Feb 8, 2020

ఐటీ దాడులు - రేషన్ కార్డుల కోత


ఛానల్ - టీవీ - ఏపీ 24X7 - తేదీ: 08.02.2020 శనివారం ఉదయం 7.30 గం.
అంశాలు :     ఐటీ దాడులు  కిలారు రాజేష్, శ్రీనివాస రెడ్డి,  -  19 లక్షల రేషన్ కార్డుల కోత

పట్టాభి – టీడీపీ
పెండ్యాల శ్రీనివాస రావు వద్ద వందల కోట్లు ఉన్నాయని మీరు సర్టిఫై చేస్తారా?  రాయిటర్స్, సాక్షికి లింకా? 150 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రపంచ స్థాయి సంస్థ రాయిటర్స్. అంతకంటే దుర్మార్గం ఉండదు. వివరాలు బయటపెట్టండి అని మేం డిమాండ్ చేస్తున్నాం. అన్ని కోట్లు ఇన్ని కోట్లు అని పిచ్చి రాతలు రాసేస్తున్నారు. ఐటి శాఖ వారు స్టేట్ ఇవ్వాలని టీడీపీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఏం జరిగిందో ప్రజల ముందు పెట్టాలి. శ్రీనివాస రావు ఇంట్లో ఏం దొరికాయి? ఏ ఖాతా నుంచి ఏ ఖాతాకి ఎన్ని కోట్లు ట్రాన్సఫర్ అయ్యాయి? బయట పెట్టాలి. పుల్లారావు కుమారుడి ఇంట్లో ఏం జరిగిందో చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం ఆస్తులు ప్రకటిస్తున్నారు. వీటికి మించి నా వద్ద ఒక్క రూపాయి, గజం భూమి ఎక్కువ ఉందని నిరూపించగలిగితే నా ఆస్తి మొత్తం రాసిస్తానని సవాల్ చేస్తుంటారు. ఇప్పటి వరకు ఆయన సవాల్ ని ఎవరూ ఎందుకు స్వీకరించలేదు? ఆస్తులు ప్రకటించమని  ఐటీ శాఖ వారు ఏమీ అడగలేదు. అయినా ఆయన ప్రకటిస్తున్నారు. శ్రీనివాస రావు గారు గానీ, మరొకరి  ఇంట్లో ఐటీ దాడులు జరిగితే భయపడాల్సిన, కంగారు పడాల్సిన అవసరంలేదు. మేం రియాక్ట్ కూడా కాలేదు.  వియ్ డోంట్ కేర్. హానెస్టీకి మారు పేరు చంద్రబాబు నాయుడు. ఆయనపై 29 కేసులు పెట్టారు. ఇప్పటి వరకు ఏమైనా అయిందా? ఏమీ కాలేదు. ప్రస్తుతం దాడులు జరిగిన వారిపై ఫిర్యాదులు రాలేదు. జగన్మోహన రెడ్డిగారు 12 కేసుల్లో ఏ1 ముద్దాయి. అటువంటి వ్యక్తిపై దాడులు జరిగితే రాస్తారు. ఆయనపై ఛార్జిషీట్ ఫైల్ అయింది. ప్రజా ధనాన్ని రూ.42వేల కోట్లు దోపిడీ చేశాడు. మేం ప్రజా ధనం లూటీ చేయలేదు. అందుకనే అది వార్త అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు నీతివంతమైన నాయకుడు అందువల్ల అది వార్త కాదు. విజయ్ మాల్యా, నీరబ్ మోడీ, చార్లెస్ శోభరాజ్ వంటి వారి ఇళ్ల పై ఐటీ దాడులు జరిగితే అది వార్త అవుతుంది. వెంకటకృష్ణగారు, మహేష్, బాజీ గారి ఇంటిపై దాడులు జరిగితే అది వార్త కాదు. బీజేపీ కక్షసాధింపు అని మేం అనుకోవడంలేదు. ఇక రకంగా మాకూ మంచిదే. శ్రీనివాస రావు గారు ఏంటో మాకు తెలుసు. భవిష్యత్ లో ఆరోపణ చేయడానికి కూడా ఉండదు. ఢిల్లీలో కూడా ఒక ముద్దుల బాబు అమిత్ షా గారి అబ్బాయి జయషా ఉన్నారు. ఆయన ఆస్తులు కూడా ఒక్క సంవత్సరంలో 50 వేల నుంచి వెయ్యి రెట్లు పెరిగినట్లు అప్పుడు కూడా వార్త వచ్చింది. అది కూడా ఐటీ బయట పెట్టాలి.

