Feb 12, 2020

ఆమ్ ఆద్మీ విజయం – మండలి సెలెక్ట్ కమిటీ - పీఎం, సీఎం కలయిక

 24X7 -తేదీ: 12.02.2020 బుధవారం ఉదయం 7.30 గం.
అంశాలు :  ఆమ్ ఆద్మీ విజయం – మండలి సెలెక్ట్ కమిటీ – పీఎంని కలవనున్న సీఎం
యాంకర్ :  కృష్ణ సాయి

బ్రహ్మం చౌదరి – టీడీపీ
కేజ్రీవాల్ గారికి శుభాకాంక్షలు. నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలకు రాజకీయ వ్యూహాలలో చాలా తేడా ఉంటుంది. నీరు, మహిళా రక్షణ, విద్య,వైద్యం, ప్రచారంలో జాగ్రత్తలు, హుందాగా వ్యవహరించారు. ఒక సందర్భంలో ప్రకాష్ జవదేకర్ గారు ఉగ్రవాదులని సంబోధించారు. మోడీ గారు దేశ ప్రధాని మోడీ గారు అని సంబోధించారు. ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా వారు చేసిన సంక్షేమ కార్యక్రమాలే ప్రచారం చేశారు. భవిష్యత్ ప్రాంతీయ పార్టీలదే.
సెలెక్ట్ కమిటీ :  అమరావతిని విశాఖపట్నం పోకుండా నిలుపుతాం.  అసెంబ్లీలో స్పీకర్ ది తుది నిర్ణయం, మండలిలో చైర్మన్ ది తుది నిర్ణయం. ఎక్కడ ఏ రాజకీయ పార్టీకి మెజార్టీ ఉంటుందో వారి నిర్ణయాలను చైర్మన్ పాటించవలసి ఉంటుంది. అసెంబ్లీలో వైసీపీకి, మండలిలో టీడీపీకి మెజార్టీ ఉంది. కౌన్సిల్ లో బీజేపీ, పీడీఎఫ్ సభ్యులు కూడా అమరావతిని తరలించవద్దన్నారు. అవతల వైసీపీ వారు గొడవ చేస్తున్నా చర్చల్లో వారు అమరావతిని మార్చవద్దన్నారు. ముఖ్యమంత్రితో సహా 22 మంది మంత్రులు వచ్చి,      కౌన్సిల్ కు సంబంధంలేని విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ప్రభాకర రెడ్డి వంటి వారు వచ్చి గేలరీలలో కూర్చున్నారు. అక్కడ కూర్చోవడం తప్పు కాదు. అయితే వారు హద్దులు దాటి ప్రవర్తించారు. చైర్మన్ గారిని భయాందోలనకు గురిచేశారు. టీడీపీ సభ్యులపై దాడులు చేయబోయారు. చైర్మన్ విచక్షాధికారంతో చైర్మన్ ఒక నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఒకటి బిల్లు సాప్ కావడం, రెండు తిరస్కరించడం, మూడు సెలెక్ట్ కమిటీకి పంపడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ కమిటీకి పంపారు. దానికి చైర్మన్ గా అధికార పార్టీవారే ఉంటారు. పేర్లు అడిగితే సహకరించరు. మిగతావారి పేర్లు కూడా తీసుకోవద్దని అసెంబ్లీ కార్యదర్శికి బెదిరింపులు. ఈ కేసు కోర్టుకు వెళ్లింది. అక్కడ ఈ బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లినట్లు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఇప్పుడు 14 రోజులు సమయం అయిపోయిందని అంటున్నారు. 