Feb 10, 2020

151 గంటల నిరాహారదీక్షకు పోలీసులు భగ్నం

తుళ్లూరు మండలం వెలగపూడిలో రాజధానిని అమరావతి నుండి తరలించవద్దు అంటూ 5 రోజులుగా 151 గంటలు నిరాహారదీక్ష చేపట్టి దీక్ష చేస్తున్న ఇద్దరు యువ రైతులు బొర్రా రవిచంద్ర, తాడికొండ శ్రీకర్‌ల దీక్షను ఆదివారం అర్థరాత్రి పోలీసులు భగ్నం చేశారు. తుళ్ళూరు ప్రభుత్వ వైద్యశాలకు చెందిన డాక్టర్లు వెలగపూడిలోని దీక్షా శిబిరానికి వచ్చి ఇద్దరి యువకులకు వైద్య పరీక్షలు నిర్వహించగా వారికి షుగర్ లెవల్స్ పడిపోయినట్లు గుర్తించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 112  గంటలుగా దీక్షను కొనసాగిస్తున్న వారిని పోలీసులు బలవంతంగా గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే తాము ఆసుపత్రిలోనే దీక్షను కొనసాగిస్తామని యువ రైతులు చెప్పారు.
రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దని  ఈ ఇద్దరు ఈ నెల 5న 151 గంటల నిరాహాదీక్ష ప్రారంభించారు.  ఒక్కో గంట, ఒక్కో ఎమ్మెల్యేకు చొప్పున 151 గంటలు చేస్తున్నట్లు వారు తెలిపారు.  

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...