Feb 11, 2020

సెలెక్ట్ కమిటీపై డిబేట్

-ఏపీ 24X7 -తేదీ: 11.02.2020 మంగళవారం ఉదయం 7.30 గం. నుంచి 9.26 వరకు
అంశాలు :  సెలెక్ట్ కమిటీ - శాసన మండలి  - ఢిల్లీ ఎన్నికలు
యాంకర్ :  కృష్ణ సాయి

కొండా రాజీవ్ గాంధీ – వైసీపీ
ఇది రెండు రాజకీయ పార్టీల మధ్య పోటీ కాదు. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసే ఒక దౌగుల్బాజీ రాజకీయానికి, ప్రజాస్వామ్యాన్ని బతికించి రాష్ట్రాన్ని బాగుచేయాలనే ఒక ధృడ సంకాల్పానికి మధ్య జరిగే పోటీ. ఖచ్చితంగా ఇందులో దౌగుల్బాజీ రాజకీయాలు, నాయకుడు ఓడిపోవడం ఖాయం. రాష్ట్ర అభివృద్ధి జరగడం తధ్యం. ఇదే శాసనసభలో 23 మంది శాసనసభ్యులు ఒక పార్టీకి చెందినవారు మరో పార్టీవైపుకు వెళ్లిపోయి కండువాలు వేసుకొని మంత్రులుగా ఉంటే, ఇప్పుడు మండలి చైర్మన్ గురించి మాట్లాడుకుంటున్నామో అదే స్థాయిలో రాజ్యాంగాధికారాలు, విచక్షణాధికారాలు కలిగి ఉన్న ఒక స్పీకర్ ప్రజాస్వామ్యా ఖూనీ చేశారు. ఆ వ్యవస్థని ప్రజలు చూశారు. అసెంబ్లీ, మండల వ్యవహారాలలో కోర్టులు జోక్యం చేసుకోవడం తక్కువే. ప్రజా కోర్టులో ప్రజలే చెంప ఛెళ్లుమనిపిస్తారు. చరిత్రే కాదు, 2019 ఎన్నికల్లో పునరావృతమైన విషయం మనకి తెలుసు. ఇదే శాసనసభలో స్పీకర్ విచక్షాధికారాలతో కోర్టు చెప్పినప్పటికీ ఒక మహిళా ఎమ్మెల్యేని ఏళ్లపాటు సస్పెండ్ చేశారు. ఇదే విచక్షాధికారాలతో అసెంబ్లీ ఫర్నీచర్ పట్టుకువెళ్లి దొంగల్లా  అమ్ముకున్న.... ఇవన్నీ చూశాం. యనమల రామకృష్ణడు అదే విచక్షాణాధికారాలతో పార్టీ పెట్టిన ఎన్టీఆర్ గారికి వెన్ను పోటు పొడిచారు. విచక్షణాధికారాలతో మీరు చేసిన తప్పులను, పాపాలను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో మా ప్రభుత్వం అనేక బిల్లులు తయారు చేసింది. ప్రజాస్వామ్యానికి రక్షణలా ఉండాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ గారు మండలిని తెచ్చారు. గతంలో మండలిలో కాంగ్రెస్ మెజార్టీ ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన బిల్లులకు ఆమోదం తెలుపుతూ సహాయ సహకారాలు అందించింది. మండలి సలహాలు, సూచనలు ఇవ్వడానికే తప్ప ప్రజలు ఎన్నకున్న శాసనసభ చేసిన చట్టాలను అడ్డుకోవడానికి కాదు. గతంలో కాంగ్రెస్ వారు అలా చేయలేదు. మండలని అడ్డుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఒక సైంధవుడులా అభివృద్ధికి అడ్డుపడుతున్నారు.  ఇటువంటి మండలి మనకి అవసరంలేదని ప్రజలు కూడా అనుకుంటున్నారు. రద్దు తీర్మానాన్ని శాసనసభలో ఆమోదించాం. కేంద్రానికి కూడా వెళ్లింది. నన్ను ఎవరూ ఏమీ అనలేదు అని మండలి చైర్మన్ చెప్పారు. టీడీపీ నాయకులు గగ్గోలు పెట్టారు. టీడీపీ పాచికలు పారలేదు. విచక్షణాధికారాలు వినియోగించవలసిన ప్రమాదకరమైన పరిస్థితి ఏపీలో ఏమి వచ్చింది. ఎమ్మెల్సీలను రౌడీలుగా తయారు చేసిన వ్యక్తి చంద్రబాబు. అసెంబ్లీ సెక్రటరీ రూల్ పొజిషన్ తెలిపారు.