అద్దేపల్లి శ్రీధర్ – వైసీపీ
పెండ్యాల శ్రీనివాస రావుది సాధారణ ఫ్యామిలీ. వారి అత్తగారిది రాజమండ్రి. చిన్న ఫ్యామిలీలు. ఏది ఏమైనా ఆస్తులు, ఆదాయానికి మించి డబ్బు దొరికింది. నేరుగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఉందా? లేదా? అనేది చర్చనీయాంశం. శ్రీనివాస రావు, పత్తిపాటి పుల్లారావు గారి అబ్బాయి వద్ద అదనపు డబ్బు దొరికితే చంద్రబాబు నాయుడు గారి మనసు హర్ట్ అవుతది. మరో వ్యక్తి లోకేష్ కి దగ్గరగా ఉన్నారు. ఐటీ చట్ట ప్రకారం ఎవరిపై దాడి జరిగిందో వారు సంతకాలు పెడతారు. అందువల్ల ఏం దొరికాయో వారికి తెలుసు. దాడి జరిగినంతమాత్రాన ప్రతి వ్యక్తి తప్పు చేశాడని కాదనేది డిపార్ట్ మెంట్ రూల్.  టాక్స్ ఎగ్గొడితేనే వారిది తప్పవుతుంది. వివరాలు తెలపమని ఐటీ శాఖని డిమాండ్ చేసే అవకాశం లేదు. ఇది వైసీపీ ప్రభుత్వానికి ఏమీ సంబంధంలేదు. ఐటీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్వతంత్ర సంస్థ. వారికి ఉన్న సమాచారం మేరకు దాడులు చేస్తారు. ఐటీ ఉన్నత అధికారులు ఎక్కడికి వెళుతున్నారో భార్యకు కూడా చెప్పలేని స్థితిలో ఉంటారు. అంత కాన్షిడెన్స్ గా ఉంటాయి వారి వ్యవహారాలు. ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో ఏపీ ప్రజలందరికీ తెలుసు. ఐటీ, సీబీఐ, సీఐడీ దాడులు చేయడానికి వీలులేకుండా జీఓలు తీసుకువచ్చారు. పోలీసులు ఎవరితో సహకరించకూడదు. ఐటీ దాడులు చేసిన వ్యక్తుల జీవన విధానం పొరుగువారికి తెలుస్తుంది. ఆదాయానికి మించిన ఆస్తులు, సూట్ కేస్ కంపెనీలు ... వంటి ఉంటే వారందరూ వంద శాతం లయబుల్. బినామీ ట్రాన్సాక్షన్,  ఓపెన్ ట్రాన్సాక్షన్, డీమోనిటైజేషన్ వచ్చాయి.  రూ.2 లక్షలకు మించి ఇచ్చిపుచ్చుకోకూడదు. గుజరాత్, కర్ణాటక ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ టీమ్  కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారు. అయితే  డబ్బు సమకూర్చారా లేదా? అనేదానికి సాక్ష్యం ఉండాలి. శ్రీనివాసరావు చంద్రబాబు పీఏ కాబట్టి డైరీ రాస్తారు. అలాంటి డైరీ దొరికితే అందులో ఫిగర్స్ ఉంటాయి, ఎవరికి ఇచ్చింది వివరాలు ఉంటాయి. ఫిర్యాదు చేస్తేనే ఐటీ దాడులు చేయవలసిన అవసరంలేదు. గత 6,7 సంవత్సరాల రిటన్స్ లో వ్యత్యాసం, ఆధార్ ఆధారంగా ఆస్తులు