Feb 25, 2020

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన


టీవీ డిబేట్ :  ఏపీ 24X7 - తేదీ: 25.02.2020 మంగళవారం ఉదయం 7.30 గం. నుంచి
అంశాలు :  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన – 
                రాష్ట్రంలో ప్రధాన నేతల విమర్శలు
యాంకర్ :  కృష్ణ సాయి
లక్ష్మీనారాయణ – విశ్లేషకులు
అలీన విదేశాంగ విధానం సందర్భంగా ఏకాభిప్రాయం. విదేశీ ప్రముఖుడు భారతదేశానికి వచ్చినప్పుడు భిన్న దృక్పదాలు మంచిది కాదు. అదరినీ తన వెంట తీసుకువెళ్లవలసిన అవసరం పాలకపక్షంపై ఉంటుంది. దౌత్యసంబంధాల విషయంలో మేమంగా ఒక్కటే అనే భావన కనిపించాలి. భిన్నాభిప్రాయాలు మంచిది కాదు. ట్రంప్ పర్యటన సందర్భంగా అధ్యక్షుని విందుకు   93 మందిని పిలిచారు. మరో 15మందిని పిలిస్తే కొంపలేమి మునగవు. అక్కడ చర్చలు ఏమీ జరగవు. ఢిల్లీలో పాఠశాల సందర్శనకు ట్రంప్ భార్య వెళుతున్నారు. స్థానిక సీఎంకి ఆహ్వానంలేకపోవడం మంచిదికాదు. ప్రధాన ప్రతిపక్షం తరపున సోనియా గాంధీకి ఆహ్వానంలేదని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ సీఎంలు రావడంలేదు. ఆ పరిస్థితి రాకుండా చూడాలి.    ఇది వ్యక్తిగత సంబంధాల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలా కనిపిస్తోంది. వాణిజ్య బృందాలు రాలేదు. మోడీ ట్రంప్ ని పొగిడితే, ట్రంప్ మాత్రం అమెరికా విధానాలు తెలియజేశారు. పాకిస్తాన్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. భారత్ సంబంధాలు ...అనేక విషయాలు ప్రస్తావించారు. గోల్డన్ టెంపుల్, గంగానది... పక్కపక్కనే మత ప్రాదిపదికన ప్రార్ధనలు చేస్తారని చెప్పారు. ఇరుగుపొరుగుతో సంబంధాలు మెరుగుపడాలి అదే ముఖ్యం. టార్గెట్ చైనా అనే ఆలోచన, అమెరికాతో ఉంటే మంచిదన్న ఆలోచన అత్యంత ప్రమాదరకం. చైనాని కట్టడి చేయాలంటే భారత్ తో మంచిగా ఉంటే బెటర్ అని అమెరికా అనుకుంటుంది.
విదేశాంగ నీతికి భారత దేశ ప్రయోజనాలే కొలబద్ద. నౌకాదళాన్ని హిందూ మహాసముద్రంలోకి పంపిది ఎవరు. నిన్నటికి వరకు పాకిస్తాన్ పెంచి పోషించింది ఎవరు, బిన్ లాడెన్ పెంచి పోషించింది ఎవరు? చైనా ని బూతంగా చూపించడం మంచిది కాదు. చైనా చేసేవాటినీ ఎదుర్కోవాలి.
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమావేశంలో సుప్రీం కోర్టు  దీపక్ గుప్త ప్రసంగం. రాజకీయ పక్షాలు అధినేతలు అధ్యయనం చేయాలి. ఓటర్లు పాలకపక్షానికి, ప్రతిపక్షానికి ఓట్లు వేశారు. విద్యకు బడ్జెట్ లో 30 శాతం అన్నారు. 20 శాతం అయినా మంచిదే. విద్యా ద్వారా సంపద అందస్తానని జగన్ గారు అన్నారు. మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల నియామకం కోసం వనరులు ... బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలి. జాతీయ నిరక్షరాశ్యత 27, రాష్ట్రంలో 37 శాతం. సంక్షేమపథకాలు ఎంత నిర్వహించినా సమర్థనీయం.
