Feb 10, 2020

‘ఆ గ్రామాల’ విలీనం చట్ట విరుద్ధమని హైకోర్టులో పిటిషన్‌

గుంటూరు జిల్లా తాడేపల్లి మున్సిపాలిటీలో పెనుమాక, ఉండవల్లి, పాతూరు, గుండెమెడ, వడ్డేశ్వరం, ఇప్పట్నం, మల్లెంపూడి, చిర్రావూరు గ్రామాలను విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ గ్రామాలను విలీనం చేస్తూ ప్రభుత్వం ఈ నెల 6న జీవో 97ను జారీ చేసింది. దీనిని సవాల్‌ చేస్తూ గుంటూరుకు చెందిన కళ్లెం రాజశేఖర్‌రెడ్డితో పాటు మరికొందరు హైకోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలు చేశారు. ల్యాండ్‌పూలింగ్‌ కింద ఇప్పటికే తాము ఎంతో విలువైన భూమిని కోల్పోయామని, ఆ భూమికి బదులుగా ఇవ్వాల్సిన ప్లాట్లు కూడా ప్రభుత్వం ఇంత వరకు ఇవ్వలేదని పిటిషనర్లు వాపోయారు. ఆ ప్లాట్ల కోసం తాము పోరాటం చేస్తున్నామన్నారు. ఉగాదినాడు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, అయితే, తాడేపల్లి మండల పరిధిలో పంపిణీకి భూమి లభించకపోవడంతో తమ గ్రామాలను ఆ మండలంలో విలీనం చేశారని తెలిపారు. పెనుమాక, ఉండవల్లి గ్రామాలు సీఆర్‌డీఏ చట్ట ప్రకారం రాజధాని పరిధిలోనివని, అందువల్ల వాటిని డీనోటిఫై చేయకుండా మున్సిపాలిటీలో కలపలేరని పేర్కొన్నారు. 

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...