Feb 24, 2020

ట్రంప్ భారత్ పర్యటన–3 రాజధానులు


టీవీ ఏపీ 24X7 - తేదీ: 24.02.2020 సోమవారం ఉదయం 7.30 గం. నుంచి
అంశాలు :  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన–రాజధాని–3 రాజధానులు
యాంకర్ :  వెంకటకృష్ణ

 శ్రీనివాసరావు - అమరావతి జేఏసీ కన్వీనర్
20 రోజుల క్రితం పార్లమెంటులో సురేష్ గారిని మేం కలిశాం. అమరావతికి మద్దతు పలకమని అడిగాం. ఆయన మా నాయకుడు ఒక విధానాన్ని ప్రకటించారు. నేను కూడా ఆ దారిన వెళుతున్నాను అని చెప్పారు. స్పష్టంగా చెప్పారు. ఇబ్బందిలేదు. ఒక కులం అనేదాని బద్దలు కొడుతూ నిన్న వెలగపూడి దీక్షా శిబిరంలో 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు నిరసనగా 151 మంది మాల, మాదిగలు కూర్చున్నారు. ఆ శిబిరాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వర రవు. దళిత బహుజన ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి నీలం భాగ్యారావు గారు. తుళ్లూరులో జరిగిన పెద్ద సభలో దళితులు ముందుండి ఈ ఉద్యమం నడుపుతారు అని చెప్పారు. ఉద్యమంలో అందరి పాత్ర పెరుగుతూ వస్తోంది. అమరావతి రోడ్డుకు కూడా వెళ్లాం. హోం మంత్రి రాకుండా డమ్మీ కాన్వాయ్ ని పంపారు. అమరావతి రథోత్సవానికి మేం 2వేల మంది వెళ్లాం. డిమాండ్ వినిపించడానికి. జై అమరావతి అని నినాదాలు చేశారు. రధం వద్ద ఓ 3 వందల మంది స్థానికులు కాదు జై జగన్ అని నినాదాలు ఇచ్చారు. పది నిమిషాలు ఆగిన తరువాత వారిలో కొంతమంది జై పులివెందుల అని నినాదాలు ప్రారంభించారు. వాళ్లలో వారే కొంతమంది వారిని ఆపారు. వారు తాగి ఉన్నాం. ఆ తరువాత మహిళలు బుద్దుని విగ్రహం వద్దకు వెళ్లి ధర్నా చేశారు. తరువాత లేమల్లె వద్ద మహిళల బస్సు ఆపారాని తెలిసింది. మేం బయలుదేరాం. అయితే వారిని అమరావతి పోలీస్ స్టేషన్ కు తీసుకువస్తున్నారని చెబితే మేం అక్కడకు వెళ్లాం. అమరావతి సీఐ ప్రభాకర్ లేమల్లె వెళ్లి, అక్కడ పరిస్థితిని నియంత్రించి ... లేమల్లెలో మహిళలపై దాడి జరిగితే అర్ధ గంట వరకు పోలీసుల స్పందనలేదు. ఆ తరువాత ప్రభాకర్ గారు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చి బస్సుని అమరావతి స్టేషన్ కు తెమ్మని డ్రైవర్ కి చెప్పి ఆయన స్టేషన్ కు వచ్చేశారు. కానీ ఆ బస్సుకు ముందు వెనుక సురేష్ గారి అనుచరులు రెండు టాటాఏసీ కారుల్లో ఆ బస్సుని పెదకూరపాడువైపు తీసుకువెళ్లారు. సురేష్ గారు అనుచరులు చెప్పిన రూట్ లో బస్సుని తీసుకువెళ్లారు.  సీఐ ప్రభాకర్ అమరావతి స్టేషన్ లో కూర్చొని బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. మేం ఆయనతోనే ఉన్నాం.
వెళ్లే బస్సుని లింగాపురం గ్రామంలో రైతులు బస్సుని ఆపారు. ఆ రైతులు బస్సుని ఆపకపోతే ఆ మహళలకు ఏం జరిగేదో మనం ఊహించలేం. ఆ మహిళలపై కారం చల్లారు. మొదట గొడవ జరిగినప్పుడు కారం చల్లలేదు. సురేష్ గారు ఏదో చెప్పారు వెళ్లారు. ఆ తరువాత సురేష్ గారి బంధువులు, అనుచరులు కారం తీసుకొని వచ్చారు. మేం ఒకే ఒక డిమాండ్ తో ఉద్యమం చేస్తున్నాం. అవకాశం ఉన్నచోట ప్రచారం చేస్తున్నాం. కోటప్పకొండ వద్ద కూడా ప్రభలు కట్టి జై అమరావతి అని నినాదాలు చేశారు. అక్కడ పోటీ నినాదాలు చేయవలసిన అవసరం ఏమిటి?  మా ఉద్యమం పార్టీ రహితం. టీడీపీ నాయకులతోపాటు సీపీఐ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు గారు, సీపీఎం నాయకులు వచ్చారు. మా ఉద్యమానికి వైసీపీ తప్ప అందరూ మద్దతు ఇస్తున్నారు. వాటిలో పెద్ద పక్షం, ఎక్కువ కేడర్ ఉంది.
  
