Feb 21, 2020

చంద్రబాబు ఆస్తుల ప్రకటన - 25 లక్షల ఇళ్ల స్థలాలు



టీవీ 24X7 - తేదీ: 21.02.2020 శుక్రవారం ఉదయం 7.30 గం. నుంచి
అంశాలు :   చంద్రబాబు నాయుడు ఆస్తుల ప్రకటన -  25 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ
యాంకర్ :  వెంకటకృష్ణ

గురజాల మాల్యాద్రి – టీడీపీ
రాజు ఎలా ఉంటో ప్రజలు అలా అని ఒక సామెత ఉంది. ప్రక్షాళన టాప్ నుంచే ప్రారంభం కావాలి. మార్పు కూడా అంతే. తరువాత అన్ని లేయర్లకు సర్క్యులేట్ అవుతుంది. అనేక దేశాలలో, మన దేశంలో, రాష్ట్రంలో కూడా ప్రధాన నేతలు ట్రాన్సఫరెన్సగా ఉండాలని కోరుతున్నారు. డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తరువాత ప్రజాప్రతినిధుల ఆస్తులు ప్రకటించే విధానం తీసుకువచ్చారు. అన్నహజారే మూమెంట్ లో భాగంగా తీసుకువచ్చారు. 9 ఏళ్ల నుంచి. సాక్షి అవినీతి మీడియా పుత్రిక మొదటి పేజీలోనే ప్రచురిస్తోంది. దానికి ప్రాధాన్యత లేకపోతే అంబర్ అయితే  ఎందుకు ప్రచురిస్తోంది. వైసీపీ చీఫ్ విప్, జగన్ కు అత్యంత సన్నిహితుడు పక్కపక్క నియోజకవర్గాలు. చిత్తూరు జిల్లాలో ఆరణి నుంచి శ్రీకాకుళం ఇసుక క్వారీలు దాకా వారు మేసేస్తున్నారు. తోలేస్తున్నారు. ఆయన రియాకర్ట్ అయి నీతి వ్యాఖ్యలు చెబుతున్నారు. శ్రీకాకుళంలో, చిత్తూరు జిల్లా సత్యవేడు దగ్గర క్వారీల వద్ద విచారించండి. ఏమీ పట్టించుకోనోళ్లు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకు ఇలా రాస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ల నుంచి ప్రకటిస్తున్నారు.  జగన్మోహన రెడ్డి నా అస్తులు ఇవి అని ప్రకటించి, ఏమైనా ఉంటే చెప్పు. ఎందుకు ప్రకటించడంలేదు. తేలుకుట్టిన దొంగలా. ప్రతిదానికి కౌంటర్ చేసే పెద్ద మనుషులు దీంట్లో తేలుకుట్టిన దొంగలా ఉన్నారు. కలుగులో దాక్కుంటున్నారు.
మొన్న ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఖర్చు పెట్టారా? చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఖర్చు పెట్టారా? 5 కోట్ల ఆంధ్రులు చూశారు గదా.
వారు కూడా 2004లో 9 లక్షల కోట్లు ఐటీ కట్టారు. తరువాత జగన్ 5,6 వందల కోట్లు ఐటీ కట్టారు. ఇంతేనా అడ్వాన్స్ ఐటీ అని నేను అడగను. అదైనా చెప్పండి. ఎదుటివారి వ్యక్తిత్వాన్ని ఖననం చేస్తే లేదా దెబ్బతీస్తే ప్రయోజనం ఉండదు. వారి వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలి. జగన్మోహన రెడ్డి వ్యక్తిత్వాన్ని పెంచడానికి ప్రయత్నం చేయండి. ఆయన ఆస్తులను ప్రకటించాలని డిమాండ్ చేయండి. జగన్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తరువాత రాజకీయాల్లో డబ్బు పాత్ర, ఆర్థి ఉగ్రవాదం వచ్చినట్లు సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. చంద్రబాబు కాదు, ఆయన మొన్న ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టలేకపోయారు. చతికిలబడ్దాడని అందరికీ తెలుసు. మీరు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టారని అందరికీ తెలుసు. మీ నేరాలననీ చంద్రబాబు నాయుడుకు ఆపాదించి- ఈ రోజు హింసా సంస్కృతి పెరిగింది. లక్షసార్లు అబద్దాలు చెప్పి ...