3 నెలల సమయం ఉంటుంది. దీనిపై ఎప్పుడైనా సరే చైర్మన్ మళ్లీ నిర్ణయం తీసుకోవచ్చు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ గారికి ఎన్ని హక్కులు ఉన్నాయో ఇక్కడ చైర్మన్ గారికి కూడా అన్ని అధికారాలు ఉంటాయి. ఇక్కడ రెండో థాట్ లేదు. సెలెక్ట్  కమిటీ నిర్ణయమే ఫైనల్. కేసు హైకోర్టులో ఉంది. ఓపిక లేకుండా వైసీసీ వ్యవహరిస్తోంది. సీఎస్ గారి మౌకిక ఆదేశాలు లేకుండా, హైకోర్టు చెప్పినా కూడా, రాజ్యాంగ బద్దమైన ఏ సంస్థపైనా నమ్మకంలేదు. పాటించాలన్న గౌరవంలేదు. కర్నూలు, విశాఖకు తరలించడానికి రెండు జీఓలు తెచ్చారు. దానిపై సంతకం పెట్టేది నేను అని సీఎస్ గారు చెబుతున్నారు. ప్రవీణ్ ప్రకాష్ గారు జీఏడీలో కూర్చొని సీఎస్ గారిని బేకాతరు చేస్తున్నారు. దీనిని ఎవరూ హర్షంచరు. ఉమ్మారెడ్డి మాటలను రాష్ట్రప్రజలు చూస్తున్నారు. హడావుడిగా విశాఖకు తరలించడాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతించే పరిస్థితిలో లేరు. రాజధాని అంటే శాసనసభ, మండలి, సచివాలయం గతంలో జగన్మోహన రెడ్డి గారు చెప్పారు. 30 వేల ఎకరాలు ఇక్కడ అందుబాటులో ఉన్నందున ఇక్కడే పెట్టమని అన్నారు. 13 జిల్లాల చిన్న రాష్ట్రం మేం సహకరిస్తున్నాం అని చెప్పారు. దానికి ఎందుకు మీరు కట్టుబడి ఉండరు? అధికారం లేప్పుడు ఒక మాట, ఉన్నప్పుడు ఒక మాట ఎందుకు?    నగరాలు అభివృద్ధి చేయండి. ఉత్తరాంధ్రని, రాయలసీమని, ప్రకాశం జిల్లాని అభివృద్ధి చేయండి. అమరావతి రాజధానిగా ఇక్కడే కొనసాగుతుందని చెప్పారు. మా నాయకుడు కూడా ఇక్కడే ఇల్లు కట్టుకున్నారని ఉమ్మారెడ్డి గారు చెప్పారు. జగన్ గారు మాట తప్పారు, మడమ తిప్పారు.
జేఏసీ సీఎంని కలిశారా అంటున్నారు. మీరు సెక్రటేరియేట్ కి వెళ్లేటప్పుడు గ్రామాలలోని రైతులను ఇళ్లలో నుంచి బయటకు రానివ్వడంలేదు. నెట్ లు అడ్డం పెట్టుకుంటన్నారు. అరెస్ట్ చేస్తున్నారు. ముందస్తు జైల్లో పెడుతున్నారు. సెక్రటేరియేట్ కు వెళ్లాలంటే ఎన్ని ఆంక్షలు ఉన్నాయో చూశారు. వాళ్లు దేశంలో ఒక రాజ్యాంగం ఉన్నట్లు ఇక్కడ జగన్ రాజ్యాంగం ఉన్నట్లు మాట్లాడుతున్నారు. 29 గ్రామాలంటున్నారు. 5 కోట్ల ఆంధ్ర ప్రజల కోసం, 16వేల గ్రామాల కోసం భూములు ఇచ్చారు. అక్కడ మిగిలిన పదివేల ఎకరాలు ఎవరిది. ఆ 29 గ్రామాల వారిదా? సీఆర్డీఏ చట్టం ప్రకారం వారికి ఇవ్వవలసిన భూములు ఇచ్చివేశారు. రాజధాని మునుగుతుందన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటారు. రకరకాల సాకులు చెబుతున్నారు. 4వేల ఎకరాలు . ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటున్నారు. దానిని ఎటాచ్ చేయండి. మూడు రాజధానులు అని మ్యానిఫెస్టోలో పెట్టారా? మ్యానిఫెస్టో భగద్గీత, ఖురాన్, బైబిల్ అన్నారు.  
