చెప్పేది. రాజధాని ప్రాంతంలో ఇళ్లు లేని పేదలకు జీ ప్లస్ 3 ఇళ్లు కట్టారు. చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇళ్లకు వీళ్లు మూడు రంగులు వేసుకున్నారు. రాజధాని ప్రాంతంలో పేదలకు స్థానమేలేదని తప్పుడు ప్రచారాలు చేశారు. 75, 80 శాతం పూర్తి అయిన ఎమ్మెల్యే క్వార్టర్లను పూర్తి చేయలేదు. ప్రజావేదికను కూల్చిన తరువాత మీ విధానం చెప్పిన తరువాత, మీ విధ్వంసకర పరిపాలన చూసిన తరువాత పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారు.? పరిశ్రమలు వస్తాయని మీరు రాసుకోండి, మీ టీవీలో చూపండి. తాడేపల్లి నుంచి మంగళగిరి, నాగార్జున యూనివర్సిటీ వరకు పది వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి అపార్ట్ మెంట్లు కట్టారు. వాళ్లు ఏడుస్తున్నారు. అమ్ముడు పోవడంలేదని  వైసీపీ బిల్డర్లు కూడా ఏడుస్తున్నారు.  సీట్లే మీకు ప్రాతిపదిక అయితే  మళ్లీ ఎన్నికలకు వెళ్లండి. ఒప్పందం  ప్రకారం  మాకు ఇచ్చిన భూములు డెవలప్ చేయలేదు, మీకు హక్కు ఎలా వస్తుందని రైతులు అడుగుతున్నారు. 29 గ్రామాల్లో రైతులకు పట్టాలు ఇచ్చారు. అభివృద్ధి చేయలేదు. అక్కడ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు, అక్కడ మౌలిక సదుపాయాలకు ఎంత ఖర్చు అవుతుంది? ఒక్క భూసేకరణకే
15వేల కోట్లు అవుతుందన్నారు. రూ.15 లు పెట్టారా? ఇప్పుడు ఇచ్చే ఇళ్ల స్థలాలకు రోడ్లు, త్రాగునీరు, విద్యుత్... వంటి సౌకర్యాలకు ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి. వారి మాటలను ప్రజలు ఎవరూ నమ్మడంలేదు.
చంద్రబాబు నాయుడు గారు 2004లో సికింద్రాబాద్ లో 150 కోట్లతో  గాంధీ మెడికల్ కాలేజీ కట్టారు. ఇక్కడ విజయవాడలో కూడా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కట్టారు. ఓపెనింగ్ కు రెడీగా ఉంది. రేపు వైసీపీ వారు నాడు నేడు కార్యక్రమంలో ఫోటో  పెట్టుకోవచ్చు. 2007 తరువాత   రెండు రాష్ట్రాలలో 30వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఏపీ కోసం 13వేల కోట్లు ఖర్చు చేశారు. ఆరోగ్యశ్రీతోపాటు క్రమంగా పబ్లిక్ సెక్టార్ ని కూడా మెరుగుపరచాలి. వాటిని మెరుగుపరిస్తే ఆరోగ్యశ్రీ అవసరం ఉండేదికాదు.  చంద్రబాబు గారు ప్రపంచ బ్యాంకు నుంచి 630 కోట్లు తెచ్చి ప్రతిచోట ఆస్పత్రి కట్టించారు. తల్లిబిడ్డ పథకం ప్రవేశపెడితే ఎంతో ప్రయోజనం చేకూరింది. ఆరోగ్యపరంగా ప్రజలకు ఎన్ని రకాల సర్వీసులు ఇవ్వాలో అన్ని ఇచ్చాం.