నారాయణ మూర్తి – వైసీసీ
అమరావతి కేపిటల్ గా ఉంటుంది. వికేంద్రీకరణలో వైజాగ్ ఒక కేపిటల్, కర్నూలు మరో కేపిటల్.  అమరావతి ఒకటే కాదు మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతుంది. అమరావతికి జై.  అది టీడీపీ దాడి. దళిత ఎంపీపై దాడి చేస్తారా?  తాగి ఉంది వారే. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. జై పులివెందుల అన్నారంటారు.అన్ని అబద్దాలు మాట్లాడితే ఎలా? చంద్రబాబు రైతులను మోసం చేశారు.


టీడీపీ – అశోక్ బాబు
ట్రంప్ గెలిచినప్పుడు ఈ ట్రంప్ మాకు వద్దని అమెరికన్లు పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేశారు. ముస్లిమ్స్ అంటే అతనికి వ్యతిరేకత ఉంది. మోడీ గారి మాదిరిగా. మోడీ ఒక్కసారి మసీదుకు వెళితే ఆయన యాంటి ముస్లిం కాదని అంగీకరిస్తాం. ట్రంప్ గారు మన దేశానికి రావడం విశేషం కాదు. ఏ దేశస్తుడైనా మన దేశానికి వస్తే పరస్పర అంగీకారంతో కూడి ఒప్పందాలు జరుగుతాయి. ఇప్పుడు అటువంటివి ఏమీలేవు. ఒక విషయంలో మోడీ గారిని అభినందిస్తున్నాను. రైతులకు వ్యతిరేకంగా ఉంటుందని డెయిరీ ఉత్పత్తులు రాకుండా అడ్డుకున్నారు. ఇరాన్ పై ఆంక్షలు సడలించే ఒప్పదం పెట్టుకుంటే బాగుండేది. ట్రంప్ ఎన్నికలకు వెళుతున్నారు. అవసరం ఆయనది. విదేశీ వాణిజ్య వ్యాపారంలో టాక్స్ లకు సంబంధించి ఒప్పందం చేసుకుంటే బాగుండేది.   హెలికాఫ్టర్స్, ఫ్లైట్స్ యుద్ధ విమానాలు వంటి అగ్రిమెంటు చేసుకొని, మీటింగ్ పెట్టి, తనని గెలిపించండి అని అడుగుతారు. అమెరికాలోని మన దేశస్తులు ట్రంప్ విధానాల వల్ల ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు. 90 శాతం భారతీయులు డెమోక్రసీకి మద్దతు. హిల్లరీ ఓడిపోయినా ఆయన భారతీయులతో మంచి సంబంధాలు ఉన్నాయి.  
అమరావతిలో రథోత్సవానికి ఎంపి నందిగం సురేష్ వచ్చిన సందర్బంగా రాత్రి ఏం జరిగిందనేదానికి వీడియోలు ఏమీలేవు. రాత్రి అవడం వల్ల .. సురేష్ అక్కడ వ్యక్తి. వాళ్లు ఓట్లు వేశారు. కృష్ణదేవరాయులు గారు వచ్చారు. మాట్లాడారు వెళ్లారు. భోజనం కూడా చేశారు. గొడవ ఏం లేదు. ప్రొఓకింగ్ స్టేట్ మెంట్లు వస్తే, ఉద్యమ మూడ్ లో ఉన్నవారితో మనం మాట్లాడటం కరెక్ట్ కాదు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో రాఘవులు గారు నిమ్స్ కు వెళ్లినప్పుడు జై తెలంగాణ అనమని డిమాండ్ చేశారు. నన్ను చంపండి నేను అనని ఆయన వచ్చేశారు. వారి పార్టీ విధానం అది. సురేష్ గారు వారితో సామరస్యంగా మాట్లాడితే బాగుండేది. జై అమరావతి అంటే తప్పులేదు. ఈ రోజు చీఫ్ మినిస్టర్ లెటర్ హెడ్ పైన చీఫ్ మినిస్టర్, అమరావతి అని ఉంటుంది. దీనిని విపరీతమైన యాంగిల్, వైసీపీవారి వ్యతిరేకత. సురేష్ గారు గానీ, ఆ ప్రాంత ఎమ్మెల్యే శ్రీదేవి ఒక రోజు కూర్చొని ఈ పరిస్థితులలో మేం నిర్ణయం తీసుకున్నాం, మీకేమైనా ఉంటే చెప్పండి అని మాట్లాడాలి. సురేష్ అనుచరుల యాటిట్యూడ్. వారు బస్సులో మహిళలను అడ్డుకోవడం తప్పు. మహిళలు ఉద్యమం చేస్తున్నప్పుడు దానిని డీల్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానిది లేదా ఎంపీగా నీది. ఎంపీగా ఆ సిట్యేషన్ ని హ్యేండిల్ చేయలేకపోతే దటీజ్ ఫెయిల్యూర్ ఆన్ యువర్ పార్ట్. ఒకవేళ వారు మహిళలు ఎదురు తిరిగే ఆయన ఫాలోయర్స్ అంతగా స్పందించవలసిన అవసరంలేదు. వారిపై దిశ యాక్ట్ పెడితే ప్రభుత్వం కేసులు రిజిస్టర్ చేస్తుందా? ఈ శ్రీనివాస రావు మొన్నటివరకు ఎక్కడ ఉన్నారు? ఎలా వచ్చారు. ఈ కాంట్రాక్ట్. ఒకసారి ఎంపీ గారు వివరణ ఇచ్చిన తరువాత ఆయనపై దాడి ఎందుకు చేయాలి. ఓ దళితుడుపై ఎందుకు దాడి చేశారు?
అశాంతి క్రియేట్ చేస్తారా? చంపేస్తారా? కొడతారా? ఆయన స్టాండ్ చెప్పారు. ఎందు మాట్లాడాలి. డమ్మీ ధర్నాలు మీరు చేస్తున్నారా? కొంతమందైనా రైతులు ఉన్నారు. రైతులను ముందు పెట్టి, మిగతా వారిని కాంట్రాక్ట్ తెచ్చి.. 29 గ్రామాల్లో చేస్తూ రాష్ట్రం అంతటా.... శ్రీదేవిపైన, రజనీపైన, సురేష్ మీద దాడి చేస్తారు. దళితులపై దాడి చేస్తారు. బీసీలపైన, దళితులపైన దాడులు చేస్తారు. అమరావతి జై ఒకే. విశాఖ, పులివెందుల, అనంతపురం డౌన్ డౌన్ అనమనండి. మిగతావి డౌన్ డౌన్ అని అంటున్నారు.
దళిత సంఘాలు రాత్రికి రాత్రి పుడతాయి. దళితులను కించపరచవద్దు.  అన్ని కులాలు సమానం. అన్నడ ఉన్నది దళితులే ఎక్కువ. బీసీలు ఎక్కువ. రైతుల ముసుగులో గ్రామా ఆర్టిస్టులను, రౌడీలను తీసుకువస్తున్నారు.