పీఎంని కలవనున్న సీఎం: ముఖ్యమంత్రి హోదాలో పీఎంని, కేసీఆర్ ని కలిసినా తప్పులేదు. కలిసిన అంశం, మాట్లాడిన విషయాలు ప్రజలకు వివరించవలసిన బాధ్యత సీఎం పైన ఉంది. అయితే ఈ 8 నెలల కాలంలో ప్రధానిని ఎప్పుడు కలిసినా ఆయన ఎందుకు కలిసింది, ఏం మాట్లాడింది ఎప్పుడూ వివరించలేదు. సీఎం కాకపోయినా, సలహాదారులు గానీ తెలయజేయాలి. పోలవరం తీసుకురండి, ప్రత్యేక హోదా సాధించండి. అన్ని విషయాలలో టీడీపీ సహకరిస్తుంది. ప్రత్యేక హోదాకు మించి నిధులు వస్తాయని ఆశించి చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీకి ఒప్పుకున్నారు. అప్పుడు దీనిని చట్టం చేమని చంద్రబాబు గారు అడిగారు.  చట్టం చేయకపోగా, అమలు కూడా లేదు . దాంతో టీడీపీ బటయకు వచ్చి పోరాడింది.  ఎంపీలను గెలిపించండి, ప్రత్యేక హోదా కోసం పోరాడతామని చెప్పారు. గెలిపిస్తే మీరు ఏం చేశారు. పోరాటం చేయలేదు. గెలిచిన తరువాత మొదటి సారి ప్రధానిని కలిసి వారికి సంపూర్ణ మెజార్టీ ఉంది, ప్రత్యేక హోదా అడగలేని పరిస్థితి ఉందని చెప్పారు. విభజన చట్టంలోని ఏ ఒక్క అంశం కూడా ఈ 8 నెలలలో అమలు కాలేదు. తనపై ఉన్న కేసుల కోసం ఢిల్లీ వెళ్లి రావడం కాదు. అధికారులను ప్రభావితం చేయడం కోసం ఇవన్నీ చేస్తున్నారు. ఆంధ్రుల కోసం  మీరు పోరాడితే టీడీపీ కూడా సహకరిస్తుంది.
ప్యాకేజీ ప్రకటించారు. ఎస్టీవీ అంటారు ఏదైనా సరే అమలు చేయండి మాకు కావలసింది నిధులు. దేశంలో ఏపీని ప్రత్యేకంగా చూడవలసిన అవసరం ఉంది. 8 నెలల్లో ఏం సాధించారు? ప్యాకేజీ కోసం ఆవు కథ చెప్పవద్దు. మీరు ఏం చేశారో చెప్పండి. చంద్రబాబు నాయుడు గారిపై ఏ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఉందో చెప్పమనంది. ఆరోపణ కాదు, నిరూపించమనండి. అది పెద్ద పనికాదు. ఆన్ లైన్  లో ఉంటాయి గదా. సబ్జెక్ట్ ని డీవీయేట్ అవవద్దు. ఓటుకు నోటు ఎఫ్ఐఆర్ చూపించమనండి.

రవిచంద్రా రెడ్డి – వైసీసీ
ప్రజల కోరికలు స్పష్టం. పార్లమెంటుకు 7 సీట్లు బీజేపీని గెలిపించారు. 62 సీట్లు (గత ఎన్నికల్లో 67). 53.6 శాతం ఓట్లతో గొప్ప గెలుపు. ఏపీలో కూడా 50 శాతానికి మించి ఓటింగ్. ప్రాంతీయ పార్టీల పాత్ర పెరిగింది. పని చేశారు ఫలితాలు సాధించారు.