టీడీపీ – పట్టాభి
దేశాల మధ్య సత్సంబంధాలు ఉండటం మంచిది. నిన్నటి కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నాం. రాజకీయాలు మాట్లాడకూడదు. జాతీయ ప్రయోజనాలు మాట్లాడాలి. అమెరికాలో హౌడీ మోడీ గానీ, ఇక్కడ నమస్తే ట్రంప్ జరిగినా  మంచివి. ట్రంప్ మన దేశానికి వచ్చిన  7వ అధ్యక్షుడు. గతంలో ఆరుగురు అధ్యక్షులు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా వచ్చారు. అమెరికాతో సత్సంబంధాలు జరపడానికి ఎవరి స్థాయిలో వారు చేశారు. ఈ రోజు చైనా పెద్ద ఎత్తున పాకిస్తాన్ కు సహాయం చేస్తోంది. బిలియన్స్ డాలర్లు. చైనా నుంచి పాకిస్తాన్ కు రోడ్డు నిర్మిస్తోంది. చైనా నుంచి త్రెట్. అంతర్జాతీయంగా అగ్రరాజ్యాల మద్దతు అవసరం. గతంలోలా అమెరికా, రష్యా మధ్య శత్రుత్వంలేదు. గతంలో మనం అమెరికాతో సన్నిహితంగా ఉంటే రష్యా అభ్యంతరం చెప్పేది. భారత్ ఎక్కువగా రష్యాకి సన్నిహితంగా ఉండేది. ఈ రోజు సీన్ మారిపోయింది. చైనా పాకిస్తాన్ కు సపోర్ట్. రష్యా, యుఎస్ఏ కలిసి పనిచేయడం. ఐసిస్ లీడర్ బద్దాబి ని సిరియాలో చంపారు. అది రష్యా, యుఎస్ జాయింట్ ఆపరేషన్. గతంలో ఇటువంటి పరిస్థితిలేదు. వాజ్ పాయి గారు గతంలో పాకిస్తాన్ కు బస్ యాత్ర చేశారు. మోడీ గారు లాహోర్ లో నవాజ్ షరీఫ్ గారి ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం మనకి యుఎస్ సపోర్ట్ అవసరం. చైనా శ్రీలంకలోకి ఎంటర్, టిబెట్, నేపాల్ లో చైనా ప్రభావం.
ఇరాన్ పై యుఎస్ ఆంక్షలు. ఇరాన్ నుంచి చములు కొనవద్దని యుఎస్ చెబుతోంది. అటువంటి వాటికి లొంగకుండా ఉంటే మంచిది. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో స్థానం కోసం మనం ప్రయత్నిస్తున్నాం. దానికి యుఎస్ మద్దతు చేయవలసిన అవసరంలేదు. సీఎంలకు ఆహ్వానం కేసీఆర్, కేసీఆర్ వెళితే జగన్ వెళ్లినట్లే,  నవీన్ పట్నాయక్, ఉద్దవ్ థాక్రే, అమరేంద్ర సింగ్ ని పిలిచారు. మన్మోహన్ సింగ్ గారిని పిలిచారు. దీనిని ఎక్కువగా చేయకూడదు. అమెరికాలో శ్వేత కేశినేని గారు ప్రచారం చేసిన మాట వాస్తవం. వీసా విషయంలో ప్రవాస భారతీయులు ఆందోళనగా ఉన్నారు. ఆ విషయంలో ఆ ఆందోళన తగ్గేవిధంగా ఉంటే మంచిది. మోడీ గారు కూడా అలా చేస్తే మంచిదే.
చైనా అధ్యక్షుడు జిపింగ్ ని పిలిచి ఎంత మర్యాద చేసినా ఆయన పద్దతి మార్చుకోవడంలేదు. మాల్దీవులలో కూడా ఎంటర్ అయిపోయారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్.....వంటి చోట్లకు ఎంటర్ అయిపోతున్నాయి.
భాష ప్రయోగంని ప్రజలు గమనిస్తున్నారు.
