Feb 27, 2020

పౌరసత్వ సవరణ– విశాఖలో చంద్రబాబు పర్యటన - సినీ పరిశ్రమ తరలిరావడం


టీవీ 24X7 - తేదీ: 27.02.2020 గురువారం ఉదయం 7.30 గం. నుంచి
అంశాలు :  పౌరసత్వ సవరణ చట్టం – 27 మంది మృతి -  విశాఖలో చంద్రబాబు పర్యటన —
              సినీ పరిశ్రమ తరలిరావడం --
యాంకర్ :  కృష్ణ సాయి రామ్

చెవుల కృష్ణాంజనేయులు – సీనియర్ జర్నలిస్ట్
ఢిల్లీలో అల్లర్లు దేశప్రజానికాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. శాంతిభద్రతలకు రాజకీయ పార్టీలు కృషి చేయవలసిన అవసరం ఉంది. రెచ్చగొట్టే ప్రసంగాల వల్లే అల్లర్లు జరుగుతున్నాయని బీజేపీ వారు అంటున్నారు. కాని కపిల్ మిశ్రా దగ్గర నుంచి గోలీమార్ అనే నినాధాలతో . కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూడ్, రమేష్ శర్మ వంటి వారు బాధ్యతాయుతంగా రెచ్చగొట్టేవిధంగా మాట్లాడారు. కేంద్రంలో  అధికారంలో ఉన్నవారే ఆ విధంగా మాట్లాడుతున్నారు. కేంద్రం, ఇంటిలిజన్స్ ఫెల్యూర్స్ ఉంటే సరిదిద్దుకోవచ్చు. ఇక్కడ ఫయిల్యూర్ కాదు.కావాలని చేస్తున్నారు. రజనీకాంత్ ఎన్ఆర్సీని సపోర్ట్ చేశారు. కేంద్రం వైఫల్యం ఉంది సరిదిద్దుకోమని ఈరోజు చెబుతున్నారు. కేంద్రం స్పందించాలి. అమిత్ షాని రాజీనామా చేయమనండం రాజకీయం కావచ్చు. వారు ఢిల్లీ వెళ్లి అందరినీ శాంతింపచేయాలి. ఇంకొక్క ప్రాణం కూడా పోకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలి.
అభివృద్ధి వికేంద్రీకరణ అనేది వైసీపీ వాదన, దానిని వీరు వ్యతిరేకిస్తున్నారు. ఎవరి వాదన వారు వినిపిస్తారు. చంద్రబాబు పర్యటనని ప్రజలు వ్యతిరేకిస్తుందని, ఘర్షణలు జరుగుతాయని భావిస్తే  పోలీసులు ఆంక్షలు పెట్టవచ్చు. ఇదే జగన్ గారు విశాఖలో పారిశ్రామికవేత్తల సమావేశం జరిగే సమయంలో అడ్డుకోవడానికి వెళ్లి నేను ముఖ్యమంత్రిని కాబోతున్నాను, మీరు ఆపడం సరైనది కాదు. అప్పుడు ప్రభుత్వ తప్పు చేస్తుందని ప్రతిపక్ష నేతగా మాట్లాడారు. ఈ రోజు ఇలా చేయడం మంచిదికాదు. చంద్రబాబు నాయుడు వెళ్లేటప్పుడు అక్కడ కంధకం తవ్వారు. ప్రజలు నిర్ణయించుకుంటారు. మీరెందుకు షరతులు విధించడం. ఈ విషయంలో ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది.  
గత ప్రభుత్వం ప్రతిపక్షనేతని అడ్డుకుందని అంటున్నాం. ఇప్పుడు అదే రకంగా వైసీపీ వ్యవహరించడం ఏమిటీ? రేపు మీ మీద కూడా అలాంటి విమర్శలే వస్తాయి.
సినీప్రముఖులు సీఎంని కలవడం మంచిదే. సినీపరిశ్రమకు అనువైన ప్రాంతం ఉత్తరాంధ్ర. అందరికీ ఉపయోగంగా ఉంటుంది. రాష్ట్రాభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది. విశాఖ, నెల్లూరు రెండు ప్రాంతాలు సినీపరిశ్రమలకు అనుకూలం అన్న ఆలోచనలు వచ్చాయి. నగరానికి దూరంగా, వినియోగంలేని ప్రభుత్వ భూములు వారికి ఇస్తే బాగుంటుంది. సినీపరిశ్రమ, సాఫ్ట్ వేర్, ఆర్థిక పరంగా విశాఖకు అనుకూలంమైన ప్రాంతం. ఆ రకంగా దానిని అభివృద్ధి చేస్తే బాగుంటుంది.  