విజయకుమార్ – జనసేన
వైసీపీ ప్రభుత్వం, నాయకులను చూస్తుంటే శంకర్ గారు ఎంత ఇబ్బందకరంగా మాట్లాడుతున్నారో చూస్తున్నాం.  వైజాగ్ క్లబ్ వంటివి భూముల లాంగ్ లీజులన్న విషయం మాకు తెలియదు. ఇప్పుడు ఈ బెదిరింపులు  3,4 నెలల నుంచి విశాఖలో చూస్తున్నాం. హైదరాబాద్ లో చిలుకూరు బాలాజీ టెంపుల్ స్వామీజీ ఎలా పోరాటం చేస్తున్నారో ఇక్కడ స్వామీజీ కూడా అలాగే పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న ఎంపీ గారు కూడా కొంత ఆక్రమించారు. అపార్ట్ మెంట్లు కట్టారు. ఏ పార్టీ వచ్చినా ఆ స్వామీజీ పోరాడుతున్నారు. విశాఖలో 616 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది.  వాళ్లకు వాళ్లుగా ఇస్తే తీసుకుంటామన్నారు. చాలా మండలాలలో రైతులు ఇవ్వం అంటున్నారు. వారిపై కేసులు పెట్టారు. దానిని ల్యాండ్ పూలింగ్ అంటారో, లాక్కోవడం అంటారో నాకు తెలియదు.   ఎమ్మార్వో వనజాక్షి మండల మెజిస్ట్రేట్. వైసీపీకి ఒక భాష ఉంది. మాధవ తిట్టినప్పుడు ఎంపీ సీటు ఇచ్చారు. ఆమె కూడా అలా చేస్తుందోమో. వైసీపీ ఎమ్మెల్యేల వద్ద సబ్జెక్ట్ లేదు. వారు చేసిన మంచి పనులు లేవు. అందువల్ల పవన్ కల్యాణ్ గారిని తిడుతున్నారు.  విశాఖలో ప్రజలపై కేసులు పెట్టి భూములు లాక్కుంటున్నారు.
మధురవాడ, ఆనందపురం వెనుకబడిన ప్రాంతాలు. ఇక్కడ అందరూ బీసీల కింద వస్తారు. ఇక్కడ పేదలకు ఇచ్చారు. ఇదే వైసీపీ ప్రభుత్వం పాలనా రాజధానిగా విశాఖను చేసి 6,116  ఎకరాల అసైన్డ్ భూమి పేదలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. భూమికి సంబంధించి ఒక శాస్త్రీయ పద్దతి లేదు. విశాఖలో భూమి రేపటి తరం కోసం ఉండాలి. ఆ భూమిని లాక్కోవడం పద్దతి కాదు. ఎంత ల్యాండ్ బ్యాంకు అభివృద్ధి చేయవచ్చే తెలియదు. అధికారులపై వత్తిడి పెడుతున్నారు. వారు రైతులపై వత్తిడి పెడుతున్నారు.  వైసీపీ విధానాలలో మ్యాచ్ అవడంలేదు. డెవలప్ మెంట్ కు ఎంత భూమి పోతుందో తెలుసుకోవాలి. లేదా రామకోటయ్య గారి లాంటి వారి సలహాలు తీసుకోవాలి. మీ వద్ద బిల్డర్సు ఉన్నారు వారి సలహాలు తీసుకోండి. టీడీపీ ఎమ్మెల్యేలు 32వేల పట్టాలు ఇచ్చారు. ఎప్పటి నుంచో ఉంటున్న వారికి పట్టాలు ఇచ్చారు. అందువల్లే వారు గెలిచారని భావిస్తున్నారు. తొందపాటుతో విశాఖలో వ్యవహరిస్తున్నారు.  జీవీఎంసీలో ఇళ్లు కావాలని 2.20 లక్షల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి.
లాంగ్ టెర్మ్ విజన్, అభివృద్ధి ఉండాలి. 2007 నుంచి ఆరోగ్యశ్రీనిశాస్త్రీయ పద్దతి పాటించి ఉంటే బాగుండేది. ఒక మనిషికి ఆర్ట్ ఎటాక్ వస్తే 20 నిమిషాలే ఉంటుంది. అటువంటి వారి దృష్టిలో పెట్టుకోవాలి.

