Feb 26, 2020

ట్రంప్ 2 రోజుల భారత్ పర్యటన


టీవీ 24X7  - తేదీ: 26.02.2020 బుధవారం ఉదయం 7.30 గం. నుంచి
అంశాలు :   అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 రోజుల భారత్ పర్యటన – కాంగ్రెస్ గైర్హాజర్
               అమరావతి రగడ   - 1250 ఎకరాలు పేదలకు కేటాయింపు. మంగళగిరి, పెదకాకాని, విజయవాడ, గుంటూరు, దుగ్గిరాల వారికి
---  పౌరసత్వ సవరణలు - సీఏఏ
యాంకర్ :  కృష్ణ సాయి

  
విక్రమ్ పోల – విశ్లేషకులు
అంతర్జాతీయంగా ట్రంప్ పర్యటనకు ప్రాధాన్యత ఉంది. ఆసియాలో చైనా ప్రాభల్యం. కవ్వింపు చర్యలు.. భారత్ కు అమెరికా సహాయం, మితృత్వం మనకి ఉపయోగం.  చైనా చాలా సంవత్సరాలుగా బెల్ట్ అనే ప్రాజెక్ట్ ని తీసుకుంది. పెద్ద ఎత్తున నిధులు ఖర్చే చేస్తోంది.  ఆసియా ప్రాంతంలోని అనేక దేశాలకు ఉదారంగా నిధులు ఇస్తోంది. భారత్ కు మొదటి నుంచి స్నేహభావంతో ఉన్న శ్రీలంక, మైన్మార్, బంగ్లాదేశ్, నేపాల్ దేశాలలో చైనా పెట్టుబడులు పెడుతోంది. ఆ దేశాలను ఆర్థికంగా లొంగదీసుకునేట్లు కనిపిస్తోంది. పాక్-చైనా ఎకనామిక్ కారిడార్  1.3 ట్రిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. బెల్ట్ అనే ప్రాజెక్ట్ 68 బిలియన్ డాలర్ల వ్యయం. ఆసియా ప్రాంతంలో బలపడటానికి ప్రయత్నం. ఈ పరిస్థితులలో భారత్ కు అమెరికా సహాయం ముఖ్యం. ఈ దశలో రాజకీయంగా చూడటం మంచిదికాదు. అయితే రెండు దేశాల మధ్య విభేదాలు ఉన్నాయి. భారత్ సుంకాలు భారీగా ఉన్నాయని ట్రంప్ గారే చెప్పారు. అమెరికా భారత్ పై డబ్ల్యూటీఓలో 14కేసులు వేయించింది. భారత్ ఉత్పత్తులను డిస్క్రైజ్ చేస్తున్నారు. వాణిజ్యపరమైన కొన్ని వైరుధ్యాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులలో అమెరికా మార్కెట్ మనకి చాలా అవసరం. చైనాలో మార్కెట్ ఉండదు. అక్కడి ఉత్పత్తులు చాలా చౌక. మన దేశం పశ్చిమ దేశాలకు, అమెరికాకు చేయాలి. అమెరికాలో ప్రైవేటు రంగమే ఎక్కువ. అమెరికా నుంచి పెట్టుబడులు వస్తే మంచిది. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని పీచమణచడంలో భారత్ ఒక్కటే ఏమీ చేయలేదు. అమెరికా సహాయం కావాలి. 1962లో చైనా వార్ లో అమెరికా సపోర్ట్ చేసింది.  డెమోక్రాట్స్ కంటే రిపబ్లికన్సే మనకి సహాయం చేశారు. జార్జి బుష్ జూనియర్ హయాంలోనే చాలా సహాయం అందించారు. క్లింటన్, ఒబామా స్నేహపూర్వకంగా ఉన్నా మితిమీరిన ఆంక్షలు పెట్టారు. మోడీ-ట్రంప్ వ్యక్తిగత స్నేహం దేశాల మధ్య స్నేహం పెరగడారిని ఉపయోగం. మనలోని వామపక్ష ఆలోచనలు తొలగిపోవలసిన పరిస్థితి ఉంది.