విజయనగరంలో వసతి దీవెన కార్యక్రమం జగన్ గారు ప్రారంభించారు. భారీగా కోతలు. పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ తోపాటు ప్లస్ 20వేలు ఇస్తామని మేనిఫెస్టోలో రాశారు. మన రాష్ట్రంలో 17,70,000 ఉన్నత విద్యార్థులు ఉన్నారు. ఎస్టీఎస్సీ,బీసీ, మైనార్టీలు 12 లక్షల మంది ఉన్నారు. ఆ విద్యార్థులకు లబ్ది, అమ్మ ఒడి పథకానికి 80 లక్షల మందికి లబ్ది చేకూర్చాలంటే దాదాపుగా 30వేల కోట్లు అవసరం ప్రతి సంవత్సరం. వీరు చెప్పేది 12వేల కోట్లు అంటే దాదాపు 18వేల కోట్లు కోత విధించారు. ప్రజలను ఈ విధంగా మోసం చేస్తున్నారు. వీరి నిర్ణయాల వల్ల విద్యా వ్యవస్థ సర్వనాశనం అవుతుంది. రాష్ట్రంలో 25,021 కాలేజీలు ఉన్నాయి. ఫీజు రీయింబర్స్ మెంట్ ని పూర్తిగా ఆపేశారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. గతంలో మేం 4వేల కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ కు ఇచ్చాం. 12 రకాల స్కాలర్ షిప్స్ ఆపేశారు. మెస్ ఛార్జీలు, కాస్మోటిక్ కోసం 19వేలు ఇచ్చేవారం. ఒక వెయ్యి పెంచారు. భారీగా కోత విధించారు. పాత పథకాలకు కొత్త ముసుగు వేశారు. .ఫీజు రీయింబర్స్ మెంట్ ఆపడం వల్ల కాలేజీలు మూతపడే పరిస్థితి ఉంది. కాలేజీలకు అటాచ్ డ్ గా హాస్టళ్లు ఉండేవి. తల్లి ఖాతాలోకి వెళ్లడంతో  కాలేజీలకు నిధులు వెళ్లడంలేదు. కాలేజీ యాజమాన్యాలను బెదిరించి గతంలో ఇచ్చిన 40వేలనే ఫీజులుగా ఫిక్స్ చేయమంటున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ఎందుకు ఆపారు. నేను అడిగిన రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఏదేఏదో చెబుతున్నారు.
సుందర రామశర్మ – కాంగ్రెస్
అమెరికా ప్రసిడెంట్ ట్రంప్ రావడం విషయం కాదు. ప్రొటోకాల్ సరిగా పాటించలేదు. అంతర్జాతీయ కార్యక్రమాలు జరిగినప్పుడు 8 మంది సీఎంలను పిలిచారు. సోనియాని పిలవకపోడం ...ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారిని గౌరవించవలసిన అవసరంలేదా? సోనియా గాంధీ అంతర్జాతీయంగా తెలిసిన వ్యక్తి. ఆమెని పిలవకపోవడం తప్పు. అది మంచి పద్దతి కాదు. ప్రతి దాన్ని రాజకీయం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వారిని కూడా పిలిచి మేమంతా ఒక్కటే అని చూపించకుండా చేస్తున్నారు. సోనియా గాంధీని పిలవలేదని అమెరికాలో పేపర్లో వస్తే ఎలా ఉంటుంది? దేశ గౌరవాన్ని కాపాడటానికి కాంగ్రెస్ ముందుంటుంది. ట్రంప్ పర్యటనని మేం తప్పు పట్టడంలేదు. వారిని కించపరచాలనిలేదు. వారు చేసింది తప్పు. రాజకీయం చేశారు.
విష్ణు – బీజేపీ
