Feb 7, 2020


రాజధానిపై జగన్ వ్యాఖ్యలు

తరలింపు కాదు... వికేంద్రీకరణే!
04-02-2020:  ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి నేతృత్వంలో కొద్ది మంది రైతులు, రైతుకూలీలు (వారంతా ఆర్కే బంధుగణమే. ఆయన బాబాయి, ఆయన బావరిది, ఆయన బావమరిది... ఉన్నారు. వారిలో ఆర్కే న్యాయవాది చోడిశెట్టి నిర్మల(ఉండవల్లి), మాజీ జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, బోసురెడ్డి, సాంబిరెడ్డి(ఉండవల్లి), వేణుగోపాలరెడ్డి(తాడేపల్లి), నాగిరెడ్డి(నిడమర్రు)... వీరంతా వైసీపీకి చెందిన వారే.) సీఎం జగన్‌తో సమావేశమయ్యారు.  సీఎం మాట్లాడుతూ, రైతుల సమస్యలు పరిష్కరించేందు కు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.  గతంలో జారీచేసిన భూసేకరణ ఉత్తర్వులు రద్దు చేయాలని, మంగళగిరి, తాడేపల్లి మునిసిపాలిటీలను మాస్టర్‌ ప్లాన్‌ నుంచి తొలగించి ఫ్రీజోన్‌గా ప్రకటించాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లి-పెనుమాక వద్ద ఒక కేంద్ర ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వ సంస్థను ఏర్పాటు చేయాలి. ఎవరికీ అన్యాయం చేయడం లేదు. అన్ని ప్రాంతాలకూ న్యాయం చేస్తున్నాం. అమరావతి అటు విజయవాడా కాదు, ఇటు గుంటూరు కాదు, ఇక్కడ సరైన రోడ్లు, డ్రైనేజీ, పైపులైన్లు లేవు.  కనీస మౌలిక సదుపాయాల కోసం ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు చేయాలి. మొత్తంగా గత ఐదేళ్లలో అమరావతి మీద ఖర్చు చేసింది రూ.5,674 కోట్లు మాత్రమే. లక్ష కోట్లు అవసరమైనచోట రూ6వేల కోట్లు ఖర్చుపెట్టడం సముద్రంలో నీటిబొట్టే. రాజధాని రైతుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం. తాడేపల్లి, మంగళగిరి మునిసిపాల్టీల అభివృ ద్ధి ప్రణాళికతో పాటు గ్రామాల్లో పనులు రెండు మూడు నెలల్లో ప్రారంభిస్తాం.  రాజధాని ప్రాంతంలో ప్రతి గ్రామంలోనూ అభివృద్ధికి ఏం కావాలో, ప్రజలేం కోరుకుంటున్నారో తెలుసుకుని వారం రోజుల్లో ఒక నివేదికను సమర్పించాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఆదేశాలు. ప్రతి గ్రామానికి నాలుగు కార్యక్రమాలు ఉండేలా చూడాలి.
 05-02-2020 : అమరావతికి నిధుల్లేవ్! : జగన్
అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం వద్ద నిధులు లేవు.  ఇక్కడ ఐదేళ్లు ఉన్నా పరిస్థితి మారదు. అలాంటప్పుడు ఏం చేయాలి. లక్ష కోట్లు పెట్టుబడి పెడితే 20 ఏళ్ల తర్వాత తడిసి మోపెడై రూ.3 లక్షల కోట్లవుతాయి. అమరావతిలో ల్యాండ్‌బ్యాంకింగ్‌ చాలా ఉందని చంద్రబాబు చెబుతున్నారు. ఎస్జీటీ నిబంధనల ప్రకారం పరిధి మినహాయిస్తే, నికరంగా ఉన్న భూమి 5,200 ఎకరాలు మాత్రమే. ఈ భూమి ద్వారా లక్ష కోట్లు రావాలంటే.. అదే 20 ఏళ్ల తర్వాత 3-4లక్షల కోట్లు కావాలంటే ఎకరం దాదాపు రూ.90 కోట్లకు అమ్మాలి. ఇది సాధ్యమేనా?. రాష్ట్రానికి ఒక తండ్రిగా తనవంతుగా శాయశక్తులా న్యాయం చేస్తున్నాను. అమరావతి రాజధాని కోసం 53 వేల ఎకరాలు ల్యాండ్‌ పూలింగ్‌లో సేకరించారు.  అక్కడ కనీస మౌలిక సదుపాయాలూ లేవు. రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్‌, నీరు వంటి కనీస సదుపాయాలు కల్పించాలంటే.. గత ప్రభుత్వ నివేదికల ప్రకారం ఎకరాకూ రూ.2 కోట్లు ఖర్చవుతాయి. 53 వేల ఎకరాలకు రూ.1.09 లక్షల కోట్లు ఖర్చవుతాయి. గత ప్రభుత్వం గడచిన ఐదేళ్లలో రూ.5,677 కోట్లు మాత్రమే వ్యయం చేసింది. ఇంకా మా ప్రభుత్వంపై సుమారు రూ.2,300 కోట్లు భారం వేసారు. చేసిన పనులకు కూడా 10.32 శాతం వడ్డీతో అప్పుతెచ్చారు.  కేంద్రం 1,500 కోట్లు ఇచ్చింది. అందుకే ఇక్కడ పెట్టుబడి కోసం తప్పనిసరిగా రుణాలకు వెళ్లాల్సిందే. ఈ పరిస్థితుల్లో ఏ ముఖ్యమంత్రి అయినా ఏం చేస్తారు?. మూడు రాజధానులపై నిర్ణయం తీసుకోకుంటే వచ్చే తరాలకు అన్యాయం, నష్టం జరుగుతాయి. అమరావతి.. విజయవాడకు గానీ, గుంటూరుకు గానీ దగ్గరగా లేదు. అక్కడకు కనీసం డబుల్‌రోడ్‌ లేదు. అంతా సింగిల్‌ రోడ్డే. అయినా ఆయన(చంద్రబాబు)కు ఆ ప్రాంతంపై ఎందుకంత ఆసక్తిఅంటే.. అందరికీ తెలుసు. ఆయనకు, ఆయన అనుయాయులకు అక్కడ ఎన్నో భూములున్నాయి. అమరావతిలో కనీస సదుపాయాల కోసం ఇంకా 1.06 లక్షల కోట్లు కావాలి. ఆరు వేలకోట్లకు మించి ఖర్చు చేసే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. ఆ వ్యయమంతా సముద్రంలో నీటి బొట్టు మాదిరిగా ఉంటుంది.
 విశాఖ రాష్ట్రంలో నంబర్‌ వన్‌ నగరం. అక్కడ రోడ్లు, నీరు, విద్యుత్‌ సహా అన్ని సదుపాయాలూ ఉన్నాయి. అమరావతిలో ఖర్చు చేయాల్సిన రూ.లక్ష కోట్లలో కనీసం పదో వంతు అంటే పది వేల కోట్లు విశాఖలో ఖర్చు చేస్తే.. పదేళ్లలో హైదరాబాద్‌తో పోటీ పడవచ్చు. ఉద్యోగాల కోసం పిల్లలు ఎక్కడకూ వెళ్లాల్సిన అవసరం రాదు. అమరావతి లెజిస్లేటివ్‌ రాజధానిగా ఉంటుంది. ఏడాదిలో 60 నుంచి 70 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. అమరావతి క్రమంగా అభివృద్ధి చెందుతుంది.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...