Ø ఈ నెల 27న విజయవాడలో విడుదల
Ø అంతర్జాతీయ స్థాయిలో చర్చకు అవకాశం
Ø అన్ని వర్గాల మహిళల సమస్యల ప్రస్తావన
Ø 10 అంశాలుగా విభజన
Ø ప్రపంచదేశాల మహిళా అభివృద్ధికి దిశానిర్దేశం

ప్రకటన ముసాయిదాను తయారు
చేయడానికి 8 మంది ఎడిటోరియల్ బోర్డు సభ్యులను నియమించారు. వారు ప్రధానమైన పది అంశాలతో ఒక ముసాయిదాని
రూపొందించారు. 1.స్త్రీ విద్య,
2. మహిళల న్యాయపరమైన హక్కులు, 3.మహిళల ఆరోగ్యం,
సమతుల ఆహారం, 4.పారిశ్రామిక రంగంలో
మహిళలు, 5. పరిశోధన, నూతన ఆవిష్కరణల్లో మహిళలు,
6.రాజకీయాల్లో మహిళలు, 7. మహిళల సమాజిక భద్రత,
8.స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో మహిళల పాత్ర,
9.మహిళల సామాజికాభివృద్ధి, 10.మహిళలు - డిజిటల్ విద్య అనే అంశాల ప్రాతిపదికగా మహిళలకు
సంబంధించిన అన్ని సమస్యలను ప్రస్తావించారు. శాసనసభాపతి డాక్టర్ కోడెల అధ్యక్ష్యతన
జరిగిన సమావేశాల్లో జస్టిస్ జీ.రోహిణి, అమరావతి
రాజధాని నగరాభివృద్ధి, నిర్వహణ సంస్థ ఎండీ లక్ష్మీ పార్థసారధి,
రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమిత
దావ్రా, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధ, ఎండోమెంట్స్
కమిషనర్ అనురాధ, మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ
శాఖ కార్యదర్శి సునిత, పాఠశాల విద్య
కమిషనర్ సంధ్యారాణి, ప్లానింగ్ శాఖ సెక్రటరీ సంజయ్ గుప్త,
విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు ఎ.జయశ్రీ,
పి.విజయలక్ష్మి,
డీఎం మమత, డిబీ కృష్ణ కుమారి,
యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ ఏపీ సెక్రటరీ జనరల్ ఎల్.జయ రాములు, ఆంధ్రప్రదేశ్
మహిళా పారిశ్రామికవేత్తల సంఘం అధ్యక్షురాలు కె.రమాదేవి, జి.జానకీ రామచంద్రన్ వంటి వారితోపాటు అధ్యాపకులు,
విద్యార్థినులు పాల్గొని ఈ
ముసాయిదాలోని అంశాలను లోతుగా చర్చించి, తమ అనుభవాలను
కూడా జోడించి తమ అమూల్యమైన సూచనలు,
సలహాలు ఇచ్చారు.
ఈ చర్చల్లో మహిళలు,
విద్యార్థినులు, బాలికలు, పిల్లలకు
సంబంధించి చిన్న చిన్న అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. గ్రామీణ, పట్టణ పేద మహిళలు, అసంఘటిత కార్మిక మహిళలు,
ఒంటరి మహిళలు, గర్భిణీ స్త్రీలు, పసిపిల్లల
స్థితిగతులపై ప్రతి అంశాన్ని చర్చించారు. పాఠశాల స్థాయిలో విద్యార్థినులకు సౌకర్యాలు, ఉపాధిపై
అవగాహన, స్వీయరక్షణ, మహిళల న్యాయపరమైన హక్కులు,
ఆస్తి హక్కు, బలవంతంగా వ్యభిచార
కూపంలోకి నెట్టబడే బాలికలు, మహిళల సమస్యలు, కరాటే శిక్షణ, వృత్తి విద్య,
గ్రామీణ పరిశ్రమలు, డ్రైవింగ్ లో శిక్షణ,
మహిళా పారిశ్రామికవేత్తలకు రుణ సౌకర్యం కల్పించడం,
పన్నుల మినహాయింపు, ప్రత్యేక మహిళా పారిశ్రామిక జోన్ల ఏర్పాటు,
సైబర్ సెక్యూరిటీ, సినిమా, టీవీ,
సోషల్ మీడియా నుంచి రక్షణ, అన్ని
రంగాల్లో సమాన అవకాశాలు, సమాన పనికి
సమాన వేతనం... తదితర అన్ని
అంశాలపై విస్తృత స్థాయిలో చర్చించారు.
రాజకీయాలకు అతీతంగా ప్రపంచ వ్యాప్తంగా అందరూ స్త్రీని గౌరవిస్తూ
ఆచరించదగిన మార్గదర్శకాలు ఇందులో ఉంటాయి. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉండే విధంగా, అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వాలకు,
స్వచ్ఛంద సంస్థలకు, ప్రతి వ్యక్తికి, మహిళలకు
సూచనలు, సలహాలు అందించే విధంగా ఈ ప్రకటన ఉంటుంది. వివాదాలకు
తావులేకుండా అంతర్జాతీయ స్థాయిలో విస్తృత అంశాల ప్రాతిపదికన ఈ ప్రకటనను
రూపొందించారు. రాజకీయాలకు
అతీతంగా మహిళలకు సంబంధించి ఇటువంటి ప్రకటన
రూపొందించడం ఓ గొప్ప అవకాశంగా భావించవచ్చు. ప్రపంచదేశాల మహిళా అభివృద్ధికి దిశానిర్దేశం చేయడమేకాక అన్ని విధాల మహిళలకు
సహాయపడేవిధంగా దీనిని రూపొందించారు. అత్యంత
ప్రతిష్టాత్మకంగా మహిళా సాధికారితపై రూపొందించిన ఈ ప్రకటనను నవంబర్ 27న విజయవాడ సిదార్థ గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారు. ఈ కార్యక్రమ
నిర్వహణలో మహిళా మంత్రులు, ఎంపీలు,
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు కీలకపాత్ర
పోషిస్తారు. వివిధ రంగాలకు
చెందిన ప్రముఖ మహిళలు పాల్గొంటారు.
-శిరందాసు నాగార్జున, డెవలప్ మెంట్ జర్నలిస్ట్, 9440222914.
No comments:
Post a Comment