Feb 26, 2020

విశాఖ భూ దందా - సిట్ గడువు పొడిగింపు


26.02.2020:
v విశాఖపట్నం, చుట్టుపక్కల ఉన్న మండలాల్లో జరిగిన భూకుంభకోణంపై సమగ్ర విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) గడువును ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది.
v అక్రమాలను నిగ్గు తేల్చడం కోసం నూతన ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేస్తూ 2019 అక్టోబర్‌ 17న జీవో జారీ చేసింది.
v విశాఖపట్నం, పరిసర మండలాల్లో విలువైన భూములను కొట్టేయడమే లక్ష్యంగా భూ రికార్డులను ట్యాంపరింగ్‌ చేశారని, ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేశారని, ప్రైవేట్‌ భూములకు చెందిన రికార్డులను కూడా తారుమారు చేశారని వచ్చిన అభియోగాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.
v దర్యాప్తు పరిధి ఎక్కువగా ఉండటం, ఇంకా కొన్ని అంశాలపై సమగ్ర విచారణ జరపాల్సి ఉన్నందున తుది నివేదిక సమర్పణకు మరికొంత సమయం ఇవ్వాలని కోరింది. దీనిని పరిశీలించిన ప్రభుత్వం మరో మూడు నెలలు సిట్‌ను పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
v  

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...