Feb 7, 2020

కియా మోటార్స్ - బెదిరింపులు


 ఏపీ 24X7 - 07.02.2020 శుక్రవారం ఉదయం 7.30 గం.
అంశాలు :     కియా మోటార్స్  
               పెండ్యాల శ్రీనివాసరావు, శ్రీనివాస రెడ్డి, ప్రతిపాటి పుల్లారావు కుమారుడి ఇళ్లపై ఐటీ దాడులు

గొట్టిపాటి రామకృష్ణ – టీడీపీ
రాజధాని విషయంలో శ్మశానం, సమాధులు, ఎడారి, మునుగుతుందని  అన్నారు. ఇల్లు ఎందుకు కట్టుకున్నాం. రాజధాని మార్చం అన్నారు. కియాకి వచ్చేసరికి అక్కడ పార్లమెంటు సభ్యులు మీ అంతు చూస్తాను, మీ సంగతి తేలుస్తానని విదేశీ ప్రతినిధులను పట్టుకొని  అన్నారు. వారు కంగారు పడతారు. ఆగస్ట్ 21న గౌతం రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు.  కియా మోటార్స్ వల్ల ఏడాదికి రూ.25వేల కోట్లు ప్రభుత్వంపై భారం పడుతోందన్నారు. మూడు నెలల్లో వారికి ఇచ్చే రాయితీలు రద్దు చేస్తామన్నారు. అక్కడ వారిని, అనుబంధ సంస్థల వారిని ఇబ్బందులు పెడుతున్నారని వార్తలు వస్తున్నాయి. కొన్ని అనుబంధ పరిశ్రమలు వెళ్లిపోయాయి. దానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. అక్కడ వత్తిడి, వేధింపులు ఎక్కువయ్యాయని మేం చెబుతున్నాం. వాస్తవం ఇది. ఈ నేపధ్యంలో ఈ వార్త వచ్చింది. నేపధ్యం ఇలా ఉన్నప్పుడు ఎవరిమీద అపవాదు వేస్తారు. గౌతం రెడ్డి గారిని మేం స్పందించమని చెప్పామా?.  మాదవ్ గారిని వెళ్లి బెదిరించమన్నామా? అనుబంధ పరిశ్రమలు తరలివెళ్లిపొమ్మన్నది ఎవరు? ఆ రోజు ఎంపీ గారు మాట్లాడినప్పుడు క్లారిటీ ఇచ్చారా? ఇప్పటికి కూడా ఫ్రాక్లింన్ టెంపుల్ కంపెనీని వైజాగ్ లో పెట్టిస్తామని గౌతం రెడ్డి గారు మాట్లాడారు. మళ్లీ నిన్న చంద్రబాబు నాయుడు గారు పెట్టించిన ఫేక్ కంపెనీ అంటారు. రాజశేఖర రెడ్డి గారు రాసిన ఉత్తరం ఆధారంగా కియా మోటార్స్ ని స్థాపించినట్లు చెప్పారు. నిన్న విజయసాయి రెడ్డి గారు మోదీ గారు దానిని ఇక్కడ పెట్టించారని చెప్పారు. పారిశ్రామికవేత్తలు సాధారణంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వం చేసే వ్యవహారాలు నేపధ్యం ఒకటైతే, సంస్థ ఇబ్బందుల... ఏ సంస్థ అయినా వెళ్లిపోయిన తరువాత మాట్లాడతారు. పీపీఏ వాళ్లు అలాగే మాట్లాడారు. ముఖ్యమంత్రి ఎటూ మాట్లాడరు. మంత్రులు మాట్లాడిన మాటలకు నెల రోజుల తరువాత కట్టుబడి ఉండటంలేదు. అనుబంధ పరిశ్రమలు అన్నీ తరలి వెళ్లిపోతున్నాయి. ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడంలేదు. ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ కంపెనీలో జగన్ గారు రూ.9 కోట్లు పెట్టుబడి పెట్టారు. అది మంచి కంపెనీ అనేగదా పెట్టుబడులు పెట్టింది. అది ఫేక్ కంపెనీ అని వాళ్లు పార్లమెంటులో చెబుతారు. ఉండవల్లి గారే కాదు కేంద్ర మంత్రి కూడా అదే చెప్పారు. దక్షిణాఫ్రికాలో కూడా సక్సెస్ కాలేదు. న్యాయస్థానాన్ని ఎలా తరలిస్తారో నాకు తెలియదు. హైకోర్టు ఏర్పాటు చేసిన తరువాత మార్పు చేసిన సందర్భంలేదు. ఆయన మూడు రాజధానుల  ఆలోచన ఒక్క రాష్ట్రంలోనే కాదు ప్రపంచం మొత్తానికి నచ్చడంలేదు. ఆ పార్టీ వారికి తప్ప. మార్చడానికి ఒక సహేతుకమైన కారణాన్ని చూపించలేకపోతున్నారు. అభివృద్ధి చెందిన విశాఖలో పెట్టి వికేంద్రీకరణ అంటే ఎలా? ఉండవల్లి, కేంద్ర మంత్రి, ఇతర పెద్దల మాటలు గమనంలోకి తీసుకోమని కోరుతున్నాను. చంద్రబాబు కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తారా?