పెట్టుబడులు కావాలి. చైనా పెట్టుబడులు మనకి రావు. ట్రంప్ దేశానికి రావడం ద్వారా మన దేశ ఉన్నతిని, ప్రాముఖ్యాన్ని వివరించడం అంతర్జాతీయంగా మనకి మేలు చేసేదే.
పేదలకు ఇళ్ల స్థలాలు తప్పుపట్టవలసిన అవసరంలేదు. స్థానికులకు ఇవ్వవచ్చు. గన్నవరం విమానాశ్రయానికి భూములు ఇచ్చినవారికి అమరావతిలో భూములు ఇస్తామన్నారు. స్థానికులకు ఇవ్వకుండా ఇతర ప్రాంతాల వారికి ఇస్తే గొడవలు వస్తాయి.
ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ చూసేది కేంద్రం. డిసెంబర్ 15 నుంచి అక్కడ సీఏఏకి అనుకూలంగా, వ్యతిరేకంగా ఆందోళనకారులు ఉద్యమాలు చేస్తున్నారు. ట్రంప్ వచ్చే సందర్భంగా ఇంటిలిజన్స్ సమాచారం ఉంటుంది. ఆందోళనలను అణచడానికి యంత్రాంగం ఉంటుంది. ట్రంప్ ఉన్న సమయంలోనే ఈ ఆందోళన జరగడం ఆశ్చర్యం. ఇంటిలిజన్స్ వైఫల్యం కనిపిస్తోంది. సుప్రీం కోర్టు కూడా ఆందోళనని శాంతియుతంగా చేసుకోమని చెప్పింది. ముస్లింలు ఎక్కవగా ఉన్న ప్రాంతంలోనే ఈ గొడవలు జరుగుతున్నాయి. పోలీసులు వారిని కొడుతూ జైభారత్ అనిపిస్తున్నారు. టీడీపీదానికి మద్దతు. కేశినేని నాని ఓవైసీని విజయవాడలో సభ పెట్టించారు. వైసీపీ కూడా అంజాద్ బాషా గారితో ప్రదర్శనలు. కీలకమైన చట్టాన్ని పార్టీపరంగా స్పష్టత ఉండాలి. ప్రజలు గమనిస్తుంటారు.

రాజీవ్ గాంధీ – వైసీపీ
మన దేశంలో మన తల్లి భూమి భారతిని పొగడటం చాలా సంతోషం. జగన్ గారిని పిలవకపోవడానికి రాష్ట్రపతి మార్గదర్శకాలు, అమెరికా విధివిధానాలు, సంఖ్యని పరిమితిని చేయడం.. రాజకీయాలు చూడకూడదు. మన రాష్ట్రంలో పచ్చ మీడియా జగన్ కు ఆహ్వానంలేదు, కేసీఆర్ ని పిలిచారు అని ప్రచారం. కేజ్రీవాల్ ని ఎందుకు పిలవలేదు. . దేశ భద్రత, దౌత్యపరంగా ఫలితం ఉంటుంది. ఆయన ప్రసంగం ద్వారా దేశ ఔన్నత్యాన్ని పెంచారు.
నవరత్నాలలో భాగంలో 1250 ఎకరాలు పేదలకు ఇస్తున్నాం. (సీఆర్డీఏ చట్టం  53డీ  ప్రకారం)  భూములు కావాలనుకుంటే రైతులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. రాజధాని ప్రాంతానికి, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి చాలా వ్యత్యాసం ఉంది. పేదలకు ఇళ్లు ఉండాలి. రైతుల ప్రతిపాదనలు పరిశీలిస్తాం. పేదలకు అంత తెలివితేటలు ఉండవు. అక్కడ ఉద్యమం పది శాతం మాత్రమే. చంద్రబాబు నాయుడు గారి మాయలో పడవద్దు. రాజధానిపై అందరికీ స్పష్టత వచ్చింది. మూడు రాజధానులతో అభివృద్ధి. జాస్తి కిషోర్ కుమార్ విషయంలో విచారణ చేసుకోవచ్చని కోర్టు చెప్పింది.
