Feb 6, 2020

అమరావతి స్మార్ట్‌సిటీలో రూ.2046 కోట్ల ప్రాజెక్టులు

న్యూఢిల్లీ:   స్మార్ట్‌సిటీ పథకంలో ఎంపికైన అమరావతిలో రూ. 2046 కోట్ల విలువైన 20 ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురి వెల్లడించారు. లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌, వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి గురువారం ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఐదేళ్లలో ప్రాజెక్టు పనులు పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. మూడోదశ స్మార్ట్‌సిటీ చాలెంజ్‌లో అమరావతి 2017 జూన్‌లో స్మార్ట్‌ సిటీ పథకానికి ఎంపికైందని గుర్తు చేశారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...