Feb 3, 2020

సీఆర్డీఏ రద్దు బిల్లును సస్పెండ్‌ చేయాలని హైకోర్టులో రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు



21.01.2020:  ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాథికార సంస్థ (ఏపీసీఆర్డీయే) చట్టం-2014ను రద్దు చేస్తూ ఏపీ శాసనసభ ఆమోదించిన బిల్లును సస్పెండ్‌ చేయాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి.
v సీఆర్డీయే చట్టం-2014ను రద్దు చేస్తూ బిల్లు ప్రవేశపెట్టడం చట్టవిరుద్ధమని, ఏకపక్షమని విజయవాడకు చెందిన శీలం మురళీధరరెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు.
v అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా మరో మార్గాన్ని వెతుక్కోవడమంటే రాజధాని రైతుల న్యాయబద్ధమైన ఆకాంక్షను ఉల్లంఘించడమే.
v ల్యాండ్‌పూలింగ్‌ స్కీమ్‌ కింద భూములిచ్చిన రైతులకు తగిన న్యాయం చేయాలి.
v రాజధానిలో నిలిపివేసిన నిర్మాణ పనులను పునఃప్రారంభించాలి.
v సీఆర్డీయే చట్టం రద్దుకు సంబంధించిన బిల్లు అమలు కాకుండా నిలుపుదల చేయాలి. ఆ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టుని అభ్యర్థించారు.
v గతంలో జరిగిన ఒప్పందం మేరకు రైతులకు ప్లాట్లను అభివృద్ధిచేసి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
v ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రభుత్వ యంత్రాంగం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోంది. మంత్రి వర్గం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది.
v రాజధాని మార్చాలంటే కేంద్రప్రభుత్వాన్ని సంప్రదించాలి.
v ప్రజాధనంతో 50 శాతం పనులు పూర్తయిన నేపథ్యంలో సీఆర్డీయే చట్టం రద్దు చేయడం తగదన్నారు.
v చట్టం రద్దు బిల్లును వ్యతిరేకిస్తూ మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది.
హైకోర్టు ధర్మాసనం
v 23.01.2020: రాజధాని అమరావతి వ్యాజ్యాలపై  విచారణ కోసం హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరి నేతృత్వంలో  జస్టిస్‌ శేషసాయి, జస్టిస్‌ సత్యనారాయణలతో త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటైంది. అమరావతి, సీఆర్డీఏ అంశాలతో ముడిపడిన పిటిషన్లను ఈ ధర్మాసనం  విచారిస్తుంది.
v 8 పిటిషన్లపై విచారణ:  సీఆర్‌డీఏ చట్టం రద్దు, పాలనా వికేంద్రీకరణ - సమగ్రాభివృద్ధి బిల్లులను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లతోపాటు రాజధాని తరలింపు ప్రక్రియకు సంబంధించిన వివిధ అంశాలను వ్యతిరేకిస్తూ దాఖలైన మొత్తం 8 పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.
త్రిసభ్య ధర్మాసనం హెచ్చరిక
v రాజధాని మార్పు పేరిట ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై తదుపరి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశారు.
v తమ ఆదేశాలను అతిక్రమిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. తమ మాటను ధిక్కరిస్తే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదు. బాధ్యులైన వారి నుంచి ఖర్చు వసూలు చేయిస్తాం.
v పాలనా వికేంద్రీకరణ - సమగ్రాభివృద్ధి, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్లు దాఖలు చేయాలి. శాసనసభ, శాసన మండలి బిజినెస్‌ రూల్స్‌ ను కూడా మా ముందుంచాలి.
v మూడు రాజధానులనిర్ణయంలో కీలకమైన నిపుణుల కమిటీ, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌, హైపవర్‌ కమిటీల నివేదికలను పిటిషనర్లకు అందజేయాలి
v రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాజీ అటార్నీ జనరల్‌, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహిత్గీ : సెలెక్ట్‌ కమిటీ నిర్ణయం తీసుకోవడానికి మూడు నెలల వరకు గడువు ఉంటుంది. బిల్లులు చట్టరూపం దాల్చకుండానే విచారణ జరపడం సరికాదు. వాయిదా వేయాలని అభ్యర్థించారు. ఆ అభ్యర్థనతో ధర్మాసనం ఏకీభవించింది.
v  పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది అశోక్‌ భాన్‌ : ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలను విశాఖకు తరలించాలని ప్రభుత్వం ఇప్పటికే సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారం కోర్టు విచారణలో ఉండగానే తరలింపు జరిగిపోతుంది. అందువల్ల కార్యాలయాలను తరలించకుండా అడ్డుకోవాలని అభ్యర్థించారు.  
v  ధర్మాసనం: ఆ వ్యవహారాన్ని మేం చూసుకుంటాం.ఆ రెండు బిల్లుల విషయంలో శాసన మండలి సెలెక్ట్‌ కమిటీ ఏం చేస్తుందో చూద్దాం! తదుపరి విచారణను ఫిబ్రవరి 26వ తేదీకి వాయిదా వేస్తున్నాం. ఈలోపు ప్రభుత్వం కార్యాలయాల తరలింపు విషయంలో తదుపరి చర్యలకు దిగితే... అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మాకు అధికారాలు లేవనుకోవద్దు! ఒకవేళ మా మాటను ధిక్కరించి కార్యాలయాలను తరలిస్తే... వాటిని వెనక్కి రప్పిస్తాం. ఇందుకయ్యే ఖర్చును బాధ్యులైన వారి నుంచి వసూలు చేయిస్తాం!. ప్రభుత్వం తదుపరి చర్యలకు దిగితే ఎప్పుడైనా మేం జోక్యం చేసుకుంటాం.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...