వివరాలు చూపించకపోయినా దాడులు చేస్తారు. శ్రీనివాస్ అమ్మ, నాన్న, భార్య తరపువారి ఆస్తులు పెరిగినా దాడి చేస్తారు. జగన్ గారి కేసులో రాజకీయ ప్రమేయంతో చేశారు. పెద్ద ఫిగర్స్ చెబుతున్నారో అవి ఛార్జి షీట్ లో లేవు. లోకేష్ గారికి లెఫ్ట్ రైటూ రాజేష్, అభిష్ట, వేమూరి. రాజేష్ అప్రూవల్ గా మారి నిజాలు చెబితే మిగిలిన ముగ్గురు కూడా ఇరుక్కుంటారు. కాకినాడ పోర్టు ఏరియాలో ఒక ఆఫీసర్ కింద పనిచే అతను  లంచం తీసుకుంటున్నాను, దాంట్లో 80 పర్సెంట్ అధికారి ఇస్తున్నానంటే ఇద్దరినీ రిమూవ్ చేశారు. హైదరాబాద్ లో ఎస్ఐ డబ్బు తీసుకొని సీఐ తీసుకోమన్నాడని చెప్పాడు. ఇద్దరినీ రిమూవ్ చేశారు.
ఏలేరు స్కామ్, సోమశేఖర్ కమిషన్ పూర్తి అవకుండా ఆగిపోయింది, ఐఎన్జీ భారత్ అకాడమీ ఢిల్లీ రావు, హైకోర్టు స్టే ఆర్డర్ లో ఉంది. కేసు జరుగుతోంది. కుప్పంలో ఢిల్లీ రావు, ఇతరులు డ్రిప్ ఇరిగేష్ స్టేలో ఉన్నారు. శ్రీనివాస రావు డైరీలో ఏవైనా వివరాలు ఉన్నా, కిలారు రాజేష్ అప్రూవల్ గా మారినా  చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఇరుక్కుంటారు.  మిగతా వ్యవహారాలలో కాస్త తక్కువైనా మనీ వ్యవహారాలలో లోకేష్ తెలివైన వాడు.
నిజమైన వారికి సంక్షేమ పథకాలు అందజేయాలని నోబెల్ బహుమతి పొందిన బెనర్జీ, డక్లో, మైఖేల్  వారు చెప్పారు. వారు హైదరాబాద్, ఆఫ్రికన్ దేశాలలో పరిశోధన చేశారు. అవన్నీ నేను జగన్ , అజయ్ కల్లాం గారికి ఇచ్చాను. ఆ ప్రకారం జగన్ గారు తెల్లకార్డులకు కోత విధించారు. బియ్యం పంపిణీలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి. తెలంగాణలో రైతు బంద్ పథకం ఒక ఎకరా నుంచి 300 ఎకరాలు ఉన్నా ఇస్తున్నారు. ఏపీ 5 ఎకరాలని లిమిట్ పెట్టారు. రిసెర్చ్ లో కూడా అనర్హులను తీసివేయమని చెప్పారు. న్యాయబద్దమైన అర్హులకు ఇవ్వాలన్నది జగన్ గారి లక్ష్యం. అర్హులైతే తరువాత ఇస్తాం. గ్రామ సేవకులు పరీక్ష ద్వారా ఎంపిక చేశారు. అన్ని ప్రధాన  పార్టీలు దీనికి సహకరిస్తున్నారు. మేం రాజకీయాలు, కులాలకు అతీతంగా కార్యక్రమాలు చేస్తున్నాం. మాకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలను పెద్ద లెక్క కాదు. సాధికార సర్వే కూడా పరిగణనలోకి తీసుకొని చేస్తున్నాం. తెల్లకార్డుకు నిబంధనలు తప్పనిసరి.

