Feb 25, 2020

అమరావతి అంగుళం కదలదు: స్వామి కమలానంద భారతి


v ‘‘పార్లమెంటు నుంచి మట్టి, నీరు వచ్చింది. అమరావతి రాజధాని అంగుళం కూడా కదలదు’’ మందడం, వెలగపూడి రాయపూడి, తుళ్లూరు, పెదపరిమి గ్రామాల్లో జరిగిన ధర్నా కార్యక్రమాల్లో ఆయన  పాల్గొని రైతులు, రైతు కూలీలకు సంఘీభావం తెలిపారు. ప్రధాని మోదీ పార్లమెంటు నుంచి నీరు, మట్టి తెచ్చారు. ఆయనే స్వయంగా శంకుస్థాపన చేశారు. ఎవరూ అధైర్యపడొద్దు. పార్టీల గురించి మాకు అవసరంలేదు. మేం సమాజం గురించే మాట్లాడతాం. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు 13 జిల్లాల ప్రజలు కోరుతున్నారు. దేశానికి రెండో రాజధాని అవుతుందనుకుంటే, అలా జరుగుతుందా అని కళ్లు కుట్టి అమరావతి ఇలా అయ్యింది. లాఠీతో కొట్టి, పోలీసులు ఇంటికెళ్లి బాధపడతారు. వారూ మనుషులే, డ్యూటీలో పైవారు చెప్పినట్టు నడుచుకోవాలి. పోలీసు ఉన్నతాధికారులు ఆ పాపం తొలగిపోవటానికి హోమాలు చేసుకుంటున్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...