ఇక్కడ మంచి పరిణామం జరుగుతోంది. అందరూ పోజిటివ్ గా మాట్లాడారు. మోడీ గారు ప్రపంచ దేశాలలో సక్సెస్ ఫుల్ గా విజయం సాధించారు. యుఎన్ కౌన్సిల్ లో మెంబర్ విషయంలో చైనా తప్ప అందరూ మద్దతు పలికారు. ప్రపంచ దేశాల్లో 2,3 స్థానాల్లో  ఉండబోతున్నాం. ఒక మంచి అవగాహనతో మోడీ గారు ముందుకు వెళుతున్నారు. మన్మోహన్ సింగ్, పీవీ హయాంతో బాగానే చేశారు. మన్మోహన్ సింగ్ ఇచ్చిన జీఓని రాహుల్ గాంధీ చించివేశారు.  మన్మోహన్ సింగ్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అద్వానీ హోం మినిస్టర్, డిప్యూటీ పీఎం సీఏఏపై చట్టం తీసుకురమ్మని అడిగారు. సోనియా నాయకత్వం రాగానే దేశంలో అశాంతి రెచ్చగొడుతున్నారు. వారి వెనుక పాకిస్తాన్ ఉంది. వారికి సోనియా గాంధీ బొమ్మ తప్ప మిగిలిన వారు మనుషులు కారు. .  మన్మోహన్ సింగ్ కూడా సోనియా ముందు నిలబడాలి.  అది కాంగ్రెస్ పరిస్థితి. ట్రంప్ పెద్ద బిజినెస్ మేన్. మోడీ టీ అమ్ముకునే చిన్న బిజినెస్ మేన్. ఇద్దరూ తెలివైనావారే. టఫ్ పీపుల్సే. స్నేహంలోనే ఫలితం ఉంటుంది. అమెరికా, రష్యాతో స్నేహం అవసరం. చైనా మనకి చాలా ఇబ్బంది కలిగిస్తుంది. చైనాలో కరోనస్ వైరస్ వచ్చినా మనం సాయం చేస్తున్నా మార్పులేదు. ఈ సారి మన దేశస్తుల ఓట్లు వారు అడుతున్నారు. మేం 70 ఎళ్లు ఉంటామని అనడంలేదు. వారు మంచి పనులు చేస్తే మళ్లీ రావచ్చు. స్నేహంగా ఉండి మనకి మంచి జరిగే విధంగా చూడాలి. రేపు అక్కడ పార్టీ మారితే వారితో కూడా స్పేహంగా ఉందాం.  మనం బలంగా ఉండటం ముఖ్యం. మేకిన్ ఇండి ఇక్కడ చేస్తే వారే ఇక్కడికి వచ్చి కొనుక్కుపోతారు. అమెరికాలో భారతీయుల సమస్యలు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. ట్రంప్ గారు కూడా చాలా కామెంట్లు చేశారు. ఇప్పుడు ట్రంప్ దిగివచ్చారు. మోడీ ఏం మాట్లాడలేదు.ఆయన పని ఆయన చేసుకుంటూ పోయారు. స్నేహంలో విజయం.  అమెరికా శత్రువు కాదు, మిత్రుడు కాదు. చైనా మాత్రం శత్రువే.
తెలుగు మాతృ భాష తీసివేస్తున్నారనేది బాధ. పాఠశాలలు మెరుగుపరచడం మంచిదే. ఇంటింటి పథకాలు మంచిదే. కొన్ని అంశాలలో వారి ఆలోచన విధానం మంచిదే. మొట్టమొదటిసారిగా ప్రజావేధికని కూల్చవేశారు. చంద్రబాబుపై కసిని ఇంకో రకంగా చూపించడం వల్ల రాష్ట్రానిక నష్టం. వారిని తొక్కుతాం అనడం మంచిది కాదు. రాష్ట్రం నుంచి వలసలు ఎక్కువగా ఉన్నాయి. పిల్లలు స్కూల్ కు రావాలంటే వారు సౌకర్యంగా ఉండాలి. ప్రతి నెలా డబ్బు ఇస్తామంటే కుదరదు. వారికి పని కల్పించాలి.
శంకర్  - వైసీపీ
అధ్యక్షుడు విందుకు జగన్ గారిని పిలవకపోవడం పెద్దగా ఆలోచన చేయవలసిన అవసరంలేదు.