మండలిని రబ్బర్ స్టాంప్ అని నేను అనలేదు. మా మాటలను వక్రీకరించవద్దు. చంద్రబాబు నాయుడు గారి బాటలో మేం వెళ్లి ఉంటే అసెంబ్లీలో గానీ, మండలిలో గాని వారికి ఆ సీట్లు కూడా ఉండేవి కాదు. ఒక్క ఆయన తప్ప. మేం విలువలతో కూడి రాజకీయాలు చేస్తున్నాం. టీడీపీ వారు ఇచ్చిన మోషన్ సాంకేతికంగా మూవ్ కాలేదని అని మండలి చైర్మన్ చెప్పారు. విచక్షాధికారాలు ఎందుకు ఉపయోగించారు. మీరు ఇవ్వడంలో సాంకేతికంగా లోపం ఉంది. గ్యాలరీలో చంద్రబాబు కూర్చొని చైర్మన్ ని ప్రభావితంచేశారు. మీకు దమ్ముంటే విజయసాయి రెడ్డి వచ్చినట్లు ఒక్క ఫొటో చూపించండి. మీరు దుర్మార్గులు, మీ లోకేష్ గారు దుశ్శాసనుడు. లోకేష్ పప్పు, జీరో.
టీడీపీ వారు అలాంటి దుర్మార్గాలు, దౌర్జన్యాలు చేయబట్టే గడ్డి పెట్టారు. చెంప ఛెళ్లుమనిపించారు. ఛీకొట్టారు. ఆప్ చేసిన సంక్షేమం వల్ల ప్రజలు గుర్తుపెట్టుకొని దానిని గెలిపించారు. మా జగన్ గారు కూడా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నాం.  మండలిలో విజయసాయి రెడ్డి గారి ఫొటోలు ఉంటే బయటపెట్టండి.

గురజాల మాల్యాద్రి – టీడీపీ
ఇది రెండు పార్టీల మధ్య పోరాటం కాదు. చట్టసభలకు, జగన్ ప్రభుత్వ నియంతృత్వానికి మధ్య పోరాటం. మండలిలో ఉన్న మెజార్టీ పార్టీకి, వైకాపాకి మధ్య జరుగుతున్న పోరాటం. జగన్ ప్రభుత్వ నియంతృత్వ విధానం చట్టవ్యతిరేకం, రాజ్యాంగబద్ద కోర్టులు, ప్రజా కోర్టులలో ఓటమి చెందుతుంది. ఇది తాత్కాలికమే. వారి నియంతృత్వం చెల్లదు. చైర్మన్ 154వ నిబంధన ప్రకారం రూలింగ్ ఇచ్చారు. ఓటింగ్ జరుపుతాను, సభ్యులుగాని మంత్రులు 20 మంది బయటకు వెళ్లండని ఆయన పదేపదే చెప్పినప్పటికీ బయటకు వెళ్లకుండా చైర్మన్ ని దిక్కరించారు. చైర్మన్ పై ఏం జరిగిందో రాష్ట్రం అంతా చూసింది. ఓటింగ్ జరిగే పరిస్థితి లేదు. ఈ రెండు బిల్లుల సారాంశంపైన రూల్ 71 ప్రకారం చర్చ జరిగింది. దానిమీద ఓటింగ్ జరిగింది. ఓటింగ్ లో ప్రభుత్వానికి అనుకూలంగా 13, వ్యతిరేకంగా 27 ఓట్లు వచ్చాయి. చట్టప్రకారం ఒకసారి ఆ సిద్ధాంతమే తప్పని మెజార్టీ ఓటర్లు తేల్చిన తరువాత కొవదది నామినల్, దానికేమీ వాల్యూ ఉండదు.  అది చూరుపట్టుకొని వేలాడం లాంటిదే. సెలెక్ట కమిటీ అంటే 13 జిల్లాల్లో ప్రజాభిప్రాయం సేకరించడమే. ప్రజాభిప్రాయం అంటే వైకాపా ఎందుకు భయపడుతుంది? మహా అయితే మూడు నెలలు అవుతుంది. కోర్టులకు వెళ్లడం ఇదంతా అంతకంటే ఎక్కువ పడుతుంది. దాని వల్ల సాధించేది ఏమిటి? అంతా నాయిష్టం నా ఇష్టప్రకారం జరుకోవాలనే  ఫ్యాక్షనిస్ట్ ధోరణి తప్ప ప్రజాస్వామ్య స్పూర్తి ఎక్కడ ఉంది. ప్రజాభిప్రాయం సేకరిస్తారు. మీ చట్టాలకు ప్రజల ఆమోదం ఉందనుకుంటే మీరు ఎందుకు భయపడాలి. ప్రజాభిప్రాయానికి విరుద్దంగా, విశాఖలో భూ దోపిడీ చేయడం కోసం, కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పినట్లు జగన్ బృందం అక్కడ 32వేల ఎకరాలు కబ్జా చేశారు. అందుకోసం ఈ దుర్మార్గం చేస్తున్నారు. ప్రజల కోసమైతే ప్రజాభిప్రాయం సేకరించడానికి ఎందుకు భయపడుతున్నారు.
