Dec 21, 2017

పేద మహిళలకు చేయూత ‘సాధికారమిత్ర’


*   స్వయం సహాయక సంఘాల బలోపేతం
*   సభ్యుల సామర్ధ్యం పెంపునకు శిక్షణ
*   మహిళా సామర్థ్యానికి గుర్తింపు
*   ప్రతి 35 కుటుంబాలు ఓ క్లస్టర్‌
*   క్లస్టర్ కు ఓ సాధికారమిత్ర
           
  విధి నిర్వహణ, కుటుంబ వ్యవహారాలలో మహిళల ప్రాధాన్యత గుర్తించిన ప్రభుత్వం తగిన శిక్షణ ఇచ్చి అన్ని విధాల వారిని సమర్థవంతులుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. తద్వారా ప్రతి కుటుంబం నెలకు రూ.10 వేల ఆదాయం సంపాదించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకు  స్వయం సహాయక సంఘాలను ఎన్నుకుంది. అన్ని అంశాల్లో సభ్యులకు అవగాహన కల్పించడం ద్వారా  సంఘాలను బలోపేతం చేయనుంది. ఇందుకు ప్రత్యేకంగా సాధికార మిత్ర వ్యవస్థను రూపొందించింది. స్వయం సహాయక సంఘాలలో  సభ్యత్వంతో సంబంధంలేకుండా ప్రతి 35 కుటుంబాలు ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి, దానికి ఓ సాధికార మిత్రను నియమిస్తారు. వారు ప్రభుత్వానికి-ప్రజలకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరిస్తారుసేవే లక్ష్యంగా ముందుకు వచ్చేవారికి సాధికారమిత్రలుగా అవకాశం కల్పిస్తారు. శాస్త్రీయ పద్దతిలో ఈ వ్యవస్థని రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 4,70,070 ‘సాధికారమిత్రక్లస్టర్ల ద్వారా 5,86,157 కుటుంబాలకు ప్రయోజనంకలిగించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు వేరువేరుగా ప్రత్యేక గుర్తింపు సంఖ్యలు ఇస్తారుసాధికార మిత్రగా ఎంపికైన  ప్రతి ఒక్కరికీ యూనిక్ ఐడీ కేటాయించడంతోపాటు గుర్తింపు కార్డు కూడా ఇస్తారు. ప్రభుత్వ పథకాలు, ఏఏ శాఖల ద్వారా ఏఏ పథకాలు అమలు చేస్తున్నారు, వాటి విధి విధానాలుప్రయోజనాలు, వివిధ పథకాల కింద బ్యాంకుల ద్వారా పొందే రుణాలు, సబ్సిడీలు, వాటిని పొందే మార్గాలు తదితర అంశాలలో వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఏఏ శాఖల ద్వారా ఏఏ పథకాలు, ఏఏ కులాల వారికి, ఏ వయసు వారికి అందుబాటులో ఉన్నాయో వారికి తెలియజేస్తారుపేద కుటుంబాలకు ప్రయోజనం కలిగించే ప్రతి అంశంపై ప్రాథమిక సమాచారంతో వారికి అవగాహన కల్పిస్తారు. వారు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంధానకర్తలుగా ఉంటూ  ఆ క్లస్టర్ లో ఉండే 35 కుటుంబాలకు సహాయపడుతుంటారు. తద్వారా పేద కుటుంబాలు ఆదాయ మార్గాలు పెంపొందించుకోవడానికి అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తుంది. ఒక్కో క్లస్టర్ లోని మహిళల విద్యార్హతలువృత్తిపరమైన నైపుణ్యత, ఇతర అంశాలలో వారికి ఉన్న ఆసక్తి, సామర్థ్యం, నైపుణ్యతల ఆధారంగా వివిధ ప్రభుత్వ పథకాల కింద  రుణాలు పొంది స్వయం ఉపాధి ద్వారా ఆయా కుటుంబాల ఆదాయం పెంపొందించుకోవడానికి సాధికార మిత్రలు సహాయపడతారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న వనరులు, అవకాశాల ఆధారంగా ఆసక్తి ఉన్న రంగాల్లో స్వయం ఉపాధికి మహిళలకు శిక్షణ కూడా ఇప్పిస్తారు. ఇప్పటికే పేదల కుటుంబ ఆదాయాలు పెంచేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా 4,90,000 స్వయం సహాయక సంఘాల సభ్యులకు చిరు వ్యాపారాలు చేసుకునేందుకు  స్త్రీనిధిద్వారా రూ.1,200 కోట్ల అందజేశారు. 67,84,602 మంది సభ్యులకు రూ.576.62 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చారుఉన్నతిపథకం కింద 38,600 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.153.93 కోట్లు ఆర్థిక సాయం చేశారు. పసుపు-కుంకుమపథకం కింద రెండు విడతల్లో 82,85,000 మంది సభ్యులకు ఒకొక్కరికి రూ. 6 వేల చొప్పున రూ. 4,971 కోట్లు అందించారు.

