Nov 24, 2017

26న రాజ్యాంగ దినోత్సవం


సచివాలయం, నవంబర్ 24: ఈ నెల 26న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ సంస్థల్లో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించి, రాజ్యాంగం మొదటి పేజీలోని ప్రవేశికను చదవాలని ప్రభుత్వం కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి ఒక ప్రకటనలో కోరారు. అంతే కాకుండా ఆ రోజున తప్పనిసరిగా మాక్ పార్లమెంట్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, ఉపన్యాసాలు వంటి కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కార్యదర్శి అందించిన సమాచారం మేరకు ఆ రోజు సెలవు రోజు ఆదివారం అయినందున ఆ మరుసటి రోజు సోమవారం  తగిన ప్రాధాన్యత ఇచ్చి రాజ్యాంగ దినోత్సవం నిర్వహించాలన్నారు. ఆ రోజు రాజ్యాంగ ప్రవేశిక చదవడంతోపాటు ఇతర కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రభుత్వంలోని అన్ని శాఖల కార్యదర్శులు, శాఖల బాధ్యులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా మేజిస్ట్రేట్లు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
   
1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ 1949 నవంబర్‌ 26న రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించింది. జనవరి 26, 1950 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది.  నవంబర్‌ 26న రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు అయినందున ఏటా ఈ రోజును రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నాం. భారత రాజ్యాంగానికి ఆత్మ లాంటి ప్రవేశిక 'భారత ప్రజలమైన మేము' అనే మాటలతో ప్రారంభమై భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమని పేర్కొన్నారు. పౌరులకు సంబంధించిన న్యాయం, స్వాతంత్య్రం, సమానత్వం, సౌభ్రాత్రం గురించి ప్రస్తావించారు.



No comments:

Post a Comment

గోలి మధు కలానికి పదును, స్పీడు, ఎరుపు ఎక్కువ!

‘ఎదురీత’ పుస్తక సమీక్ష ఎవరు  ఏ సమస్య చెప్పినా వెంటనే స్పందించి, ఇట్టే  అద్భుతమైన  కవిత్వం రాయగల దిట్ట  ప్రముఖ అభ్యుదయ కవి గోలి మధు. ఆయన కవిత...