 రామకోటయ్య – బీజేపీ
ఆరోగ్యశ్రీ దేశంలో అందరికీ ఉపయుక్తమైంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టుమీద మేయదు. రైతుల ధర్నాను ప్రభుత్వం పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. వనజాక్షిగారు ఒక అడుగు ముందుకువేసి బ్రోకర్లా ? రైతులా? అన్నారు. వారి విధానం అలా ఉంది. విశాఖలో సైనికులకు భూములు ఇచ్చారు. మధురవాడలో డీఫారాలు ఇచ్చారు. వారిని ఇప్పుడు ఆ భూములు ఇవ్వమని అడుగుతున్నారు. ఇస్తే ల్యాండ్ పూలింగ్ కింద 900 గజాల స్థలం ఇస్తాం. ఇవ్వకపోతే మీ సంగతి చూస్తామంటున్నారు. ఒక పోలీస్ అధికారి, విశాఖ కార్పోరేషన్ కమిషనర్ తండ్రి కలిసి 1958 నుంచి ఉన్న ఒక ఆశ్రమాన్ని ఏదోవిధంగా కబ్జాచేయలన్న ఆలోచన చేస్తున్నారు.  ఒక పేపర్లో మెయిన్ వార్తగా వచ్చింది. విశాఖ, విజయనగరంలో గతంలో విజయనగరం మహారాజావారు ఇచ్చిన పట్టాలను అపహాస్యం చేస్తున్నారు. ఏడు వేల ఎకరాలు తీసుకోవాలని, దొరికినకాడకి దోచుకోవాలన్న ఆలోచనతో ప్రభుత్వమే ఉంది. అక్కడకు వచ్చిన ప్రజలు రైతులు ఎవరో, బ్రోకర్లు ఎవరో తెలియకుండా ఎమ్మార్వోగా చేస్తున్నారు. ఆర్ఐ, వీఏఓలను అడిగినా చెబుతారు. గతంలో ఆమెను సపోర్ట్ చేశాం. వారికి తాతలు, తండ్రుల నుంచి ఆ డీఫారాలు పొంది ఉంటారు. ఇంటికి ఒక సెంటు సరిపోదు. రెండు సెంట్లు ఇస్తే బాగుంటుంది. అయితే అది సాధ్యం కాదు. దేశం విడిపోయేనాటికి 26 కోట్లు, ఇప్పుడు 130 కోట్ల జనాభా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 3,30,000 చదరపు కిలోమీటర్లు ఉంటే, విడిపోయిన ఏపీలో 1,70,000 చదరపు కిలోమీటర్లు ఉంది. గ్రామాలు, గ్రామ కంఠాల్లో ఇళ్లు ఇస్తామంటే ఉంటారు. పొలంలో ఇళ్లు ఇస్తామంటే తీసుకోరు. అభివృద్ధి చేయాలంటే ఖర్చు ఎక్కువ. ఇంతకు ముందు ప్రభుత్వం తెలివితేటలో కొన్ని పనులు చేసింది. మోడీ గారు 2 లక్షల ఇళ్లు ఇచ్చారు. ఎక్కువ ఇళ్లు కావాలని చెప్పి టిడ్కో కింద జీ ప్లస్ 3 పద్దతిలో నిర్మించారు. వాటిని అపహాస్యం చేస్తూ కాన్సిల్ చేశారు. 60: 40 రేషియోలో అపార్ట్ మెంట్లు కట్టిస్తే బాగుంటుంది. తెలంగాణలో మాదిరిగా డబుల్ బెడ్ రూమ్ కట్టడానికి అవకాశం ఉంటుంది. విశాఖలో 4 ఎకరాల్లో 16 లక్షల అడుగులు కట్టారు. అంత ఎత్తు అవసరంలేదు. పది ఫ్లోర్లు కడితే చాలు. సౌకర్యాలు లేకుండా ఇల్లు కట్టినా వారు అక్కడ ఉండదు. మళ్లీ యథావిథిగా ఉంటారు. ప్రయోజనం ఉండదు. శంకర్ గారు ఈ విషయాలన్నీ మీ మంత్రికి చెప్పండి. అమరావతిలో పేదలకు 800 ఎకరాలు ఇవ్వాలన్న ఆలోచన మంచిదే. 40 శాతం రోడ్లకు అభివృద్ధి చేసి ఇవ్వాలి. అప్పుడే ఉపయోగం. శాసన రాజధాని అంటే అక్కడ ఉండే అవకాశం ఉండదు.
