Nov 9, 2017

పీకే దర్శకత్వంలో జగన్ పాదయాత్ర


రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య

Ø అది ఓ స్టేజ్ మేనేజ్డ్ డ్రామా
Ø ఓ ముసలమ్మ, ఓ దివ్యాంగుడు, ఓ యువకుడు
Ø పేరడైజ్ పేపర్లో వచ్చిన వాటికి సమాదానం చెప్పాలి
Ø విదేశాల్లో ఆర్థిక లావాదేవీలు వెల్లడించాలి
Ø సీబీఐ దర్యాప్తు చేయాలి

          సచివాలయం, నవంబర్ 8: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రశాంత కిషోర్ దర్శకత్వంలో నిర్వహించే ఓ స్టేజ్ మేనేజ్డ్  డ్రామాగా రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య అభివర్ణించారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో బుధవారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గాల ఇన్ ఛార్జిలకు, వారి ఎమ్మెల్యేలకు ఓ మెస్సేజ్ పంపారని, అందులో జగన్ ఆయా నియోజకవర్గాలకు వెళ్లినప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఓ ముసలమ్మ, ఆమెకు షాంపూతో తల స్నానం చేయించి ఉండాలి, ఓ దివ్యాంగుడు, ఓ యువకుడు తప్పనిసరిగా ఉంచే ఏర్పాటు చేయాలని పేర్కొన్నాట్లు తెలిపారు. ముందుగా తర్ఫీదు ఇచ్చిన ప్రకారం వారు నటిస్తారని, ముసలమ్మ కంటనీరు పెట్టుకొని వేడుకుంటుంది, దివ్యాంగుడు తానూ నడుస్తానన్నా అంటాడు, యువకుడు పార్టీ జండా పట్టుకొని ముందుకు వచ్చి, తాను ప్రాణం ఇస్తానిని చొక్కా చించుకుంటాడనిఆ తరువాత జగన్  మాట్లాడుతూ ‘‘ మీరెవరరూ నాతో రావద్దు, మీ కోసం నేను నడుస్తాను. కాస్త ఓపిక పట్టండి నేను వస్తాను, స్వర్గం సృష్టిస్తాను’’ అని చెబుతారని, ప్రతిరోజూ జరిగే తంతు ఇదని ఆయన ఎద్దేవా చేశారు. విదేశాల్లో నల్లధనం దాచిన మన దేశానికి చెందిన 741 మంది పేర్లను పారడైజ్ పత్రిక ప్రచురించిందని, ఆ జాబితాలో జగన్ పేరు కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు. దానికి వివరణ ఇవ్వవలసిన బాధ్యత ప్రతిపక్ష నేతగా మీకు ఉందా? లేదా? అని జగన్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. మూడు రోజుల క్రితం తాను సంధించిన వంద ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వాటిలో ప్రధానమైనది 12వ ప్రశ్న మీకు, మీ కుటుంబానికి లండన్, సైప్రస్, మారిషస్, బ్రిటీష్ వర్జన్ ఐలాండ్, లగ్జింబర్గ్ వంటి ఆరు దేశాల్లో మీ ఆర్థిక లావాదేవీల గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ లావాదేవీలపై సీఐడి, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ వారు ఆయా దేశాలతో సంప్రదించి, మీ గుట్టు బయటపెట్టడానికి ప్రయత్నిస్తున్నారా? చెప్పాలని డిమాండ్ చేశారు. కోల్ కతాలో అల్లిబిల్లి కంపెనీల గురించి, విదేశాల నుంచి వచ్చిన నిధుల గురించి తెలియజేయాన్నారు. అలాగే ఈ ఆరోపణలపై సీబిఐ విచారణ జరపి, అవినీతి బాగోతం బయట పెట్టాలని ఆయన కోరారు. అవినీతి వ్యవహారలకు పాల్పడుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని జగన్ ను ఉద్దేశించి ఆయన హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించి, పారడైజ్ పేపర్ లో వచ్చిన ఆరోపణలపై సీబిఐ చేత దర్యాప్తు జరిపించాలని కోరారు. ప్రతిపక్ష నేత ఇంత అవినీతి పరుడా? అని దేశంలోని, ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు మన రాష్ట్రం వైపు చూస్తున్నారని, రాష్ట్ర ఔన్యత్యాన్ని దిగజార్చారని బాధ పడ్డారు.

          జగన్ చేసేది చిత్తశుద్దిలేని శివపూజలేల అన్నట్లు చిత్తశుద్ధిలేని పాదయాత్ర చేస్తున్నారని, తెలుగు ప్రజలు ఆయన డ్రామాలను నమ్మరని అన్నారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. పాదయాత్రలో శాంతిభద్రతలకు భంగం కలిగించి, దానిని ఎదుటివారిపై నెట్టడానికి చూస్తున్నారని రామయ్య ఆరోపించారు

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...