అమరావతి ఎక్కడకు తరలిపోదు. శాసనరాజధానిగా ఉంటుంది. వైసీపీకి 151 సీట్లు ఇచ్చింది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయమని, టీడీపీ నాయకుల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయమని కాదు. ప్రజలకు నచ్చేవిధంగా, వారికి మేలు జరిగే విధంగా చేయాలనుకుంటున్నాం. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా చేయాలనుకున్నాం. జగన్ గారు ఒక మాట చెబితే ఖచ్చితంగా అమలయి తీరుతుంది.  ఖచ్చితంగా మూడు రాజధానులు ఏర్పడి తీరుతాయి. అమరాతి రైతులకు న్యాయం చేస్తాం. 5 కోట్ల ఆంధ్రులకు సంబంధించిన అంశం అని చెప్పడం ధర్మం కాదు. 13 జిల్లాల్లో 16,452 గ్రామాలు ఉన్నాయి. రాజధానికి 29 గ్రామాల రైతులు భూములు ఇచ్చారు. 3 నుంచి 5 గ్రామాల వారే ఆందోళన చేస్తున్నారు.  ఎవరినీ తక్కువ చేయం. ప్రతి రైతుకు న్యాయం జరుగుతుంది. రైతు కూలీల పెన్షన్ పెంచారు. 3 లక్షల మందికి లబ్ది చేకూరుతుంది. జేఏసీ ఒక్కసారి కూడా సీఎం గారిని కలవడానికి రాలేదు. హైదరాబాద్ ఫిల్మి ఛాంబర్ కు, ఢిల్లీకి  వెళ్లడం, వార్తలలో ఉండటానికి ప్రయత్నం. చంద్రబాబు నాయుడు గారి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కాపాడటం కోసం.
సెలెక్ట్ కమిటీ: మండలి విషయంలో  చైర్మన్ గారు ఆ రోజు ఏ రూల్ ప్రకారం కూడా దీనిని సెలెక్ట్ కమిటీకి పంపించే అవకాశం లేదని చెప్పారు.  దానికి పూర్తి విరుద్ధంగా రూల్ నెంబర్ 154 ప్రకారం విచక్షణతో నిర్ణయం తీసుకున్నారు. అది నచ్చక వైసీపీ మండలి రద్దుకు వెళ్లింది. సెలెక్ట్ కమిటీకి వెళ్లాలంటే ఓటింగ్ జరగాలి. డివిజన్ చేసి ఉండాలి.  ప్రస్తుతం మండలి రద్దయింది. ఫోర్స్ లో లేదు. త్రిశంకులో ఉంది. రాష్ట్రంలో లేదు. కేంద్రం ఇంకా రద్దు చేయలేదు. వారు తీసుకున్న ఏ నిర్ణయానికి శాంసిటీలేదు. 14 రోజులు కూడా గడిచిపోయింది. ఈ బిల్లులను కాలయాపన చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒన్ థర్డ్ మెజార్టీతో అసెంబ్లీ మండలి రద్దు చేసిన తరువాత మండలి సమావేశాలు జరగవు.  పార్లమెంటు ఆమోదించిన తరువాత మండలి రద్దవుతుంది. అప్పటి వరకు మండలి సమావేశాలు ఉండవు. ఇది రాజ్యాంగ పరిధిలోని అంశం. ప్రభుత్వం పరిశీలిస్తోంది. మూడు రాజధానులు ఏర్పడతాయి. ప్రజలు  ఎవరి మాటలు నమ్మవద్దు. భ్రమల్లో ఉండవద్దు. నవనగరాలు ఒకేచోట కట్టి 13 జిల్లాల రెవెన్యూ ఒక ప్రాంతానికి దోచిపెట్టడానికి మేం సిద్ధంగా లేం. మూడు ప్రాంతాలకు న్యాయం చేస్తాం.