8 నెలల్లో అసెంబ్లీ నుంచి మండలికి 42 బిల్లులు వచ్చాయి. అందులో 38 పాసయ్యాయి. రెండు బిల్లులు సవరణ. ఒకటి ఆంగ్ల మాద్యమం బిల్లుకి సవరణ. ఆంగ్ల మాద్యమం పెట్టండి. తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుకుంటే తెలుగుమాద్యమానికి అవకాశం కల్పించమని సవరణ చేశారు. పెద్దల సభకు ఆ మాత్రం హక్కులేదా? చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కోసంమే గదా రాజ్యాంగం. అసెంబ్లీ, లోక్ సభ హాట్ గా ఉన్నప్పుడు దానిని నార్మల్ కు తీసుకు రావడానికి సాసర్ లా అటు రాజ్యసభ, ఇటు కౌన్సిల్ ఉంది. అనేక బిల్లులు మోడీకి వ్యతిరేకంగా సెలెక్ట్ కమిటీకి పంపింది. అతనేమీ రాజ్యసభని రద్దు చేస్తానని అనలేదు. మండలి ఆరు రాష్ట్రాల్లో ఉన్నాయి. మరో పది రాష్ట్రాలు కావాలని కోరుతున్నాయి. అవి పెండింగ్ లో ఉన్నాయి. తమిళనాడు ప్రభుత్వం జయలలిత హయాంలో వారి మండలిని రద్దు చేస్తూ 2011లో కేంద్రానికి పంపింది. ఇప్పటివరకు 9 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉంది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ దేశంలో ఒకేరకమైన విధానం ఉండాలని సూచిస్తోంది. చట్టానికి లోబడి జగన్ గారు పని చేయాలి. 151 సీట్లు వచ్చాయని, చట్టాన్ని ధిక్కరిస్తామంటే కుదరదు. రాజ్యాంగం ఒప్పుకోదు, చట్టాలు ఒప్పుకోవు.  ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన లక్ష్మీ పార్వతిని మీరు పైన పెట్టుకొని, అలాగే తండ్రి పెట్టిన కౌన్సిల్ ని రద్దు చేయడం ద్వారా వెన్నుపోటు పొడిచి మీరు వెన్నుపోట్లు గురించి మాట్లాడటం ఏమిటి? వెన్నుపోట్లు, దోపిడీ, అవినీతి, హింసే  మీ సిద్ధాంతం. అందరినీ నిర్మూలిస్తానన్న హిట్లర్ ఏమయ్యాడు? మండలిలో ఆ రోజు మేం సకాలంలోనే నోటీస్ ఇచ్చాం. మీ అధికారులు ఎందుకు మూవ్ చేయలేదు? అందుకే విచక్షాధికారాలు ఉపయోగించవలసి వచ్చింది. ఫాల్ట్ ఆఫ్ యువర్ స్టాఫ్. టీడీపీ వారు నోటీస్ ఇచ్చినట్లు మీ అధికారులు చెప్పారు. మోషన్ మూవ్ చేయవలసింది అధికారులు. వారు చేసిన పొరపాటుని సరిదిద్దడానికే చైర్మన్ విచక్షాధికారాలు ఉపయోగించారు. మండలిలోకి విజయసాయి రెడ్డి ముందు వచ్చారా? చంద్రబాబు నాయుడు గారు ముందు వచ్చారా?  విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డికి గ్యాలరీలో ఏం పని? మీరు దుర్మార్గం చేస్తున్నారు. దౌర్జన్యాన్ని ఫవర్ ఫుల్ గా ఎదుర్కొన్నాం. లోకేష్ చిచ్చర పిడుగు. మీ దుర్మార్గాన్ని, పోలీసుల దుర్మర్గాన్ని ఒంటిచేత్తో ఎదుర్కొన్నాడు. హీరో అతను. హీరో మనవడు సూపర్ హీరో.
