Feb 5, 2020

మూడు రాజధానులు – పార్లమెంటులో ప్రకటన



ఛానల్ - టీవీ - ఏపీ 24X7 - తేదీ: 05.02.2020 బుధవారం ఉదయం 7.30 గం.
అంశాలు :   మూడు రాజధానులు – పార్లమెంటులో ప్రకటన

బ్రహ్మం చౌదరి – టీడీపీ
రాష్ట్రం మధ్యలో అమరావతి ఉంది. ఆ రోజు చట్ట సభలలో ప్రాతినిధ్య వహించని సీపీఐ, సీపీఎం, ప్రాతినిద్యం వహించిన వైసీపీ, బీజేపీ కూడా అమరావతిని అంగీకరించాయి. అసెంబ్లీలో అంగీకరించారు. వారు అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి నోటిఫై చేయలేదని, ఒకే సామాజిక వర్గం అనే అంశాలను లేవనెత్తారు. అమరావతిని నోటిఫై చేసింది కేంద్రం. ప్రజల మనసులో కూడా అమరావతి ఉండిపోయింది. వైసీపీ వాళ్లు వారి రాజకీయ లబ్ది కోసం ఇన్ సైడ్ ట్రేడింగ్, నోటిఫై, సామాజిక వర్గం, హైమావతి, ఎడారి, శ్మశానం ....రకరకాల వ్యాఖ్యాలు చేశారు.  అక్కడ నుంచే వారు కూడా పరిపాలన కొనసాగిస్తున్నారు. 50 రోజులుగా ఆందోళన జరుగుతున్నాయి. అమరావతి నోటిఫై అయినట్లు కేంద్రం తెలిపింది. అసెంబ్లీలో తీర్మానం కేంద్రానికి పంపారో లేదో తెలియదు. జీఎన్ రావు గారి కమిటీలోని వాస్తవాలను దాచిపెట్టారు. (రాజశేఖర్ కు కౌంటర్ బాగా ఇచ్చారు.) ప్రజలకు వాస్తవాలు చెప్పడంలేదు.
వైసీపీ కార్యకర్తలను ఆర్కే గారు సీఎం వద్దకు తీసుకువెళ్లారు. పృధ్వీగారు రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. నిన్న రైతులు అని వెళ్లి జగన్ గారికి శాలువ కప్పింది ఆర్కే గారి లాయర్ చౌడిశెట్టి నిర్మల గారు. కొడాలి నాని గారి పక్కన కూర్చున్న వ్యక్తి తాడేపల్లి మున్సిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్ వేణుగోపాల స్వామి రెడ్డి. తరువాత ఆర్కే గారి బాబాయి భాస్కర రెడ్డి గారు, ఆయన బావమరిది శ్రీనివాస రెడ్డి(వైసీపీ మాజీ జెడ్పీటీసీ తాడేపల్లి మండలం), ఆయన బావమరిది నాగి రెడ్డి గారు, సాంబిరెడ్డి. ఫొటోలతో సహా వారి ఆధార్ కార్డుల చూపిస్తున్నాను.  ఆ పార్టీ కార్యకర్తలను తీసుకువెళ్లి శాలువాలు కప్పితే వారు నిజమైన రైతులా? అక్కడ 30 మంది చనిపోయారు. వారికి ఒక్క గజం భూమిలేదు. వారంతా తాడేపల్లి వాసులు. ఆర్కే కుటుంబ సభ్యులతో సీఎం టీ పార్టీ అది. వెంకటపాలెంలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కృపానందం అనే రైతు 25 రోజులు దీక్ష చేశారు. ఆయన చనిపోయిన రోజు కూడా అక్కడ వైసీపీ జెండా ఎగిరింది. ఈ ఆర్కే గానీ, శ్రీదేవి గానీ  కనీసం తొంగికూడా చూడలేదు. వారిలో ఒక్కరు కూడా భూమి ఇవ్వలేదు. వారు రైతులు ఎలా అవుతారు?
రైతులు ఎవరి ఉచ్చులో లేరు.


