Dec 12, 2017

శాఖల మధ్య సమన్వయంతో మహిళా,శిశు సంక్షేమ పథకాల అమలు


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్
                    సచివాలయం, డిసెంబర్ 11: శాఖల మధ్య సమన్వయంతో మహిళా,శిశు సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్ కుమార్ ప్రభుత్వంలని పలు శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. సచివాలయం 1వ బ్లాక్ లోని సీఎస్ సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం మహిళా,శిశు సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయా పథకాల పనితీరుని సీఎస్ సమీక్షించారు. మహిళా,శిశు సంక్షేమానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర పథకాలకు తగిన ప్రాధాన్య ఇచ్చి సకాలంలో అమలు చేయాలని కోరారు. అంగన్ వాడీ కేంద్రాలను ఉన్నతాధికారులు తనిఖీ చేయాలని, అక్కడి సౌకర్యాలను పరిశీలించాలని ఆదేశిచారు. వివిధ శాఖల నుంచి హాజరైన ఉన్నతాధికారులు మహిళలు, విద్యార్థులు, శిశువుల సంక్షేమానికి సంబంధించి అన్ని అంశాలు, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకం, మినరల్ డెవలప్ మెంట్, జిల్లా పరిషత్, మండల పరిషత్, వెనుకబడిన ప్రాంత ఫండ్(బీఆర్జీఎఫ్) నిధులతో అంగన్ వాడీ భవనాలు నిర్మిస్తున్నట్లు, టాయిలెట్ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు, నీరు, విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు, 1983 అంగన్ వాడీ కేంద్రాలను గ్రామ పంచాయతీలలో కలిపినట్లు అధికారులు వివరించారు. అలాగే 3148 అంగన్ వాడీ కేంద్రాలను మునిసిపాలిటీలకు కలిపినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు.  

         అంగన్ వాడీ కేందాలు, అన్న అమృత హస్తం కింద మహిళలకు అందించే పౌష్టికాహారం, మహిళా స్వయంసహాయక గ్రూపుల ద్వారా మహిళాభివృద్ధి, మహిళల హక్కుల పరిరక్షణ, జువైనల్ హోమ్ లో బాలుర సంక్షేమం, గ్రామ పంచాయతీల్లో సీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమాలు, మన భవిత కింద మోడల్ గ్రామపంచాయతీలకు శిక్షణ, టాటా ట్రస్ట్ సహకారంతో మూడు జిల్లాల్లో అందించే పౌష్టికాహారం, అంగడవాడీ కేంద్రాల కోసం మండల పరిషత్ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న గదులు, కిషోరి వికాసం, మూడు బాలల సంక్షేమ గృహాల్లో డిప్యూటేషన్ పై ఉపాధ్యాయుల భర్తీ, గర్భిణీ మహిళలకు ఆషా( గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు), ఏఎన్ఎం కార్యకర్తల ద్వారా ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం, వేధింపులకు గురైన మహిళలకు 108 అత్యవసర ఆరోగ్య సేవలు, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 102 కాల్ సెంటర్ ద్వారా మహిళలకు, శిశువులకు వైద్యం, పౌష్టికాహారం అందిచడం, మానసిక ఆరోగ్య రక్షణలో భాగంగా సైకో సోషల్ కౌన్సిలింగ్, ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచడం, ఆరోగ్య, పౌష్టికాహార వాలంటీర్ల నియామకం, పౌష్టికాహారం  అందించడం, 181 కాల్ సెంటర్ సేవల వినియోగం, మహిళా సాధికారత కోసం పేదరిక నిర్మూలన సంస్థ, డీఆర్డీఏ సహకారం తదితర అన్ని అంశాలను చర్చారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులతోపాటు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సంస్థ, ఏపీ మహిళా కమిషన్, స్వచ్ఛంద సంస్థల సభ్యులు హోం శాఖతో కలసి పని చేయడాన్ని సమీక్షించారు. వరకట్న, నిర్భయ, గృహ హింస తదితర చట్టాల కింద నమోదైన కేసులు, మహిళా పోలీస్ వాలంటీర్ పథకం, న్యాయ సలహా శిబిరాలు, స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే స్వధార హోమ్, ఉజ్వల హోమ్, నిర్భయ ఫండ్ తో అభయ ప్రాజెక్ట్ అమలు తీరుపై చర్చించారు.
2017-18లో కేంద్ర ప్రభుత్వం అభయ ప్రాజెక్ట్ కింద రూ.138.49 కోట్లు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. కడప, అనంతపురం జిల్లాల్లో రూ.76 లక్షల నిర్భయ నిధులు( 60 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులు) విడుదల చేసినట్లు వివరించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యానాధ్ దాస్, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనురాధ, గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిల్ సెక్రటరీ రామ్ ప్రకాష్ సిసోడియా, సాంఘీక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ షంషేర్ సింగ్ రావత్,   మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.కరికాల వలవన్, మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ కార్యదర్శి కె. సునిత,   బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బి.ఉదయ లక్ష్మి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ బి.రామాంజనేయులు, బాల నేరస్తులు, వీధి బాలల సంక్షేమ శాఖ స్పెషల్  కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...