చనిపోయినవారి జాబితా చూద్దాం. ఎవరెవరు ఏ కారణంతో చనిపోయారో వివరాలు మా వద్ద ఉన్నాయి. ఈ విధంగా చెప్పమని టీవీ వారు చనిపోయినవారి బంధువులకు చెప్పారు. తులసి రెడ్డి గారు వైఎస్ గారికి మీకు కక్షలు ఉండవచ్చు.  మా మీద బురద చల్లకండి. ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ అన్నారు. ఆ ప్రాంతాన్ని ఫ్యాక్షనిస్ట్ ప్రాంతం అంటారు. మా నాయకుడినికి ఆ బుద్దులులేవు. మీకేమైనా ఉన్నాయోమో.
వరద ముంపు ప్రాంతంలో చంద్రబాబు నాయుడు కట్టారని తులసిరెడ్డి గారు ఒప్పుకుంటారా? కుల, మతాలకు అతీతంగా పాలన చేసే పార్టీ మాది. అక్రమార్కులను, అవినీతిపరులను, అరాచక వ్యక్తులను అణగదొక్కుతాం.
పౌరసత్వ సవరణని మా పార్టీ సమర్ధించింది. తరువాత ప్రజలలో భయాందోళనలు వచ్చాయి. దాంతో మా పార్టీ స్టాండ్ మార్చుకుంది. దీనికి వ్యతిరేకంగా ఉంటామని జగన్ గారు చెప్పారు. ప్రజలలో భయాందోళనలు తొలగించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. హోం శాఖ మంత్రి మరింత లోతుగా చర్చించాలి. ప్రజా వ్యతిరేకతని నియంత్రించాలి. ఉద్యమకారులపై షూట్ అండ్ సైట్ ఆర్డర్ ఇవ్వడం మంచిదికాదు.

గొట్టిపాటి రామకృష్ణ - టీడీపీ
అగ్రరాజ్యాధినేత ప్రసంగం సంతోషం. 1991 తరువాత తెలుగు బిడ్డ పీవీ సంస్కరణల తరువాత దేశాన్ని అనేక అంశాల్లో విస్మరించలేని పరిస్థితి. వాణిజ్యపరమైన అంశాలు. ట్రంప్ పర్యటన, ప్రసంగం, పరస్పర అవగాహన దేశానికి మంచిది. దీనిని రాజకీయ చేయకుండా ఉంటే మంచిది. రాజీవ్ గాంధీ గారు వాజ్ పాయ్ గారిని యుఎన్ కు తీసుకువెళ్లారు. అదే వాజ్ పాయ్ పాకిస్తాన్ యుద్ధం తరువాత ఇందిరా గాంధీని కాళీ మాతగా వర్ణించారు. వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా దేశ గౌరవం కాపాడటంలో ... ఏ ప్రొటోకాల్ ప్రకారం పిలుపులు పిలిచారో తెలియదు. మాజీ ప్రధాని అనుకుంటే దేవగౌడ్ గారు కూడా ఉన్నారు. సోనియా  గాంధీని పిలవకపోవడాన్ని రాజకీయంగా భావించకూడదు. ఏ రాజకీయ పార్టీ అయినా, అమెరికాని వ్యతిరేకించే పార్టీలు కూడా ఆ దేశంతో మంచి సంబంధాలు ఉండాలనే కోరుతున్నాయి. ఈ పర్యటన మన దేశానికి కొంత ఉపయోగపడుతుంది. అమెరికాలోని భారతీయులలో అభద్రతా భావంలో కొంత మార్పు వస్తుంది.
