Nov 10, 2017

అర్థవంతంగా సభల నిర్వహణ


సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు

Ø నదుల అనుసంధానంపై సమగ్ర చర్చ
Ø సమయాన్ని సద్వినియోగం చేసుకున్న సభ్యులు
Ø శాసన మండలిలో చంద్రన్న బీమాపై విస్తృత స్థాయిలో చర్చ

  సచివాలయం, నవంబర్ 10: శాసనసభ, శాసనమండలి వర్షాకాల, శీతాకాల తొలిరోజు సమావేశాలు అర్ధవంతంగా జరిగినట్లు సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం సమావేశాలు వాయిదాపడిన తరువాత ఆయన మాట్లాడారు. ప్రశ్నోత్తరాల సమయంలో సమాచారం రాబట్టడంలో సభ్యులు సఫలీకృతులైయ్యారన్నారు. సభ్యులు సభా సమయాన్ని సమర్ధవంతంగా  సద్వినియోగం చేసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎదురయ్యే ఇబ్బందులు సభ దృష్టికి తీసుకువచ్చారని, మంత్రులు సమాధానాలు చెప్పారని పేర్కొన్నారు. దేశంలో నదులు అనుసంధానం అనేది దశాబ్దాల కల అని, గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం ద్వారా వాస్తవరూపంలో దానిని అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ వల్ల కలిగిన ప్రయోజనాలు, పట్టిసీమ ఫలితాలపై సమగ్రంగా చర్చ జరిగినట్లు మంత్రి తెలిపారు. కృష్ణా డెల్టాకు, రాయలసీమకు నీరు అందించడంపై చర్చించినట్లు చెప్పారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు, శ్రీశైలం ద్వారా హంద్రీ-నివాకు ఎలా నీరందించింది చెప్పే అవకాశం సభలో వచ్చిందన్నారు. పట్టిసీమ జలాలు చివరి ఆయకట్టు వరకు అందలేదని కొందరు సభ్యులు అడిగినట్లు చెప్పారు. సభ్యులు అత్యంత బాధ్యతతో వ్యవహరించారని, నిర్మాణాత్మకంగా సలహాలు ఇచ్చారన్నారు. అధికార పార్టీ సభ్యులమని కానీ, తమ ప్రభుత్వం అని కానీ ఆలోచించకుండా ప్రశ్నలు అడిగారని చెప్పారు. శాసన మండలిలో చంద్రన్న బీమాపై విస్తృత స్థాయిలో చర్చ జరిగినట్లు తెలిపారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...