బాజీ – బీజేపీ
ఐటీ దాడులు వారి నిబంధనల ప్రకారం జరుగుతాయి. ఆ వ్యక్తి వైపు ఐటీ శాఖ ఎందుకు చూసింది? కాంగ్రెస్ కాలంలో దశాబ్దాలు సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరోగా పేరుపడింది. 2014 నుంచి 19 మధ్యలో ఏపీలో ఏ డిబేట్ లో చూసిన ఒకే విషయం ఉండేది. వైసీపీ లక్ష కోట్లు, ఓటుకు నోటు కేసు టీడీపీ, వైసీపీ 16 నెలల జైలు, 19 స్టేలు టీడీపీ.. ఇదే చర్చ. రాజకీయ ఆరోపణలు కాదు. అవినీతి ఆరోపణలు. నువ్వెంత తిన్నావు, నువ్వెంత తిన్నావు అని. వీరిద్దరూ కాదు వ్యక్తిగత సహాయకులు తిన్నారని సూర్యుడు, తరువాత విజయసాయి రెడ్డి, లక్ష్మి, మోపిదేవి... వీళ్లందరినీ తీసుకెళ్లి పెట్టారు. వారిని ఊరికినే పెట్టలేదు.  అలాగే ఈ రోజు టీడీపీలో పత్తిపాట పుల్లారావు గారి అబ్బాయిని పెట్టినా, మరొకరిని పెట్టినా .. శ్రీనివాస రెడ్డి పేరు ఆంధ్రజ్యోతిలో 3 వపేజీలో వచ్చింది. అదే అటుఇటూ అయితే ఫస్ట్ పేజీలో వచ్చేది. ఉద్దేశం ఏదైనా ప్రజా సొమ్ము. 2018లో అనేక రాష్ట్రాలలో సీబీఐ, ఈడీ దాడులు జరిగాయి. ఏపీలో మాత్రం అవిరావడానికి వీలులేదు అని చంద్రబాబు నాయుడు ఇతర రాష్ట్రాల వారితో కూడా సంతకాలు చేయించారు. మనం మెయిన్ టెయిన్ చేసుకోవాలన్నారు. శ్రీనివాస రావు వద్ద వందల కోట్లు దొరికినట్లు తేలితే, టీడీపీ నాయకులు చంద్రబాబు గారి వద్దకు వచ్చి మొన్న ఎన్నికల్లో ఏమీ లేవని చెప్పారు గదా, ఈ డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందని అడుగుతారు. గుజరాత్ లో కూడా లోకేష్ బాబు గారి ద్వారా కాంగ్రెస్ కు సహాయం అందింది. కర్ణాటకలో కూడా ఆర్థిక సాయం అందించారు. ప్రజాస్వామ్యంలో సామాన్యుడు కూడా మాట్లాడే హక్కు ఉంటుంది. లక్ష్మీ పార్వతి ఏసీబీ కోర్టులో కేసు వేశారు. ఇప్పుడు కూడా ఆయన రెండెకరాలతో కడిగిన ముత్యంలా ఉన్నారు. వేల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయో ప్రజలకు తెలుసు. కార్డుల తొలగింపు నిష్పక్షపాతంగా జరగాలి. రాజకీయ వ్యవహారాలు ఉండకూడదు. ముఖ్యంగా సంచార జాతులను గుర్తించి వారికి లబ్దిచేకూర్చాలి. 2,08,800 క్వింటాళ్ల బియ్యం ఇస్తున్నారు. తెల్ల కార్డు కాకుండా, ఎమ్మార్వో ఇచ్చిన నిర్ధారణతో ఇవ్వాలని కోరుతున్నాను. క్రిష్టలంకలో ఇళ్లలో ఏసీలు కూడా ఉంటాయి. టీవీ కారణం తీసివేయాలి. గ్రామసేవకుల ఎంపికే పార్షియల్ గా జరిగింది.