పేదలకు అవకాశాలు అందరూ హర్షిస్తారు. ఆ భూములు మునిగిపోతాయని చెప్పారు. ఒక ఎకరాకి రెండు కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పారు. 1250 ఎకరాలు ఇస్తున్నారు. ఆ భూమికి వైసీపీ వారు చెప్పిన లెక్క ప్రకారం రూ.2500 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ రోజు డబ్బులు లేవంటున్నారు.  భూమి రైతులది. వారికి రూపాయి ఇవ్వలేదు. అవసరమైతే రైతులకు భూములు తిరిగి ఇస్తాం అని మంత్రులే చెబుతున్నారు. పెనమలూరులో కట్టపై నివాసాలను ఖాళీ చేయించడానికి ప్రభుత్వాలు ప్రయత్నించాయి. వాస్తవానికి వారు అక్కడ ఉండటం ఇబ్బందికరమే. అయితే వారు అక్కడకు దగ్గరలో పనులు చేసుకుంటారు. వారికి అమరావతిలో భూములు ఇస్తే అక్కడ నుంచి రావడం ఇబ్బంది. వారే చెప్పారు, అది శ్మశానం, ఎడారి అని, మనిషి అనేవాడు వెళ్లే పరిస్థితి ఉందా? అన్నారు. మంత్రులు బాధ్యతాయుతంగా మాట్లాడాలి. పేదలను తీసుకువెళ్లి ఒకచోట పెట్టడం. రెచ్చగొట్టే పద్దతి. లీగల్ గా సాధ్యం కానివి చెప్పడం. తెలుగుని తీసివేసి ఇంగ్లీష్ పెడతామంటే కోర్టులు అంగీకరించవు. సీఆర్డీఏ చట్టం రద్దు  అసెంబ్లీలో ఆమోదించి, కౌన్సిల్ లో త్రిశంకు స్వర్గంలో ఉంది. సెలెక్ట్ కమిటీ అన్నారు. అది జరుగుతూ ఉంది. 5 శాతం భూమిని పేదలకు ఇవ్వాలని ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ. ప్రభుత్వ విధానం ఏంటి? రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తారోచెప్పలేదు. మిగిలిన భూమి ఏం చేయబోతున్నారు. కాని పనులు వివాదాలు సృష్టించడానికి ఈ పనులు చేస్తున్నారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం స్థానిక పేదలకు  5 శాతం భూములు ఇవ్వవచ్చు. ప్రతిచోట ఎసైన్డ్ భూమి సమస్య. పీపీఏలను రద్దు చేయబోతే కోర్టులు కొట్టివేశాయి. కేంద్రం చెప్పింది. అంతర్జాతీయ సమస్య అయింది.
ఢిల్లీ లాంటి రాజధానిలో ఇంత గొడవ జరిగిందంటే మిగతా ప్రాంతాల్లో ఇంక ఎలా ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వ విఫలమైంది. కేశినేని నాని గారు ఆ చట్టాన్ని వ్యతిరేకించారు. క్రమంగా సమస్య పెద్దదైపోయింది. ప్రతి పౌరుడూ నిరూపించుకోవడం కష్టం. ప్రజల్లో భయాందోళనలు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రంలో ఒక కుంటుంబంలో ముగ్గురిలో  ఇద్దరికి పౌరసత్వం ఇచ్చారు. మరొకరికి ఇవ్వలేదు. చట్టంలో ఉన్న విషయానికంటే ప్రజల మనోభావాలు ముఖ్యం. వారి భయాందోళనలు ముఖ్యం.
370 చట్టానికి అందరూ మద్దతు తెలిపారు. రామజన్మభూమి విషయంలో వ్యతిరేకత రాలేదు. వెంటవెంటనే చట్టాలు తీసుకురావడం వల్ల ప్రజలలో భయాందోళన వ్యక్తమవుతుంది.