దర్యాప్తు సంస్థలు, ముఖ్యంగా ఆర్థిక దర్యాప్తు సంస్థలు మరింత పారదర్శికంగా ఉండాలి. అనవసరమైన అనుమానాలకు, అపోహలకు తావులేకుండా ఉండాలి. రాజకీయపరమైన కక్షలతో చేస్తున్నారన్న భావన రాకూడదు.  
ఈద రాజశేఖర్ రెడ్డి – వైసీపీ
అంతర్జాతీయ సంస్థ కియా 1.1 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టి కార్ల పరిశ్రమ ఏర్పాటు చేసింది.  రాష్ట్రాభివృద్ధిలో భాగమైంది. అది తరలిపోతుందంటే నమ్మే పరిస్థితిలేదు. ఇది ఎక్కడకు వెళ్లదని అటు సంస్థ ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులు చెప్పారు. జగన్మోహన రెడ్డి గారు కూడా పారిశ్రామిక వేత్త. ఒక పరిశ్రమ స్థాపన, వ్యవహారాలు అన్నీ ఆయనకు తెలుసు. రాయిటర్స్ వంటి సంస్థ కూడా ఇలా రాయడం ఏంటా అని అనుకుంటున్నారు.
2017లో చంద్రబాబు గారి ప్రభుత్వంలో డిజిటల్ కంటెంట్ డెవలప్ మెంట్ పేరుతో బాలకృష్ణ గారి వియ్యంకుడు గీతం సంస్థ ద్వారా రాయిటర్స్ తో ఏక పక్షంగా ఒక ఒప్పందం చేసుకున్నారు. చంద్రబాబు గారు ఆయనకు ఉన్న సంబంధాలతో ఎంత పెద్దవారినైనా మేనేజ్ చేయగలరు. అది అందరికీ తెలిసిన విషయమే. రాయటర్స్ అనే సంస్థ వారికి ఉన్న సంబంధాలతో..... పారిశ్రామిక రంగం ప్రశాంతంగా ఉంటే జగన్మోహన రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఏదో ఒక రకంగా చిన్న నిప్పు పెట్టి వదిలేస్తే అదే రాజుకుంటుందన్న ఆలోచనతో చంద్రబాబు గారు ఉన్నట్లున్నారు. వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. పరిశ్రమ వెళ్లడం అనేది జరగనే జరగదు.