ఈనాడు బ్యేనర్ ఐటంగా వేసింది కాపురం ఉండే గుడెసెని జేసీబీతో కొట్టివేసి 2.5 సెంట్లు ఉంటే, 1.5 సెంట్లు ఇస్తామంటున్నారు. టీడీపీ ప్రభుత్వం గ్రామాల్లో 2.5 సెట్లు స్థలం ఇచ్చింది. దాన్ని లాక్కొని 1.5 సెంట్లు ఇస్తామంటున్నారు. టౌన్ లో 2 నుంచి 1కి కట్ట చేశారు. విశాఖలో ఎస్టీ,ఎస్సీ, మైనార్టీలు సాగు చేసుకుంటున్న 10వేల ఎకరాలు లాక్కొని వారికి ఇస్తారట. అక్కడ ప్రభుత్వ భూమి 4వేల ఎకరాలు ఉన్నాయి. ఈ 4వేల ఎకరాలు అమ్మేస్తారట. వైసీపీ నాయకులు వాటిని తక్కువ రేటుకు కొనుక్కొని దోచుకుంటారట. ప్రభుత్వ భూములు పేదలకు ఇవ్వరట. పేదల భూములే కబ్జాచేసి ఇస్తారట. విశాఖలో 4వేల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందా?లేదా? అది ఇవ్వవచ్చు గదా. అవి నవ మోసాలా? నవరత్నాలా?
ఇళ్లు కట్టకుండా కట్టినట్లు రికార్డు సృష్టించి తిరేశారు. 14లక్షల ఇళ్లు పేపర్ మీదే ఉన్నాయి.
చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో పది లక్షలు కట్టించి ఇచ్చారు. ఇంకా పది లక్షలు నిర్మాణంలో ఉన్నాయి. ఒక్క అమరావతిలోనే 5024 ఇళ్లు కట్టి ఉన్నాయి. వాటిని పేదలకు ఇవ్వవచ్చు గదా.

కుటుంబ రావు – టీడీపీ
ఎవరు విమర్శ చేస్తున్నారో మొదట వారి ఆస్తులు ప్రకటించి విమర్శ చేస్తే బాగుంటుంది. వారు కొన్న ధర తెలుపుతారా? మార్కెట్ విలువ తెలుపుతారా?  ఏ విధంగా చేస్తారనేది అందరికీ తెలుస్తుంది.  అవతల మనిషిని విమర్శించే ముందు మనం ఒక గాజు ఇంట్లో ఉన్నాం, అవతల మనుషులు రాళ్లు వేస్తే ఆ గాజు పగిలిపోతుందనేది అర్ధం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు దశాబ్దం నుంచి ఒక మంచి సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఫిబ్రవరి చివరి వారంలో ఆస్తులు ప్రకటిస్తారు.  అసలు విలువ, మార్కెట్ విలువకు తేడా ఉంది. 2019లో ఆయన అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు వైఎస్ జగన్ గారి అఫిడవిట్ తీసుకుందాం. భారతీ సిమెంట్ లో ఆయన పెట్టుబడి పెట్టిన విలువ చూపించారా? అదే కంపెనీలో తన కొన్న వాటాని ఫ్రెంచ్ కంపెనీకి అమ్మిన రేటు విలువ  చూపించారా? ఆయన అండర్ వ్యాల్యూ చేసి చూపినది వందలు కాదు వేల కోట్లు. పబ్లిక్ డిబేట్ కు వద్దాం. నిన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు  ఆస్తులు ప్రకటించారు. ఈ పేపర్లు, జగన్ గారి పేపర్లు పక్కన పెట్టి చూస్తే ఎవరు మార్కెట్ విలువ చూపించారో తేటతెల్లం అవుతుంది. సాంప్రదాయాలు, ట్రాన్సఫరెన్సీ ముఖ్యం. ఆర్టీఏ కింద అడిగితే వివరాలు ఇవ్వరు. అందుకు అనుమతిలేదు. ఎవరైతే తప్పు చేయలేదు అనుకుంటారో వారు నేను తప్పు చేయలేదు, నా ఆస్తులు ఇవి.... బినామీ ఆస్తులు అని నోటికి వచ్చినట్లు వాగేవాళ్లు ఎక్కువైపోయారు. ఈ ఆస్తులు కాకుండా బినామీ ఆస్తులు ఉంటే ప్రభుత్వం తీసుకోమని లోకేష్ గారు చెప్పారు. ఇందులో ప్రత్యేకత