సంజీవరెడ్డి – కాంగ్రెస్
ట్రంప్ విశిష్టత అమెరికాలో తగ్గుతోంది. భారతీయులు మద్దతులేకుండా ఈ సారి ఆయన గెలిచే అవకాశంలేదు. ఇక్కడ మోడీ పరిస్థితి కూడా అదే. ప్రతిదేశానికి మన దేశం మంచి మార్కెట్. ఆయుధాలు అమ్ముకుంటానే ఆయన వస్తున్నారు. సాంమ్రాజ్యవాదం దేశం అమెరికా. మనది అలీన విధానం. మోడీ ట్రంప్ కు స్నేహం కాదు, దేశాల మధ్య స్నేహం ఉందాలి. పార్టీ అంటే వ్యక్తలు గుర్తుకు వస్తారు. టీడీపీ అంటే చంద్రబాబు, వైసీపి అంటే జగన్, కాంగ్రెస్ అంటే రాహుల్ ... ఇటువంటిపోవాలి. సమిష్టి బాధ్యత తీసుకోవాలి. ట్రంప్ పర్యటన దేశప్రయోజనాలకు ఉపయోగపడాలి. ఆయన వస్తున్నాడని గోడలు కట్టడం ఏమిటి? అమెరికాలో మనవారు రాత్రి 7 తరువాత బయటకు వెళ్లే పరిస్థితి ఉందా? మనదేశంలో పేదరికం ఎవరికి తెలియదు?
అమరావతిది హిస్టారికల్ ఈవెంట్. ప్రపంచంలో ఎక్కడా 33వేల ఎకరాలు రైతులు ఇవ్వడం జరగలేదు. వారి త్యాగం రైతులకు, రైతు కూలీలకు దక్కుతుంది. దానిని మరచిపోతే తెలుగువాడిగా తలదించుకోవలసి వస్తుంది. ప్రజాప్రతినిధులు వారి వద్దకు వెళ్లి నచ్చజెప్పాలి. దానిని ఉపయోగించుకోవడం చేతగాక వారిని అవమానిస్తున్నారు. 30వేల మంది రైతులను .. 5 కోట్ల ఆంధ్రులకు రాజధాని లేదు. అక్కడ మట్టి మెత్తగా ఉంది. నాగార్జున యూనివ్సిటీలో, మంగళగిరిలో కట్టండి. విశాఖ ఎందుకు తరలించారా? కారు గుద్దినప్పుడు ఎవరైనా ఒకరు దిగి చూశారా? అమరావతి రైతులు త్యాగం సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఉంటుంది.

రఘురామ్ – బీజేపీ
అతిధిదేవోభవ అనేది మన సంప్రదాయం. దేశప్రయోజనాల కోసం మోడీ వ్యవహరిస్తారు. జపాన్ ప్రధాని వచ్చినా ఇదేవిధంగా ప్రవర్తించారు. వాణిజ్య ఒప్పందాలు వంటివి ఉంటాయి. పొర్లు దండాలు పెట్టడంలేదు. ద్వైపాక్షిక సంబంధాల కోసం మోడీ ప్రయత్నం. పాకిస్తాన్.. శత్రువు తల్లికి పాదాభివందనం చేశారు. అది భారీతీయ సంప్రదాయం. చైనా అధ్యక్షుడు వచ్చినప్పుడు కూడా అలాగే చేశారు. దేశ ప్రధానిగా ఆయన వ్యవహరిస్తారు. దేశ ప్రయోజనాలే ప్రధానంగా ఉంటాయి. ఒక దేశ అధ్యక్షుడు భారతీయ ఓటర్లపై ఆధారపడడ్డారంటే అది భారతీయుల గొప్పదనం. అమెరికాతో మన దేశానికి ఉన్న సమస్యలను పరిష్కరించడానికి మోడీ ప్రయత్నిస్తున్నారు. ట్రంప్ వస్తే అయిపోయింది, అల్లుడు కోసం, కూతురు కోసం వచ్చారనేది కాదు. అనేక దేశాలతో వ్యాపారాలు చేస్తాం, అగ్రరాజ్యంతో సంబంధాలు ఉంటే మంచిదేకదా. ఇరాన్ నుంచి పూర్తిగా ఆయిల్ కొనకుండా ఏంలేదు. మోడీ యాంటి ముస్లిం కాదు. మోడీ మసీదుకు ఎందుకు వెళతారు? ఎవరి విశ్వాసాలు వారివి. మోడీ గారు ముస్లింలకు వ్యతిరేకత అనేది దుష్ప్రచారం చేస్తున్నారు. (దేశంలో 17 శాతం ముస్లింలు)
రాష్ట్రంలో పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు పేపర్లలో వచ్చాయి. ఉద్యమాన్ని అణగార్చే ప్రయత్నం జరుగుతుందా? రైతులు వచ్చి కారాలు కొట్టడం లాంటి చర్యలు లేవు. టీడీపీ మేజర్ రోల్ ఉంటుంది. రాజకీయంగా మారిపోతోందా?

