Feb 20, 2020

ఐటీ దాడులు - సుగాలీ ప్రీతి కేసు: టీవీ డిబేట్


టీవీ 24X7 - తేదీ: 20.02.2020 గురువారం ఉదయం 7.30 గం. నుంచి
అంశాలు  -  ఐటీ దాడులు     ----  సుగాలీ ప్రీతి కేసు
యాంకర్ :  వెంకటకృష్ణ

 సంజీవరెడ్డి – కాంగ్రెస్

ప్రేరేపిత ఐటీ దాడులు. 6 ఏళ్ల నుంచి వారి ఉద్యోగం వారిని చేయనివ్వడంలేదు. చంద్రబాబు నాయుడు పీఏ వద్ద లెటర్ దొరికిందన్నారు. వాళ్లే ఎందుకు పెట్టకూడదు.  పోలీస్ వ్యవస్థ, ఐటీ, ఈడీ, సీబీఐ వాళ్లను నమ్మే పరిస్థితి ఉందా ఈ దేశంలో? సుజనా చౌదరి, సీఎం రమేష్ వి ఏమైంది. టీ త్రాగనివ్వలేదు. ఫోన్ ముట్టుకోనివ్వలేదు. అంత హడావుడి చేశారు. ఇప్పుడేమైంది. నిజం నిరూపితమయ్యేవరకు నమ్మడానికి వీలులేదు. ప్రతిపక్ష నాయకులను అదుపులోకి తెచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వ్యవస్థలను వాడుకుంటుంది. జుగుప్సాకరంగా, సీబీఐ, ఐటీ అంటే  ఒక బూతులా మారిపోయింది. 1980 తరువాత రాజకీయ నాయకులు ఒకరికొకరు సహకరించుకోవడం సర్వసాధారణం. పత్తిత్తులు ఎవరూలేరు. 95 మంది అవినీతిపరులు. ఓటరు డబ్బు తీసుకొని ఎప్పుడైతే ఓటు వేస్తున్నాడో వాడి జాతకాన్ని వాడు తాకట్టు పెడుతున్నాడు. చంద్రబాబు నాయుడా, అహ్మద్ పటేలా, సంజయ్ గాంధా అనేది పక్కన పెట్టండి వారికి ఎక్కడ నుంచి వచ్చాయి ఇన్ని వందల కోట్లు.? ప్రజలు ఆలోచించాలి. అవినీతిపరులను ఎందుకు గెలిపిస్తున్నారు. ఎవరిమీద దాడి జరిగినా చంద్రబాబు నాయుడు వారికి హెల్ప్ చేసినా అది ఫ్రూవ్ కావాలి. ఎవరు ఫ్రూవ్ చేస్తారు. సీబీఐ గానీ, ఈడీ గానీ ఎవరినైనా జైలుకు పంపారా? వాళ్లు వచ్చి బయటకు తెచ్చారు. డబ్బు తీసుకొని పార్లమెంటులో ఎంపీ ప్రశ్న వేసే పరిస్థితి ఉంది. నీతులు గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుంది. అవినీతి చేస్తే శిక్షించండి. అన్ని రాజకీయ పార్టీలు నీతివంతంగా ఉండాలని కోరుకుందాం. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారిన అవినీతి పోతేనే దేశం బాగుపడుతుంది. బీజేపీ ముగ్గురితో ఆడుకుంటుంది. ఎవరికి వారు సపోర్ట్ చేస్తున్నట్లు వారనుకుంటున్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన మూడిటిని వాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో జత కట్టకపోతే ఖచ్ఛింతంగా ఈ దాడి లేదు. రాజకీయ కక్ష సాధింపు చర్య.
సుగాలీ విషయంలో పవన్ స్పంనని, ప్రభుత్వం స్పందనని అభినందించాలి. పవన్ ఫుల్ టైమ్ రాజకీయాల్లో ఉంటే మంచి స్పందన వస్తుంది. కమ్యూనిస్టులు ఏం ఆశించి ఇంత కాలం నుంచి రాజకీయాల్లో ఉంటున్నారు. అన్ని విషయాలపట్ల స్పందిస్తారు. అగ్రి గోల్డ్, రాజధాని రైతుల విషయంలో పోరాడుతున్నారు. ఎవరైనా ప్రజల మధ్య ఉండాలి. సీట్లు లేకపోయినా.