కాకుమాను రాజశేఖర్ – వైసీపీ
దేశ రాజధాని నడిబొడ్డున 27 మంది మరణించడం దురదృష్టకరం. ఈ ఉద్యమాన్ని ఇంటిలిజన్స్ వర్గాలు ఎందుకు పసిగట్టలేకపోయాయి. రాజధానిలో ఇటువంటి ఘటనలు దేశభద్రతకు సంబంధించినది. కఠిన నిర్ణయాలు, చర్యలు తీసుకుంటే బాగుండేదని మేం భావిస్తున్నాం. రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకూడదు. అన్ని పార్టీలు, కులాలు, మతాలు కృషి చేయవలసిన అవసరం ఉంది. 1984 నాటి దాడులను దేశ ప్రజలు మరచిపోలేదు. మిలటరీనైనా రప్పించి అదుపు చేయాలి. ట్రంప్ కూడా అన్ని మతాల అభిప్రాయాలను గౌరవించవలసి ఉంది. చట్టం ప్రవేశపెట్టినప్పుడు లేని పరిస్థితి వచ్చింది.
ముస్లింల మనోభావాలకు అనుగుణంగా మేం విధానం మార్చుకున్నాం. దీనిని తప్పుపట్టవలసిన అవసరంలేదు. రాజకీయప్రయోజనాలు ఆశించవలసిన అవసరంలేదు. గతం 5 ఏళ్లలో జరిగిన అవినీతి, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. దీనికి దానికి ముడిపెట్టవలసిన అవసరంలేదు.
చంద్రబాబు నాయుడు యాత్ర ప్రజల కోసం కాదు. పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం. మునిగిపోయే నావలాంటి పార్టీ నుంచి ఇతర పార్టీలలోకి నేతలు వెళుతున్నారు. జగన్ గారి నాయకత్వంలో 9 నెలల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. గత 5 ఏళ్లలో ఆయన అరాచక పాలన, దౌర్జన్యాలు ఎలా ఉన్నాయో చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓడించారు. ఈ రోజుకు కూడా సిగ్గుసెరం లేకుండా, బుద్ది జ్ఞానం లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఆయన పర్యటన వల్ల మాకేమీ నష్టంలేదు. మూడు రాజధానులపై వ్యతిరేకంగా మాట్లాడటం, జగన్ గారిపై ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మేం వ్యతిరేకిస్తున్నాం. ప్రత్యేక హోదా విషయంలో శాంతియుతంగా నిర్వహించే క్యాండిల్ ర్యాలీకి ఆయనని ఎందుకు అడ్డుకున్నారు. రన్ వేపైకి వెళ్లి అడ్డుకున్నారు లోకల్ పోలీసులు. అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టి ప్రజలకు వాస్తవాలను తెలియజేయవలసిన అవసరం ఉంది. ప్రజలు అడ్డుకుంటారు. 5 ఏళ్ల పరిపాలన చూసే ఓడించారు. అయినా మీకు బుద్ది రాలేదు. గతంలో జగన్ ని ప్రజలు అడ్డుకోలేదు. పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు మాటలు ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు. మాకు అడ్డుకోవలసిన అవసరంలేదు. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. అక్కడివారిని మోసం చేసినందుకు వారు చంద్రబాబు పర్యటనని వ్యతిరేకిస్తున్నారు.
సినిమా పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ లేదు. వారి వల్ల మేం అధికారంలోకి రాలేదు. మాకు ప్రయోజనంలేదు. గతంలో మాదిరిగా వారిని వాడుకోవలసిన అవసరంలేదు. సినీ పరిశ్రమ రాష్ట్రానికి రావడం మంచి పరిణామం. గతంలో ఒకరితరువాత ఒకరు మద్రాస్ నుంచి హైదరాబాద్ తరలి వచ్చారు. దేశంలో హైదరాబాద్ కు ఒక ప్రాధాన్యత వచ్చింది. జగన్ పరిపాలన నచ్చి, మెచ్చి వారు వచ్చి అడిగారు. వారికి రాయితీలు ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. వారి రాకను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోం.  వారి సహకారం అవసరమే. రామానాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే స్టూడియో నిర్మాణం మొదలు పెట్టారు.