పవన్ ని గురించి మాట్లాడుకోవడ వేస్ట్. ఒక ఎంపీ అంతర్జాతీయ సంస్థని బెదిరిస్తారా? ఇది వక్రీకరణ. ఇండో-యుకే హెల్త కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వెయ్యి పడకల ఆస్పత్రి కట్టాలనుకుంది. చంద్రబాబు ప్రభుత్వోం మమ్మల్ని దారుణంగా బెదిరిస్తున్నారు, వారి ఫార్మాలిటీస్ ఇవ్వనిదే ఆస్పత్రి పెట్టుకోవడానికి వీలు లేదని బెదిరిదస్తున్నారని దాని ఎండి అజయ్ రంజన్ గుప్తా పత్రికా ముఖంగా తిట్టేసి  వెళ్లిపోయారు. ఏపీలో అవినీతి అంతా ఇంతా కాదు అని  మాకీ సంస్థ ఎండీ చెప్పారు. ప్రొటోకాల్ కోసం మాధవ్ మాట్లాడారు. అది బెదిరింపు కాదు. ఆఫ్ నాలెడ్జితో బురదపూసే కార్యక్రమం పెట్టుకోవద్దు. బెదిరింపుల్లో చంద్రబాబు నెంబర్ వన్.
పరిపాలన విభాగాలు విశాఖలో ఉంటే పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. విశాఖ హైదరాబాద్, బెంగుళూరుతో పోటీ పడుతుంది. అమరావతిలో కూడా కొన్ని డిపార్ట్ మెంట్లు ఉంటాయి. పరిపాలనకు అనుకూలంగా ఉండేవిధంగా విశాఖలో ఉంటాయి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పింది కరెక్ట్ కాదు. కొంతమందిలో ఆందోళన ఉన్న మాట నిజమే. తరువాత సర్ధుకుంటాయి. మూడు రాజధానులు 5 కోట్ల మంది కోరుతున్నారు. టీడీపీ వారు 23 నుంచి 2కి దిగిపోవద్దు.
మీడియా అత్యుత్సాహం వల్ల మసాలా రాస్తుంటారు. పారిశ్రామికవేత్తల ఇళ్లు సెర్చ్ చేయడం సర్వ సాధారణం. రాజకీయ నాయకుల ఇళ్లలో సెర్చ్ వేరు. ఐటీ వారికి సమాచారం ఉంటుంది. ఆర్టీఐ నుంచి సమాచారం తీసుకోవచ్చు.

కిలారు దిలీప్ – బీజేపీ
రాయిటర్స్ సంస్థని నేను నమ్ముతున్నాను. వ్యాపారం పెంచాలి. కానీ వ్యాపారులను భారత ప్రభుత్వం సరిగా ట్రీట్ చేయడంలేదు. పీపీఏలే రూ.22వేల కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఈ రోజు ఏమైందో మనకి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా ప్రకటనలపై వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారు. పోలవరం, అమరావతి, కియా మోటర్స్, ఎలక్ట్రిసిటీ, గ్రీన్ ప్రాజెక్స్  వంటి వాటిపై. వేల కోట్లు ఖర్చు పెట్టారు. వ్యాపాలన్నీ థిన్ మార్చిన్ మీద పని చేస్తున్నాయి. కియా మోటర్స్ వారు 1.1 బిలియన్ డాలర్స్ అంటే దాదాపు రూ.8వేల కోట్లు ఖర్చు పెట్టారు. భవనాలు నిర్మించారు. వేల మందికి ఉపాధి కల్పించారు. ఉత్పత్తి మొదలైంది. ఇంత పెట్టారు గదా ఎక్కడకి పారిపోతారని వారిని హెరాస్ చేయడం మంచిది కాదు. 75 శాతం స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం అంటేనే వారు సగం చచ్చిపోయి ఉంటారు. రాయితీలు కూడా వారికి సరిగా రావడంలేదని తెలిసింది. అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ 9.11 మీద అమెరికన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్లు 4 కూలిపోయాయి. వారం రోజుల తరువాత క్వీన్స్ లో ఒక అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానం ఎగిరే సమయంలో ఇంజన్ పడిపోయి కూలిపోయింది. దాని తరువాత అమెరికన్ ఎయిర్ లైన్స్ ఎక్కడం మానివేశారు. ఆ కంపెనీ ఒక నెల రోజుల్లోనే కూలిపోయే పరిస్థితి వచ్చింది. 2000 తరువాత సాఫ్ట్ వేర్ కంపెనీల బిజినెస్ లు పడిపోతుంటే లైవ్ లో ఉంచుకోవడానికి వేల మంది ఉద్యోగులను తీసివేశారు. టర్నోవర్ ని పెంచారు. మార్జిన్ 1 శాతం మాత్రమే ఉంటాయి. ఎప్పుడైతే చిన్న చిన్న కంపెనీలకు ప్రత్యేక హోదా ఇస్తే దేశంలోని కంపెనీలు వారు ఉన్నచోట నుంచి బిచానా ఎత్తివేసి అక్కడ పెట్టుకుంటారు. జీఎస్టీ, ఇతర టాక్స్ లు ఆపేస్తే, అవే వారి లాభాలుగా భావిస్తారు. వారు కట్టుకునే భవనాలు కూడా ఎప్పుడుపడితే అప్పుడు ఎక్కడికి బడితే అక్కడకు తీసుకువెళ్లే విధంగా(కిర్బి స్టక్చర్) కడతారు. కియా మోటర్స్ వారు ఎక్కడ నుంచో వచ్చి ఇక్కడ పెట్టినప్పుడు వారు పక్క రాష్ట్రానికి వెళ్లడం పెద్ద విషయం కాదు. ఇక్కడ ప్రొడక్షన్ తగ్గించుకొని రెండు, మూడేళ్లలో వెళ్లిపోవడాన్ని ఎవరూ ఆపడంలేదు.