భానుప్రకాష్ – బీజేపీ
కాంగ్రెస్ అంటే సోనియా, రాజీవ్, రాహుల్, ప్రియాంక గాంధీ వీళ్లేనా. పదేళ్లు దేశాన్ని పరిపాలించిన ప్రధాని మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ నాయకులు కాదా? దేశాధ్యక్షుని విందుని ఇంట్లో పెళ్లితో పోల్చితే ఎలా? భారత్-అమెరికా సంబంధాలు గతంలోకి ఇప్పటికి వచ్చిన మార్పులు.. దేశ భద్రత, ఆంతరంగిక విషయాలలో మనందరం ఒకటి అవుదాం. కొన్ని నిబంధనలు, ప్రొటోకాల్ ప్రకారం కొద్దిమందిని పిలిచారు. ట్రంప్ సందర్శన వల్ల ప్రపంచం మొత్తం ... అమెరికాలోని వారు ఉప్పొంగిపోతున్నారు. అమెరికాలో వారు ఇండియాని గూగుల్ లో వెతుకుతున్నారు. ఆయన ప్రసంగం వల్ల మంచి ప్రచారం జరిగింది.  ఆంతరంగిక విషయాలు బయటకు రావు. కొన్ని సుహ్రుద్బావ వాతావరణంలో చర్చలు జరిగాయి. ఒక పక్క చైనా, ఒక పక్క పాకిస్తాన్ ఉగ్రవాదం.... శక్తివంతమైన దేశంగా భారత్ ఉంది. ట్రంప్ మద్దతు ఉంది.  సోనియా గాంధీని పిలవలేదని చర్చ వచ్చింది గదా.
రాజధాని వ్యవహరాం త్రిశంకు స్వర్గంలో ఉంది. చంద్రబాబు 5 ఏళ్లు వృధా చేశారు. జగన్ గారు మూడు రాజధానులు అంటున్నారు. కోర్ క్యాపిటల్ అమరావతిలోనే ఉండాలి. గొడవలు జరగాలనే ఉద్దేశం తప్ప ప్రజలకు మేలు జరగాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ఒక కులంపై కక్ష. ప్రతిపక్షం వారిని, వారికి ఫైనాన్స్ చేసినవారిని అణగదొక్కాలన్న ఉద్దేశం తప్ప మరొకటిలేదు. వారిది దురుద్దేశంతో చేస్తున్నారు.  అక్కడ భూములు ఇచ్చినవారు చాలా బాధపడుతున్నారు. పేదలకు భూములు ఇవ్వడం మంచిదే. ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతంలో భూములు ఇవ్వడం మంచిది.
మీరు రండి, గంటలో కుల రాజకీయాలు నిరూపింస్తాను. ఉద్దేశపూర్వకంగా టీటీడీలో కాంట్రాక్టులు రద్దు చేశారు. చేసేదంతా తప్పులు సమర్ధించుకుంటారు. మీ మాదిరి కమిషన్ తీసుకోవలసిన అవసరంలేదు.  మా గురించి తెలుసుకొని మాట్లాడు. మీ పార్టీ మాదిరిగా కమిషన్ తీసుకునే అలవాటు లేదు. ధైర్యం ఉంటే తిరుపతి రండి నిరూపిస్తా. బెదిరించే ప్రయత్నం. నా గురించి తెలుసుకొని మాట్లాడు. టీటీడీకి ఆర్టీఏ వర్తించదు. తెలిసి మాట్లాడండి. జాగ్రత్తగా మాట్లాడండి. రాజధాని ఎందుకు మారుస్తున్నారు.
ఈ ఉద్యమం ఉద్దేశపూర్వకంగా జరిగిందే. అగ్రరాజ్యనేత వచ్చినప్పడు రెండు రోజుల్లో ఇలా చేయడం అసాంఘీక శక్తుల పాత్ర ఉంది. కారకులను హోం శాఖ పట్టుకుంటుంది. సీఏఏ వల్ల ఎవరికీ నష్టంలేదు. ఇది చాలా మంచిది. బీజేపీ దేశవ్యాప్తంగా అవగాహన కల్సిస్తోంది.  ప్రతి ఇంటికి వెళ్లి చెబుతున్నాం. కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. వాస్తవాలు తెలియకుండా అపోహలు నమ్మవద్దని ప్రజలను కోరుతున్నాను. ఎట్టిపరిస్థితులలో ఈ దేశంలో సీఏఏ అమలు అవుతుంది. ఎన్నికష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఇది మా అమిత్ షా గారు చెప్పారు.

