Feb 17, 2020

రాజధాని గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు


గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాలలోని  అర్హులైన నిరుపేదలకు రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల పరిధిలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని జిల్లా అధికార యంత్రాంగం ప్రతిపానలు సిద్ధం చేసింది. మంగళగిరి ప్రాంతంలోని వారికి నిడమర్రు, నవులూరు పరిధిలో ఇవ్వనున్నారు. ఈ మూడు మండలాల పరిధిలో 20వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రతిపాదించారు. దుగ్గిరాల, పెదకాకాని మండలాలలోని వారికి కూడా రాజధాని ప్రాంతంలోనే ఇచ్చే అంశం పరిశీలిస్తున్నట్లు జిల్లా సంయుక్త పాలనాధికారి దినేష్ కుమార్ చెప్పారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...