రాయిటర్స్ కు నోటీస్ ఇవ్వడాన్ని పక్కన పెట్టి,  సీఎం  జగన్ విజయశాయి రెడ్డి వాళ్ల లాంటి వారిని వారి వద్దకు పంపి మీకేమైనా సమస్యలు ఉన్నాయా? చెప్పండి పరిష్కరిస్తాం అని చెప్పాలి. లేదా సీఎం ఆ మేనేజ్ మెంట్ ని పిలిచి మాట్లాలి. మీడియా డిబేట్ నడిచే సమయంలోనే ఇది జరగాలి. అంత పెద్ద సంస్థ వెళ్లిపోతే ఉద్యోగపరంగా, పన్నుల పరంగా ఎంత నష్టం. వైజాగ్ నుంచి కూడా 18 వేల మంది ఉద్యోగులు హైదరాబాద్ తరలి వెళ్లిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. పక్క రాష్ట్రానికే వెళుతున్నాయి. దేశం విడిచి వెళ్లడంలేదు గదా. అమరావతి కూడా విశాఖ వెళుతుంది. ఎక్కడికి వెళ్లడంలేదుకదా అని సోషల్ మీడియాలో వ్యంగ్యంగా రాస్తున్నారు. జగన్ గారు కీయా వారిని ఆహ్వానించాలి.
రాజధానిపై పార్లమెంట్ లో చాలా స్పష్టంగా చెప్పారు. అమరావతికి అనుకూలంగానే స్పందిస్తామని స్పష్టంగా చెప్పాం. 33 వేల ఎకరాలు రైతులు ఇచ్చిన తరువాత,  పది వేల కోట్లు గుమ్మరించిన తరువాత  ఆరు నెలల్లో 15 కోట్లు ఖర్చు పెడితే ప్రభుత్వ కార్యకలాపాలు బ్రహ్మాండంగానిర్వహించుకోవచ్చు.  ఇప్పుడు షిఫ్ట్ చేస్తానని అనడంలో అర్ధంలేదు. కాండియంట్ అనే కంపెనీ 2400 ఉద్యోగులతో బెంగుళూరు తరలివెళతామని, హెచ్ సీఎల్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ కంపెనీల వారు 18వేల ఉద్యోగులతో హైదరాబాద్ వెళ్లిపోతున్నట్లు రకరకాలుగా కథనాలు వస్తున్నాయి. వికేంద్రీకరణ అవుతుందో లేదో తెలియదు గానీ, కంపెనీలు వెళ్లవని అనుకోవడం తప్పు. మమతా బెనర్జీ వేధింపులు తట్టుకోలేక టాటా నానో కంపెనీ సిలిగూరు నుంచి గుజరాత్ వెళ్లిపోయింది. ఇండియన్సే తట్టుకోలేకపోతే విదేశీయులు ఎలా తట్టుకుంటారు. క్లోజడ్ ఛాప్టర్ రాజధాని మీద 3,4 ఏళ్లు చర్చ చేయాలా? ప్రభుత్వం మనసు పెట్టాలి. గతంలో చంద్రబాబు నాయుడు పెట్టిన ఖర్చు వ్యర్థమైపోతుంది. జగన్ గారు వైజాగ్ ఐటీ టవర్లు కట్టడానికి ఖర్చు చేస్తున్నారు. మేం ప్రజల తరపున ఉంటాం.  ఇటువంటి మార్పులను మేం అంగీకరించం. మేమంతా ఒకే మాటపై ఉంది. బీజేపీ కూడా ఓ రాజకీయ పార్టీ. ఒకటి అరా మాటలు తేడా ఉండవచ్చు. అమరావతి సింగిల్ కేపిటల్. మోడీ గారికి, అమిత్ షా గారికి చెప్పి చేస్తున్నామనే మాటలు రైతులు నమ్మవద్దని చెబుతున్నాను.