తులసి రెడ్డి – కాంగ్రెస్
పారిశ్రామికవేత్తలను పిలిచారు. సోనియా గాంధీ గారిని పిలవకుండా మిగిలినవారిని పిలిస్తే వెళతారా? ముఖ్యమంత్రులను అందరినీ ఎందుకు పిలవలేదు? సీఎంలు వస్తే ఎక్కువైపోతుందా? బీజేపీ తెలిసి చేసినా తెలియకచేసినా తప్పే. కొందరిని పిలిచి మిగతావారిని పిలవలేదు. గతంలో చైనా, రష్యా అధ్యక్షులు వచ్చారు. అమెరికావారికి ఆడంబరం ఎక్కువ. ఫోజులు ఎక్కువ. ప్రచారం, ఆర్భాటం. ట్రంప్ కు రెండు విధాల లాభం. నవంబర్ లో ఎన్నికలు. ఆ దేశ కంపెనీలకు రూ.21వేల కోట్ల వ్యాపారం. మనకి పెద్దగా ఒరిగిన ప్రయోజనం ఏమీ లేదు. నమస్తే ట్రంప్ లో ఆయన ప్రసంగం అనేక కోణాల్లో భారతదేశానని ఆవిష్కరించారు. స్వామి వివేకానంద తరువాత భారత దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ముఖ్యంగా దేశం గురించి వసుదైక కుటుంబం, భిన్నత్వంలో ఏకత్వం,వేద విజ్ఞానం, పురాణ విలువలు, పవిత్ర గంగానది, స్వర్ణ దేవాలయం, జమా మసీదు, హిమాలయాలు, గోవా, క్రికెటర్లు, హోలీ .... వంటి వాటి గురించి చెప్పారు. ఆ విధంగా మేలు చేశారు. వాణిజ్య ఒప్పందాలు బైయింగ్ సెల్లింగ్ పద్దతిలో జరిగింది.
ప్రభుత్వానిది ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ. కక్ష. దానికి అర్ధంలేదు. గెలిసింది వైసీపీ. మీకే ఓటు వేశారు. భూములు వేరే చోట ఇచ్చే అవకాశం ఉంది. సీఆర్డీఏ పరిధిలో ఉన్నదానిని ఇవ్వడం ఏమిటి? ఇప్పటికి 28 మంది చనిపోయారు. అవన్నీ ప్రభుత్వ హత్యలే. ఏ విధంగా సమర్థనీయం కాదు. దీనివల్ల ఎంతమంది చనిపోతారో.  పేదవారికి స్థలాలు ఇవ్వాలి. మరోచోట ఇవ్వాలి. మునక ప్రాంతం అన్నారు. పేదలు మునిగిపోవచ్చా. ఇది రెచ్చగొట్టే పనే. పుండుమీద కారం చల్లుతున్నారు.  నాకు గన్ మేన్ కూడా లేడు.
పౌరసత్వ సవరణ ఆందోళన హింసాత్మకం 18 మంది చనిపోయారు. 200 మంది క్షతగాత్రులు. సమస్య- ఘర్షణ. దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి. రెండు నెలల నుంచి జరుగుతోంది. ట్రంప్ ఉన్నప్పుడే ఢిల్లీలో జరగడం యాదృచ్ఛికం గావచ్చు. ఉద్యమ తీవ్రత బాగా ఉంది. అనవసరమైన సమస్య. అవసరంలేని సమస్య. దొంగతనం జరిగితే దొంగని పట్టుకోవాలి. గ్రామంలో అందరూ దొంగ కాదని నిరూపించుకోండి అన్నట్లు ఉంది. కొత్తగా సీఏఏ, ఎన్ఆర్ సీ ఏంటి? పదివేల కోట్లు ఖర్చు పెట్టి లేని సమస్య. అస్సాంలో ఎఆర్సీ  గొడవ. ప్రజాస్వామ్యం, సామ్యవాదం, లౌకికవాదం,  గణతంత్ర రాజ్యం.
లౌకితవాదం అని రాసుకున్న తరువాత మతం ప్రాతిపదిక ఏంటి. ఇది దేశానికి, బీజేపీకి మంచిదికాదు. వైసీపీ, టీడీపీ ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్యలా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీలో ఉన్నది వారిద్దరేగదా వ్యతిరేకిస్తూ తీర్మానం చేయవచ్చుగదా.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...