                            
పట్టాభి – టీడీపీ
ఐటీ వాళ్లు రమ్మన్నా, కోర్టుకు వెళ్లాలన్న ఏదో ఒక సాకులు చెప్పడం ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం. శుక్రవారం శుక్రవారం కూడా ఏదో ఒక సాకు. ఆ ట్రెండ్ సృష్టించిందే జగన్ గారు. మిగతావాళ్లు కూడా గమనించవచ్చు. అహ్మద్ పటేల్ గారికి నోటీస్ ఇస్తే అది కాంగ్రెస్ పార్టీ వ్వవహారం. మీరు ఎన్ని దాడులైనా చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వస్తారా? రండి. మేం ఐటీ వారిని ఇన్వైట్ చేస్తాం. హెరిటేజ్, టీడీపీ కార్యాలయం, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వస్తారా ఐటీ వారు రండి. రూ.400 వందల కోట్లు అహ్మద్ పటేల్ వ్యవహారం మాకు సంబంధంలేదు. మేం స్పందించవలసిన అవసరంలేదు. రూ.40వేల కోట్లు అక్రమ సంపాదనపై చార్జిషీట్లు వేయించుకున్నారు.  శ్రీనివాస్ గారి ఇంటిపై దాడి చేసినప్పుడు అహ్మద్ పటేల్ గారితో లింకులు దొరికాయని ఐటీ వారు ఏమైనా చెప్పారా?  గాలి వార్తలు మేం నమ్మం. దాడి సందర్బంగా అమ్మద్ పటేల్ పేరు వచ్చిందా?   మా ఆరోపణలు అన్ని నిజాలని ఎన్నికల అఫిడవిట్ ద్వారా జగన్ గారు ఒప్పుకున్నారు. మేం ప్రజాచైతన్య యాత్ర చేస్తున్నాం. ఆ కరపత్రంలో ఎక్కడైనా జగన్ గారి గురించి రాశామా? కేసులు గురించి జనానికి తెలుసు. ఆ కథ మళ్లి చెప్పవలసిన అవసరంలేదు. నవ మాసాల పాలన నవమోసాల పాలన. అనేక రగాల రద్దులు, మోసాలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు.   ప్రజా సమస్యలపై ప్రజల్లోకి వెళుతున్నాం. మాపై జ్యుడిషియల్ విచారణ వేయమని అడుగుతున్నాం. ఎందుకు వేయరు. సిటింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎక్వైరీ వేయండి. మామీద కేసులు వేనందునే దేశం మొత్తం బలపం కట్టుకొని తిరుగాం. రాష్ట్రం కోసం.
సుగాలీ ప్రీతి కేసు విషయమై ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. జిల్లా కలెక్టర్ నాయకత్వంలో విచరణ కమిటీ వేశారు. నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ రోజు సీబిఐ విచారణకు ఆదేశించినందుకు అభినందిస్తున్నాను. సీబీఐ విచారణ కోసం సునీతమ్మ గారు కోరుతున్నారు. జగన్ గారు వద్దంటున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి కేసు కూడా సీబీఐకి ఇవ్వాలని అడుగుతున్నాం. సుగాలీ విషయంలో మేం ఫెయిల్ కాలేదు. విచారణ జరిగింది. పవన్ కల్యాణ్ గారు మా దృష్టికి తీసుకువచ్చిన విషయాలలో మేం స్పందించాం. 15 రోజులు ముందు 3న వంబర్ న లాంగ్ మార్చ్ చేస్తున్నట్లు పవన్ గారు ప్రకటించారు. చేశారు.  14 నవంబర్ న చంద్రబాబు గారు విజయవాడలో ఇసుక దీక్షకు కూర్చున్నారు. ఆ రోజు నుంచే ఇసుక వారోత్సవాలు ప్రకటించారు జగన్ గారు. పవన్ గారి మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని విషయాలపై స్పందించి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ రోజు చైతన్య యాత్ర చేస్తున్నారు. పవన్ గారు అమరావతి గురించి కూడా గట్టిగా అడుగుతున్నారు. బీజేపీ అది కూడా చూడాలి.
గుంటూరులో మైనర్ బాలికపై అత్యారం జరిగితే దిశ కేసు పెట్టారా?