లేదంటే మీరు కూడా చూపించండి. ఒక ఏడాదిలో వారి ఆస్తులు పెరిగిన తీరు, పెద్ద మొత్తం వారి ఖాతాలోకి వచ్చిందో తెలుస్తుంది కదా. సింపుల్ కాదు. దమ్ము ధైర్యం ఉంటే ప్రకటించండి. ఏ సంవత్సరంలో ఎక్కవచ్చింది? ఏ సంవత్సరంలో నష్టం వచ్చింది? అన్ని తెలుస్తాయి. ప్రజలు గమనిస్తారు. ఎన్నికలలో పోటీ చేసే ప్రతి వ్యక్తి కుటుంబం ఆస్తులు పబ్లిక్ డొమైన్ లో పెట్టడం ఎన్నికల సంఘం తప్పనిసరి చేయాలి. అది ఏ పార్టీ అయినా సరే. ప్రజా జీవితంలో ఉన్నవారు పంచాయతీ జీవితంలో ఉన్నవారు. ప్రజల పన్నులతో అభివృద్ధి చేసేటప్పుడు ప్రజలకు రైట్ ఉంది. యూఎస్ఏ లో ట్రంప్ అంతకు ముందు వ్యాపారవేత్త. ఆయన కుటుంబ ఆస్తులు వివరాలు పబ్లిడొమైన్ లో పెట్టారు. అప్పడ తప్పనిసరి.

గోవింద రెడ్డి – వైసీపీ
ప్రతి పౌరుడు ప్రతి సంవత్సరం ఐటీకి తన ఆస్తులు తెలపాలి. ఒక కంపెనీ షేర్ విలువ 2 లేక 3 వేలు ఉండవచ్చు. రూ.10 ల ఫేస్ వ్యాల్యూ మాత్రమే చూపుతాం. అది వాస్తవ విలువ కాదు. రాజకీయ వ్యవస్థలో ఆయన సొంత ఆస్తే కాకుండా బ్లాక్ మనీ, బినామీల ద్వారా వేలాది కోట్లు ఎన్నికల ఖర్చు ఏ విధంగా ఎకౌంట్ ఫర్ అవుతుందని ప్రజలలో ఒక అభిప్రాయం ఉంది. ఐటీ వారు కొద్ది రోజుల క్రితం ఆయన పీస్ ఇంట్లో వెతికి, డైరీలు కనుకున్నారు. దాదాపు 2వేల కోట్లు మిగతావాళ్లకే డబ్బు ఇవ్వడం.. ఐటీ చూపించేటప్పుడు వీరు ఇచ్చే డిక్లరేషన్ కు ఏ విధంగా ట్రాన్స్ ఫరెన్సీ ఉంటుంది? ప్రజలకు నమ్మకం కలిగే అవకాశం లేదు. షేర్ మార్కెట్ విలువ ఎంత ఉందో తెలుస్తుంది. అది ప్రకటించవచ్చు. హెరిటేజ్ కంపెనీ గ్రోత్ బాగానే ఉంది. ఆయన ఆస్తుల ప్రకటనకు ప్రజలకు నమ్మకం ఉండదు. దానిని సీరియస్ గా తీసుకునే అవకాశం లేదు. ప్రతి ఒక్కరూ జూన్ 31న ఐటి రిటన్స్ కోసం ప్రకటిస్తారు. డబ్బు ప్రభావం రాజకీయాలలో విపరీతంగా పెరిగిందని అందరూ అంటారు. ఎన్నికలలో పోటీ చేస్తే చట్టపరంగా ఆస్తులు ప్రకటించాలి. మార్చి ఏప్రిల్ లో ఐటీకి చూపించేవి ఈ రోజు ప్రకటించడం రియాల్టీకి దగ్గరాలేవు. ప్రతి రాజకీయ నాయకుడు పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి అందరూ ప్రకటించే విధంగా డిమాండ్ చేద్దాం. చేయిద్దాం. చంద్రబాబు గారు తన వైట్ మనీ వంద కోట్లు చూపించారు. వారికుండే ఇన్ఫ్లియన్స్ వల్ల రేపు ఎన్నికలలో పెట్టు 8వేలు లేదా పది వేల కోట్లు ఏ విధంగా తీసుకువచ్చి ఖర్చు పెడుతున్నారు, రాజకీయ వ్యవస్థని కలుషితం చేస్తున్నారో చెప్పకుండా ఈయన ఎంత డిక్లేర్ చేసినా ఫలితంలేదు. ఎన్నికల ఖర్చు విషయంలో వ్యవస్థ ఆ విధంగా ఉంది. చంద్రబాబు డిక్లేర్ చేయడం వల్ల ఈ వ్యవస్థలో మార్పు రాదు. దాని వల్ల ఏమీ మేలు లేదు. ఎన్నికలలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టడంలేదని ఆయన, ఆయన పార్టీ నాయకులు ఒక వాగ్ధానం తీసుకొని మీ లాంటి వాళ్లందరినీ నమ్మించండి. అప్పుడు పవిత్రత ఉంటుంది.
