Nov 16, 2017

పీడీఎఫ్ ఎమ్మెల్సీల వాకౌట్

15.11.2017
శాసనసభ మీడియా పాయింట్ వద్ద పీడీఎఫ్ ఎమ్మెల్సీలు
 వై.శ్రీనివాస రెడ్డి, కత్తి నరసింహా రెడ్డి, బొడ్డు నాగేశ్వర రావు,
రాము సూర్యారావు.

1.   సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం)పై వాయిదా తీర్మానాన్ని, చర్చకు శాసనమండలిలో అనుమతించనందున వాకౌట్ చేశాం.
2.   2004 తరువాత చేరిన ఉపాధ్యాయులకు పెన్షన్ పొందే అవకాశం లేకుండా అన్యాయం చేస్తున్నారు.
3.   సభలో సభ్యులకు గౌరవంలేదు. చర్చకు అనుమతించడంలేదు.
4.   ఓపీఎస్(పాత పెన్షన్ స్కీం)ను అమలు చేయాలి.
5.   త్రిపుర, పశ్చిమబెంగాల్ లలో పాత పెన్షన్ నే అమలు చేస్తున్నారు.
6.   ఓపీఎస్ అంశంపై ఛలో అసెంబ్లీ పిలుపు ఇస్తే, నిన్న రాత్రి నుంచే ఉపాధ్యాయులను నిర్భంధించడం అన్యాయం.
7.   శాంతియుత ఆందోళనకు అవకాశం ఇవ్వకపోవడం అన్యాయం.
8.   రాష్ట్రంలో లక్షా 84వేల మంది ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారు.
9.   ఒకసారి ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తికి రూ.25వేలు, రెండుసార్లు చేస్తే రూ.50వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. 30 ఏళ్లకు పైగా ఉద్యోగం చేసేవారికి పెన్షన్ ఎందుకు ఇవ్వరు.
10.ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల వారిపై దాడులు చేయడం, వారిని అరెస్ట్ చేయడం అన్యాయం.
11.సీపీఎస్ పై ప్రభుత్వ వైఖరి చెప్పాలి.
12. లక్షా 84వేల మందికి అన్యాయం జరుగుతున్నందున తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డు ఎక్కాం.
13.అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు అరెస్టులు చేశారు.
14. అత్యవసర అంశాల విషయంలో సభను వాయిదా వేసి చర్చించాలన్న అంశాన్ని విస్మరించారు.
15. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉండాలి. రిటైర్మెంట్ తరువాత ఆర్థిక ప్రయోజనాలు ఉండాలి.
16.ఉద్యోగ సంఘాలు కూడా తమకు మద్దతు పలికాయి.
17. తాను అధికారంలోకి వస్తే సీపీఎస్ ను రద్దు చేస్తానని జగన్మోహన రెడ్డి చెప్పారు.
18. ప్రతిపక్షం వారు సభకు వచ్చి సీపీఎస్ పై తీర్మానం ప్రవేశపెడితే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

19.వైఎస్ జగన్ సభకు వచ్చి మాకు సహాయం చేయాలని కోరుతున్నాం.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...