తెలకపల్లి రవి – సీనియర్ జర్నలిస్ట్
ఏ తీగ ఎప్పుడు మీటాలి, ఎప్పుడు లాగాలి అనేది రాజకీయ అవసరాల ప్రకారం నిర్ణయిస్తారు. బీజేపీ వచ్చిన తరువాత ఈ ధోరణి బాగా పెరిగింది. రాకేష్ అస్తనా, అలోక్ వర్మల మధ్య జరిగిన ఘోరమైన వ్యవహారం ఎవరైనా పట్టించుకున్నారా? బీజేపీ వద్ద అక్షింతలు, ఖక్షింతలు ఉంటాయి. రక్షింతలు ఉంటాయి.  టెలికం కంపెనీలు 1.87 లక్షల కోట్లు ఎగవేసినందుకు సుప్రీం కోర్టు అక్షింతలు వేసింది. ఈ వ్యవస్థలో ఎందుకు పని చేస్తున్నానో నాకే అర్ధం కావడంలేదని జడ్జి గారు అన్నారు. కార్పోరేట్లను కాపాడటం ఒక క్రమపద్దతిలో జరిగితే బాగుంటుంది. బీజేపీ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో తెలియదు. ఈ విషయంలో బీజేపీ రికార్డు. చంద్రబాబు పీఏ వద్ద కాగితాలు దొరికితే ఆయన పేరు ప్రస్తావించకుండా ఉండరు. వైసీపీ, టీడీపీ ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారు. ఆ డైరీలో ఏముందో టీడీపీ వారికి తెలుసు వారు మాట్లాడరు. చంద్రబాబు కేంద్రం గురించి మాట్లాడరు. ఇది వైసీపీ, టీడీపీ వార్. నిజాలు బయటకు రావు. నిజాలు బయటపెట్టకపోతే బీజేపీది తప్పు. ఐటీ, సీబీఐ, ఈడీ ఉస్కోఉస్కో అంటే వెళుతున్నారు. పెద్దవారిని పట్టుకోలేదు. టీడీపీ బీజేపీని విమర్శించడంలేదు. వారికి చంద్రమండలం, వీరికి జగన్నాటకం. శుక్రవారం విషయం ఎంతో కాలంగా చెబుతూనే ఉన్నారు. ఆయన ప్రతిపక్ష నాయకుడు, సీఎం కూడా అయ్యారు. స్టే కోరడానికి చంద్రబాబుకు ఎంత హక్కు ఉందో, శుక్రవారం మినహాయింపు ఇవ్వమని అడిగే హక్కు జగన్ గారికి ఉంటుంది. అదేదో మహాపాపంలా... దేశంలో అత్యధిక కార్పోరేట్ నిధులు బీజేపీకే వెళ్లాయి. 6వేల కోట్లు, 60,70 శాతం వెళ్లాయి. ప్రపంచంలో రిచ్చస్ట్ పార్టీ బీజేపీ. కాంగ్రెస్, రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలే బీజేపీకి లక్ష్యం. సీబీఐ విషయంలో వారికి స్థిరత్వంలేదు. మోడీతో బాగుంటే సీబిఐ రైటు.  దాడి జరిగిన తరువాత నేను చెప్పింది నిజమైందని చంద్రబాబు గారు చెప్పారా?
పవన్ కల్యాణ్, జనసేన కృషిని అభినందించాలి. పవన్ కు జనాకర్షణ ఉంది.  గతంలో పవన్ ని మీడియాలో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. గతంలో కార్పోరేట్ కళాశాలల్లో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. జగన్ ప్రభుత్వాన్ని కూడా అభినందించాలి. ఇసుక సమస్య కూడా అందుకున్నారు. పవర్ స్టార్ అయినందున అభిమానులు ఎక్కువగా ఉంటారు. ఆ సుగాలీ సభలో సీఏఏసి సమర్ధిస్తూ మాట్లాడటం అసందర్భం. కాస్త ఆలోచనాత్మకంగా మాట్లాడితే మంచిది.