బాబురావు – సీపీఎం
రెచ్చగొట్టిన బీజేపీ నాయకులపై కేసులు నమోదు చేయమని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఆయనను వెంటనే ట్రాన్సఫర్ చేశారు.అది వేరే విషయం. బీజేపీ నేతలు అమిత్ షా మొదలు ఢిల్లీ ఎన్నికలలో ఎలా మాట్లాడారో అందరికీ తెలుసు. సీఏఏ వ్యతిరేకులను పోలీసులు ఖాళీఈ చేయించకపోతే మేమే ఖాళీ చేయిస్తామని బీజేపీ నేత కపిల్ మిశ్రా మాట్లాడారు. ఆయన ప్రకటన తరువాత 48 గంటల్లో ఈ అల్లర్లు జరిగాయి. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. పోలీసులు బాధ్యత వహిస్తే చాలా మంది ప్రాణాలు కాపాడగలిగేవారని కోర్టు వ్యాఖ్యానించింది. బీజేపీ,ఆర్ఎస్ఎస్ నేతల చర్యలే. సైన్యాన్ని దించి అక్కడ శాంతి భద్రతలు కాపాడాలి. 70 రోజులుగా ఆందోళన జరుగుతున్నా ఇటువంటి ఘటనలు జరుగలేదు. సుప్రీం కోర్టు జడ్జీలతో విచారణ జరిపించాలి. గుజరాత్ మోడల్ అంటే అభివృద్ధి మోడల్ కాదు. మత విధ్వేషాలను రెచ్చగొట్టే మోడల్.

బ్రహ్మం చౌదరి – టీడీపీ
ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన అభిప్రాయాలు ఉన్నాయి. అన్ని మతాలవారిని సంతృప్తిపరవలసిన అవసరం కేంద్రంపై ఉంది. ట్రంప్ పర్యటన సంతోషకరం. 15 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు బిల్ క్లింటన్ ని పిలిపించి, డ్వాక్రా మహిళల పక్కన కూర్చోబెట్టారు. ఆయన దేశంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. అప్పుడు ఇటువంటి సంఘటనలు జరుగలేదు. ట్రంప్ వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతామంటే ఎవరూ వ్యతిరేకించరు. ఎఆర్సీ, సీఏఏ విషయంలో వైసీపీ రెండు నాలుకల దోరణిలో వ్యవహరిస్తోంది. వైసీపీ వారు అత్యధికంగా మైనార్టీ ఓట్లు వేయించుకున్నారు. ఆ పార్టీ నేతలపై వివిధ ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు.
ఈ రోజు విశాఖలో సదస్సులు ఏమైనా జరుగుతున్నాయా? గతంలో జగన్ హడావుడిగా యుద్ధ విమానం ఏసుకువచ్చి గొడవ చేయడానికి ప్రయత్నించారు. ఆ రోజు 70 దేశాల ప్రతినిధులు పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు. పెట్టుబడులు రాకుండా చేయడానికి అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించారు. ఆ రోజు పరిస్థితులు వేరు. టీడీపీ ప్రభుత్వానికి 6 నెలలు సమయం ఇద్దామనుకుండి. ఈ రోజు 9 నెలల్లో 9 మోసాలతో నయామోసగాడిగా జగన్ నిలిచాడు. చంద్రబాబు అర్ధరాత్రి ఒంగోలులో పర్యటిస్తే  లక్షల మంది జనం వచ్చారు.  రాయలసీమలో కూడా ఆయన పర్యటన విజయవంతమైంది. ఈ రోజు ల్యాండ్ పూలింగ్ రైతులను పరామర్శించడానికి వెళతున్నారు. ఇదే వైసీపీ ల్యాండ్ పూలింగ్ కు వ్యతిరేకం అన్నారు. జగన్ గారు, తన తండ్రి పాదయాత్ర చేసిన సమయంలో టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, సహకరించింది. రక్షణ కల్పించింది. అవన్నీ మరచిపోయి ఈ రోజు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయం నుంచి పెందుర్తి నియోజకవర్గ కార్యకర్తలకు చంద్రబాబు పర్యటనను ఎదుర్కోమని లేఖలు రాశారు. మంత్రి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ప్రతిపక్ష నేతగా నిరసన తెలిపే హక్కు మాకుంది. హుద్ హుద్ తుపాను సందర్భంలో గాని వారిని ఆదుకున్న చంద్రబాబు. గతంలో ఒక్క లాఠీ ఇరక్కుండా అమరావతిలో 33వేల ఎకరాలు సేకరించారు. చంద్రబాబు పర్యటనని అడ్డుకోమని ప్రజలు అధికారం ఇవ్వలేదు. అభివృద్ధి చేయమని ఇచ్చారు. చేతనైతే చేయండి లేదా మూసుకొని కూర్చొండి.
సిగ్గులేనిది, బుద్ధి లేనిది వైసీపీ వారికి. అధికార పార్టీగా ఉండి కార్యకర్తలకు అడ్డుకోమని మెసేజ్ లు పెడతారా? ఉత్తరాంధ్రలో చంద్రబాబుకు బ్రహ్మరథం పడతారని భయంతో చేశారు.
ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమ నుంచే వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మొదట సినిమాటోగ్రఫీ మంత్రిగా చేశారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి, పోలవరంపై దృష్టి పెట్టారు. చిత్ర పరిశ్రమ తరలించడానికి పలువురు ప్రముఖులతో సమావేశాలు ఏర్పాటు చేసి చర్చలు జరిపారు. ఈస్ట్, వెస్ట్, అరకు, విశాఖ సినీ పరిశ్రమలకు అనుకూలం. ఇక్కడ సినిమాలు తీస్తే రాయితీలు ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. హుద్ హుద్ తుఫాను సందర్భంగా సినీ హీరోలు ఆర్థిక సహాయం చేశారు. వారి సహాయంతో ఇళ్లు నిర్మించారు. ఆ ఇళ్ల ప్రారంభోత్సవానికి జగన్ గారిని ఆహ్వానిస్తున్నారు. దానిని మేం విమర్శించం. సినీపరిశ్రమ విశాఖ వస్తే సంతోషం.