పీఎంని కలవనున్న సీఎం: సీఎం గారు ఒక వారం ముందు పీఎం గారికి ఒక లేఖ రాశారు. రాష్ట్రానికి రావలసిన అంశాలు ఉన్నాయి అందులో. ప్రధానితో నేరుగా చర్చించేందుకు సీఎం వెళ్లారు. 3 రాజధానులు, మండలి అంశాలు ఉండవచ్చు. ప్రత్యేక హోదా అంశం కూడా ఉంటుంది. పార్లమెంటులో పీఎం గారు ఏపీకి సానుకూలంగా మాట్లాడారు. పీఎం గారికి, సీఎం గారికి మధ్య చక్కటి సమన్వయం ఉంది. ప్రత్యేక హోదా సాధించే క్రమంలో ఉన్నాం. ఏపీకి ప్రత్యేక హోదా అవసరంలేదని చంద్రబాబు గారు లేఖ రాశారు. కడప స్టీల్ ఫ్యాక్టరీకి చర్యలు తీసుకున్నాం. రామయ్యపట్నం నిబంధనలు ప్రకారం పరిధి కుదించారు. ఇటువంటి అంశాలను సాధించుకుంటాం. మనం రోజు తిడితే పెడతారా? అందువల్ల కేంద్రాన్ని మెప్పించాలి. ప్యాకేజీ మాకు నచ్చలేదు. అందువల్లే స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోలేదు.
ఎస్పీవి ద్వారా వచ్చే డబ్బు మాకు వద్దు. ప్రధాన మంత్రి మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ రోజు బీజేపీ కార్యకర్తలు ఆనందిస్తారు.  


శ్రీరామ్ – బీజేపీ
కేజ్రీవాల్ గారికి అభినందనలు. బీజేపీ గెలిచి ఉంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ అయిపోయాయని వాదించేవారు. సంతోషం. విశ్లేషణ చేసుకోవలసి ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని సీట్లు మాకే ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి పట్టంగట్టారు. రాష్ట్ర ఎన్నికల్లో ఆప్ కి అధికారం ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ గెలుస్తోంది. ఫ్రీ పాలసీలు ఆప్ ని గెలిపించాయి. కాంగ్రెస్ ఆత్మహత్యా సదృశ్యమైన నిర్ణయం తీసుకుంది. వారి ఓట్లు ఆప్ కు మళ్లించారు. ముస్లింలు గంపగుత్తంగా ఓట్లు ఆప్ కు వేశారు. ఇక్కడ వైసీపీ డబ్బులు ఇస్తుంది. అక్కడ ప్రొడక్టివిటీ లింక్ డ్ పథకాలకు ప్రాధాన్యత ఇచ్చారు. మొహల్లా క్లినిక్, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి వంటివి ప్రభావం చూపించాయి. ఇవి మంచి ఉదాహరణలుగా భావించవచ్చు.  ఫ్రీ పాలసీలు మంచిదికాదు.
సెలెక్ట్ కమిటీ :  ఇందులో రాజకీయ పరమైన కోణం కంటే కూడా.... చైర్మన్ గారు ఇన్వాల్వ్ అయినందున అది రాజకీయ కోణం కాదు. వీరు ఎందుకు ఇంత పట్టుపడుతున్నారు?  ఇది రాజ్యాంగపరమైన అంశంగా మారుతుంది. చైర్మన్ కు విచక్షణాధికారం ఉంది. సెలెక్ట్ కమిటీకి మా మాధవ్ గారి పేరు పంపాం.  సెలెక్ట్ కమిటీలో ఉందని హైకోర్టుకు చెప్పారు. ఛైర్మన్ పదవిని తగ్గించాల్సిన అవసరంలేదు. రెండు, మూడు నెలల్లో ఈ విషయం తేలిపోంది. మండలి రద్దయిపోతే .... రాజ్యాంగపరమైన వ్యవస్థని మనమే కించపరుచుకుంటే అది ప్రభుత్వానికి కూడా ప్రతిష్టను తీసుకురాదు. ప్రభుత్వం ఆచన చేయాలి. చైర్మన్ విచక్షణాధికారాన్ని ఎవరూ ప్రశ్నించే అధికారంలేదు. వైసీపీ ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకోవాలి.