షేక్ బాజీ – బీజేపీ
70 ఏళ్లు పెద్ద పార్టీ పాలించింది.  తప్పు జరిగినప్పుడు ప్రక్షాళన చేసే దిశగా వెళ్లలేదు. ఎంసీఐ ఉండేది. చేతన్ ఫరేక్ ఇంట్లో కోట్లాది రూపాయలు దొరికాయి. సీట్లు అమ్ముకోవడం గొడవలు జరిగాయి.  ఈ తరువాత దానిని ప్రక్షాళన చేయాలనుకున్నారు.  ఆర్బీఐ వ్యవహారంలో కూడా దారుణాలు జరిగాయి. తమిళనాడులో జరిగిన దాడుల్లో శంకర్ రెడ్డి వద్ద రూ.200 కోట్లు దొరికాయి.  జనం వద్దకు రాకముందే ఆర్బీఐ సెస్ నుంచి నేరుగా డబ్బు అతని వద్దకు వెళ్లింది. చర్య తీసుకోవాలి. 2018లో ఐటీ దాడులు జరిగితే రాష్ట్రానికి రావద్దన్నారు. కేంద్రంలో సంబంధాలు తెగిన తరువాత చంద్రబాబు నాయుడు నన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను మీరే కాపాడాలని అనేవారు. అటువంటి ముఖ్యమంత్రి పీఏ వద్ద దొరికాయి. ఆ డైరీ, కాగితంలో మూడు కంపెనీలకు నగదు బదిలీ అయినట్లు ఉంది. అడ్డగోలుగా చేసిన ప్రాజెక్టుల డబ్బు ఐటీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. భారత జాతి మొత్తం ఒకే విషయం నమ్మింది. వాజ్ పాయ్, నరేంద్ర మోడీ నిజాయితీపరులు. 2014 నుంచి 2019 వరకు ఒక్క మచ్చలేకుండా పాలన చేశారు. 70 ఏళ్లపాటు తినితిని ఉన్నవారు అలాగే మాట్లాడతారు. పది విషయాలలో 9 మంచి విషయాలను గుర్తించాలి. ఎంసీఏ, ఆర్బీఐ, జీఎస్టీ..... ఇవన్నీ మేం చేసినవే. పట్టుకున్నదాకా దమ్ముంటే పట్టుకోండని అంటారు. తరువాత కక్ష సాధింపంటారు.
2018లో 8 రాష్ట్రాల్లో ఐటీ దాడులు జరిగాయి. అంతకు ముందు కూడా బీజేపీ, టీడీపీ మధ్య విపరీతమైన బంధంలేదు.
 ప్రారంభంలో పవన్ గారికి స్పష్టత ఉంది. ఆ నాడు ఇసుకపై చేశారు. ఉద్దానం విషయంలో కృష్ణా జిల్లా కొండూరు మండలంలో కూడా ఉంది. పవన్ వెళ్లిన తరువాత చంద్రబాబు స్పందించారు.  కన్నా గారు కూడా ఇసుకపై చేశారు. 2007లో విజయవాడ నగరంలో  ఆయేషామీరా ఘటనను రెండు రాజకీయ పార్టీలు వాడుకున్నాయి.