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో ఒక ప్రాంతీయ పార్టీ ఢీకొని మూడింట రెండు వంతులకు పైగా మెజార్టీ రావడం గొప్ప విషయమే. ఆప్ వారు ఎన్నికలలో డబ్బు పాత్రలేకుండా నిజాయితీగా వ్యవహరించడం మంచి పరిణామం. డబ్బుండే పార్టీలను ఓడించి డబ్బు లేని పార్టీలను గెలిపించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించి, డబ్బు, దౌర్జన్యంతో గెలుద్దామనుకుంటే ప్రజల్లో వేగంగా మార్పు వస్తుంది. ప్రజాభిప్రాయాన్ని కూడా గౌరవించడం మీ పార్టీ నేర్చుకోవాలి. కేసీఆర్ నుంచి భారీ మొత్తం ఎవరికి వచ్చాయి. హైదరాబాద్ డబ్బంతా మీ దగ్గరే ఉంది. విధానాలన్నీ నిర్ణయాలన్నీ కేసీఆర్ కు అనుకూలంగా ఎందుకు తీసుకుంటున్నారు. పరిశ్రమలన్నిటినీ ఎందుకు హైదరాబాద్ కు తరలిస్తున్నారు. దౌర్జన్యం, అవినీతి, అబద్దాలు తప్ప ఏం చేయగలరు మీరు. టీడీపీ అన్ని త్యాగాలకు సిద్ధం. మీరు అడుగడుగునా హింస పెట్టినా మా కార్యకర్తలు రాకెట్ లా పోరాడుతున్నారు. ప్రతి కార్యకర్త తెగించి పోరాడుతున్నారు. మీ హింస ఎల్లకాలం సాగదు.

రాజేష్ – బీజేపీ
మొదటి నుంచి వైసీపీ మండలిని చిన్న చూపు చూస్తున్నారు. జగన్ తన తండ్రి మండలిని ఏర్పాటు చేశారు. ఆ విలువలకు తిలోదకాలు ఇచ్చారు. నేను చెప్పినదే వేదం అన్న రీతిలో ఆయన వ్యవహరిస్తున్నారు. మా సోము వీర్రాజు గారు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపవద్దని చెప్పారు. చైర్మన్ రూలింగ్ ఇచ్చిన తరువాత అన్ని పార్టీలో ఆమోదించాలి. రాజకీయ విలువలు, మండలి సంప్రదాయాలకు గౌరవం ఇవ్వాలి. లెజిస్లేటివ్ కార్యదర్శిని బెదిరించి దానిని తొక్కిపెట్టారు. టీడీపీ, వైసీపీ రెండూ ప్రాంతాయ పార్టీలు. వీరు చేసిన పాపాలు కడుక్కోవడం, అవినీతి మరకలను వేరేవారికి అంటించడం. గతంలో ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడవడం, ఇప్పుడు వీళ్ల అక్రమాలు కప్పిపెట్టుకోవడం... ఈ  రోల్ ఓవర్ లోనే గడిచిపోతోంది. ఏపీ ప్రజలు భవిష్యత్ లో ప్రత్యామ్నాయం చూడవలసిన అవసరం ఉంది. ఆ విధంగా చూస్తారని బీజేపీ తరపున ఆశిస్తున్నాం. మండలి రద్దు విషయంలో రాజకీయంగా బీజేపీ చూడదు. వాళ్లేదో తప్పు చేశారని 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు రావడం ఏమిటి?