పార్ధసారధి – బీజేపీ
ఐటీలో 99 శాతం రాజకీయ ప్రమేయం ఉండదు. ఆ విధానం చాలా పకడ్బంధీగా ఉంటుంది. టీడీపీ వారిపై బీజేపీ దాడులు చేయిస్తుందనేది పూర్తిగా అవాస్తవం. లోకేష్ గారు రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచి ఆయన సన్నహితులు రాజేష్ పై విపరీతమైన అభియోగాలు వచ్చాయి. ఐటీ వారు ఆధారాలు సేకరిస్తారు. పోలవరం ప్రాజెక్ట్ సబ్ కాంట్రాక్ట్  వందల కోట్లు  శ్రీనివాస రెడ్డి చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. ఆ రోజుల్లోనే ప్రచురణ అయ్యాయి. అవి వచ్చినప్పుడు సాక్ష్యాలు సేకరిస్తారు. వ్యాపార సంస్థల వ్యాపారాలు దెబ్బతింటాయని వారిపై  పదేపదే వచ్చే ఫిర్యాదుల వివరాలు బయటపెట్టారు.

మహేష్ – జనసేన
సాధారణమైన వ్యక్తులు శ్రీనివాస్ గారు, రాజేష్ గారు ఇళ్లలో ఇంత పెద్ద ఎత్తున డబ్బు దొరికిందంటే రాజకీయాలు చేయకుండా ఐటీ శాఖ ఎందుకు వస్తుందని ఆలోచన చేయాలి. లెక్కలేనంతగా ఇంతగా ఆస్తులు ఎక్కడ నుంచి వచ్చాయి? ఐటీ దాడులు చేసి గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏంటి? ఇటువంటి వ్యక్తులకు ఇంత పెద్ద ఎత్తున డబ్బు సమకూరుస్తున్నాయంటే ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలి. కేసులు సుదీర్ఘ కాలంనడవడం. అనుకూలమైన వ్యక్తులకు ఒక రకం, వ్యతిరేకులకు ఒక రకం. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెండుమూడేళ్లలో 42వేల కోట్లు సంపాధించిన జగన్మోహన రెడ్డిగారిని చూశాం. ఆయనను ఆదర్శంగా తీసుకొని పెద్ద ఎత్తున రాజకీయాలలోకి వస్తే వ్యవస్థ కలుషితమతుంది. ప్రజలకు అవగాహన కల్పించాలి. ఏపీ, తెలంగాణలో డబ్బు ప్రభావంతోనే రాజకీయాలు నడుస్తున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ కోట్లలో ఖర్చు చేశారు. ఎన్నికల సంఘం కూడా ఏమీ చేయలేకపోయింది. ఇంత పెద్ద ఎత్తున డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది. అవినీతి ద్వారానే వస్తుంది. 2003లో జగన్ గారి ఆస్తులు ఎంత ఉందో అందరికీ తెలుసు. ఎవరిమీదైనా కేసు ఫైల్ అయితే అతను నేరగాడేనని అంబటి రాంబాబు స్వయంగా అసెంబ్లీలో చెప్పారు. ఆ రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. ఇల్లు, ఫీజు రీయింబర్స్ మెంట్ వస్తాయని అనేక మంది తెల్ల రేషన్ కార్డులు తీసుకున్నారు. అర్హత లేనివారికి రద్దు చేయడం మంచిది. దానికి వ్యతిరేకత లేదు. దానిని మంచిగానే చూద్దాం. వార్డు వాలంటీర్లు పరిశీలన చేయకుండా వైసీపీ నేతల సలహాలు తీసుకొని పెన్షన్ రద్దు చేశారు.  వంటరి మహిళల పెన్షన్ రద్దు చేశారు. ఆదాయం కూడా వారే నిర్ణయిస్తున్నారు. లోన్ కోసం ఐటీ దాఖలు చేస్తే దానిని కూడా పరిగణనలోకి తీసుకొని రద్దు చేశారు. సమగ్రంగా సర్వే చేయాలి. వయసు తగ్గించిన తరువాత పెన్షన్లు రద్దయ్యాయి. ప్రజలలో ఆందోళన ఉంది. ఉగాదికి 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పారు. కార్డులు రద్దు చేస్తామని జగన్ గారు ముందే చెప్పవలసింది. తీసేటప్పుడు అధికారులపై తోసేస్తున్నారు.