మహిళల వద్దకు వచ్చేసరికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వని పరిస్థితి ఉంది. వారి తలసరి ఆదాయం కూడా తక్కువగా ఉంది. వారి శక్తి సామర్థ్యాలను ఉపయోగించడం ద్వారా వారి ఆదాయ మార్గాలను పెంపొందించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 9,01,567 స్వయం సహాయక బృందాల(సెల్ఫహెల్ప గ్రూపులు)లో 90.81 లక్షల మంది సభ్యులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 7.11 లక్షల గ్రూపుల్లో 71.75 లక్షల మంది ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 1.91 లక్షల గ్రూపుల్లో 19.06 లక్షల మంది ఉన్నారు. ఈ గ్రూపుల్లో అట్టడుగు వర్గాలకు చెందిన చెంచు, యానాది వంటి కులాల మహిళలు కూడా ఉన్నారుపట్టణ ప్రాంతాల్లోని గ్రూపుల కార్పస్ రూ.1,162.62 కోట్లు, గ్రామీణ ప్రాంత గ్రూపుల కార్పస్ రూ. 6,627.95 కోట్లతోపాటు సభ్యులు రూ.4,585.36 కోట్లు పొదుపు చేశారు. 99.47 శాతం మంది అంటే 90,33,342 మంది సభ్యుల ఆధార్ సమాచారాన్ని అనుసందానం చేశారు. ఈ గ్రూపులను బ్యాంకు ఖాతాలతో జతపరచడంతో మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తున్నారుగత ఏడాది(2016-17) 4,59,815 గ్రూపులు లక్ష్యానికి మించి రూ.14,271 కోట్లు తీసుకున్నాయి. ఈ ఏడాది జూన్ వరకు 26,276 గ్రూపులు రూ. 674.76 కోట్లు తీసుకున్నాయి. చంద్రన్న చేయూత మూలధన పెట్టుబడి పథకం కింద ఒక్కో సభ్యురాలికి రూ.10,000 చొప్పున మొత్తం  పది వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 8.2 లక్షల గ్రూపులకు పెట్టుబడి నిధి కింద రెండు విడతలుగా రూ. 4,972 కోట్లు ఇచ్చారు. అంతేకాకుండా 2014 ఫిబ్రవరి నుంచి 2015 ఏప్రిల్ వరకు గ్రూపులకు వడ్డీ రాయితీ కింద రూ.1842 కోట్లు విడుదల చేశారు. 2015-16 సంవత్సరానికి సంబంధించి  గ్రామీణ, పట్టణ ప్రాంత స్వయం సహాయక సంఘాలకు రూ. 700 కోట్ల మేర వడ్డీ రాయితీ ఇచ్చారుఈ విధంగా రాష్ట్రంలో 7 లక్షల స్వయం సహాయక సంఘాలు లబ్ది పొందడానికి అవకాశం ఏర్పడింది. మహిళా సంఘాల ద్వారా అమలు అవుతున్న ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు, పండ్లతోటలు, ఎవెన్యూ ప్లాంటేషన్ తదితర  కార్యక్రమాలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి.   రహదారులకు ఇరువైపులా మొక్కల పెంపకం చేపట్టడంతో పాటు నర్సరీలు ఏర్పాటు చేసే బాధ్యతను కూడా స్వయం సహాయక సంఘాల సభ్యులకు అప్పగించనున్నారు. అంతే కాకుండా సాధికార మిత్ర’  ద్వారా కూడా అవకాశం ఉన్న అన్ని మార్గాల్లో రాష్ట్రంలోని మహిళలందరికీ ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉంది.
-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...