కేజ్రీవాల్ 3 సార్లు గెలిచారు. ఆయనకు ఆహ్వానంలేదు. అక్కడ ఏం ఉందో తెలియదు. బెంగాల్ అతి పెద్ద రాష్ట్రం గదా. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ట్రంప్ సందర్శించడం శుభపరిణామం. ఆయన మన దేశం గురించి అన్ని రంగాల గురించి చెప్పడం భారత కీర్తి ఔన్నత్యాన్ని చాటింది. మోడీ టఫ్ నెగోషియేటర్ అని ట్రంప్ చెప్పారు. ఏ అధ్యక్షుడు కూడా ఆ విధంగా పేరుపెట్టి పొగడటం నేను చూడలేదు. మోడీ అంటే మన దేశాన్ని చూడాలి. చాలా ఆప్యాయంగా మాట్లాడారు. భారత దేశం అతిపెద్ద పవర్ ఫుల్ అని చెప్పారు. ఈ స్నేహం రక్షణ, వాణిజ్య పరంగా మనకి ప్రయోజనం. అమెరికాలో మనకి 40 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అతనికి లబ్ది జరగాలి. మనకి లబ్ది జరగాలి. తమ దేశ భద్రతకు ఇబ్బందిలేకుండా ఇమిగ్రేషన్ యాక్ట్ ఉంటుదని ట్రంప్ గతంలో చెప్పారు.  పౌల్ట్రీ, డెయిరీ పరంగా లక్షల మంది ఆదారపడి ఉన్నారు. అమెరికాలో లెగ్ పీస్ లు తినరు. అవన్నీ ఇక్కడకు తీసుకురావడానికి ఒప్పందంలో ఉందంటున్నారు. మిలియన్ టన్నులు అక్కడ ఉంటాయి. అటువంటి ఒప్పందం ఉంటే రైతులు రోడ్డున పడే అవకాశం ఉంది. వ్యక్తిగత పూజ ఎక్కవనిచింపించింది. సబర్మతి ఆశ్రమంలో మోడీ గారు మంచి మిత్రుడు అని రాశాడు. ప్రపంచానికే స్పూర్తి అని ఒబామా రాశారు. మేనిఫెస్టో బైబిల్, ఖురాన్, భగవత్గీత. దీనిని అందరూ పట్టుకొని తిరుగుతాం. విద్య వైద్యంపై మేం చేసే నిధులు రిఫార్మ్స్. ఏపీలో 33 శాతం నిరక్షరాశ్యత. పేదవాడు బలపడాలంటే విద్య ముఖ్యం. విద్య ఉంటే కుటుంబం బాగుంటుంది. ట్రైబల్స్ డ్రాప్ అవుట్స్ ఎక్కువ. వలస వల్ల డ్రాప్ అవుట్స్. పేదరికంలో మూలుగుతా ఉంటారు. అమ్మఒడి కార్యక్రమం దేశంలో అత్యుత్తమ కార్యక్రమం. తల్లులకు ఇస్తే ఫలితం ఉంటుంది. పిల్లలకు పౌష్టికాహారం. బాలికలకు బాత్ రూమ్స్ లేవు. సిగ్గుతో తలదించుకోవాలి. నారాయణ, చైతన్య స్కూల్స్ లో కనీస సౌకర్యాలు లేవు. మేం చేసే కార్యక్రమాలు చెబితే రెండు రోజులు పడుతుంది.
బొలిశెట్టి సత్యనారాయణ – జనసేన
ట్రంప్ ప్రసంగంలో ఒక్క మాట కూడా తీయడానికి వీలులేకుండా మాట్లాడారు. మన దేశం గురించి ఎవరూ చెప్పనివిధంగా చెప్పారు. ప్రపంచం జియోగ్రాఫికల్ కంటే ఎకనామిక్ వార్ ఎక్కువైంది. ట్రంప్ దేశానికి అధినేతే కాకుండా సుపీరియర్ పవర్. జన బలాన్ని మోడీ ప్రదర్శించారు. భారతదేశానికి పనికివచ్చేవిధంగా నిర్ణయం తీసుకుంటే మంచిదని చూపించారు. అందరినీ కలుపుకుపోవడంలో మోడీ ఫెయిల్. సోనియా గాంధీ, కేజ్రీవాల్ ను కూడా పిలవాలి. మోడీ ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రధాన్యత ఇచ్చే వ్యక్తి కాదు. ఈ రోజు జరిగే డీల్ ని చూస్తే దేశానికి మంచి జరుగుతుందో ఏందో చూడాలి. బీజేపీ వైపు నుంచి ఇంకా మంచిగా జరగాలి. ఉన్నంతో మోడీ భాగానే చేశారు. ఆయన ఎన్నికలకు వెళుతున్నారు. మన ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు.  
విద్య కోసం ఎంత చేసినా అభినందిస్తారు. బేసిక్ ఎమినిటీస్ లేవు. బాలికల స్పూల్స్ లో టాయిలెట్స్ లేవు. ప్రైవేటు పాఠశాలలు మెరుగు గా ఉన్నాయి. ఢిల్లీలో కేజ్రీవాల్ లా చేస్తే బాగుండేది. పంచాయతీలకు రంగులు మార్చే ఖర్చు పాఠశాలలకు ఖర్చు పెడితే బాగుండేది. మళ్లీ ఆయన అధికారంలోకి రావడానికి అవకాశం ఉండేది. ఎక్కువ ఖర్చు పాఠశాలలపై ఖర్చు పెట్టాలి. ప్రైవేటు పాఠశాలలు తీసివేయాలి. తెలుగు మీడియం రద్దు మంచిది కాదు.


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...