ఈఎస్ఐ కింద 17 కోట్ల మంది వస్తారు. ఈఎస్ఐకి రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వాలి. విజయవాడలో 32 ఎకరాలు వేస్ట్ గా పడి ఉంది. చైనాలో 20 రోజుల్లో కార్పోరేట్ ఆస్పత్రి నిర్మించారు. ప్రభుత్వానికి ఆలోచన ఉంటే ఆరు నెలల్లో పోస్ట్ ఆపరేషన్ కు సౌకర్యాలు కల్పించాలి. ఈ రకమైన ఖర్చు తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. హైదరాబాద్ లో రూ.500 కోట్లతో ఆస్పత్రి కట్టించారు. కార్పోరేట్ ఆస్పత్రులు దివాళాతీసే స్థితిలో ఉన్నాయి. ఆరోగ్యశ్రీకి పేమెంట్లు జరగడంలేదు.

శంకర్ – వైసీపీ
అర్బన్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ తాండవిస్తూ ఉంటుంది. అసైన్డ్ భూములు నిజంగా రైతుల చేతిలో ఉన్నాయా? రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో ఉన్నాయా? గతంలో బలవంతంగా తీసుకునేటప్పుడు వ్యతిరేకత వచ్చింది. ఎమ్మార్వో వనజాక్షి నిజమైన రైతులను అలా అంటే మాత్రం క్షమాపణలు చెప్పాల్సిందే. అక్కడ బ్రోకర్లు ఉండే అవకాశం ఉంది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ గారి కారు అద్దాలు పగులగొట్టే నీచ సంస్కృతి రాజధాని ప్రాంతంలో నడుస్తోంది. అనీల్ గారిపై కూడా దాడి చేసి అద్దాలు పగులగొట్టిన సంస్కృతి మనం చూశాం. అలాంటి అరాచక శక్తులు వనజాక్షి గారిపై కూడా అటువంటి దాడి అని ఎందుకు అనుకోకూడదు. మా ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు వ్యతిరేకం. పట్టణాలలో ప్రతిపక్షాలు అక్కడ ప్రజలను రెచ్చగొడుతున్నాయి. విజయవాడలో వారికి ఎక్కడో విజయనగరంలో ఇవ్వడంలేదు. రాజధాని ప్రాంతంలో 50 వేల ఎకరాలపైచిలుకు ఉంది. అక్కడ నిరుపయోగం కాబోతున్నాయి. ల్యాండ్ బ్యాంకు ఉంది. ప్రజా రాజధాని అంటే ఇళ్లు, హోటళ్లు ఉంటాయి. పేదలకు అక్కడ ఏదో ఒక పని దొరుకుతుంది గదా. మూడు రాజధానులు ఏపీ ప్రజల అదృష్టం. విద్యాలయాలు, ఆస్పత్రులు, పరిశ్రమలు, సర్వీస్ ఇండస్ట్రీ,  హోటళ్లు వస్తాయి. ఈ రాజధానిని అభివృధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. పేదలకు 48 గజాలు సరిపోతుంది. వైసీపీ ప్రభుత్వం నిజాయితీగా ఉంది. దేశ ప్రజలు మెచ్చిన ప్రభుత్వం. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా విద్య,వైద్యం, వ్యవసాయం మూడు రంగాలపై మా దృష్టి ఉంటుంది. వీటికి నాడు నేడు కార్యక్రమం చేపట్టాం. ఆస్పత్రులు మెరుగుపరుస్తాం. మూడేళ్లకు 11,737 కోట్లు ఖర్చు చేస్తారు. ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులకే వెళతామనే విధంగా వాటిని తీర్చిదిద్దుతాం.

