Dec 2, 2017

కాపుల చిరకాల కోరిక తీరింది

ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప
        సచివాలయం, డిసెంబర్ 2 : కాపులను బీసీల్లో చేర్చాలని మంత్రి మండలి తీర్మానించడం, దానిని ఉభయ సభల్లో ఆమోదించడంతో కాపుల చిరకాల కోరిక తీరిందని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆనందం వ్యక్తం చేశారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద శనివారం సాయంత్రం పలువురు కాపు నాయకులతో కలసి ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిఠాపురంలో ఇచ్చిన హామీ మేరకు బీసీ కమిషన్ ఏర్పాటు చేసి, నివేదిక తెప్పించుకొని మంత్రి మండలి, ఉభయ సభల్లో  ఆమోదింపజేశారని కృతజ్ఞతలు తెలిపారు. దీంతో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు మేలు జరుగుతుందన్నారు. మంజునాథన్ కమిషన్ లోని మెజార్టీ ముగ్గురు సభ్యులు నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. బీసీలకు ఎటువంటి ఇబ్బందిలేకుండా ఈ రిజర్వేషన్ కల్పించనున్నట్లు తెలిపారు. దీనిని 9వ షెడ్యూల్ చేర్చడానికి ముఖ్యమంత్రి, బిజేపీ నాయకులు ప్రయత్నిస్తారని చెప్పారు. మంత్రి మండలిలో బీజేసీ మంత్రులు కూడా ఉన్నట్లు చినరాజప్ప తెలిపారు.  ఉపముఖ్యమంత్రి  వెంట కాపు కార్పోరేషన్‌ చైర్మన్‌ చలమలశెట్టి రామానుజయ తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...