నవరత్నాల కార్యక్రమంలో మోస్ట్ ఛాలెంజింగ్ స్కీమ్. మిగతా పథకాలు సులభం. ప్రతి పేదవాడికి ఇళ్లు ఉండాలనేది జగన్ గారి ఆలోచన. పట్టణ ప్రాంతాల్లో భూమి సమస్య వచ్చింది. ప్రభుత్వ భూములు ఆక్రమించారు. వారి వద్ద భూమి తీసుకోవాలంటే సమస్యలు వస్తున్నాయి. 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం, ఇళ్లు కట్టించడం ఛాలెంజ్. బద్వేలు లో కూడా 150 ఎకరాలు కావాలి. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి.

(1995లో కుటుంబానికి రెండు సెట్ల స్థలం ఇచ్చారు. ఇక్కడ షెడ్ మాత్రమే వేశారు. దానిని ఇప్పుడు తీసుకుంటాం అంటున్నారు. కొత్త జాబితాలో ఆ భూమి స్వాధీనంలో ఉన్నవారి పేర్లు లేవు.) ఇలాంటిదే బద్వేలులో సంధ్య టౌన్ షిప్ సమస్య వచ్చింది. జిల్లా కలెక్టర్ వచ్చి వారి వద్ద తీసుకోవడం మంచిదికాదన్నారు. అటువంటి విషయాలలో ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనవి పట్టా ఇవ్వనివి  తీసుకోవచ్చు. వ్యవసాయం చేసే డీకేటీ భూములను ముట్టుకోవద్దని జగన్ గారు చెప్పారు.
ఇది ఛాలెంజింగ్ జాబ్ అని ముందే చెప్పాను. గ్రామాల్లో భూమి సమస్య పెద్దగా లేదు. పట్టణాలలోనే సమస్య. ఇబ్బంది కరమైన పరిస్థితి ఉందని చెప్పడం సరికాదు.