బుందేల్ ఖండ్ ప్యాకేజీ తీసుకున్నారు. ఏపీ వంటి రాష్ట్రం ఇటువంటి ప్యాకేజీ తీసుకోవడం ఏమిటని ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. ఈ రోజు లులూ గ్రూప్, సాఫ్టవేర్ కంపెనీలు వెల్లిపోవడం, కియా మోటర్స్ బెదిరంపులు ఎదుర్కోవడం – పోలవరం – నోటిఫై అయిన అమరావతిని ఫిష్ట్ చేయాలనుకోవడం వల్ల ఏపీ బ్రాండ్ దెబ్బతింది. ఈ విధంగా ఉంటే పరిశ్రమలు రావు.
ఇన్ కంమ్ టాక్స్ సమాచారం సమాచార హక్కు కింద అడిగితే ఇస్తారు. పబ్లిక్ అడగటంలేదు. అడిగితే ఇస్తారు.
వెంకటరెడ్డి – కాంగ్రెస్
న్యూస్ ఇస్తే గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తే ఎలా? కియా బహుళ జాతి సంస్థ అయినందున రాయిటర్ రాసింది. ప్రభుత్వ స్పందనకు అభినందిస్తున్నాను. బెదిరింపులు ఒక్క ఏపీలోనే కాదు. అన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షం, అధికార పక్షం రెండు చేస్తాయి. రాయితీలు, ఫీజిబిలిటీ, మ్యాన్ పవర్ వంటి వాటి మీద ఆధారపడి వెళతారు. ఎక్కవ రాయితీలు ఇస్తే వెళతారు. మన ఏపీలో ఇంటిలిజన్స్ వ్యవస్థ బలంగా ఉంది. వారి వద్ద పక్కా సమాచారం ఉంటుంది. కియా వల్ల రాష్ట్రానికి ఉపాధి తప్ప అదనంగా ఏమీ రాదు. ముఖ్యంగా అనుబంధ పరిశ్రమల ద్వారా మాత్రమే రాష్ట్రానికి ఆదాయం ఎక్కవ వస్తుంది. ఎఫ్.డీ.ఏల వల్ల కేంద్రానికి కూడా పెద్దగా ఆదాయం రాదు. అనుబంధ పరిశ్రమలు వెళ్లిపోకుండా చూడాలి. పెట్టుబడి ఎక్కువైతే వెళ్లదు. తక్కువయితే వెళతాయి అనేది కరెక్ట్ కాదు. పారిశ్రామికీకరణలో రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. తమిళనాడు నిజం చెబుతుందని అనుకోలేం. గోరంట్ల మాధవ్ వ్యవహారం పెద్ద విషయం కాదు. అందువల్ల కియా వెళ్లిపోతుందనేది రాంగ్. అన్ని కంపెనీలు అన్ని పార్టీకు ముడుపులు ఇస్తాయి.