రాజశేఖర్ – వైసీపీ
కేంద్ర సమాధానం స్పష్టంగా ఉంది. బీజేపీ కేంద్ర నాయకులు ఏమి చెప్పారో సమాధానం కూడా పార్లమెంటులో అదే ఉంది. కేంద్రం జోక్యం చేసుకోదని జీవీఎల్ గారు చాలా సార్లు చెప్పారు. అధికారికంగా స్పష్టంగా చెప్పారు. పార్లమెంటులో స్పష్టమైన తరువాత ఇప్పటికైనా టీడీపీ గానీ, ఇతర పార్టీలు గానీ పద్దతి మార్చుకోవాలి. బీజేపీ కూడా కేంద్రం, రాష్ట్ర పార్టీ నాయకత్వం సరిదిద్దుకోవలసిన అవసరం ఉంది. రాజధాని రైతులను ఇంకా మోసం చేయడం మానుకోవాలి. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. భవిష్యత్ లో కూడా కేంద్రం వైఖరి ఇలానే ఉంటుంది.
జీఎన్ రావు, బోస్టన్, మంత్రుల కమిటీల సూచనల మేరకే నిర్ణయాలు తీసుకున్నాం. బీజేపీ వారు విమర్శలకు మాత్రమే పరిమితమవుతున్నారు. రాష్ట్రాభివృద్ధికి వారు కృషి చేయడంలేదు. కేంద్రంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. శివరామకృష్ణణ్ కమిటీ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. నారాయణ కమిటీ నివేదికను మాత్రమే ప్రదేశ పెట్టారు.
రైతులు చంద్రబాబు నాయుడు ఉచ్చులో నుంచి బయటకు రావాలి. ఆయన గ్రాఫిక్ చూపించి రైతులను మోసం చేశారు. మళ్లీ మోసం చేయడానికి చూస్తున్నారు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వ్యవసాయం చేసుకుంటే చేసుకోండని సీఎం రైతులకు చెప్పారు. బాల్ వారి కోర్టులోనే ఉంచారు. రైతులు టీడీపీ, ఇతర పార్టీల కబంధ హస్తాల నుంచి బయటపడాలి.
రెడ్డి సమాజిక వర్గంలో రైతులు ఉండరా?
పార్టీలు సిద్ధాంతాలు మాకు అవసరంలేదు. ప్రజా సమస్యలే మాకు ముఖ్యం.

ఎంఏ గఫూర్ –సీపీఎం
ప్రశ్నకు రాతపూర్వక సమాధానం మాత్రమే ఇచ్చారు. చర్చ జరగలేదు. రాతపూర్వక సమాధానం క్లుప్తంగా ఇస్తారు. బీజేపీ తీరుపట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. కిషన్ రెడ్డి గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం అంశం, అయినా పరిశీలిస్తామని చెప్పారు. బీజేపీ రాష్ట్ర యూనిట్ మొత్తం అమరావతి ఉండాలని చెప్పారు. బీజేపీకి రెండు నాలుకలు ధోరణి అలవాటే. కన్నా ఒక మాట చెప్పారు. జీవీఎల్ ఒకటి చెబుతారు. ప్రజలను ఫూల్ చేయడానికా? బీజేపీ ఒకే నిర్ణయానికి రావాలి. రెండు నాలిక ధోరణితో రాష్ట్రాన్ని  నాశనం చేస్తున్నారు. ఈ ప్రపంచంలో జగన్ ఇంకొకరి మాట వింటారని నేను అనుకోవడంలేదు. కేంద్రం అధికారయుతంగానైనా జోక్యం చేసుకోవాలి. లేదా కోర్టుకు వెళ్లాలి. వైసీపీకి నైతిక అధికారం లేదు. విజయవాడలో రాజధాని అనేదానికి అంగీకరించారు. రాష్ట్ర రాజధానిని మారుస్తామని ఎన్నికల ప్రణాళికలో లేదు. ఎమ్మెల్యేల బలం ఉండవచ్చు నైతికంగా బలంలేదు. ఏ ముఖ్యమంత్రి అయినా అలా ప్రవర్తించలేదు. చంద్రబాబు నాయుడుని ఆ రోజు బలపరచలేదు. ఈ రోజు బలపరచలేదు. రాజధాని మీ సొంతమా? అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయమంటే చేయలేదు. రాజధాని పార్టీ విషయం కాదు. ప్రజల విషయం. అధికారం ఇచ్చింది వాస్తవం. మీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం మంచిపద్దతి కాదు. మీ ముఖ్యమంత్రి ఎవరితో కలవరు. ఏ పార్టీతో మాట్లాడరు. రాజశేఖర రెడ్డి రోజుకు వెయ్యి మందిని కలిసేవారు. రాష్ట్రంలో మళ్లీ చిచ్చు పెడుతున్నారు. మీ మంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తారు? రైతులతో మాట్లాడండి. కౌన్సిల్ లో మెజార్టీ లేదు. దానిని ఒప్పుకోరు. దూకుడుగా పోయారు. కోర్టులో కేసు.  తీర్మానం కేంద్రానికి పంపలేరు. కౌన్సిల్ లో మీకు మెజార్టీలేదని తెలుసు కదా.  బీజేపీ మెజార్టీ వచ్చేంతవరకు ఆగారు. మీరు కూడా ఆ రకంగా చేసి ఉండాల్సింది.

