Nov 15, 2017

టీడీపీ హయాంలోనే బీసీలకు న్యాయం


టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కంభంపాటి రామమోహన రావు
సచివాలయం, నవంబర్ 14: తెలుగుదేశం పార్టీ హయాంలోనే బీసీలకు న్యాయం జరిగిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కంభంపాటి రామమోహన రావు అన్నారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఉదయం ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఎన్టీఆర్ కాలంలో బీసీలకు అనేవిధాలుగా మేలు జరిగిందన్నారు. మండల్ కమిషన్, బీసీలకు కేంద్రంలో రిజర్వేషన్ అంశాలను గుర్తు చేశారు. గత ప్రభుత్వం 5 ఏళ్లో 23 జిల్లాల్లోని బీసీలకు  ఇచ్చిన నిధుల కంటే తమ ప్రభుత్వం 3 ఏళ్లలో 13 జిల్లాలకు అధికంగా ఇచ్చినట్లు తెలిపారు. బీసీ సబ్ ప్లాన్ అమలు చేసినట్లు చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలన్నటిని నెరవేర్చినట్లు ఆయన చెప్పారు.
రాష్ట్ర విభజన తరువాత ఇక్కడే శాసనసభ సమావేశాలు జరపాలని పట్టుదలతో ఇక్కడ జరుపుతున్నట్లు తెలిపారు. ప్రతిపక్షం లేకపోయినా అధికార పక్ష సభ్యులు అందరూ ప్రజా సమస్యలను సభ దృష్టిటి తీసుకువచ్చి సమర్థవంతంగా సభ నిర్వహిస్తున్నారన్నారు. గొడవలు, అలజడులు, వాయిదాలు ఏమీ లేకుండా సభ సజావుగా జరుగుతుందని చెప్పారు.
ప్రతిపక్షం రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతోందని, కేంద్రానికి లేఖలు రాసి నిధులు రాకుండా చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేవిధంగా మాట్లాడవద్దని  ఆయన కోరారు. తాము పదేళ్లు  ప్రతిపక్షంలో ఉన్నా కేంద్రం చేసే పనులకు అడుపడలేదన్నారు.


.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...