తులసిరెడ్డి – కాంగ్రెస్
ఆస్తుల ప్రకటన ఎన్నికల అఫిడవిట్ – ఐటీ రిటన్స్ – స్వయంగా ప్రకటించడం. ఇది తెలుస్తుంది. ఎవరు చేసినా మంచిదే. ఎవరు చేసినా నల్లధనం చేయరు. బినామీ ఆస్తులు, బంగారు బిస్కెట్లు, నేలమాళిగలో ఉండే నోట్ల గురించి చెప్పరు. ఒక్క తెల్లధనం గురించి మాత్రమే చెబుతారు.  తెల్లధనానికి మించి నల్ల ధనం కనీసం వెయ్యి రెట్లు ఎక్కువ ఉంటుంది ఆ స్థాయి నాయకులకు. ఎన్నికల ఖర్చు శాసనసభకు రూ.25 లక్షలు. పులివెందులలో ఓటుకు రూ.1500 పంచారు. కొన్ని చోట్ల మూడు వేలు, పదివేలు పంచారు. అందరికీ తెలుసు. ఆ 30 కోట్లు చూపించి ఉంటారా? చూపించరు. ఇది చర్చకు పనికి వస్తుంది. మార్కెట్ విలువ, అసలు విలువ అనేది చర్చ. చంద్రబాబు నాయుడు గారు చూపించినది రూ.111 కోట్లు. బాబు గారికి రూ.9కోట్లు, దేవాంషకు రూ.19 కోట్లు, భువనేశ్వరి గారికి రూ.50 కోట్లు, లోకేష్ రూ.24 కోట్లు, బ్రహ్మణి గారికి రూ.16 కోట్లు. జగన్ ప్రకటిస్తే ఒ పది రెట్లు ఎక్కువ ప్రకటించవచ్చు. ఇందిరా గాంధీ ఆ తరువాత ఎన్టీఆర్ హయాంలో ఇళ్లు ఇచ్చారు. ఆ తరువాత వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ గారు శాస్యురేషన్ కాన్సెప్ట్ తో ఇచ్చారు. స్థలాలు కాదు, ఇళ్లే కట్టించారు. ఇప్పటి వరకు కోటి 20 లక్షల మందికి ఇళ్లు కట్టించారు. అంత సంఖ్యేలేదు. పొలిటికల్ ఇన్వాల్వమెంట్, టార్గెట్. తహసీల్దార్ లపై వత్తిడి. పులివెందుల నియోజకవర్గంలోనే 50 ఏళ్లుగా కల్లం వాడుకుంటున్నారు. ఇప్పుడు దానిని తీసుకొని ఇళ్ల స్థలాలకు ఇస్తారట. కాన్సెప్ట్ మంచిదే ఒకపేద కోసం మరో పేద వద్ద తీసుకోవడం కరెక్ట్ కాదు. టార్గెట్ స్థానిక రాజకీయాలు – భూములు కొంటానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. కొందరికి పండుగ ఎక్కవ మందికి పండుగకాదు.

చందు సాంబశివరావు – బీజేపీ
వంద ఏళ్ల క్రితం లెక్కలు సింపుల్ గా ఉన్నాయి. రాబడి, ఖర్చు మాత్రమే ఉండేవి. ఇప్పుడు అదే అంశాలపై 220కి వచ్చాయి. గ్రంథాలు అయ్యాయి. ఐటీ కూడా అంతే. ఇలా చేస్తే బాగుంటుందేమో అని చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చేశారు. ఆ ఆలోచనని విమర్శించడం మంచిదికాదు. ఎందుకు విమర్శిస్తున్నారో ఆలోచన చేసుకోవాలి. ఆయన నా సంగతి నేను చెబుతాను అన్నప్పుడు మనం ఈకలు పీకుతున్నాం. ఈ రకమైన చర్చ జరిగేకొద్ది ఈ నాయకులు, అధికారులపై  ఒత్తిడి పెరిగే కొద్ది ఎలా చేస్తే బాగుంటుందనేది వస్తుంది. అవి రావడానికి చంద్రబాబు గారు చేసింది పునాది కావచ్చు. ఇది కొత్త ఆలోచనకు దారి. కొంత కాలం గడిచిన తరువాత నిబంధనలు రూపొందుతాయి.
ప్రభుత్వ భూములు అనే కాన్సెప్ట్. ఇళ్ల స్థలాలు, పాఠశాలలు, ప్రజాప్రయోజనాల కోసం బ్రిటీష్ వారి వద్ద నుంచి ప్రభుత్వ భూములు ఉన్నాయి. స్వతంత్ర భారతంలో ప్రభుత్వ భూమిని వాడుకుంటున్నారే గానీ ప్రణాళిక లేదు. భూమి సమస్య ఉంది. టార్గెట్ పెట్టడం వల్ల సమస్యలు వస్తున్నాయి. ఇళ్లు ఇస్తామంటే తప్పుపట్టరు. చంద్రబాబు నాయుడు 30వేల ఎకరాల్లో రాజధాని కడతానన్నారు. మౌలిక సదుపాయాలు వస్తాయన్నారు. గ్రామానికి దూరంగా ఇళ్లు కడతామంటే ఎవరూ వెళ్లరు. దీనిని ప్రభుత్వ సీనియస్ గా తీసుకోవాలి. ఇళ్ల స్థలాలు ఇవ్వండి. తొందర ఎందుకు. తొందరవల్లే ఈ సమస్య. ముందు ఆయా గ్రామాలలో అందుబాటులో ఉన్న భూమికి సంబంధించి ప్రణాళిక ఉండాలి. అదిలేకపోవడం వల్లే ఈ సమస్య. ఎసైన్డ్ ల్యాండ్ తీసుకోవడం అంటే దైర్భాగ్యమే. భూమిలేని చోట కొనడానికి ప్రయత్నించండి. దాతలు ఇచ్చిన స్థలాలలో పాఠశాల, దేవాలయం, ఇళ్లు కట్టడం ఆనవాయితీగా వస్తుంది. పెద్ద రైతుల వద్ద భూములు తీసుకోండి. చంద్రబాబు గారితో కలిసి పిలుపు ఇవ్వండి. కలిసి చేయండి. ఈ రోజు సెంటు అంటున్నారు. రేపు గజం ఇచ్చి నిలబడి బతకమంటారు.