బీజేపీ బ్రహ్మచారుల పార్టీ. మా నాయకులు పూర్తిగా నిమగ్నమై ఉంటారు. పూర్తి స్థాయి ప్రచారం చేస్తారు. లాభాపేక్షలేకుండా పని చేసే పార్టీ బీజేపీ. ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ నాయకత్వంలో మహిళలకు ఉచితంగా ఇవ్వడం వంటివి నగదు బదిలీ కార్యక్రమాలకంటే వినూత్నంగా ఆలోచించారని అనుకుంటున్నాను. కొంత మా వైఫల్యం ఉంది. ఢిల్లీలో ముస్లింలను విడగొట్టడంలో కాంగ్రెస్ పని చేసింది.


డాక్టర్ జీ.గంగాధర్  - కాంగ్రెస్
పార్లమెంటరీ సాంప్రదాయాలకు విఘాతం కలిగించే విధంగా ఉంది. హైకోర్టులో ఈ బిల్లులు రెండు సెలెక్ట్ కమిటీకి వెళ్లినట్లు ఒప్పుకున్నారు. ఇప్పుడు అభ్యంతరం ఎందుకు పెడుతున్నారు. ఓటింగ్ జరగలేదని చెబుతున్నారు. చైర్మన్ రూలింగ్ ఇచ్చారు. ఏకపక్షంగా, నిరంకుశంగా వ్యవహరిస్తే వ్యవస్థ ఏమవుతుంది. ఇది సరైన పద్దతి కాదు. సెలెక్ట్ కమిటీకి పేర్లు ఇవ్వమని మండలి చైర్మన్ అడిగారు. ఇవ్వాలి. ఒక్క వైసీపీ తప్ప అందరూ తమ సభ్యుల పేర్లు ఇచ్చారు. 71 రూల్ ప్రకారం అడ్డు తగిలితే వ్యతిరేకించాం. చైర్మన్ రూలింగ్ కు గౌరవం ఇవ్వాలి గదా.
మేం కూడా టీడీపీ అడుగుజాడల్లో నడుస్తాం అని వైసీపీవారు చెప్పదలుచుకున్నారా? శాసనమండలి అంటే రబ్బరు స్టాంప్ గా ఉండాలి అనే ధోరణిలో వారు మాట్లాడుతున్నారు. అక్కడ డైరెక్ట్ ఎన్నికల ద్వారా ఎన్నికైనవారు కూడా ఉంటారు. శాసనసభలో తప్పుడు నిర్ణయాలు చేస్తే అడ్డుకోవడానికి రక్షణ కవచంగా ఉండాలి. రాష్ట్రాన్ని రక్షించే కవచంగా ఉండాలి. లోక్ సభలో పాసైన బిల్లులు రాజ్యసభలో ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. సెలెక్ట్ కమిటీ తిరస్కరిస్తున్నట్లు నిర్ణయం ఏమీ తీసుకోదు. ప్రజాభిప్రాయం తీసుకోవడానికి అభ్యంతరం ఎందుకు? గంటల్లో, నిమిషాల్లో తేలిపోవడం అంటే నిరంకుశ ధోరణి. గతంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు. మీరు దానిని పీక్ కు తీసుకువెళ్లారు. మహానాయకుడు అని వైఎస్ఆర్ ని పదేపదే చెబుతుంటారు. ఇదేనా ఆయనను అనుసరించడం. మండలి గతంలో ఎన్ని బిల్లులు తిరస్కరించింది? అయిదేళ్లు సాగదీసి టీడీపీ నష్టం కలుగజేసింది. కొద్దిగా కుదురుకునే టైంలో మీరు డిస్ట్రబ్ చేశారు. దానిని మండలి అడ్డుకుంది. ఒక రకంగా రక్షణ కవచమే. రాష్ట్రానికి నష్టం కలిగించే బిల్లుని అడ్డుకోవడం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు కొనసాగింపేనా?
ఢిల్లీలో రోడ్లు, వంతెనలు అభివృద్ధి అంతా షీలాదీక్షిత్ కాలంలో చేసినదే.