పీఎంని కలవనున్న సీఎం: రాష్ట్రానికి కావలసి అంశాల్లో సీఎం ప్రయత్నం చేయాలి. పోలవరానికి నిధులు ఇస్తుంది. రాష్ట్రానికి రావలసినవి ఇస్తుంది. విభజన హామీలు అమలు విషయంలో రాష్ట్రం కేంద్రంపై వత్తిడి తేవలసిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా గతించిన అంశం. ప్యాకేజీని సాధించుకోవడం మంచిది. గతంలో టీడీపీ వారు పోరడతాం డబ్బు తీసుకురాం అన్నారు. ఇప్పుడు వైసీపీ వారు కేంద్రంతో లాబియింగ్ చేస్తాం డబ్బు మాత్రం తీసుకురాం అంటున్నారు. 8 నెలలు గడిచిపోయింది. ఏం సాధించారు.? ముందు రాష్ట్రానికి వచ్చే డబ్బు తీసుకురండి.
విక్రమం పోలా – విశ్లేషకులు
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అప్రస్తుతం. ప్రజా స్పందన, రాజకీయ పార్టీలు నేర్చుకోవలసింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకాదు, కామ్ ఆద్మీపార్టీ అని నిరూపించింది. పని చేసే ప్రభుత్వం. బీజేపీ ప్రచారంలోకి తీసుకువచ్చిన అంశాలపైకి వెళ్లకుండా దైనందిక జీవితంలో ప్రజలకు కావలసిన అంశాలపై దృష్టిపెట్టారు. ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు పరిణతితో ఓటు వేశారు. కేజ్రీవాలే కాదు అభ్యర్థులు కూడా నిజాయితీపరులను ఎంపిక చేశారు. ఆయన జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టకుండా, స్థానిక అంశాలపై మాత్రమే దృష్టి పెట్టారు. విద్య, ఆరోగ్యంపై ఖర్చు ఫ్రీ కాదు. ఢిల్లీలో బీజేపీ నాయకత్వం బలహీనంగా ఉంది. బీజేపీలో మోడీ, అమిత్ షా తప్ప ఎవరినీ ఎదగనివ్వడంలేదు.

సెలెక్ట్ కమిటీ :  ధర్మ మీమాంస వచ్చింది. నిబంధనలు గొప్పవా, విచక్షణాధికారాలు గొప్పవా అనేది తేలవలసి ఉంది. నిబంధనలకు విరుద్ధమైనప్పటికి కూడా నా విచక్షణాధికారాలను నేను ఉపయోగిస్తున్నానని చైర్మన్ గారు చెప్పారు. ఎవరి వాదన వారికి ఉంది. చైర్మన్ ఆదేశాలను కాదనే అధికారం కార్యదర్శికి ఉందా? ఇందులో రాజ్యాంగపర అంశాలు ఇమిడి ఉన్నాయి.
మండలి రద్దయిపోయిందనేది వాస్తవం కాదు. పార్లమెంటు ఆమోదం పొందాలి. రాష్ట్రపతి ర్యాటిఫై చేయాలి. ఖచ్ఛితంగా మండలి కూడా సమావేశం అవుతుంది. ఆ ప్రక్రియ సాగుతోంది.

పీఎంని కలవనున్న సీఎం: ఇందులో రాజకీయ ప్రాధాన్యం ఉంది. ప్యాకేజీని ఒప్పుకుంటే హోదాని వదిలివేసినట్లు అవుతుంది. రాష్ట్రానికి రావలసినవి చాలా ఉన్నాయి. 3 రాజధానుల అంశంలో సీఎం చాలా దూకుడుగా ఉన్నారు. దానికి ఆమోద ముద్ర వేయించుకోవలసిన అవసరం ఉంది.  మండలి రద్దు బిల్లు ఇంకా పార్లమెంటుకు రాలేదు. దాని గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర బిజేపీ, కేంద్ర బీజేపీ వైఖరి వేరువేరుగా ఉన్నాయి. బీజేపీ, జనసేన కలిసిన తరువాత వైసీపీ మీద దూకుడు పెంచారు. టీడీపీ నేతలపై ఐటీ దాడులు, ఇంటిలిజెన్స్ ఐజీ వ్యవహారం ... వంటి వాటిని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంది.


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...