చలసాని శ్రీనివాస్ – ప్రత్యేక హోదా సాధన సమితి
ప్రత్యేక హోదా గురించి చెప్పినందుకు ధన్యవాదాలు. విశాఖలో ఒక సామాన్యమైన ఇంజనీర్ వద్ద రూ.800 కోట్లు దొరికినట్లు వార్తలు వస్తాయి. తరువాత ఫాలోఅప్ ఉండదు. టంగుటూరి ప్రకాశం, వావిలాల గోపాల కృష్ణయ్య లాంటి రాజకీయ నాయకులు ఉండేవారు. రాజకీయ నాయకులు వ్యాపారస్తులను, సంఘ విద్రోహ శక్తులను,  వ్యాపారస్తులు రాజకీయ నాయకులను వాడుకోవడం మొదలు పెట్టారు. తరువాత వ్యాపారస్తులే రాజకీయాల్లోకి వస్తున్నారు.  జగన్ గారు కాంగ్రెస్ లో ఉన్నంత కాలం ఏమీ కనిపించలేదు. ఆయన బయటకు వెళ్లగానే ఇడీ, సీబిఐలు అన్ని ఆయనమీద పడ్డాయి. అప్పట్లో కాంగ్రెస్ నేత ఒకరు మా పార్టీలో ఉంటే ఇవన్నీ ఏమీ జరిగి ఉండేవి కావు అని చెప్పారు. కేంద్రం గానీ, రాష్ట్రంలో గాని రాజకీయ ప్రత్యర్థులను బలహీన పరచడానికి వీటిని వాడుకుంటున్నారు. తమిళనాడు కనిమొళి గారి ఇంటిపై దాడులు జరిగాయి. కరుణానిధి పలకరించిన తరువాత దాడులు ఆగిపోయాయి. రాష్ట్రంలో ఎంపీలపై దాడులు జరిగాయి. వారు పార్టీ మార్చగానే ఏమైందో తెలియదు.  అందరి అధికారులను తప్పుపట్టలేం. రాజకీయ పార్టీలకు సంబంధంలేదు అని చెప్పడం భావ్యం కాదు. ఒక నిర్మాణ కంపెనీలో మూడు వేల కోట్లు అని రాస్తారు. తరువాత ఏమైందో తెలియదు. రాజకీయ నాయకులు ఒకరికొకరు ప్రత్యారోపణలు చేస్తారు. ఒకటైన తరువాత ఏమీ ఉండదు. దేశంలో ఎక్కడైనా పారదర్శకత ఉండాలి. విజయమాల్యా కేసులో ఫాలో అప్ లేదు. వామపక్ష పార్టీలు  తప్ప ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ అధికారం ఎలా దుర్వినియోగం అవుతోంది. ఈ పరిస్థితులను చూసి రాజకీయాల్లోకి రావడానికి భయపడుతున్నారు.
రాష్ట్రం బాగుపడాలనుకునేవారందరూ డిమాండ్ చేసే అంశం అనర్హులకు కార్డులు రద్దు చేయాలి. అన్ని పథకాలు రావడంతో తెల్లకార్డు ప్రామాణికం అయింది. నవరత్నాలు అద్భుతం. గ్రామ సేవకులు నియామకం విషయంలో ఏక పక్షంగా జరిగినట్లు విమర్శలు వచ్చాయి. అర్హులకు అన్యాయం చేయకూడదు. రాజకీయలు లేకుండా చూడాలి. వ్యవస్థలో మౌలికమైన మార్పు రావాలి. అర్హులను తిరస్కరిస్తే వారికి శిక్ష వంటి జవాబుదారీ ఉండాలి.
---------------------

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...