Feb 7, 2020

3 రాజధానులకు నో - ‘హిందూ’ సర్వేలో జనాభిప్రాయం


రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటును 83 శాతం మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న ఈ నిర్ణయం తెలివైనదేనా అని ది హిందూ బిజినెస్‌ లైన్‌ అనే ఆంగ్ల వెబ్‌సైట్‌ సర్వే చేపట్టింది. డిసెంబరు 28న ఈ ప్రక్రియ మొదలుపెట్టగా.. గురువారం రాత్రి వరకు 3,18,348 మంది దీనిపై స్పందించారు. వీరిలో 83 మంది ప్రజలు జగన్‌ నిర్ణయం తెలివైనది కాదని తేల్చిచెప్పగా.. మంచిదేనని 16శాతం మంది పేర్కొన్నారు. టుడేస్‌ పోల్‌ శీర్షికతో ఈ వెబ్‌సైట్‌ ఎప్పటికప్పుడు ఒక్కో అంశంపై సర్వే నిర్వహిస్తుంటుంది.



No comments:

Post a Comment

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...