ఎంఏ గఫూర్ – సీపీఎం
ఆధిపత్యం వహించే అగ్ర రాజ్యం అమెరికా. మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏం ఇస్తారు అన్న ధోరణిగా ఉంటుంది. వారిప్రయోజనం ముఖ్యం. ఇతరుల ప్రయోజనం వారికి అవసరంలేదు. అమెరికా అధ్యక్షుడు వస్తుంటే మన జనం కనిపించకుండా గోడలు కట్టారు. వ్యక్తిత్వం లేని విధాం. భారతదేశంలో పేదరికం, నిరుద్యోగం ఉందని అందరికీ తెలుసు. అమెరికా ఆధిపత్యంలో ఒక పార్టనర్ గా భారత్ ని ఎంపిక చేసుకుంది. ఒకప్పుడు చైనాకి వ్యతిరేకంగా పాకిస్తాన్ తో ఆ రకమైన సంబంధాలు  ఉండేవి. ఇప్పుడు ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్.  మనం ఇరాన్ వద్ద ఆయిల్ కొంటున్నాం. అక్కడ ఆయిల్ కొనవద్దని మోడీ చెప్పేశాడు. చాలా చీప్ రేటుకు అక్కడ కొంటున్నాం. మనం ఎవరితో స్నేహంగా ఉండాలో ఆ స్వేచ్ఛ మనకి ఉండదు. వారే చెబుతారు ఎవరితో స్నేహం చేయాలో. ఇండియన్ ఆర్మీ ఏ ఆయుధాలు వాడాలో అమెరికా చెబుతుంది. దానికి సరండరైంది మన ప్రభుత్వం. అమెరికా పక్తు బిజినెస్ దేశం. ట్రంప్ మోస్ట్ అన్ పాపులర్. అనైతిక వ్యవహారాలలో ఇతను ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఇంపీచ్ మెంట్ ఎదుర్కొన్న వ్యక్తి ఇతనే. ఇతను వచ్చిన తరువాత భారతీయులపై ఆంక్షలు ఎక్కువైయ్యాయి. భారతీయులను తరేమేస్తున్నారు ఇతర దేశాల అధ్యక్షులు రావడంలో తప్పులేదు. కానీ ఇంత ఆర్భాటం పనికిరాదు. దేశ ప్రయోజనాలు ముఖ్యం. ఇరాన్ లో రెండవ ర్యాంకులో ఉన్న వ్యక్తిని చంపారు. మనది అలీన విధానం. ఇప్పుడు సామ్రాజ్యవాదానికి మద్దతు పలుకుతున్నారు. కోవాడ భూములపై ట్రంప్ అల్లుడు కన్నుపడిందంటున్నారు. ఒక ప్రముఖ పత్రికలో వచ్చింది. అమెరికా ఆయుధ వ్యాపారానికి ఉపయోగపడుతున్నారు.
29 గ్రామాల ప్రజలు ఉద్యమం. ఈ ఆందోళన 2 నెలలుగా జరుగుతుంది.  ప్రజాప్రతినిధులను అడుగుతుంది. వారితో ఎందుకు మాట్లాడరు?  33వేల ఎకరాలు, నవ నగరాలు మేం వ్యతిరేకించాం. వారు ఆశించారు. వారిని నమ్మించారు. వారి మనోవేధన, వారి ఆందోళన చేస్తున్నప్పుడు పెయిడ్ ఆర్టిస్టులని కించపరుస్తున్నారు. కొంతమంది రైతులతో బొత్స సత్యనారాయణ మాట్లాడారు. అక్కడ ఉద్యమం జరుగుతుంది వాస్తవం.  ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఎక్కడ ఉంటే అదే రాజధాని. జనంలో అసంతృప్తి ఉంది. వారిని నచ్చజెప్పవలసిన బాధ్యత ప్రభుత్వానిది, స్థానిక ప్రజాప్రతినిధులది.
వైసీపీవారు జనం వద్దకు వెళ్లకుండా వారిని రెచ్చగొడతారా? మీకు తెలిసిందే అంతా సర్వసం అనుకుంటే కుదరదు. రైతులు రాజధానికి భూములు ఇచ్చారు. చంద్రబాబు నాయుడిని ఉరి తీయండి. రైతులను ఇబ్దంది పెడుతున్నారు. ఒక సమస్యతో రాష్ట్రం మొత్తం మంట పెట్టారు. సురేష్, ఆర్కే ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు, వారు పరిష్కరించాలి. రెచ్చగొట్టకూడదు. ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా సెక్రటేరియేట్ ని అడ్డుకుంటామని చెప్పారు. ఎన్టీఆర్ రోడ్డుపై కూర్చొని తనని రక్షించమన్నారు. ఉద్యమాలను ఎన్నాల్లు అణచివేస్తారు. ప్రజలు మిమ్మల్ని అణచివేస్తారు. మీ వెంట పాదయాత్రలో పాల్గొన్నవరందరూ పెయిండ్ ఆర్టిస్టులు అంటారు. పోలీసు బలం ఉందని రెచ్చగొట్టవద్దు.


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...