లక్ష్మీనారాయణ - విశ్లేషకులు
రెండు రాజకీయ పక్షాల మధ్య వివాదంగా చూడటం సాధ్యం కాదు. చట్టసభలకు సంబంధించి నెలకొన్ని ప్రతిష్టంభనగా భావించాలి. శాసనసభ, మండలి రెండు సభలో వాటి పరిధిలో పనిచేయాలి. ఒక సభ మరో సభపై పెత్తనం చేయకూడదు. ప్రజలకు చట్టసభలపై విశ్వాసం సన్నగిల్లుతోంది. భాస జుగుప్సాకరం. రాష్ట్ర భవిష్యత్ కు సంబంధించిన రెండు ముఖ్యమైన అంశాలు. ఒకటి అందరి ఆమోదంతో రాజధాని నిర్మాణం జరుగుతోంది. అభివృద్ధి వికేంద్రీకణ పేరుతో దానిని తరలించే బిల్లు, రెండు సీఆర్డీఏ – రైతులు 33వేల ఎకరాలు రాజధాని కోసం ఇచ్చారు. ఆ సీఆర్డీఏని రద్దు చేసే బిల్లు. శాసనసభలో ఈ బిల్లులు ఆమోదించి, మండలికి వెళ్లింది. అక్కడ చర్చ జరిగిన తరువాత చైర్మన్ ఒక నిర్ణయం తీసుకున్నారు. సెలెక్ట్ కమిటీకి పంపారు. 14 రోజులు అయిపోయిందని కుంటిసాకులు చెప్పి మండలి కార్యదర్శి ఆ బిల్లుని వెనక్కు పంపితే చైర్మన్ రూలింగ్ కు విలువేముంది. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేసినా, ఓ 3 నెలల్లో ప్రజాభిప్రాయం సేకరించి నివేదిక సమర్పిస్తారు. సెలెక్ట్ కమిటీ అంశం అసెంబ్లీలో చర్చించడం కూడా మంచిదికాదు. సెలెక్ట్ కమిటీకి వెళ్లినట్లు హైకోర్టులో కూడా చెప్పారు. చట్టాలు చేసినంతమాత్రాన అవి అమలులోకి వస్తాయని ఏమీ లేవు. వాటిని సమీక్షిస్తారు. న్యాయస్థానాలు వాటిని రద్దు చేసే అవకాశం కూడా ఉంది. న్యాయస్థానాలను రద్దు చేయలేం కదా. గతంలో ఆమోదించిన చట్టాలను రద్దు చేయడాన్ని మండలి సెలెక్ట్ కమిటీకి పంపించినంత మాత్రాన మండలిని రద్దు చేయడం తగనిది. ఒకవేళ చేసినా రేపు న్యాయ సమీక్ష ఉంటుంది. కాస్త సంయమనం పాటించాలి. ప్రజలు, రైతులు ఆందోళన చేస్తున్నారు. అనేక అంశాలతో సంక్లిష్టంగా ఉన్న సమస్యని సామరస్యంగా పరిష్కరించాలి. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఛీఫ్ సెక్రటరీ అమలు చేయకపోతే ఎలా ఉంటుంది. ఒత్తిళ్లు, బ్లాక్ మెయిల్ రాజకీయాలో చేయాలనుకోవడం సరికాదు. చట్టసభలు వాటి పనిని చేసుకోనివ్వాలి. అవరోధాలు సృష్టించుకుంటే సమస్య పరిష్కారం కాదు. మరింత జఠిలమై దుష్పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంది.
ఢిల్లీలో ఆప్ పరిపానని కొలబద్దంగా తీసుకోవడం, కేంద్రం ఆర్థిక సామాజిక విధానాలను పరిశీలిస్తే ఢిల్లో ఓటర్లు చాలా విజ్ఞతతో తీర్చు ఇచ్చినట్లుంది. 2014లో లోక్ సభ ఎన్నికల్లో 7 స్థానాలూ బీజేపీ గెలిచింది. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీనే అధికారంలోకి తెచ్చారు. 2019లో కూడా లోక్ సభ ఎన్నికల్లో జాతీయ రాజకీయాలను దృష్ఠిలో పెట్టుకొని  7 స్థానాలు బీజేపీకే కట్టబెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కు అనుకూలంగా తీర్పు ఇస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావించాలి.
--------------------

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...