Nov 10, 2017

25 వరకు 10 రోజులు శాసనసభ సమావేశాలు


సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు
·       విశాఖలో వ్యవసాయ సదస్సు కారణంగా 16,17 సెలవులు
·       ప్రభుత్వం తరపున  7 బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం
·       టీడీపీ 27, బీజేసీ 15 అంశాలపై చర్చ
·       ప్రతిపక్షం హాజరుకాకపోవడం దురదృష్టకరం

        సచివాలయం, నవంబర్ 10: శాసనసభ వర్షాకాల, శీతాకాల సమావేశాలు శుక్రవారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు 10 రోజులపాటు జరుగుతాయని సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద శుక్రవారం ఉదయం ఆయన మాట్లాడారు. శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన ఉదయం జరిగిన బీఏసీలో 14వ శాసనసభ 10వ సెషన్ 10 రోజులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సభ ఎన్ని రోజులు జరపాలి, ఏఏ అంశాలు, ప్రవేశపెట్టే బిల్లులు తదితర విషయాలు చర్చించినట్లు చెప్పారు. తొలుత 23వ తేదీ వరకు సభ నిర్వహించాలని నిర్ణయించారని, అయితే ఈ నెల 16,17 తేదీలలో రెండు రోజులుపాటు విశాఖపట్నంలో  ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సాంకేతిక సదస్సు-2017ని నిర్వహిస్తున్నారని, దానికి బిల్ అండ్ మిలిండ గేట్స్ ఫౌండేషన్ సహకారం అందించడమేకాక, బిల్ గేట్స్ కూడా వస్తున్నారని అందువల్ల  సదస్సుకు మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లవలసిన బాధ్యత ఉన్నందున ఆ రెండు  రోజులు సెలవు ప్రకటించినట్లు వివరించారు. దాంతో 25 వరకు సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వం తరపున సభలో 7 బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉందని, వాటిని సమగ్రంగా చర్చిస్తామని మంత్రి చెప్పారు.

టీడీపీ 27, బీజేసీ 15 అంశాలపై చర్చ
   తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం 27 అంశాలను చర్చించాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో గానీ, స్వల్పకాలిక చర్చ రూపంలోగానీ వీటిని చర్చిస్తారన్నారు. బీజేపీ శాసనసభా పక్షం తరపున 15 అంశాలు చర్చించనున్నట్లు విష్ణుకుమార్ రాజు చెప్పినట్లు తెలిపారు. ఈ అంశాలన్నిటినీ ఏఏ నిబంధనల కింద చర్చించాలో పరిశీలించి నోటీసులు ఇచ్చి చర్చిస్తామన్నారు.

ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రధానమైనది శాసనసభ అని, ప్రజా సమస్యలు చర్చించే ప్రధాన వేదిక అని, అటువంటి సభలు ప్రధాన ప్రతిపక్షం లేకుండా నిర్వహించడం దురదృష్టకరం అన్నారు. ప్రజల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం అధికారం పక్షం పనిచేయాలని, ప్రతిపక్షం హాజరుకాకపోయినా ప్రజలు ఏమి ఆశిస్తున్నారో, వారి ఆలోచనలు ప్రతిబింభించేలా చర్చ జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించినట్లు చెప్పారు. మంత్రుల నుంచి సమాచారం రాబట్టడంలో సభ్యులు సమర్థవంతంగా వ్యవహరించాలని, తగిన సూచనలు, సలహాలు అందివ్వాలని సీఎం చెప్పినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇప్పటి వరకు 9సార్లు శానసభ సమావేశాలు జరిగాయని, ప్రతిపక్షంవారు వ్యక్తిగతమైన, నిరాధారమై ఆరోపణలు చేసి సమయం వృధా చేశారన్నారు.

సమ్మిళిత, స్థిరమైన వృద్ధిపై చర్చిస్తే బాగుంటుందని స్పీకర్ సలహా ఇచ్చారని, ఒక రోజు ఈ అంశంపై కూడా చర్చిస్తామని చెప్పారు. నోబెల శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యాగ్ని బాలల హక్కుల అంశంపై దేశవ్యాప్తంగా పర్యటిస్తూ అవగాహన కల్పిస్తున్నారని, ఆ అంశంపై కూడా చర్చిస్తామని చెప్పారు. అలాగే ఈ అంశానికి సంబంధించి ఏపీ శాసనసభలో ఒక ఫోరం ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉందన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...