సుందరరామశర్మ – కాంగ్రెస్
ఇది కేంద్ర వైఫల్యం. ఫండ్స్ ఎక్కడ నుంచి వచ్చాయి. ఇంటిలిజెన్స్ ఏం చేస్తున్నారు. ట్రంప్ వస్తున్నారని సంబరాలు చేసుకొని, ప్రతిష్ట దిగజారకుండా చూడవలసిన బాధ్యత వారిపై ఉందా లేదా? కొన్ని రాష్ట్రాలలో వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. ఢిల్లీలో యూపి సరిహద్దులలో అల్లర్లు. ఆ రాష్ట్రానికి కూడా బాధ్యత. మా సోనియా గాంధీ అమిత్ షాని రాజీనామా చేయమనడానికి కారణం కేంద్రం వైఫల్యం. 1984 ఘటనలకు ఇప్పటి ఘటనలకు సంబంధంలేదు. అటువంటి ఘటనలు జరుగకూడదు. అందరూ సంయమనం పాటించాలి. అక్కడ పూర్తి బాధ్యత కేంద్రానిదే. ప్రతిపక్షాలపై విమర్శలు మాని వారిని కలుపుకొని వెళ్లండి. ట్రంప్ పర్యటనలో ప్రసిడెంట్ విందుకు సోనియా గాంధీని పిలవకపోవడం తప్పు.