రామకోటయ్య – బీజేపీ
ఏప్రిల్ 23, 2015న అమరావతి రాజధానిగా ఏపీ గెజిట్ నోటిఫికేషన్.
పార్లమెంటులో  ఎంతవరకు ప్రశ్న అడిగారో అంతవరకు సమాధానం చెప్పారు. చాలా స్పష్టంగా చెప్పారు. రాష్ట్రాల కు అధికారం ఉంది. 2015లోనే ఆ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. వారికి 151 సీట్లిచ్చారు ప్రజలు. ఈ విషయంలో కేంద్రం కలుగజేసుకుంటే ఏపీపై కేంద్రం పెత్తనం అని రాస్తుంది మీడియా. చంద్రబాబు నాయుడు గారు తాత్కాలిక రాజధాని అన్నారు. అలాగే తాత్కాలిక రాజధాని అవుతుంది. పక్క రాష్ట్రంలో కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని రాజకీయం చేస్తున్నారు. ఎవరు ఏం చేయగలుగుతున్నారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు గండిపేట నుంచి చేశారు. ప్రజలు ఓటు ద్వారా సరైన నిర్ణయం తీసుకోకపోవతే రాజకీయ నాయకుల విన్యాసాలు ఇలాగే ఉంటాయి.
ఒక ప్రేలాపన చేసినప్పుడు దానికి విధివిధానాలు ఉంటాయి. అమరావతి మాకు ముఖ్యం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టంగా చెప్పారు. వైసీపీ వారు మాత్రం కేంద్రం ఆశీస్సులు మాకు ఉన్నాయని చెబుతున్నారు. ప్రజలు నమ్మకంతో అవకాశం ఇచ్చారు. దీనిని అవకాశం తీసుకొని విశాఖపట్నం, యలమంచిలిలో పెడతామంటే ప్రజలు మౌనంగా రోధిస్తారు. ఇవన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి. కోర్టు ఫిబ్రవరి 26 వరకు కార్యాలయాలు మార్చవద్దని హైకోర్టు చెప్పింది.
సీఎం జేఏసీని పిలవకుండా వారికి అనుకూలంగా ఉన్న కొందరు రైతులను పిలిచి వారికి హామీలు ఇచ్చారు. జేఏసీ నేతలను పిలవాలి. లేదా వారి వద్దకు వెళ్లి మాట్లాడాలి. ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలతోనే మాట్లాడటంలేదు. అనుకూలమైనవారితో మాట్లాడితే ప్రయోజనం ఉండదు.

బొలిసెట్టి సత్యనారాయణ – బీజేపీ
సమాధానంలో క్లారిటీ ఉంది. అక్కడ చర్చ జరగలేదు.  మా ప్రభుత్వం వద్ద అమరావతి కేపిటల్ అని ఉంది. 3 రాజధానులు మీడియాలో చూశాం అన్నారు. ఏక పక్షంగా జగన్ రాజధానిని మార్చవచ్చా? టెక్నికల్ గా కరెక్టే. మోరల్ గా ఆలోచన చేయాలి. రాజధాని ఇక్కడే ఉంటుందని మీరు హామీ ఇస్తారా? అని చంద్రబాబు నాయుడుని 2015లోనే పవన్ ప్రశ్నించారు. జగన్ గారు తీసుకునే నిర్ణయాల వల్ల
ఏపీ గ్రోత్ దెబ్బతింటుంది. నిత్యానంద రాయ్ అమిత్ షా కాదు, మోదీ కాదు. రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి ప్రశ్నిస్తే కుదరదని, కేంద్రంతో సంప్రదించాలని చెబుతారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని నేను కూడా ఆరోపించాను. దానిమీద విచారణ జరిపించండి. రాజు మారినప్పుడల్లా రాజధానిని మార్చుకుంటూ పోతే ఎలా? సీఎం ప్రజలకు ఏది మంచిదైతే అదే చేయాలి. చంద్రబాబు నాయుడుని, పవన్ ని టార్గెట్ చేస్తూ చేయకూడదు.

పూల విక్రమ్ – సీనియర్ జర్నలిస్ట్
గల్లా జయదేవ్ గారు ప్రశ్న మరికొంత బెటర్ గా వేస్తే బాగుండేదని నేను అనుకుంటున్నాను. పార్లమెంటులో కేంద్ర మంత్రి అసలు విషయం దాచి, లేని విషయం చెప్పారు. మూడు విషయాలు స్పష్టమయ్యాయి. అమరావతి నోటిఫై అయిందని వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని తెలిసింది. బీజేపీ రాష్ట్ర నాయకులు గంభీరమైన ప్రకటనలు చేశారు. వారి కేంద్ర నాయకత్వం వద్దకు వెళ్లి తీవ్రతని వారి దృష్టికి తీసుకువెళ్లడంలో పూర్తి వైఫల్యం. పవన్ వెళ్లినా ఏమీ జరగలేదని తెలిసింది. ఇది చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ నాయకత్వం కేంద్రం నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లాలి. 
రైతులను సీఎం వద్దకు తీసుకురావడం అనేది రాజకీయం వ్యవహారం. వైసీసీ తప్ప మిగిలిన పార్టీలు రాజధానిని అమరావతి నుంచి తరలించడానికి ఇష్టపడటంలేదు. అయితే రైతులకు భరోసా ఇచ్చిన ఇతర పార్టీలు  బీజేపీ, జనసేన రాజకీయ కార్యక్రమాలు ఏమీ లేకపోవడం ఆశ్ఛర్యంగా ఉంది. సీపీఐ, సీపీఎంలు కూడా రావడంలేదు.  రైతుల మానాన రైతులను వదిలివేశారు.  కోర్టులు చెప్పినా వారు వినిపించుకోవడంలేదు. వారి దారిలో వారు వెళుతున్నారు.


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...