రాజశేఖర్ – వైసీపీ
సీబిఐ గురించి గతంలో మేం కూడా మాట్లాడాం. జగన్ గారికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కలిసి ఫిర్యాదు చేశారు. విచారణ జరుగుతోంది. గతంలో పాలకులు ప్రత్యర్థులుపై దాడులు జరిగినప్పుడు సీబీఐ చాలా మంచిదని చెబుతారు. వారికి వచ్చేసరికి వేరేగా మారుతుంది. కాంగ్రెస్ పాలనలో కూడా దాడులు జరిగాయి. ఇప్పుడు వారు కూడా విచారణకు హాజరుకావాలి.  జగన్ గారిపై కేసులు పెట్టినప్పుడు బాగుందన్నారు.  వారిపై విచారణ జరిగే సమయంలో సీబిఐ రాష్ట్రంలోకి రాకూడదన్నారు. జగన్ గారు వచ్చిన తరువాత అనుమతించారు. గతంలో చంద్రబాబు గారు హైదరాబాద్‌లో అవుటర్ రింగ్ రోడ్డుపై సీబీఐ విచారణ కోరారు. ఇప్పుడు  కేంద్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తే చేయగలిగిందిలేదు. రూ.2వేల కోట్లు అక్రమ లావాదేవీలు జరిగినట్లు నోట్ వచ్చింది. దానిపై విచారణ జరపాలి. నేరస్తులను శిక్షించాలి. రాజకీయ ప్రయోజనాలకు ఏమైనా చేస్తే ......
చంద్రబాబు బీజేపీతో కలిసినప్పుడు ఇటువంటి మాటలు వినలేదు. విడిపోయిన తరువాత అనివార్యంగా కాంగ్రెస్ పంచన చేరారు. చంద్రబాబు నాయుడు వచ్చి మా కొంప ముంచాడు లేకపోతే మేం అధికారంలోకి వచ్చేవారమని తెలంగాణలో కాంగ్రెస్ వారంటున్నారు. చంద్రబాబు విడిపోయిన తరువాత మోడీని టార్గెట్ చేశారు. అనేక ఆరోపణలు ఉన్న ఆయన పార్టీలోని వ్యక్తులు బీజేపీలో చేరారు. తెలుగుదేశం పార్టీ వారికి ప్రతిరోజు జగన్ గారి పేరు తలవడమే. వేరే సబ్జెక్ట్ లేదు వారికి. వేరే ఆరోపణలేదు. వ్యాపారాలకు సంబంధించి ఏదో కేసు కోర్టులో నడుస్తోంది. పదే పదే ఎందుకు మాట్లాడుతున్నారు? ఎన్నికల ముందు ఇదే చెప్పారు. ప్రజలు బుద్ది చెప్పారు గదా. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఎవరికి ఎలా బుద్ది చెప్పాలో తెలుసు. పార్టీలు, నాయకులు కూడా మారాలి. జగన్ గారు గతంలో రెగ్యులర్ గా వెళ్లారు. సీఎం అయిన తరువాత పనులు ఉన్నందున కొంత వెసులుబాటు కోరారు. దానిని తప్పుగా భావిస్తే ఎలా? చంద్రబాబు నాయుడుపై 18 కేసులు ఉంటే స్టేలు తెచ్చుకున్నారేగానీ కోర్టుకు హాజరైయ్యారా? ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయారు. అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, ధ్వంసం చేశారు. మోడీ గారితో విభేదాలు రావడంతో ఆయనకు వ్యతిరేకంగా దేశమంతా తిరిగి డబ్బు పంచుతూ...  
ఆగస్ట్ 27, 2017లో సుగాలీ ప్రీతి ఘటన జరిగింది. ఆ రోజు పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నారు? ఆ రోజు ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీయలేదు.? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు. డిమాండ్ చేయడం మంచిదే. ఆయన నటుడు. చిరంజీవి గారి బ్యాంగ్రౌండ్ ఉంది. ఆయనకు ఇమేజ్ ఉంది. ఉద్దానం సమస్య తీసుకువచ్చారు. దానిని పూర్తిగా స్పందన రాలేదు. మేం అధికారంలోకి వచ్చిన తరువాత రూ.500 కోట్లు ఇచ్చాం.   ఇటువంటి సంఘటనలపై ఉక్కుపాదం కోసమే చట్టం దిశ తెచ్చాం. సుగాలీ ప్రీతికి సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్ద ఉంది.  ఏ పార్టీ సూచనలు ఇచ్చినా తీసుకుంటాం. దిశ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.


 శివశంకర్ – జనసేన
సుగాలీ ప్రీతి కేసులో న్యాయం జరుగుతుంది.  వారి హక్కులను హరించడం .. దురహంకారాం. సమాజానికి ఒక డైరెక్షన్ ఇచ్చారు పవన్ కల్యాణ్ గారు. సామాజిక సంకేతం. మాకు ఎవరూ లేరని దిక్కులేని విధంగా ఉన్నవారికి పవన్ కల్యాణ్ గారు న్యాయం చేశారు. పవన్ గారు మంచి చేశారంటే రాజశేఖర గారికి కడుపు మంట. ఆ రోజు జగన్ గారు ఏం మాట్లాడారు. ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు. మీరు అభినందించినా అభినందించకపోయినా ప్రజలు గుర్తిస్తారు. విచారణకు ఆదేశించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ పవన్ గారు  ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.



No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...