 కిలారు దిలీప్ – బీజేపీ
దేశ భద్రత విషయంలో ప్రతిపక్షాలు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. పౌరసత్వ చట్టానికి సవరణ మాత్రమే. వైసీపీ 22 మంది ఎంపీలు సపోర్ట్ చేశారు. తరువాత ముస్లింల పౌరసత్వానికి ఇబ్బంది కలుగుతుందన్నట్లు మాట్లాడు. చట్టం చదవకుండా మాట్లాడుతున్నారు. 27 మంది మృతికి ప్రతిపక్షాలదే బాధ్యత. సీఏఏ అంటే ఏమిటో తెలుసుకోవాలి. డిసెంబర్ 31, 2014 కి ముందు వచ్చిన 6 మతాలవారికి మాత్రమే పౌరసత్వం ఇస్తున్నాం. సీఎంలకు కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు. ఈ విషయంలో బీజేపీ వైఫల్యం చెందలేదు. ఆర్టికల్ 370 వంటి విషయాలలో ఎక్కడా అల్లర్లు లేకుండా చేశారు. 125 కోట్లు విదేశాల నుంచినిధులు వచ్చినట్లు బయటపడింది. ఇది దేశంపై దాడి. ముస్లింల ద్వారా గొడవలు తీసుకువచ్చి అలజడి సృష్టిస్తున్నారు. ఢిల్లీలో కూడా ఏనాడు లేని మత విధ్వేషాలు రెచ్చగొడుతున్నారు. అమిత్ షా గారు అక్కడ ఉన్నందుకు దేశంలో శాంతిభద్రతలు ఉన్నాయి. ఇటువంటి అల్లర్లు ఇక జరుగకుండా చూస్తారని నేను హామీ ఇస్తున్నాను. ( యాంకర్ : కపిల్ మిశ్రా వంటి వ్యక్తులను బీజేపీ అదుపు చేయలేకపోతోంది. ఆయన వ్యాఖ్యలే హింసకు దారి తీస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.) కిపిల్ శర్మ ఒక్కరి మాట విషయంలో నేను అంగీకరిస్తాను. సోనియా గాంధీని ట్రంప్ విందుకు పిలవకపోవడం వల్ల అల్లర్లు సృష్టిస్తామన్నట్లు ఉన్నాయి వారి మాటలు. దానిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడకూడదు.
రాజకీయ నాయకులు ఈ విధంగా మాట్లాడటం సరికాదు. ఓవైసీ మాటలు ఒక్కొక్కొరం నలుగురిని చంపుతాం అంటున్నారు. సెక్యులర్ భావాలు ఉన్న వారు వీటిని ఎలా ఆలోచిస్తారు. టెర్రరిజంపై ఉక్కు పాదం మోపమని ట్రంప్ అన్నారు. ఢిల్లీ అల్లర్లకు కేజ్రీవాల్ పెద్దపీట వేశారు.  షాహీబాగ్ వంటి ఘటనలు.


శ్రీరామ్ – బీజేపీ
ఎవరైనా, ఎక్కడైనా రాష్ట్రంలో పర్యటించడానికి, అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు పర్యటనని అడ్డుకోవడం సరికాదు. గత ప్రభుత్వం అలా చేసి ఉంటే జగన్ గారు పాదయాత్ర చేసి ఉండేవారు కాదు. చంద్రబాబు ప్రజలకు తెలియజెప్పడానికి వెళ్లడం ఆయన బాధ్యత. దానిని అడ్డుకోమని అధికార పార్టీ వారు పిలుపు ఇవ్వడం సరికాదు. 3 రాజధానుల అంశంలో వీళ్లు  ల్యాండ్ పూలింగ్ కు వెళుతున్నారు. కోర్టులు, కేంద్రం ఉన్నాయి. వీరు అనధికారికంగా ఏదో చేస్తున్నారు. పేదలకు పంచుతామని 6వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కి తీసుకోబోతున్నారు. గతంలో వీరే ల్యాండ్ పూలింగ్ ని వ్యతిరేకించారు. ప్రభుత్వ భూమి ఉంటే రాజధాని ఏర్పాటు చేయమని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎలా తీసుకుంటారు? ప్రభుత్వ భూమి ఉంటే చూడండి. అప్పుడు వ్యతిరేకించి ఇప్పుడు మీరెందుకు పూనుకున్నారు. అసైన్డ్ భూములు పేదలకు ఇచ్చారు. వాటిని తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ ఎవరూ స్వాగతించడంలేదు. అనేక చోట్ల ఇబ్బందులు వస్తున్నాయి. వాటిన కప్పిపుచ్చుకోవడం కోసం బొత్స గారు ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. పేదల గుడిసెలు కూలుస్తున్నారు. పంట పొలాలు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కన్నా గారు గానీ, చంద్రబాబు నాయుడు గారు గాని వారి అభిప్రాయాలు చెబుతారు. వద్దనడానికి మీరెవరు?
చంద్రబాబు నాయుడు సినిపరిశ్రమని ఇక్కడకు తీసుకురావడంలో విఫలమయ్యారు.ఆయన చొరవ చూపించలేదు. మాకేమిస్తారు అని అడుగుతారు. మద్రాస్ నుంచి హైదరాబాద్ వారికి అలా ఇచ్చే తెచ్చారు. వారి ఆలోచన అలానే ఉంటుంది. సినీపరిశ్రమని ఇక్కడకు తీసుకురావడానికి జగన్ గారు కృషి చేయాలి. చిరంజీవి, సురేష్ బాబు అందరూ ఇక్కడకు రావడానికి ప్రయత్నించండి.
ప్రభుత్వ పరంగా చొరవ తీసుకోవాలి.  ఈ పరిశ్రమ ఇక్కడకు వస్తే  ఉపాధి లభిస్తుంది. విశాఖ అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతుంది.


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...