లక్ష్మీనారాయణ – రాజకీయ విశ్లేషకులు
రాజ్యాంగబద్దమైన వ్యవస్థలలో ఉన్న స్పీకర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మత ప్రచారకుల భాష జుగుప్సాకరంగా ఉంది. సోషల్ మీడియాలో కూడా అదే పరిస్థితి. అధికారుల భాష కూడా అదేవిధంగా ఉంది. దుర్గ గుడి సమీపంలో మతమార్పిడులుపై  పవన్ కల్యాణ్ వ్యాఖ్యానిస్తే ఒక పాస్టర్ కూడా దుర్భాషలాడారు. భూమి సమస్య ఏపీలో జఠిలంగా మారింది. 34వేల ఎకరాలు రాజధానికి ఇచ్చిన రైతులు 63 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. భూసేకరణ సమస్య. ఇళ్ల స్థలాల కోసం భూసేకరణ. కార్యక్రమం మంచిదే. భూసేకరణే జఠిలం. ప్రభుత్వ భూములు పరిమితంగా ఉన్నాయి. గతంలో పేదలైన ఎస్టీలు, ఎస్సీలకు ఇచ్చిన భూములు తీసుకునే ప్రయత్నం. వారు వాటినే జీవనాధారంగా చేసుకున్నారు. పేదలకు ఇళ్ల స్థలాల కోసం పేదలకు ఇచ్చిన భూములు లాక్కునే ప్రయత్నం. తాసీల్డార్ సంఘానికి అధ్యక్షురాలైన ఓ మహిళ ఆ విధంగా మాట్లాడటం ఏమిటి? గతంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆమెపై దాడి చేసినప్పుడు అందరూ ఆయన ప్రవర్తననే తప్పుపట్టారు.  ఈ రోజు ఆమె అలా దుర్భాషలాడటం ఏమిటి? భూములు తీసుకోవడానికి వెళ్లి అలా మాట్లాడటం ఏమిటి?
పేదలకు భూములు ఇవ్వాలని, ఇళ్లు లేని పేదలకు ఇళ్లు ఇవ్వాలని పోరాటాలు చేశాను. లాఠీ దెబ్బలు తిన్నాను. కేసులు పెట్టారు. జైలుకు వెళ్లాను. గతంలో భూములు ఇవ్వమని పోరాటం చేశాం. ఇప్పుడు పేదల నుంచి భూములు తీసుకొని పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. రివర్స్ అయిపోయింది. రాజధాని నిర్మాణం కోసం సన్నచిన్నకారు రైతులు భూములు ఇచ్చారు. దాని కోసమే ఆ భూమి వినియోగించాలి. అక్కడ ఉండేవారికి, అక్కడ పనులు చేసుకునేవారికి అక్కడ ఇళ్లు కట్టి ఇవ్వవచ్చు. విజయవాడ, గుంటూరు, ఏలూరులలో ఉండేవారికి ఇక్కడ ఇళ్ల స్థలాలు కేటాయించడం సరికాదు. భూములు ఇచ్చిన లక్ష్యం అది కాదు. అపార్ట్ మెంట్లులో షేర్ తక్కువ ఉండవచ్చు, 48 గజాలు ఇస్తే సరిపోదు. 2 బెడ్ రూమ్స్ ఉండాలి. ఇద్దరు పిల్లల కుటుంబం సౌకర్యవంతంగా జీవించడానికి అనుకూలంగా కిచన్, బాత్ రూమ్ ఉండాలి. భూమి కావాలని కాల్పులు కడా జరుగుతున్నాయి. ముదిగొండ, ఇతర చోట్ల చరిగాయి. ఆక్రమించుకొని నివాసం ఉండేవారికి రెగ్యులరైజ్ చేయడంలేదు. గ్రామాలకు దూరంగా స్థలాలు ఇచ్చినా వేస్ట్ అయిపోతాయి. రాజధాని తరలించేటప్పుడు అక్కడ భూములు ఇస్తామంటే ఎవరు ఉంటారు.
ఢిల్లీలో విద్య, వైద్య రంగాలకు సంబంధించి ప్రజలకు అనుకూల నిర్ణయాలు తీసుకున్నారు. అటువంటి విధానాలు అధ్యయనం చేసి అమలు చేయడానికి ప్రయత్నించాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మెరుగుపరచాలి. ఇన్ సెంటివ్స్ ఇచ్చినా  మారుమూల ప్రాంతాలకు డాక్టర్లు వెళ్లడంలేదు. ఆరోగ్యశ్రీ డబ్బు విడుదల కావడంలేదు. దివాళా తీసే ఆస్పత్రులు కూడా ఉన్నాయి.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...