Dec 2, 2017

బీసీలకు అన్యాయం జరుగకుండా కాపులకు రిజర్వేషన్


వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
సచివాలయండిసెంబర్ 2: ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినవిధంగా అమలు చేసిన ఘనత   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు.  శాసనసభ ప్రాంగణం మీడియా పాయింట్ వద్ద సోమవారం ఉదయం ఆయన మాట్లాడారు. బ్రిటీష్ పరిపాలనలో కాపులు బీసీగా ఉండే వారని,  నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వారికున్న బీసీ  రిజర్వేషన్ తీసివేశారనితరువాత సంజీవయ్య హయాంలో మళ్లీ  రిజర్వేషన్లు కల్పించారని, కాసు బ్రహ్మానందం రెడ్డి హయాంలో  తీసివేశారని వివరించారు. ఆ తరువాత కాపులను ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు.

పాదయాత్ర సందర్భంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు కాపులకు రిజర్వేషన్ కల్పించాలని మంత్రి మండలిలో తీర్మానించిశాసనసభలో ప్రవేశపెట్టారన్నారు. కాపు కార్పోరేషన్ స్థాపించి రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు. బీసీలకు అన్యాయం జరుగకుండావారి రాజకీయ అవకాశాలకు ఇబ్బంది కలుగకుండా కాపులకు రిజర్వేషన్ కల్పించాలని సీఎం తీసుకున్న నిర్ణయం అభినందనీయం అన్నారు. కాపులకు విద్య,వైద్యఉపాధిఉద్యోగ అవకాశాలకుయ మాత్రమే రిజర్వేషన్ కల్పించారనివారికి రాజకీయ ప్రయోజనాలు ఏమీ కల్పించలేదని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.10వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుదేనన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కు బ్రేకులు వేసే ప్రయత్నాలు దురదృష్టకరం అన్నారు. ఈ ప్రాజెక్టు కోసం సీఎం అహర్నిశలు కష్టపడుతున్నారని చెప్పారు. పోలవరం విషయంలో బీజేపీ వారు సహకరిస్తారని అనుకుంటున్నట్లు ఆంజనేయులు తెలిపారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...