Feb 11, 2020

సీఎం,సీఎస్, మంత్రులకు నోటీసులు ఇస్తాం
రాజధాని తరలింపుపై హైకోర్టు ధర్మాసనం
11.02.2020 : 
అడ్వకేట్ కారుమంచి ఇంద్రనీల్‌బాబు: సచివాలయంలో భాగమైన విజిలెన్స్‌ కార్యాలయాలను కర్నూలుకు తరలించడం సరి కాదు. దీనిపై ప్రభుత్వ నోట్‌ఫైల్స్‌ లో సీఎస్‌ సంతకం లేదు.  ఈ వ్యవహారంలో అసలేం జరిగిందనేది తెలుసుకోవాల్సి ఉంది.
ఏజీ ఎస్‌ శ్రీరాం : విజిలెన్స్‌ కమిషన్‌ స్వతంత్ర సంస్థ. ఆ కార్యాలయానికి సచివాలయంతో సంబంధం లేదు. ప్రభుత్వశాఖల్ని విజిలెన్స్‌ కమిషన్‌ పర్యవేక్షిస్తుందేతప్ప అది ప్రభుత్వ శాఖల్లో భాగం కాదు. సచివాలయంలో తగిన స్థలం లేకపోవడం వల్లే కర్నూలుకు తరలించాల్సి వచ్చింది. విశాఖలో మిలీనియం టవర్‌ పనులు 2016నుంచే కొనసాగుతున్నాయి. దానిలో భాగంగానే రూ.19.73 కోట్లు కేటాయించాం.
హైకోర్టు ధర్మాసనం చీఫ్‌జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి : అభివృద్ధి పనులకు మేం వ్యతిరేకం కాదు. వాటిని మేం అడ్డుకోం.  ప్రభుత్వ నిర్మాణాల పట్ల మాకు  అభ్యంతరం లేదు. ఆ అధికారం ప్రభుత్వానికి ఉంది.  బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.  ఇదే మాకు ముఖ్యం. పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వ్యక్తిగత హోదాలో సీఎం జగన్‌, మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన, ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, మంత్రి కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, సీఎం సలహాదారు అజేయకల్లం, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులకు నోటీసులు జారీ చేస్తాం.  అయితే కోర్టు సమయం మించిపోవడంతో నోటీసుల జారీకి అవకాశం లేదు. తదుపరి వాదనలను త్రిసభ్య ధర్మాసనం బుధవారానికి వాయిదావేసింది.  రాజధాని అంశంపై దాఖలైన పిటిషన్లపై మంగళవారం మరోసారి విచారణ జరిగింది.
న్యాయవాదులు : రాజధాని తరలింపును లక్ష్యంగా చేసుకున్న ప్రభుత్వ పెద్దలు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆఖరికి న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కూడా మాట్లాడుతున్నారు.సాక్షాత్తు ముఖ్యమంత్రి, మంత్రులుసలహాదారులు రాజధానిపై ఎలాపడితే అలా మాట్లాడుతున్నారు.  నిపుణుల కమిటీలు వేసినప్పటికీ అవి ప్రభావితమయ్యేలా వ్యాఖ్యలు చేస్తున్నారు.
సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ ఎం.రమేశ్‌: విజిలెన్స్‌ కమిషనర్‌, కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ జారీచేసిన జీవోతో పాటు, విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్‌-బి నిర్మాణ పనుల కోసం రూ.19.73 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోలను సవాల్‌ చేశారు.
రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనేలకు రామారావు: రాజధాని అభివృద్ధి పనుల సమీక్షను అడ్డుకోవాలని కోరుతూ పిటిషన్.
పాటిబండ్ల సుధాకర్‌: రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని కోరుతూ పిటిషన్.
అడ్వకేట్ ఉన్నం మురళీధరరావు : ప్రభుత్వ ముఖ్యుల వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయి. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని, న్యాయమూర్తులు, ఏజీలు, పత్రికాధిపతుల చేతుల్లో రాజధాని భూములున్నాయని సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వంటివారు వ్యాఖ్యానించారు. పబ్లిక్‌ సర్వెంట్లుగా ఉండి న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా మాట్లాడ్డమంటే అది చట్ట నిబంధనల ఉల్లంఘనే. ఐఏఎస్‌ అధికారులు సైతం రాజధాని వ్యవహారంలో సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలి. మాజీ సీఎం చంద్రబాబు న్యాయస్థానాలను ప్రభావితం చేస్తున్నారని సాక్షాత్తు ముఖ్యమంత్రే పేర్కొన్నారు. రాజధానిలో అడుగడుగునా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నది.  రాజధానిని తరలించేందుకు ప్రభుత్వం పరోక్షంగా చేయాల్సినదంతా చేస్తోంది. విశాఖ మిలీనియం టవర్‌-బి నిర్మాణ పనులకు రూ.19.73 కోట్లు కేటాయిస్తూ జీవో జారీ చేశారు. టవర్‌-1లోని ఐటీ కంపెనీ ఖాళీ చేయిస్తున్నారు. విశాఖకు కార్యాలయాలను తరలించేందుకే ఐఏఎస్‌ అధికారులు ప్రవీణ్‌ ప్రకాశ్‌, కోన శశిధర్‌ వంటివారు మిలీనియం టవర్‌ను పరిశీలించారు. విశాఖకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని ఆయా హెచ్‌వోడీలకు మౌకిక ఆదేశాలు వెళ్లాయి. ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోండి. ఈ ప్రక్రియకు సంబంధించిన జీవోలను రద్దు చేయండి.
అడ్వకేట్ సుధాకర్‌రావు అంబటి:  రాజధాని నగర మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను తరలించడానికి లేదని, రైతుల నుంచి భూముల స్వీకరణ సందర్భంగా ఏపీ సీఆర్‌డీఏ ఇచ్చిన హామీని నెరవేర్చాలి.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...