రషీ – సీనియర్ జర్నలిస్ట్
లేని సంప్రదాయాన్ని చంద్రబాబు గారు ప్రవేశపెట్టారు. స్వాగతించాలి. విమర్శచేసేవాళ్లు కూడా ప్రకటించాలి. స్పీకర్ కి సీల్డ్ కవర్ లో ఆస్తులు ఇవ్వమని చెప్పారు. అది కొనసాగడంలేదు. దానిపై ప్రభుత్వం స్పష్టం చేయాలి. అమెరికాలో మాదిరి కుటుంబ ఆస్తులు ప్రకటించే మంచిది. మోడీ గారు కొత్త చట్టాలు తెస్తారనుకున్నారు. తేలేదు. ఓటుకు రెండు వేలు ఇచ్చి కొనేమాట వాస్తవమే.  బినామీ ఆస్తులు చట్టం తెండి. వైపీపీ ప్రభుత్వం ఉన్నందున బినామీ చట్టం చేయండి.
1983లో అందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తానని చెప్పారు. అప్పుడు ఈనాడులో కార్టూన్ కాళికాదేవి వద్ద నిలబడి హాంభూం పట్ అందరికీ ఇళ్లు అని కార్టూన్ వేశారు. ఎలా ఇవ్వగలవు అని వేశారు. 25 లక్షల మందికి ఇళ్లు ఇవ్వడం మంచిదే. నేను అనుకోవడం లేదు. కేంద్రం వాంబే కాలనీల్లో ఇళ్లు ఇవ్వాలనుకొని, తరువాత అపార్ట్ మెంట్లు కట్టి ఇవ్వాలని పాలసీ మార్చుకుంది. భూమి లేనందున పాలసీ మార్చుకున్నారు. ఆ క్రమంలోనే రాజీవ్ గృహకల్ప వంటి వచ్చాయి. ఎంతమందికి ఇవ్వాలి, ఎంత భూమి ఉందో తెలుసుకోకుండా చేస్తే ఇలాంటి సమస్యలే వస్తాయి. ఈ పథకంపై పునారాలోచన చేయాలి. ముందు బిల్డ ఏపీ పేరుతో ప్రభుత్వ స్థలాలు అమ్మి, గ్రామాలకు దూరంగా ఇళ్లు కట్టించాలనుకున్నారు. దేవాదాయ, వక్ఫ, క్రిస్టియన్ భూములు అమ్మడానికి కొందరు వ్యతిరేకించారు. దాంతో అసైన్డ్ భూములు వచ్చాయి. పేదవాడి వద్ద లాక్కుని ఇంకొకరికి ఇవ్వడం. కేసీఆర్ గారు కూడా ఒక్కొక్క దళితుడిని 3 ఎకరాలు ఇస్తానని చెప్పి ఆయన చతికిలబడ్డారు. ఫెయిలయ్యారు. ఆ విషయం మాట్లాడటంలేదు. డబుల్ బెడ్ రూమ్స్ అన్నారు. దానిని వదిలివేశారు.
విజయవాడలో ఇల్లు మంజూరైందని సంతకాలు పెట్టుకొని వెళుతున్నారు. ఆ ఇల్లు అమరావతిలో ఇస్తామంటున్నారు. దానికి వారు అంగీకరించడంలేదు.




No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...