Feb 3, 2020

పార్లమెంటులో అమరావతి, మండలి!



v 30-01-2020 :
నవ్యాంధ్రకు మూడు రాజధానులు, అప్రజాస్వామికంగా శాసన మండలి రద్దు అంశాలను ప్రస్తావించినప్పుడు వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి తమను అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారని తెలుగుదేశం రాజ్యసభాపక్ష నేత కనకమేడల రవీంద్రకుమార్‌ ఆరోపించారు. 31 నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్న సందర్భంగా గురువారం పార్లమెంటు లైబ్రరీ భవనంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, టీడీపీపీ నేత గల్లా జయదేవ్‌, లోక్‌సభాపక్ష నేత కె.రామ్మోహన్‌నాయుడు, కనకమేడల, వివిధ పార్టీల సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. అమరావతిని మూడు ముక్కలు చేస్తూ ప్రాంతీయ చిచ్చు పెట్టిన జగన్‌ ప్రభుత్వ ఏకపక్ష, అప్రజాస్వామిక ధోరణి గురించి ఈ భేటీలో ప్రస్తావిస్తున్నప్పుడు.. విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి తమ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు యత్నించారని తెలిపారు. మా నేత చంద్రబాబును, మమ్మల్ని తూలనాడుతూ వాగ్వాదానికి దిగి, రభస చేయాలని ప్రయత్నించడంతో ఇతర పార్టీల సీనియర్‌ ఎంపీలంతా వారిని అడ్డుకున్నారు. అయినా వారు తగ్గకపోవడంతో రాజ్‌నాథ్‌సింగ్‌ అసహనం వ్యక్తంచేశారు. టీడీపీ ఎంపీలు మాట్లాడుతున్నప్పుడు మీరు అడ్డుతగలొద్దు.. మీ సమయం వచ్చినప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండన్నారు. అయితే అక్కడితో వారు ఆగలేదు. శాసనమండలి రద్దు అంశంపైనా పార్లమెంటులో చర్చకు అవకాశమివ్వాలని మేం కోరుతుండగా.. మళ్లీ వారు అడ్డుకోవాలని చూశారు. రెండోసారి రాజ్‌నాథ్‌ జోక్యం చేసుకున్నారు. టీడీపీ ఎంపీలు మాట్లాడేటప్పుడు అడ్డుతగలడం మంచిది కాదని గట్టిగా చెప్పడంతో వారు తోకముడిచారుఅని వివరించారు. రాజధాని కోసం చేపట్టిన చలో అసెంబ్లీసందర్భంగా. తనను కూడా పోలీసులు అమానవీయంగా, చట్టవిరుద్ధంగా కొట్టి, గాయపరిచి వేధించారని, అక్రమంగా కేసులు పెట్టారని.. దీనిపైనా చర్చిస్తామని జయదేవ్‌ తెలిపారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...