దేశానికి, రాష్ట్రానికి రెవెన్యూ జనరేట్ చేయడానికి ఒక సిటీ ఉంటుంది. దేశానికి ముంబై, తెలంగాణకు హైదరాబాద్, తమిళనాడుకు చెన్నై లా. అటువంటి నగరం నిర్మించుకోవాలి. ఒక కమర్షియల్ కేపిటల్ ని అభివృద్ధి చేయాలి.  రాష్ట్రానికి అది లేదు. ఉండవల్లి గారు మాట్లాడినదానికి క్లారిటీ లేదు. ఆయన ఉదయం విభజన చట్టం చెల్లదంటారు. సాయంత్రం అందులోని ఫలితాలు కావాలంటారు.  
ఇన్ కం టాక్స్ విభాగంలో దాని అనే పదం లేదు. సర్వేకి, సెర్చ్ కి వెళతారు. ఐటీ అధికారులు ఎందుకు వెళతారో తెలియదు. ఎక్కువ సర్వేలు జరుగుతున్నాయి. ఆస్తులు అటాచ్ చేస్తే మనకి తెలిసిపోతుంది.
రఫీ – విశ్లేషకులు
 కియా మోటార్స్ వ్యవహారం దావాలనంలా వ్యాపించింది. ప్రతిష్టాత్మక రాయిటర్స్ సంస్థ రాసింది. కొన్ని ఆధారాలు లేకుండా రాయరు. కియా వాళ్లు పూర్తిగా ఖండించలేదు. ఇక్కడే ఉంటామని చెప్పలేదు. తమిళనాడుతో జరిపిన చర్చలు ఫలప్రదం కాలేదేమో. ఒక గాలి వార్తను చూసుకొని ఇంత తొందరగా రండిరండి జలంధర్ కు అని  పంజాబ్ ప్రభుత్వం స్పందిస్తుందా? దీని వెనుక ఏదో జరుగుతోంది. రాష్ట్రం నుంచి పలు పరిశ్రమలు వెళ్లిపోయాయని దుమారం చెలరేగింది. ఆదానికి డేటా సెంటర్ కి స్థలంకేటాయించడం, వారు వదులుకొని వెళ్లిపోయింది. ఆ క్రమంలో ఇటువంటి వార్త రావడం రాష్ట్ర ప్రజలను మొత్తం కదిలించింది. గాలి వార్త అయితే నిన్నే ఆగేది. ఈ రోజు కూడా అదే జరుగుతోంది. వారం రోజులు చూడాలి. వెళ్లకపోతే రాయిటర్స్ పైన, చంద్రబాబు గారిపైన కేసులు పెట్టాలి. పార్లమెంటులో చర్చ జరిగింది. ఇంత స్థాయిలో చర్చ జరిగేటప్పుడు రాయిటర్స్ నుంచి స్పందన రాలేదు. అనుబంధ పరిశ్రమలను వెళ్లకుండా ప్రభుత్వం ఆపగలిగిందా?  రాయిటర్స్ కు లెటర్ రాయాలి.
కేంద్రం పరిపాలనకు సంబంధించి స్పష్టంగా ఉన్నారు. బ్లూ ప్రింట్ కూడా ఇచ్చారు. అక్కడ ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. సీఎం గారు మాట్లాడిన దానిని బట్టి భవిష్యత్ లో అమరావతిలో శాసనసభ కూడా ఉండదు. ఇక్కడ పనులు ఆపేసింది. బడ్జెట్ సమావేశాలు అక్కడ పెడతారన్నట్లు సీఎం గారు మాట్లాడారు. కనీసం ఏడాది అయినా గడవనిదే ప్రభుత్వాన్ని విమర్శించడం మంచిదికాదన్నారు. ప్రజలు కోరుతున్నదే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పారు. అమరావతిలో మహానగరం నిర్మాణాన్ని ఆయన స్వాగతించారు. అన్ని తీసుకువెళ్లి విశాఖలో పెడితే అది వికేంద్రీకరణ ఎలా అవుతుంది. ఐటీ దాడులు అన్ని పథకం ప్రకారం, కక్ష సాధింపుగా జరుగుతున్నాయి. అధికారుల ఇళ్లలో జరిగిన దాడుల్లో బంగారం, డబ్బు అన్నీ చూపుతారు. రాజకీయ నాయకులపై దాడుల్లో ఒక్కటి బయటకు చూపించలేదు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...