Feb 15, 2020

60వ రోజు రాజధాని రైతుల దీక్షలు


అమరావతి: ప్రజారాజధాని అమరావతి రైతులు గట్టి పట్టుదలతో రాజధాని తరలిపోకుండా ఆందోళనలు కొనసాగిస్తున్నారు.  5 కోట్ల ఆంధ్రులను దృష్టిలోపెట్టుకొని వారు భూములు ఇచ్చి, ఈ రోజున రోడ్డున పడటం బాధాకరం. వారి  ఆందోళనలు 60వ రోజుకు చేరాయి.  మందడం, తుళ్లూరులో ధర్నాలు చేస్తున్నారు. మిగతా రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో రైతుల దీక్షలు కొనసాగుతున్నాయి.


v  రాజధాని అమరావతి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని ఎన్‌ఆర్‌ఐ జేఏసీ నిర్ణయించింది. అమెరికాలో తెలుగువారుండే ప్రాంతాల నుంచి ప్రధానికి నరేంద్రమోదీకి వినతి పత్రాలు పంపించాలని నిర్ణయించింది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ అమెరికాలోని రాష్ట్రాల రాయబార కేంద్రాలు, తెలుగువారు ఉన్న 70కి పైగా దేశాల నుంచి ప్రధాని నరేంద్రమోదీకి వినతిపత్రాలు పంపాలని నిర్ణయం తీసుకుంది. 

No comments:

Post a Comment

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...